For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బావతో బీచ్ లో ఎంజాయ్ చేసేదాన్ని, చేపలు పట్టుకుని బతికేటోళ్లం, మా నాన్నకు తెలియడంతో.. #mystory379

జాబ్ లో జాయినయ్యాక బావ స్టైల్ మొత్తం మార్చాడు. బైక్ కొన్నాడు. బైక్ నన్ను ఎక్కించుకుని బీచ్ కు తీసుకెళ్లేవాడు. బీచ్ లో ఇద్దరం బాగా ఎంజాయ్ చేసేవాళ్లం. ఇంట్లో నుంచి బయటకు రానివ్వకుండాతర్వాత మా విషయ

|

నా పేరు వినీత. మాది సముద్రం తీరం పక్కన ఉండే ఒక పల్లెటూరు. మా కుటుంబం మొత్తం కూడా చేపలుపడుతూ బతుకుతూ ఉంటుంది. మేము ఉండే ఏరియా మొత్తం చేపలు పట్టే వాళ్లే ఉంటారు.
మా ఏరియాలో చదువుకునే వారు చాలా తక్కువ. అందులో అమ్మాయిలు ఇంకా తక్కువ.

కానీ నేను మా అమ్మనాన్నను చదువుకుంటానని బతిమిలాడడంతో వాళ్లు నన్ను చదివించారు. అయితే టెన్త్ పాసవ్వగానే ఇక చదువు చాలు అన్నారు. మా ఇంట్లో వాళ్లకంటే ఇంటి పక్కన ఉండే వారి గోల ఎక్కువైంది.

చదువుకోవడం అస్సలు ఇష్టం లేదు

చదువుకోవడం అస్సలు ఇష్టం లేదు

వారందరికీ నేను చదువుకోవడం అస్సలు ఇష్టం లేదు. నేను కాలేజీకి వెళ్లి బాగా చదువుకుంటే వారి పిల్లలకంటే నేను బాగుపడిపోతానేమోనని వారి బాధ. కానీ మా ఇంట్లో వాళ్లను ఒప్పించి నేను చివరకు కాలేజీలో జాయినయ్యాను.

పోష్ గా వెళ్లేదాన్ని

పోష్ గా వెళ్లేదాన్ని

కాలేజీకి నేను పోష్ గా వెళ్లేదాన్ని. నేను అలా వెళ్లడం చూసి ఓర్వలేని మా కులంలోని కొందరు నాపై రకరకాలుగా చెప్పారు. దీంతో నన్ను మా ఇంట్లోవారు కాలేజీ మాన్పించారు.

బావా అని పిలిచేదాన్ని

బావా అని పిలిచేదాన్ని

తర్వాత నాకు వివాహం చేయాలనుకున్నారు. మా నాన్న వాళ్ల తరఫు చుట్టాల్లోని ఒక అబ్బాయిని చేసుకోవాలని పట్టుబట్టారు. కానీ నాకు ఆ అబ్బాయి అంతగా నచ్చలేదు. నాకు చిన్నప్పటి నుంచి

మా అమ్మ అన్న కొడుకు అంటే ఎంతో ఇష్టం. తనని బావా అని పిలిచేదాన్ని.

మనస్సులోని మాటను చెప్పలేదు

మనస్సులోని మాటను చెప్పలేదు

నాకు వచ్చిన పెళ్లి సంబంధాల గురించి నేను మా బావకు చెప్పాను. సరే అయితే చేసుకో మంచిదేగా అన్నాడు. అతనికి నా మనస్సులోని మాటను చెప్పలేదు. తనే అర్థం చేసుకుంటాడనుకున్నాను. కానీ తను అస్సలు అర్థం చేసుకోలేదు.

Most Read :అన్నంలో విషం కలిపితే కూడా తెలిసిపోతుంది, అరటి ఆకులో భోజనంతో చాలా ఆరోగ్య ప్రయోజనాలుMost Read :అన్నంలో విషం కలిపితే కూడా తెలిసిపోతుంది, అరటి ఆకులో భోజనంతో చాలా ఆరోగ్య ప్రయోజనాలు

బావకు అసలు విషయం చెప్పాను

బావకు అసలు విషయం చెప్పాను

తర్వాత మా బావకు అసలు విషయం చెప్పాను. బావ నువ్వుంటే నాకు చాలా ఇష్టం... నేను నిన్నే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. నాకు మా ఇంట్లో వాళ్లు సంబంధం ఒకే చేయకముందే నువ్వు మా ఇంట్లో వాళ్లతో మాట్లాడు అని చెప్పాను. తను ఒకే అన్నాడు.

చేపలు పట్టుకునేటోడివి ఎట్ల ఇస్త అనుకున్నావు

చేపలు పట్టుకునేటోడివి ఎట్ల ఇస్త అనుకున్నావు

సంబంధం గురించి మా ఇంట్లో వాళ్లను డైరెక్ట్ గా అడిగాడు మా బావ. నీకు ఉద్యోగం లేదు సద్యోగం లేదు చేపలు పట్టుకునేటోడివి నీకు ఎట్ల ఇస్త అనుకున్నావు నా కూతుర్ని అంటూ మా నాన్న మా బావను నానా మాటలు అన్నాడు. దీంతో అతను ఏమీ అనకుండా ఇంటికి వెళ్లిపోయాడు.

ప్రేమ మరింత ఎక్కువైంది

ప్రేమ మరింత ఎక్కువైంది

ఆ రోజు నుంచి తనపై నాకు ప్రేమ మరింత ఎక్కువైంది. తనని విడిచి ఒక్క క్షణం కూడా ఉండలేకపోయేదాన్ని. మా నాన్నకు తెలియకుండా తనని ఇంటికి పిలిపించుకునేదాన్ని.

గంటల తరబడి ముచ్చట్లు

గంటల తరబడి ముచ్చట్లు

తనతో గంటల తరబడి ముచ్చట్లు పెట్టేదాన్ని. మా అమ్మ మమ్మల్ని ఏమీ అనేది కాదు. ఎలాగైనా నువ్వు చిన్న కంపెనీలో పనికి జాయిన్ కా బావా అన్నాను. తను అష్టకష్టాలుపడి ఇష్టం లేకపోయినా కూడా ఒక కంపెనీలో జాయిన్ అయ్యాడు.

Most Read :అలాంటి వారి ముఖంపై గాండ్రించి ఉమ్మించినా సిగ్గు రాదు, వాళ్లతో నీకెందుకు, నీ జీవితాన్ని ప్రేమించు!Most Read :అలాంటి వారి ముఖంపై గాండ్రించి ఉమ్మించినా సిగ్గు రాదు, వాళ్లతో నీకెందుకు, నీ జీవితాన్ని ప్రేమించు!

బావ స్టైల్ మొత్తం మార్చాడు

బావ స్టైల్ మొత్తం మార్చాడు

జాబ్ లో జాయినయ్యాక బావ స్టైల్ మొత్తం మార్చాడు. బైక్ కొన్నాడు. బైక్ నన్ను ఎక్కించుకుని బీచ్ కు తీసుకెళ్లేవాడు. బీచ్ లో ఇద్దరం బాగా ఎంజాయ్ చేసేవాళ్లం.

ఇంట్లో నుంచి బయటకు రానివ్వకుండా

ఇంట్లో నుంచి బయటకు రానివ్వకుండా

తర్వాత మా విషయం నాన్నకు తెలిసి నన్ను ఇంట్లో నుంచి బయటకు రానివ్వకుండా చేశాడు. మా ప్రేమకు మా అమ్మ కూడా సహకరిస్తుందని ఆమెను కొట్టాడు. కానీ పెళ్లి చేసుకుంటే బావనే చేసుకోవాలని నేను డిసైడ్ అయ్యాను.

బావనే పెళ్లాడాలనుకున్నాను

బావనే పెళ్లాడాలనుకున్నాను

అందుకే ఎన్ని కష్టాలు వచ్చినా సరే బావనే పెళ్లాడాలనుకున్నాను. దాదాపు ఆరునెలల పాటు బావను నన్ను కలవకుండా చేశాడు మా నాన్న. కానీ మా బావ మాత్రం కుంగిపోకుండా ఉద్యోగంలో ప్రమోషన్స్ సాధించి బాగా సంపాదించి ఒక స్థాయికి చేరుకున్నాడు.

మా అమ్మాయినే ఇచ్చి పెళ్లి చేసేవాణ్ని

మా అమ్మాయినే ఇచ్చి పెళ్లి చేసేవాణ్ని

తర్వాత మా కులపు పెద్ద మనుషులతో ఇంటికొచ్చి పెళ్లి సంబంధం గురించి మాట్లాడాడు. అతనితో పాటు మా ఇంటికి వచ్చిన కొందరు నాన్నకు అర్థమయ్యేలా చెప్పారు. ఆ అబ్బాయి ఒకే.. అంటే మా అమ్మాయినే ఇచ్చి పెళ్లి చేస్తానని ఒక పెద్దమనిషి అన్నాడు.

Most Read :ఇలా చేస్తే తెల్లగా మారిన జుట్టు కూడా నల్లగా మారుతుంది, ట్రై చేసి చూడండిMost Read :ఇలా చేస్తే తెల్లగా మారిన జుట్టు కూడా నల్లగా మారుతుంది, ట్రై చేసి చూడండి

మంచి పిల్లాడిని వదులుకోకండి

మంచి పిల్లాడిని వదులుకోకండి

నీ మేనల్లుడు నీ కూతుర్ని ఇష్టపడ్డాడు.. మరి ఎందుకు ఆలోచిస్తున్నావ్.. అంత మంచి పిల్లాడిని వదులుకోవడం మంచిది కాదంటూ పెద్ద మనుషులంతా నచ్చజెప్పారు. దీంతో నాన్న చివరకు మా పెళ్లికి ఒప్పుకున్నాడు. మా బావతో నా పెళ్లి జరిగింది. ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాం.

English summary

I sincerely loved him finally I married him

I sincerely love him finally I married him
Desktop Bottom Promotion