Latest Updates
-
మన్ కీ బాత్ లో ప్రధాని మోదీ ప్రస్తావించిన ఉసిరి.. నారింజ కంటే 20 రెట్లు ఎక్కువ విటమిన్ సి.. లాభాలు ఇవే! -
ఈ ఒక్కటి కలిపితే చాలు.. రోడ్ సైడ్ టమాటా గ్రేవీ రెడీ..ఇడ్లీలు లెక్కపెట్టకుండా తినేస్తారు -
బాలింతలకు డెలివరీ తర్వాత సత్తువనిచ్చి నొప్పులను తగ్గించే బలమైన లడ్డూ.! -
కరకరలాడే ఫిష్ పకోడీ.. ఈ పక్కా కొలతలతో ఒక్కసారి ట్రై చేయండి! -
చికెన్ కంటే ఎక్కువగా ప్రొటీన్ లభించే ఆహార పదార్థాలు ఏంటో తెలుసా.? -
వాస్తు ప్రకారం చీపురును ఎక్కడ పెట్టాలి? మీరు చేసే ఈ చిన్న తప్పులే పేదరికానికి కారణమా! -
కారం కారంగా..నోరూరించే ఎండుమిర్చి చట్నీ ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
వర్షాకాలంలో డయాబెటిస్ బాధితులకు ఇన్ఫెక్షన్ ముప్పు మరింత తీవ్రం.. కారణాలివే.! -
పచ్చి కొబ్బరి మసాలాతో అదిరిపోయే కర్ణాటక స్పెషల్ చిత్రాన్నం.. ఒక్కసారైనా రుచి చూడాల్సిందే.! -
గురు గ్రహం నక్షత్ర మార్పు: ఈ నాలుగు రాశుల వారికి చదువు, ఉద్యోగాల్లో మహర్దశ ప్రారంభం.!
40 శస్త్ర చికిత్సలతో ప్రపంచంలో అత్యంత రూపాంతరం చెందిన వ్యక్తిని కలుసుకోవాలని ఉందా?
కొంతమంది మనుషుల రూపురేఖలను చూసినప్పుడు, మీరు అంతకంటే వింతగా, వికారంగా ఉండే రూపాన్ని ఊహించుకోను కూడా లేని రూపాన్ని, వారు ఎందుకు సొంతం చేసుకున్నారని భావిస్తారు.
ఇటువంటి భావన మీకు ఏతాన్ బ్రాంబుల్ ను చూసినప్పుడు కూడా కలుగుతుంది, ఎందుకంటే ఆయన తన శరీరంపై 150 పచ్చబొట్లు పొడిపించుకోవడమే కాక నాలుకను కూడా చీలికలుగా తీర్చిదిద్దుకున్నాడు. అమ్మో! ఊహించుకోవడానికి కూడా చాలా గగుర్పాటుగా ఉంది.
ఈ వ్యాసం ద్వారా ఏతాన్ బ్రాంబుల్ గురించిన విశేషాలను , అతని శరీరంలో మార్పులకు సంబంధించిన కధల గురించి తెలుసుకుందాం.
అతను బాగా చిన్నగా ఉన్నప్పుడే ఈ మోజు అతనిలో మొదలయ్యింది.
పదకొండేళ్ల వయస్సులో , తన శరీరంలో మార్పులను చేయించుకోవడం మొదలుపెట్టాడు. అతను చెవులను సాగదీసినట్టు చేయించుకున్నాడు. తరువాత అతనికి పచ్చబొట్లు పట్ల ఆసక్తి మొదలైంది. అతను శరీర భాగాలలో మార్పులకై నలభైకి పైగా శస్త్రచికిత్సలు చేయించుకున్నాడు. ఇక పైన కూడా చేయించుకుంటూనే ఉంటానని తెలియజేశాడు.
అటువంటి కొన్ని మార్పులు ఏమిటంటే....
తన కనుగుడ్లలో పచ్చబొట్లు వేయించుకుని, ముక్కు కుట్టించుకున్నాడు. తన బొడ్డును తొలగించుకున్నాడు. అంతటితో ఆగలేదు. తన నాలుకను కూడా రెండుగా చీల్చుకున్నాడు. క్రింది పెదవి క్రింది భాగంలో గాటు పెట్టించుకుని, చెవులకు కూడా పెద్దగా చిల్లులు పెట్టించుకున్నాడు.
అతని జీవితం గురించి కాస్తంత:
పడమూడేళ్ల వయస్సు నుండి ఏతాన్ ఇంక్ పార్లర్లలో సమయం గడుపుతూ, శరీరక రూపాంతర నిపుణుల యొక్క పనితీరును గమనిస్తూ వచ్చాడు. ఎదుగుతున్న కొద్దీ ఆ మార్పులతో తన శరీరం పైనే ప్రయోగాలు చేయడం ప్రారంభించాడు.
అతని సాంఘీక జీవనం:
నివేదికల ప్రకారం, అతని సోషల్ మీడియా పేజీలను 65,000 మంది అనుసరిస్తున్నారు. అతని రాడికల్ లుక్ కు ఆకర్షితులైన అనేక ఇతర ఫాలోవర్స్ కూడా వున్నారు. ఆయన సోషల్ మీడియాలో తన శారీరక ప్రదర్శన చేస్తూ పెట్టే ఫోటోలను చాలా మంది ఫాలోవర్లు షేర్ చేసుకుంటారు.
అతని ఈ ప్రయాణంలో అత్యంత ప్రమాదకరమైన శస్త్ర చికిత్స:
ఏతాన్ తాను చేయించుకున్న సర్జరీలలో అత్యంత ప్రమాదకరమైనదిగా, తనను గ్రుడ్డివానిగా మిగిల్చే అవకాశమున్న దాని గురించి ఈ విధంగా తెలిపాడు. "ఒక వ్యక్తి మీ కనురెప్పలను తెరచి పట్టుకుంటే, మీరు గోడపైన ఒకే ప్రదేశం వైపుగా చూడాలి. ఇది చాలా ఒత్తిడితో కూడుకున్న ప్రక్రియ, ఎందుకంటే మీ కనుగుడ్డులోని చిన్నపాటి కదలిక జరిగినా కూడా మీ కంటికి గుచ్చుతున్న సిరంజీ కారణంగా, మీరు చూపును కోల్పోయే పరిస్థితి తలెత్తుతుంది".
తన నాలుకను చీలిక చేయడం గురించి:
ఏతాన్ కు పదిహేడేళ్ళు ఉన్నప్పుడు, అతను అత్యంత గగుర్పాటుకు గురిచేసే, నొప్పితో కూడుకున్న నాలుకను చీల్చేసే శస్త్ర చికిత్సను చేయించుకున్నాడు. ఈ శస్త్ర చికిత్స జరిగిన కొన్ని రోజుల వరకు అతను తినడానికి, తాగడానికి చాలా కష్టపడేవాడినని చెప్పుకొచ్చాడు.
అతని ఏకైక భయం:
తన నాలుక చీలికలు చేసుకున్నాక నిరంతరంగా చొంగ కార్చుతున్నందున, అతనికున్న ఏకైక భయం మృత్యువు మాత్రమే అని అంగీకరించాడు. ఇది తప్పితే అతను ఎప్పుడు, దేనికి భయపడలేదు. తాను ఇప్పటివరకు శరీర భాగాలలో చేయించుకున్న ప్రతి మార్పునూ అమితంగా ఇష్టపడతానని చెప్పాడు.
ఈ తీవ్రమైన మార్పులపై మీ అభిప్రాయమేమిటి? నిజంగానే ఇటువంటి మార్పుకు విలువ ఉంటుందనుకుంటున్నారా లేక ఇది పిచ్చికి పరాకాష్ట అనుకుంటున్నారా? మీ అభిప్రాయాలను మాకు తప్పక తెలియజేయండి!



Click it and Unblock the Notifications

