For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  కన్య రాశికి చెందిన జూన్ 2018 మాసఫలాలు

  |

  ఈ నెలలో మిశ్రమ ఫలితాలు కలిగే సూచనలు కలవు. మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ కొన్ని సార్లు తక్కువగా ఉన్నప్పటికీ మీ గ్రహస్థితులు వలన కష్టమైన పరిస్థితులను కూడా సమర్థవంతంగా ఎదుర్కోగలుగుతారు. ఈ నెలలో లో ప్రొఫైల్ ను మెయింటెయిన్ చేయడం మంచిది. వర్క్ ప్లేస్ లో కాంట్రావర్సీలను అవాయిడ్ చేయండి. లేదంటే, వాటివలన కలిగే ప్రతికూలతలను మీరు ఎదుర్కోవలసి వస్తుంది. మీ మనస్సు సరైన దిశలో ఉంటే మీరు ముఖ్యమైన పనులపై దృష్టి పెట్టగలుగుతారు.

  ఈ నెలలో మీకు ఎదురయ్యే కొన్ని పరిస్థితులలో ప్రతిసారి మీకు రెండు ఆప్షన్స్ ఉంటాయి. నిర్ణయాన్ని తీసుకునే సమయంలో అనిశ్చిత పరిస్థితులను అవాయిడ్ చేయడం మంచిది. మీ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసేవారి నుండి దూరంగా ఉండండి. అటువంటి వారిని హ్యాండిల్ చేయాలని ప్రయత్నించకండి. కర్మ అనేది వారి గురించి ఆలోచిస్తుంది. ఈ నెలాఖరులో మీరు కొన్ని ఆధ్యాత్మిక విషయాలలో నిమగ్నమవుతారు. తద్వారా, మీకు మానసిక శాంతి లభిస్తుంది. మీ తల్లిదండ్రుల యొక్క తీర్థయాత్రలకు మీరు తోడ్పడటానికి ఇది మంచి సమయం.

  ఈ నెల మొదట్లో వచ్చే సూర్యగ్రహణం వలన మీ వర్క్ ప్లేస్ లో ప్రధాన మార్పులు చోటుచేసుకోవచ్చు. కొత్త విషయాలను ప్రయత్నించేందుకు వెనకాడవద్దు. ముందడుగు వేయండి. మీ ప్రయత్నాలకు రివార్డ్స్ అందుతాయి.

  ఈ నెలలో కెరీర్ తో పాటు మీ లవ్ లైఫ్ ఏ విధంగా ఉందో తెలుసుకోవాలని అనుకుంటున్నారా?

  అయితే, మీ రాశికి చెందిన ఈ నెల ప్రెడిక్షన్స్ ను ఇక్కడ తెలుసుకోండి.

  1. ఆరోగ్యం

  1. ఆరోగ్యం

  ఆందోళన మరియు ఒత్తిడి వలన మీరు ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. పని ఒత్తిడి వలన ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడం మీకు కుదరకపోవచ్చు. అయినా, మీరు ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకునేందుకు ప్రయత్నిస్తే అనారోగ్య సమస్యలను అరికట్టగలుగుతారు. హెల్త్ కాంప్లికేషన్స్ ను అరికట్టేందుకు మీరు ఆరోగ్యకరమైన ఆహారానికే పెద్దపీట వేయాలి.

  ఉదర సంబంధ ఇబ్బందులకు స్వంత వైద్యం పనికిరాదు. వైద్యున్ని సంప్రదించి సరైన మెడికేషన్స్ ను వాడాలి. మీరు అనుకున్న విధంగా అన్నీ జరగవు. ఈ విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. మీ బరువును అదుపులో ఉంచుకోవాలి. మీ బీఎంఐ అధికంగా ఉంటే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే, గుండె మరియు బీపీ సమస్యలు తలెత్తే ప్రమాదం ఎక్కువ.

  వాహనాన్ని నడిపేటప్పుడు మరింత అప్రమత్తంగా ఉండాలి. లేదంటే యాక్సిడెంట్స్ కు గురయ్యే ప్రమాదం ఉంది. దాంతో, మీరు ఎక్కువ కాలం బెడ్ రెస్ట్ ను తీసుకోవలసి వస్తుంది. ఆరోగ్యాన్ని సంరక్షించుకునేందుకు మీరు ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలి. లీఫీ గ్రీన్స్ ను డైట్ లో భాగంగా చేసుకోవాలి. మీల్ ను ఆరోగ్యంగా ప్రారంభించేందుకు హెల్తీ వెజ్జీస్ తోడ్పడతాయి. ఇవి మీ బరువును అదుపులో ఉంచడంతో పాటు మీ కేలరీ కౌంట్ ను మానిటర్ చేస్తాయి.

  2. వృత్తిపరంగా

  2. వృత్తిపరంగా

  ఈ నెలలో వృత్తిపరంగా మీకు సానుకూలంగా ఉంది. మీ పనిలో ఎన్నో పురోగతులను మీరు గమనించవచ్చు. ఒకేసారి అనేక ప్రాజెక్ట్స్ తో సతమతమవుతున్నప్పటికీ ఒక్కొక్క ప్రాజెక్ట్ పై దృష్టి పెడుతూ ముందుకు పోతే విజయం మీదే. మీ మాటలను నియంత్రణలో ఉంచుకోకపోవటం వలన మీ కొలీగ్స్ తో కొన్నిసార్లు చిక్కుల్లో పడే ప్రమాదం ఉంది. తెలియకుండానే మీరు ముఖ్యమైన సమాచారాన్ని నోరుజారి లీక్ చేసే ప్రమాదం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి.

  ఒకవేళ మీ హార్డ్ వర్క్ కి తగినంత గుర్తింపు రాకపోతే నిరాశ చెందకండి. మీ సహనాన్ని పరిశీలించే పరిస్థితులివి. మీరెప్పటినుంచో ఎదురుచూస్తున్న ప్రమోషన్ మీ సొంతమయ్యే సూచనలు కలవు. దాంతో, మీ గుర్తింపు మరింత పెరుగుతుంది.

  వ్యాపారపరంగా, క్లిష్టమైన పరిస్థితులను కూడా హ్యాండిల్ చెసే సత్తా మీ సొంతమవుతుంది. సరైన నిర్ణయం తీసుకోవడానికి మీరు మీ మెదడుకు పదును పెట్టాలి. వ్యాపార భాగస్వాముల వలన ఇబ్బందులు తలెత్తవు. పనితో పాటు లాభాలు కూడా సమానంగానే పంచుకుంటారు.

  3. ఆర్థికపరంగా

  3. ఆర్థికపరంగా

  ఆస్తులకు సంబంధించిన అంశాలకు ప్రాధాన్యతను ఎక్కువగా ఇవ్వాల్సిన నెల ఇది. ఆస్తులను కొనాలన్నా లేదా అమ్మాలన్నా ఇది అనుకూల సమయం. అయితే, మీరు డీల్ చేస్తున్న వ్యక్తులపై మీరు ఒక కన్ను వేసి ఉంచాలి. ఒక వేళ వారు మోసపూరితమైన వారని తెలిస్తే ముందుగా మీరు జాగ్రత్త పడవచ్చు.

  మీ జీవిత భాగస్వామి నుంచి పెట్టుబడులకు సంబంధించి మీకు సరైన సలహా అందుతుంది. కాబట్టి, వారి సలహాను వినండి.

  ప్రయాణాలకు సంబంధించిన అవకాశాలను వదులుకోవద్దు. ఎందుకంటే, ప్రయాణాలు మీకు భారీ లాభాలను తెచ్చే అవకాశం ఉంది. ట్రాన్స్పోర్ట్ ఇండస్ట్రీకి చెందిన వ్యక్తులకు ఈ నెలంతా లాభదాయకంగా ఉంది.

  4. లవ్ లైఫ్

  4. లవ్ లైఫ్

  పీకల్లోతు ప్రేమలో ఉన్న వారికి రిలేషన్ షిప్ ను నెక్స్ట్ లెవల్ కు తీసుకునేందుకు ఇది అనుకూల సమయం. మీ ఇద్దరి అభిప్రాయాలు ఒకటో కాదో తెలుసుకోవాలి. లేదంటే, పరిస్థితులు విభిన్నంగా మారవచ్చు. మీ భాగస్వామితో ఎక్కువ సమయాన్ని కేటాయించడానికి ప్లాన్ చేసుకోండి. పని ఒత్తిడి వలన భాగస్వామితో సమయాన్ని గడిపే అవకాశం ఉండకపోవచ్చు. అయితే, ప్లాన్ చేసుకుని టైం స్పెండ్ చేయడానికి ప్రయత్నించండి. తద్వారా, మీ ఇద్దరూ ఆలోచనలను పంచుకోగలుగుతారు.

  5. అదృష్టాలు

  5. అదృష్టాలు

  మనసు ప్రశాంతంగా ఉంటుంది. వారి నుంచి అందే ఎమోషనల్ సపోర్ట్ వలన మీరు ఏ పనినైనా విజయవంతంగా పూర్తి చేస్తారు. హెల్తీ రిలేషన్ షిప్ ను మెయింటైన్ చేసేందుకు వివాహితులు తమ భాగస్వామికి కాస్తంత స్పేస్ ను ఇవ్వాలి. మీ భాగస్వామిని అర్థం చేసుకునేందుకు ప్రయత్నించాలి. వారి అభిరుచులను కూడా మీరు గౌరవించాలి. రిలేషన్ షిప్స్ విషయానికి వస్తే మనసుకు ప్రాధాన్యతనివ్వడం మంచిది. అదృష్ట రంగులు - రెడ్ మరియు మెరూన్. అదృష్ట సంఖ్యలు - 3 మరియు 7 .

  English summary

  June 2018 Horoscope Predictions For Virgo

  You may experience your share of highs and lows this month. Although your confidence levels will be low at times, the placement of the stars will help cope with difficult situations. You are advised to maintain a low profile and avoid controversies at work, as it may negatively affect you. Keeping your mind at the right track will help you concentrate on important tasks better.
  Story first published: Friday, June 1, 2018, 12:45 [IST]
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more