రాశిచక్రాల ఆధారంగా మీకుండే అభద్రతాభావాలను అంచనా వేయగలమా?

Written By: ChaitanyaKumar ARK
Subscribe to Boldsky

మీ భయాల గురించి, లేదా అభద్రతా భావాల గురించి ఇతరులకు ఎలా వివరణలను ఇవ్వగలరు? భయం అనేది కూడా మన వ్యక్తిత్వ చాయలకు రూపకంగా ఉంటుంది. మీకు తెలుసా, ఇతరుల భయాలను, అభద్రతా భావాలను సైతం రాశిచక్రాలతో అంచనాలు వేయవచ్చని.

జ్యోతిష్య శాస్త్రజ్ఞుల ప్రకారం, ఇలా అభద్రతాభావాలు మరియు భయాల గురించిన ప్రశ్న తలెత్తినప్పుడు, రాశి చక్రాలు ఎంతో చక్కగా సహాయపడగలవని చెప్తున్నారు.

ఇక్కడ ప్రతి రాశిచక్రానికి వాటి వాటి సంబంధిత లక్షణాలకు అనుగుణంగా భయాలు మరియు అభద్రతాభావాలు ఉన్నాయి. కానీ ముందుగా మనగురించిన అవగాహన కూడా మనకుండాలి కదా.

ఈ వ్యాసంలో వీటిగురించిన పూర్తి వివరాలను అందివ్వడమైనది.

మేష రాశి : మార్చి21 – ఏప్రిల్19

మేష రాశి : మార్చి21 – ఏప్రిల్19

మీరు మేష రాశికి చెందిన వారైతే, ఓడిపోవడం, లేదా వైఫల్యానికి గురైనప్పుడు మీరు అస్సలు జీర్ణించుకోలేరు. మీరు ఎక్కడ ఓడిపోతామో అన్న అభద్రతా భావానికి ఎక్కువగా లోనవుతూ ఉంటారు, ముఖ్యంగా మీ జీవితాన్ని ప్రభావితం చేసే విషయాలలోనే ఈ భయం అధికంగా ఉంటుంది. వర్తమానంలో జీవించడం, పరిస్థితులను తేలికగా తీసుకునే వ్యక్తిత్వాన్ని కొంతమేర అలవరచుకోవడం ద్వారా మీరు ఈ పరిస్థితి నుండి బయటపడవచ్చు.

వృషభరాశి : ఏప్రిల్ 20- మే 20

వృషభరాశి : ఏప్రిల్ 20- మే 20

మీరు వృషభరాశికి చెందిన వారైతే, మీరు ఎక్కువగా నిస్వార్ధ జీవులై ఉంటారు. నిజంగా ఎంతో ఆహ్వానించదగ్గ గుణం మీది. కానీ ఇతరుల గురించి ఎక్కువగా ఆలోచించే క్రమంలో మిమ్ములని మీరు కోల్పోయే ప్రమాదాలు లేకపోలేదు. తద్వారా ఎక్కడ ఒంటరిగా మిగిలిపోతామో అన్న భయం మిమ్ములని వెంటాడుతూ ఉంటుంది.

మిధునరాశి : మే 21 – జూన్ 20

మిధునరాశి : మే 21 – జూన్ 20

మీరు మిధునరాశికి చెందిన వారైతే, మీరు అదృష్టవంతులై ఉంటారు, అన్ని వేళలా మీకు సమయం అనుకూలంగా కనిపిస్తూ ఉంటుంది. కానీ పరిస్థితులు తారుమారైతే అన్న అనుమానం మీకు అభద్రతాభావంలా వెంటాడుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో మీరు మీ అంతరాత్మతో ఎక్కువగా చర్చించవలసి ఉంటుంది. తద్వారా సమస్యలు జీవితంలో ఒకభాగం అని బలంగా నమ్మిన రోజున నెమ్మదిగా మీకు ఈ అభద్రతాభావాలు తొలగే అవకాశాలు ఉన్నాయి.

కర్కాటకరాశి : జూన్ 21-జూలై 22

కర్కాటకరాశి : జూన్ 21-జూలై 22

మీరు కర్కాటకరాశికి చెందిన వారైతే, ఎవరికైనా తమ వల్ల హాని జరుగుతుందేమో అన్న భయాన్ని కలిగి ఉండడo సహజ లక్షణంగా ఉంటుంది. మీ భావోద్వేగాలను నియంత్రించే శక్తిని కోల్పోతూ ఉంటారు. వీటి నుండి బయటపడడానికి మీ ప్రియమైన వారి సహకారాన్ని ఎల్లప్పుడూ తీసుకోండి.

సింహరాశి : జూలై 23 – ఆగస్ట్ 23

సింహరాశి : జూలై 23 – ఆగస్ట్ 23

మీరు సింహరాశికి చెందిన వారైతే, తమ ఉనికిని ఎక్కడ కోల్పోతామో అన్న అభద్రతా భావానికి తరచుగా లోనవుతూ ఉంటారు. మరియు మీ కుటుంబ సభ్యుల ప్రేమలు దూరం అవుతాయేమో అన్న భావన మిమ్ములని వెంటాడుతూ ఉంటుంది. నిజానికి ఎటువంటి సందర్భంలో అయినా కూడా, కేంద్రబిందువుగా ఉండాలన్న ఆలోచన చేస్తూ ఉంటారు. ఈ ఒక్క ఆలోచనను తగ్గించగలిగితే, మీ అభద్రతా భావాల తగ్గుదలకి దోహదం చేసినవారవుతారు.

కన్యా రాశి : ఆగస్ట్ 24- సెప్టెంబర్ 23

కన్యా రాశి : ఆగస్ట్ 24- సెప్టెంబర్ 23

మీరు కన్యారాశికి చెందిన వారైతే మీరు ప్రణాళికాబద్దంగా జీవితాన్ని నడపాలన్న ఆలోచనను చేస్తుంటారు. తద్వారా మీతో పాటు మీ భాగస్వామి, కుటుంబ సభ్యులు, ప్రియమైనవారి నుండి కూడా ఇలాంటి అలవాట్లనే కోరుకుంటూ ఉంటారు. కానీ అస్తవ్యస్త ప్రణాళికలు ఎదురైతే అస్సలు తట్టుకోలేరు. మీరు అసౌకర్యానికి గురవడం గురించిన అభద్రతాభావానికి తరచూ లోనవుతుంటారు. మరియు మానసిక గందరగోళాలను, సామాజిక అస్తవ్యస్త పోకడలను కూడా మీరు క్షమించలేరు.

తులారాశి : సెప్టెంబర్ 24- అక్టోబర్ 23

తులారాశి : సెప్టెంబర్ 24- అక్టోబర్ 23

మీరు తులారాశికి చెందిన వారైతే, మీరు ఎక్కువగా మీ కుటుంబ సభ్యులు, మీ భాగస్వామి పట్ల అధిక ప్రేమను కనపరుస్తూ ఉంటారు. తద్వారా మిమ్ములను కూడా అదే విధంగా ఇతరులు కూడా ప్రేమించాలని ఆశిస్తూ ఉంటారు. నిర్లక్ష్యం అనే మాటను అస్సలు తట్టుకోలేని వారిగా ఉంటారు. మిమ్ములను ఎక్కడ నిర్లక్ష్యం చేస్తారేమో అన్న అభద్రతా భావం వెంటాడుతూ ఉంటుంది. ఒక్కోసారి ఈ ఆలోచన తీవ్రతరం కూడా కావొచ్చు. కానీ మీరు గ్రహించవలసిన అంశం ఏమిటంటే, మీరొక అద్భుతమైన మనిషి., మిమ్ములని ప్రేమించినవారు ఎన్నటికీ మిమ్ములని వీడిపోలేరు, పోనివ్వరు కూడా.

వృశ్చికరాశి : అక్టోబర్ 24 – నవంబర్ 22

వృశ్చికరాశి : అక్టోబర్ 24 – నవంబర్ 22

మీరు వృశ్చికరాశికి చెందిన వారైతే , మీరు మీ చుట్టూ జరుగుతున్న ప్రతి విషయము గురించిన అవగాహన కలిగి ఉండాలి. లేనిచో మీరు కొన్ని విపత్కర పరిస్థితుల యందు మానసిక గందరగోళానికి గురయ్యే అవకాశాలు లేకపోలేదు. ఇలాంటి పరిస్థితులు ఎదురవుతాయనే భయం మీలో అధికంగా ఉంటుంది. ఇలాంటి పరిస్థితులు మీ ఆందోళనా స్థాయిలను కూడా పెంచే అవకాశాలు ఉన్నాయి .

ధనుస్సురాశి: నవంబర్ 23 – డిసెంబర్ 22

ధనుస్సురాశి: నవంబర్ 23 – డిసెంబర్ 22

మీరు ధనుస్సురాశికి చెందిన వారైతే, మీ భయం కాస్త వింతగా అనిపిస్తుంది. ఎవరైనా మిమ్ములని సహాయం అభ్యర్దిoచి వస్తే, ఎక్కడ మీరు ఆ సమస్యకు పరిష్కారం చూపలేకపోతారో అన్న భావనను కలిగి ఉంటారు. తద్వారా మానసిక ఒత్తిళ్లకు లోనవ్వడం జరుగుతూ ఉంటుంది. మిమ్ములను మీరు ఒక న్యాయనిర్ణేతగా పరిష్కారాల పట్ల అవగాహన కలిగిన వారిగా భావిస్తుంటారు. కానీ అందరి సమస్యలకు మీరే పరిష్కార మార్గమన్న మీ ఆలోచనని పక్కన పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

మకరరాశి : డిసెంబర్ 23 – జనవరి 20

మకరరాశి : డిసెంబర్ 23 – జనవరి 20

మీరు మకరరాశికి చెందిన వారైతే, మీరు ఊహించని మరియు తెలియని పరిస్థితులు ఎదురవుతాయేమో అన్న అభద్రతా భావానికి తరచుగా లోనవుతుంటారు. అలాంటి పరిస్థితులు మీకు ఎదురైనప్పుడు, ఈ భయాలు మరింతగా పెరిగే అవకాశాలు లేకపోలేదు. తద్వారా ఏ విషయం కూడా మిమ్ములని ఆశ్చర్యపరచేదిలా ఉండదు అన్నది వాస్తవం.

కుంభరాశి : జనవరి 21- ఫిబ్రవరి 18

కుంభరాశి : జనవరి 21- ఫిబ్రవరి 18

మీరు కుంభరాశికి చెందిన వారైతే., మీకు ఇష్టంలేని విషయాలయందు బలవంతంగా తోయబడుతారేమో అన్న అభద్రతా భావానికి లోనవుతూ ఉంటారు. మిగిలిన వారికోసం వ్యక్తిత్వాన్ని మార్చుకోవడం మీకు నచ్చని పని . తద్వారా మనసుకు నచ్చని ఏ పనినైనా చేయుటకు సంసిద్దతను కలిగి ఉండలేరు. అలాంటి పరిస్థితులు నిజంగా ఎదురైనప్పుడు, ఈ అభద్రతా భావాలు పెరగడమే కాకుండా మీ ఆత్మ స్థైర్యాన్ని కోల్పోయే అవకాశాలు కూడా లేకపోలేదు.

మీనరాశి : ఫిబ్రవరి 19- మార్చి 20

మీనరాశి : ఫిబ్రవరి 19- మార్చి 20

మీరు మీన రాశికి చెందిన వారైతే, మిమ్ములని ఎవరైనా ఎగతాళి చేయడాన్ని మీరు అస్సలు సహించలేరు. అన్ని వేళలా మంచిగా ఉంటూ తద్వారా మంచి పేరును గడిస్తూ ఉండేవారిగా ఉంటారు. తద్వారా ఎవరైనా మిమ్ములను ఎగతాళి చేస్తారేమో అన్న భయం కలిగి ఉండడం సహజంగా ఉంటుంది. అలాంటివి ఎదురైనప్పుడు మీరు వాటిని ఎదుర్కొనలేక చాలా అసౌకర్యానికి గురవుతుంటారు కూడా.

English summary

What Are The Insecurities That Define Your Zodiac Sign

How would you describe your fears and insecurities to others? Having fear is something that defines our personality, but do you know that understanding about our individual fears is so easy with the predictions that are based on our zodiac sign?
Story first published: Tuesday, May 1, 2018, 10:00 [IST]