For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్రేమించిన వారిని ఆకర్షించడానికి, మీ రాశిచక్రం ఆధారంగా మీ శైలిని ఇలా మెరుగుపరుచుకోండి !

|

మీ ప్రేమ విషయంలో, మీ జీవితాన్ని మరింత మెరుగుపరచడంలో సహాయపడే అనేక అంశాలు జ్యోతిషశాస్త్రంలో చాలానే ఉన్నాయి.

మీ రాశిచక్రాల ప్రకారం, సహజంగానే మీరు మీ డేటింగ్ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవచ్చని తెలియజేయబడింది.

మీ రాశిచక్రం ప్రకారం, మీరు ప్రేమించిన వారిని - మీ వైపుకు ఆకర్షించేలా మెరుగుపరిచే ఒక విధానం ఉండవచ్చు.

How To Improve Your Flirting Style, By Zodiac Sign

ఈరోజు వ్యాసంలో, మీ రాశిచక్రం ఆధారంగా మీరు అనుసరించవలసిన కొన్ని ఉత్తమమైన చిట్కాలను మీకు మేము తెలియజేయబోతున్నాము. అవేమిటో మీరు కూడా తెలుసుకోండి !

ఈ చిట్కాలను మీరు అనుసరించడంవల్ల మీరు ప్రేమించిన వారి దృష్టిని, మీరు త్వరగా ఆకర్షించడంలో సహాయం చేస్తాయి.

మేషం : (మార్చి 21-ఏప్రిల్ 19)

మేషం : (మార్చి 21-ఏప్రిల్ 19)

మీరు ఇతరులతో నేరుగా మాట్లాడటం బట్టి వారిని ఇట్టే ఆకట్టుకుంటారు. మీరు ప్రేమించే వారిని అనుక్షణం అనుసరించాలని ఎక్కువగా కోరుకుంటారు. అయితే, మీరు ప్రతి ఒక్కరి దృష్టిని ఆకర్షించేగలరని మాత్రం అనుకోకండి.

మీరు వ్యక్తిపై ఎక్కువ ఇష్టాన్ని కలిగి ఉంటారో, వారిని మీ వైపుకు ఆకర్షించేలా గట్టి ప్రయత్నం చేయాలి. మీ చూపులతో అవతలవారి చూపులను ఆకట్టుకునేలా మీలో నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడం తప్పనిసరి.

వృషభం : (ఏప్రిల్ 20-మే 20)

వృషభం : (ఏప్రిల్ 20-మే 20)

మీరు మనసు పడ్డ వారిని, మీ బాడీ లాంగ్వేజ్తో మీ భావాన్ని తెలియజేయడానికి ప్రయత్నిస్తుంటారు. అందులో భాగంగా మీరు వారిని తాకడానికి ట్రై చేయండి. మరోవైపు, మీ మాటలతో పరిచయాన్ని కొనసాగించడం ద్వారా స్త్రీలు మీ వైపు త్వరగా ఆకర్షితులు కాగలరని గుర్తుంచుకోండి. అలా మీరు చేసే ప్రయత్నంలో దురదృష్టకరమైన పరిస్థితులలో కూడా చిక్కుకుపోవచ్చని గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మీరు సెక్స్ కోసం వెళ్ళాలనుకుంటే, మీకున్న పరిమితులకు లోబడి మాత్రమే మీ సమ్మతిని కలిగి ఉండేలా నిర్ధారించుకోండి.

మిధునం : (మే 21- జూన్ 20)

మిధునం : (మే 21- జూన్ 20)

మీరు మనసు పడ్డ వారిని మీ వైపుకు ఆకర్షించడంలో, చాలా తెలివిగా మాట్లాడుతూ వారిని మీ బుట్టలో వేసుకుంటారు. మీరు సెక్సీ టోన్లో మాట్లాడటం ద్వారా ఇతరులను రెచ్చగొట్టే పద్ధతిలో మీరు ముందుకు సాగుతారు.

మహిళలు మాత్రం, తక్కువగా శ్వాసిస్తూ & గట్టిగా మాట్లాడుతూ మగవారిని తమ చెప్పుచేతల్లో పెట్టుకుంటారు. అలాంటప్పుడు ఈ రాశిచక్రం గల పురుషులు మరింత ఆకర్షణీయంగా స్త్రీల మనసు కరిగేలాగా మాట్లాడుతూ కనబడతారు. స్త్రీలు మాట్లాడేటప్పుడు, వారి మాటతీరు పై సరైన నియంత్రణను సాధారణంగా కలిగి ఉంటారు.,

కర్కాటకం : (జూన్ 21- జూలై 22)

కర్కాటకం : (జూన్ 21- జూలై 22)

ఈ రాశిచక్రము వారు ప్రేమానుభూతికి చాలా దగ్గరగా ఉంటారు. మీరు చాలా త్వరగా ఇతరులతో అటాచ్ చేయబడతారు, వీరి భావన వారిపై స్థిరంగా మారకుండా ఉంటుంది. ఇతరులపై మీరు తమ అభిమానాన్ని చాటుకునేలా చాలా ఎక్కువగా కష్టపడి - ప్రేమను పొందుతారు. ఇది ముఖ్యంగా ఈ రాశిచక్రంలో ఉన్న మహిళలకు వర్తిస్తుంది.

సింహం : (జులై 23-ఆగస్టు 23)

సింహం : (జులై 23-ఆగస్టు 23)

ఈ రాశి వారు ప్రేమతో ఎక్కువగా ఆకర్షితులు అవడానికి ఇష్టపడతారు. మీ భావాలు, మీరు ప్రేమించిన వారికి అర్థమయ్యేలా చెయ్యడానికి ఎలాంటి పరిస్థితుల్లోనైనా మీరు ప్రేమించిన వారికి తగిన ప్రాధాన్యతనిస్తారు. మీరు మీ భాగస్వామిని ఇంప్రెస్ చేయడానికి నానా పాట్లు పడవలసిన అవసరం లేదు, మీరు ఏదైతే అనుకుంటారో అది మీ బుర్రకి ఎక్కితే చాలు. ( అప్పుడు మీరు మరింత ఎక్కువగా మీ భాగస్వామిని ఆకర్షించవచ్చు )

స్త్రీలు తమ తలను కిందకు వంచి, ముందుకు సాగితే చాలా అందంగా ఉంటారని స్టడీస్ చెబుతున్నాయి. కానీ నిజానికి, ఈ రాశి గల స్త్రీలు తలపైకెత్తి చూడటంవల్ల మగవారు షాకవుతారు. ఈ రాశి గల పురుషులు తమ ముక్కు కొన వైపు చూస్తూ ఉన్నట్లయితే ఇంకా ఆకర్షణీయంగా కనబడుతారు.

కన్య : (ఆగస్టు 24-సెప్టెంబర్ 23 )

కన్య : (ఆగస్టు 24-సెప్టెంబర్ 23 )

ఈ రాశి వారు వినమ్రతగా & నిరాడంబరమైన వ్యక్తిత్వమును కలిగి ఉన్నట్లుగా గుర్తించబడతారు. కాని వీరు పిరిగివారిగా & భయస్తుడిగా ఉంటారు. మీలో దాగివున్న నిరాడంబరతకు చాలామంది ఆకర్షితులవుతారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. మీరు మరింత హుందాగా కనబడటానికి లేత గోధుమ రంగు, తెలుపు & బూడిదరంగు ఉన్న బట్టలను ధరించండి.

మీరు ఇతరులను ఆకర్షించడానికి మరింత బోల్డ్గా మారాల్సిన అవసరం ఉంది. మిమ్మల్ని మరింత అందంగా చూపించగల ఎర్రని వస్త్రాలు లేదా ఎర్రని లిప్స్టిక్ వంటివి సాధనాలుగా వాడవచ్చు. ఈ రంగు మీలోన దాగి ఉన్న ప్రతికూలతలను దాచిపెడుతుంది.

తుల : (సెప్టెంబర్ 24-అక్టోబర్ 23)

తుల : (సెప్టెంబర్ 24-అక్టోబర్ 23)

ఏ రాశి వారు సహజంగానే ఆకర్షణీయమైన, అద్భుతమైన మాటతీరును కలిగి ఉంటారు. మీకు మీరు తెలియకుండానే చాలాసార్లు ఇతరులను పరిహాసం చేస్తుండటాన్ని గమనిస్తూ వుంటారు. మీరు అందరితోని సహాజంగానే ఉంటారు తప్ప, ప్రతి ఒక్కరిని ఆకర్షించడానికి మీరు ఏమాత్రం ప్రయత్నించరు. సామాజిక అంశాలపై మీరు ఇతరులను మీ మాటలతో ప్రేరేపించగలరు. మీరు కోరుకున్న వ్యక్తిని మీ వైపుకు చాలా సునాయాసంగా ఆకర్షించుకోగలరు.

వృశ్చికం : (అక్టోబర్ 24-నవంబరు 22)

వృశ్చికం : (అక్టోబర్ 24-నవంబరు 22)

ఇతరులను పొగడ్తలతో ముంచడానికి చాలా రకాల మార్గాలు ఉన్నాయని చాలామందికి తెలియకపోవచ్చు. కొందరి మాటలు చాలా సరదాగా ఉన్నప్పటికీ, మరి కొందరి మాటలు మాత్రం ఇతరులను తమ భాగస్వాములుగా పొందే భావనను వ్యక్తపరిచేలా ఉంటాయి.

వీళ్ళు చాలా మూడిగా & నాటకీయతను కలిగి ఉంటారు, ఈ వ్యక్తులు మొదటి చాలా యాక్టివ్ గా ఉంటూ, తమకు నచ్చిన వ్యక్తితో స్నేహంగా వుంటూ ఒకరినొకరు తెలుసుకోవడానికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు. వారి చర్యలు చాలా సరదాగా ఉండటం వల్ల, వీరు చాలా తొందరగా ఇతరులను తమవైపుకి తిప్పుకుంటారు.

ధనుస్సు!: (నవంబర్ 23-డిసెంబరు 22)

ధనుస్సు!: (నవంబర్ 23-డిసెంబరు 22)

ఏ రాశి చక్రం వారు తమ నవ్వుతో ఇతరులను చాలా సులభంగా ఆకర్షించగలుగుతారు. వీరికి హాస్యచతురత చాలా ఎక్కువ, అలాగే బాధ్యతలను కూడా తీసుకుంటారు. మీరు కోరుకున్న వ్యక్తిని మీ వైపుకు ఆకర్షించడానికి మీరు వేసే జోకులను నెమ్మదిగా చెప్పడం చాలా మంచిది. మీరు ద్వంద్వార్థ ప్రయోగాలకు దూరంగా ఉండటం వల్ల ఇతరులకు మీ పైనా మంచి అభిప్రాయం ఉంటుంది.

మకరం: (డిసెంబర్ 23-జనవరి 20 )

మకరం: (డిసెంబర్ 23-జనవరి 20 )

మీరు డేటింగ్ కోసం ఉద్దేశపూర్వకంగా ఒక్కరితో మాటలు కలిపేటప్పుడు మీ నరాలు మాటల్లో చెప్పలేనంత ఒత్తిడితో ఉబ్బిక్కుతాయి. ఒకవేళ మీరు ఒక వ్యక్తిని ప్రేమించినట్లయితే ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండగలరు. ఇంకొకవైపు, మీ మనసులో ఉన్న భావాన్ని త్వరగా బయట పెట్టలేరు. అలాంటప్పుడు, మీరు కాస్త ఫన్నీగా ఉంటూ, మీ భావాన్ని అవతల వ్యక్తికి తెలియపరచండి. మీ కను సైగలు & చిరునవ్వుతో అవతలి వారిని ఆకర్షించడం వల్ల, వారి కంటికి మీరు చాలా అందంగా కనపడతారు.

కుంభం : (జనవరి 21-ఫిబ్రవరి 18)

కుంభం : (జనవరి 21-ఫిబ్రవరి 18)

వారు తిరుగుబాటుదారులగానూ, అసాధారణమైన వారిగా ఉంటారు. వీరు కొత్త విషయాలను నేర్చుకోవడానికి, పెత్తందారీ తనాన్ని ప్రశ్నించడానికి ఏమాత్రం వెనుకాడరు. ఇలాంటివారు మనసు పడ్డ వ్యక్తిని ఆకర్షించడానికి సహజంగానే సరదాగా ఉంటూ, యాదృచ్ఛికంగానే జోక్స్ వేస్తూ ఉంటారు.

మీనం : (ఫిబ్రవరి 19-మార్చి 20)

మీనం : (ఫిబ్రవరి 19-మార్చి 20)

వారు సాధారణంగా చాలా తెలివైనవారు. కానీ కొన్ని సందర్భాల్లో వీరు తీసుకునే నిర్ణయాలు వారిని తెలివి తక్కువ వారీగా భావించేలా చేస్తాయి. వాళ్లు అనుకున్న పనులు సకాలంలో అవ్వకపోతే, వారికి వేరే ఏ దారి లేనట్లుగా సతమతమవుతారు. ప్రేమ విషయంలో ఇతరులను ఆకర్షించడానికి వీరి కళ్ళతో ఫ్లిర్ట్ చేయవచ్చు కానీ వీటికి అది సాధ్యం కాదు.

మీరు ప్రేమించిన వారిని దృష్టిని ఆకర్షించడానికి చేసే ప్రయత్నాలు ఎప్పుడు మొదటి స్థానంలో ఉండేలా చూసుకోండి. అలా కాకుండా, మీరు సాధారణమైన స్వభావాన్ని కలిగి ఉండటం వల్ల మీరు ఎవరికి ఆకర్షణీయంగా కనబడకపోవచ్చు. మీరు కోరుకున్న వ్యక్తితో త్వరగా ఆకర్షించడానికి మీరు మీ కంటి చూపులతో మీ భావాలను వ్యక్తపరచడాన్ని అలవాటు చేసుకోండి. భవిష్యత్తులో మీరు ఎప్పుడైనా కలిసినప్పుడు, మీ కంటిచూపులు అవతలి వ్యక్తికి మీ భావాలను వ్యక్త పరుస్తాయి. అలా వారి దృష్టిని మీరు ఆకర్షించగలరు.

English summary

How To Improve Your Flirting Style, By Zodiac Sign

The most alluring people are not those with the best physical traits, but instead those that can signal their availability and confidence through their flirting skills. According to zodiac signs, each zodiac sign has its share of ideas and tips on how they must take suggestions while flirting.
Story first published: Wednesday, August 1, 2018, 16:00 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more