Latest Updates
-
గర్భస్రావం తర్వాత సంతాన సామర్థ్యం పెరుగుతుందా.. ఇందులో నిజమెంత.? -
జూన్ 24న శివ యోగం: ఈ సమయం నుంచి మీ కెరీర్, అదృష్టం మారుతుందా? -
ఇంట్లో శ్రీ చక్రం ఉంటే ఏమవుతుంది? ఆధ్యాత్మిక నిపుణులు చెప్పిన విషయాలు -
జూన్ 24 నుంచి తులా రాశిలో చంద్ర సంచారం: ఈ రాశుల వారికి అదృష్టం, ధన లాభం ఖాయం! -
మిథున, తుల, కుంభ రాశుల వారికి అద్భుత అవకాశాలు.. మీ జాతకం ఎలా ఉంది? - బుధవారం, 24 జూన్ 2026 -
నిమిషం ఆలస్యంగా తిన్నా గంట సేపు జీతం లేని చాకిరీ తప్పదు.. ఆఫీసులో వింత నియమం.! -
మాజీ భాగస్వామితో గడిపిన ఆ సందర్భాలు.. పదే పదే అపరాధ భావనకి గురవుతున్నారా.? -
రోజూ పూజ చేస్తున్నా ఫలితం రావడం లేదా? ఈ 5 తప్పులు కారణం కావచ్చు! -
ఫేస్ వాష్ కొనే పని లేదు.. వారం రోజుల్లోనే మెరిసే ముఖం.. కిచెన్లోనే అద్భుత రహస్యం.! -
మిలీనియల్ ‘అబ్బాయిల’కి అట్రాక్ట్ అవుతున్న జెన్ జీ అమ్మాయిలు.. కారణాలివే.!
దిన ఫలాలు: శనివారం 23 డిసెంబర్ 2017

భారతదేశం లేదా పాశ్చాత్య జ్యోతిష్య శాస్త్రాల ప్రకారం మన జీవిత గమనాలు అంతరిక్షంలోని నక్షత్ర సమూహాలతో ఏర్పడ్డ వివిధ జన్మరాశుల స్థితి, గమనం పై ఆధారపడి ఉంటాయి. మొత్తం పన్నెండు రాశులు ఉంటాయి. ఈ పన్నెండు రాశుల జ్యోతిష్య ఫలితాలు ఆయా సమయాల్లో గోచార స్థితిగతులను దృష్టిలో పెట్టుకుని ఇవ్వటం జరుగుతుంది. ఈ ఫలితాలు సామాన్యంగా అన్ని వర్గాలకు కలిపి చెప్తారు. వ్యక్తిగతంగా మీ భవిష్యత్తు తెలుసుకోవాలనే ఆసక్తి వుంటే దగ్గరలో ఉన్న జ్యోతిష్య నిపుణుడి వద్ద సంప్రదించి , మీ జన్మ వివరాలను తీసుకువెళ్ళి జాతకాలను, వాటిలో దోషాలు, దానికి పరిష్కారాలు వివరంగా తెలుసుకోవచ్చు.
ఈ నాటి దినఫలాలు అష్టలక్ష్మీ జ్యోతిష్య నిలయానికి చెందిన పెద్దలు బ్రహ్మశ్రీ శ్రీ నలమాటి కొండలరావు గారి నోటి మాటల్లోనే..
ది. 23-12-2017 తారీఖు, శనివారం నాటి దిన ఫలాలను ఒకసారి పరిశీలిద్దాం. హేమలంబి నామ సంవత్సరం, దక్షియాణనం, హేమంత రుతువు, శీతాకాలం, పుష్య మాసం, శుద్ధ పంచమి రాత్రి 8 గంటల 10 నిమిషాల వరకూ ఉంది. ధనిష నక్షత్రం సాయంత్రం 6 గంటల 30 నిమిషాల వరకూ ఉంది. అమృత సమయం ఉదయం 7 గంటల 20 నిమిషాల నుండి 9 గంటల 2 నిమిషాల వరకు ఉంది. వర్జ్యం రాత్రి 2 గంటల 6 నిమిషాల నుండి 3 గంటల 45 నిమిషాల వరకూ ఉంది. దుర్ముహర్తం ఉదయం 7 గంటల 7 నిమిషాల వరకు. సూర్యోదయ సమయం ఉదయం 6 గంటల 30 నిమిషాలకు, సూర్యాస్తమయ సమయం 5 గంటల 27 నిమిషాలకు.

మేష రాశి ( 21 మార్చి-20 ఏప్రిల్ )
బంధు మిత్రుల కలయికలు ఉంటాయి. తల్లి గారి ప్రేమను కూడా గ్రహిస్తారు. భార్య సహకారంగా మసులుకోగలదు. ధన ప్రణాళికలు లాభం తెస్తాయి. వృత్తి వ్యాపారాలు బాగుంటాయి.

వృషభ రాశి (21 ఏప్రిల్-21 మే )
పని వారి సహకారం ఉంటుంది. తలచిన పనులు పూర్తి చేస్తారు. దూర ప్రాంత వార్తలు వింటారు. వృత్తి వ్యాపారాలు అనుకున్న ఫలితాలను ఇస్తాయి. పిల్లలు మనస్సుకు తగినట్టు ప్రవర్తిస్తారు.

మిథున రాశి ( 22 మే-21 జూన్ )
ధనానికి ఇబ్బందులు ఉంటాయి. పిల్లలతో ఆనందంగా గడుపుతారు. దూర ప్రాంత ప్రయాణ ఆలోచనలు చేస్తారు. తండ్రి గారి ఆశీర్వాదం కూడా పొందండి. వృత్తి వ్యాపారాలు బాగుంటాయి.

కర్కాటక రాశి (22 జూన్-22 జూలై )
చేయు పనులందు ఆటంకాలు ఉంటాయి. కొత్త అవకాశాలు చేజారే సమయం. ఇంటికి సంబంధించిన పనులు బాధ్యతగా పూర్తి చేస్తారు. అధికారులు ప్రసన్నం అవుతారు. వృత్తి వ్యాపారాలు బాగుంటాయి.

సింహ రాశి (23 జూలై-21 ఆగష్ట్ )
భార్య సహకారం పూర్తిగా ఉంటుంది. అనుకున్న పనులు నెరవేరుతాయి. చిన్న ప్రయాణాలు చేయవలసి వస్తుంది. పిల్లల విషయంలో బాధ్యతగా మసులుకోవాల్సి ఉంటుంది. వృత్తి వ్యాపారాలు బాగుంటాయి.

కన్యా రాశి ( 22 ఆగష్ట్-23 సెప్టెంబర్)
చేయు పనులందు ఆటంకాలు ఉంటాయి. ధన ప్రణాళికలు అనుకూలిస్తాయి. ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. ఇంటి పనులను జాగ్రత్తగా పూర్తి చేస్తారు. పని వారి సహకారం ఉంటుంది. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.

తులా రాశి ( 24 సెప్టెంబర్-23 అక్టోబర్)
అనుకున్న పనులు పూర్తి చేస్తారు. పిల్లల వలన ఆనందం కలుగుతుంది. అధికారుల మన్నన పొందుతారు. వ్యాపారాలు అనుకూలిస్తాయి. వృత్తి వ్యాపారాలు లాభదాయకంగా ముగుస్తాయి.

వృశ్చిక రాశి (24 అక్టోబర్-22 నవంబర్)
కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. తల్లి గారిని ప్రేమగా చూస్తారు. దైవ దర్శన ప్రాప్తి కలదు. దూర ప్రాంత వార్తలు వింటారు. వృత్తి వ్యాపారాలలో ధనం చేకూరుతుంది.

ధనస్సు రాశి ( 23 నవంబర్-22 డిసెంబర్)
దగ్గరి ప్రయాణాలు చేయవలసి వస్తుంది. శరీర ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. రుణాలు చేయవలసి వస్తుంది. చేయు పనులందు ఆటంకాలు ఉంటాయి. బంధువుల సహకారంతో వ్యాపారం బాగా సాగుతుంది.

మకర రాశి ( 23 డిసెంబర్-20 జనవరి)
చేయు పనులందు చిక్కులు కలవు. ధన ప్రణాళికలు అనుకూలిస్తాయి. వృత్తి వ్యాపారాలు బాగుంటాయి. పాత మిత్రులు కలుస్తారు. పిల్లలు అనుకూలంగా మసులుతారు.

కుంభ రాశి ( 21 జనవరి-20 ఫిబ్రవరి)
మనస్సు ఆనందంగా ఉంటుంది. మంచి విందు భోజనం లభిస్తుంది. అధికారులు ప్రసన్నం అవుతారు. పని వారి సహకారం పూర్తిగా ఉంటుంది. అనుకున్నవి అన్నీ సాధిస్తారు.

మీన రాశి (20 ఫిబ్రవరి-20 మార్చి)
ఆధ్యాత్మిక చింతన ఉంటుంది. పిల్లల గురించి ఆలోచించాల్సిన సమయం. వృత్తి వ్యాపారాలు బాగుంటాయి. దైవ దర్శన ప్రాప్తి కలదు.
ఇప్పటి వరకూ ఈ నాటి దిన ఫలితాలను చూసారు కదా ! మీకేమైనా సందేహాలు ఉంటే నన్ను కాంటాక్ట్ చేయండి. అది కూడా ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు. సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు.



Click it and Unblock the Notifications