10 ఫెంగ్ షుయ్ చిట్కాలతో మీ ప్రేమ జీవితాన్ని ఆనందమయంగా గడపవచ్చు

Written By: R Vishnu Vardhan Reddy
Subscribe to Boldsky

మీ ప్రేమ జీవితం గనుక ఆనందమయంగా లేకపోతే మరియు ఆ ప్రేమ జీవితాన్ని ఆనందమయంగా తీర్చిదిద్దుకోవాలని మీరు గనుక విపరీతంగా ప్రయత్నిస్తుంటే అటువంటి వారికోసమే ఈ వ్యాసం. ఇందుకు మీరు చేయవలసిందల్లా, మీ ఇంట్లో ఫెంగ్ షుయ్ చెప్పబడిన కొన్ని స్వల్ప మార్పులు చేసుకోవలసి ఉంది. ఇలా చేయడం ద్వారా మీ జీవితంలో ఖచ్చితంగా గుర్తించదగ్గ మార్పులు చోటుచేసుకుంటాయి.

మీ ప్రేమ జీవితాన్ని మెరుగు పరుచుకోవడానికి చేయవలసిన పనులను, పాటించవలసిన చిట్కాలను మీరు ఈ వ్యాసంలో తెలుసుకోబోతున్నారు.

ఈ వ్యాసం మీ ఇంట్లో చేసుకోవాల్సిన స్వల్ప మార్పుల గురించి మరియు పాటించవలసిన చిట్కాలను తెలియజేస్తుంది మరియు ఇలా చేయడం వల్ల మీ ప్రేమ జీవితం ఖచ్చితంగా మెరుగుపడుతుంది.

అది ఎలాగో ఎప్పుడు చూద్దాం

ప్రేమ పరమైన వ్యక్తిత్వాన్ని మరియు మనస్తత్వాన్ని వ్యక్తీకరించండి

ప్రేమ పరమైన వ్యక్తిత్వాన్ని మరియు మనస్తత్వాన్ని వ్యక్తీకరించండి

మీరు మూలలను మరచిపోకుండా మీ యొక్క అసలైన స్వభావాన్ని బయటపెట్టడం మొదలుపెట్టండి మరియు మీ భాగస్వామితో కలిసి ఏదైనా సరదాగా చేయడం ప్రారంభించండి. మీకు గనుక పెళ్లి కాక పోయి ఉంటే మీ యొక్క ప్రేమికుడు లేక ప్రేమికురాలు పై ప్రేమ పూరితమైన వ్యక్తిత్వాన్ని ప్రదర్శించండి. ఇలా చేయటం ద్వారా మీ ప్రేమ జీవితం ఎంతగానో పుంజు కుంటుంది.

అస్తవ్యస్తంగా వ్యవహరించడాన్ని పూర్తిగా మానివేయండి.

అస్తవ్యస్తంగా వ్యవహరించడాన్ని పూర్తిగా మానివేయండి.

ప్రేమ నుండి మీ దృష్టిని మరల్చే విషయాలను, మీ మనస్సు నుండి పూర్తిగా తీసివేయండి. పడక గది ని విశ్రాంతి తీసుకోవడానికి మరియు ప్రేమను పంచుకోవడానికి మాత్రమే వాడాలి అనే విషయాన్ని గుర్తు పట్టుకొని అందుకు అనుగుణంగా వ్యవహరించండి. అందుచేత, ప్రేమ నుండి మీ దృష్టిని మరల్చే, మీ విషయాలన్నింటిని తీసి పక్కన పెట్టండి. అస్తవ్యస్తంగా వ్యవహరించడం, మురికి బట్టలను వాడటం లేదా పెంపుడు జంతువుల మల మూత్ర విసర్జనల కోసం వాడే వస్తువులను మీ గదిలో ఉంచడం ఇలా వీటన్నింటిని చేయడం పూర్తిగా మానివేయండి.

విరిగిపోయిన సామాను స్థానంలో కొత్త వాటితో భర్తీ చేయండి :

విరిగిపోయిన సామాను స్థానంలో కొత్త వాటితో భర్తీ చేయండి :

మీరు చేయవలసిందల్లా ఏమిటంటే, మీ ఇంట్లో గనుక ఏదైనా సామాను విరిగిన, చిరిగిపోయిన లేక రంగు వెలిసిపోయిన, మరకలు అంటిన లేక మీ గత సంబంధ బాంధవ్యాలని ఇబ్బంది పెట్టిన సామానులు గనుక పడకగదిలో ఉంటే, అటువంటి వాటన్నింటి స్థానం లో కొత్తవి తెచ్చి పెట్టండి. విరిగిపోయిన సామాను గనుక ఉంటే దురదృష్టం వెంటాడుతుందట.

మీ పడక గదిలో ప్రేమ ప్రదేశం :

మీ పడక గదిలో ప్రేమ ప్రదేశం :

మీ పడక గది లో ప్రేమను పంచుకోవడానికి ఏ ప్రదేశం అయితే ఉత్తమమైనదిగా భావిస్తారో, అటువంటి ప్రదేశంలో సువాసనలు వెదజల్లే క్యాండిల్స్ ను మరియు శృంగారం ఉట్టి పడే వస్తువులను ఉంచండి. ఆ ప్రదేశం లో మంచి సువాసనలు వెద జల్లేలా చూస్కోండి. ఇలా చేయటం ద్వారా మీ మనస్సు మరింత ఉత్సాహంగా ఉంటుంది.

వస్తువులన్నింటిని జంటలు జంటలుగా అమర్చండి :

వస్తువులన్నింటిని జంటలు జంటలుగా అమర్చండి :

పడకగదిలో వస్తువులన్నింటిని జంటలుగా అమర్చాలి. క్యాండిల్స్ కావొచ్చు, హృదయం ఆకారం లో ఉండే బొమ్మలు కావొచ్చు లేదా కుండీ లో పెట్టే పూలు కావొచ్చు, ఇలా ఏదైనా జంటలుగా లేదా జతలుగా పెట్టండి. ఇలా చేయడం ద్వారా ఇద్దరి మధ్య ప్రేమ మరింతగా పెరుగుతుంది.

ప్రేమను ప్రతిబింభించే చిత్రాలను పడకగది లో పెట్టుకోండి

ప్రేమను ప్రతిబింభించే చిత్రాలను పడకగది లో పెట్టుకోండి

ప్రేమను వర్ణించే కళాత్మక చిత్రాలను మీ పడక గదిలో కచ్చితంగా ఉండేలా చూసుకోండి. అవి వేలాడుతూ ఉంటే కనుక ఇంకా బాగుంటుంది. రెండు పూలే కావొచ్చు లేదా రెండు కుర్చీలు సూర్యాస్తమయాన్ని చూస్తున్నట్లు గా పెట్టుకోవచ్చు లేదా జంట కాఫీ తాగుతూ ఉన్న గ్రాఫిక్ చిత్రాన్ని కూడా పెట్టుకోవచ్చు.

ఇద్దరు హాయిగా కూర్చోవడానికి ఖచ్చితంగా స్థలం ఉండాలి :

ఇద్దరు హాయిగా కూర్చోవడానికి ఖచ్చితంగా స్థలం ఉండాలి :

మీ పడక గదిలో హాయిగా ఇద్దరు కూర్చోవడానికి స్థలం ఉండేలా చూసుకోండి. ముఖ్యంగా కూర్చోవడానికి కుర్చీలు ఉండాలి. ప్రతి రోజు రాత్రి టీవీ చూసే బదులు, వాటిపైన కూర్చొని మాట్లాడుకోవడం అలవాటు చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల బంధం మరింతగా దృఢ పడుతుంది.

వృత్తి పరమైన అంశాలను పడక గదిలో చేయడాన్ని పూర్తిగా నిషేధించండి :

వృత్తి పరమైన అంశాలను పడక గదిలో చేయడాన్ని పూర్తిగా నిషేధించండి :

ఇలా మాత్రం అస్సలు చేయకండి. వృత్తి పరమైన వస్తువులను పడక గదిలో అస్సలు ఉంచకండి. ల్యాప్ టాప్ వంటి పరికరాలైన కావొచ్చు, అలాంటి వాటిని పడక గదిలో, ప్రేమను పంచుకునే ప్రదేశంలో అస్సలు ఉంచకండి.

దిండ్లు ఎక్కువగా ఉంటే తీసివేయండి :

దిండ్లు ఎక్కువగా ఉంటే తీసివేయండి :

పడక గది పరుపు పై దిండ్లు గనుక ఎక్కువగా ఉన్నట్లయితే లేదా ఏ ఇతర వస్తువులున్నా వాటిని పడుకునే సమయంలో పడకగది నుండి తీసివేయండి. ఇలా చేయటం వల్ల మీరు మీ భాగస్వామితో గడపవచ్చు మరియు మీకు ఎటువంటి అడ్డంకులు ఉండవు.

ఒక జత రాత్రి బల్లలను ఉంచండి :

ఒక జత రాత్రి బల్లలను ఉంచండి :

మీ పడక గదిలో ఒక జత రాత్రి బల్లలను ఏర్పాటు చేసుకోండి. ఇలా చేయడం వల్ల ఇద్దరి మధ్య సంబంధ బాంధవ్యాలను సమానంగా ప్రోత్సహించినట్లు అవుతుంది. ఇందు కోసం సరిపడ స్థలం ఉండాలి మరియు చుట్టు పక్కల పరిసరాలన్నీ శుభ్రంగా, చక్కగా, సొగసుగా ఉంచుకోవాలి. అస్తవ్యస్తంగా ఉన్న సమయంలో ఇద్దరి మధ్య పోరాటాలు జరగకుండా చూస్తుంది.

English summary

Best Feng Shui Tips That Can Improve Your Love Life

Best Feng Shui Tips That Can Improve Your Love Life,Can you believe that your love life can be improved with a few changes in your lifestyle? Follow these Feng Shui tips to improve your love life!
Story first published: Monday, February 19, 2018, 12:30 [IST]