మిథునరాశికి చెందిన మే 2018 మంత్లీ ప్రెడిక్షన్స్

Written By: Lalitha Lasya Peddada
Subscribe to Boldsky

మిథునరాశికి చెందినవారు హైపర్ యాక్టివ్ గా ఉంటారు. నలుగురిలో తమకంటూ ప్రత్యేకత ఉండాలని కోరుకుంటారు. ఒకవేళ మీరు ఈ రాశికి చెందినవారైతే, ఈ ప్రెడిక్షన్స్ ను తెలుసుకోండి మరి.

మే 2018 కి చెందిన మంత్లీ ప్రెడిక్షన్స్ ను మేము మీకు అందుబాటులో ఉంచుతున్నాము. మీ రాశికి సంబంధించిన ప్రెడిక్షన్స్ ను తెలుసుకోండి.

ఈ నెల కొత్త కొత్త ఆలోచనలను ప్రయత్నించేందుకు అనువుగా ఉంటుంది. అయితే, ఫలితాలకు సంబంధించి పురోగతి మందకొండిగా ఉంటుంది.

Monthly Predictions For Gemini Zodiac For May 2018

ఆస్ట్రో నిపుణుల అంచనా ప్రకారం మీ సృజనాత్మకత ఈ నెలలో మెరుగ్గా ఉంటుంది. అందువలన, మీరు కొన్ని పెద్ద ప్రాజెక్ట్స్ లో భాగస్వామి అయ్యే అవకాశాలు కలవు.

మరోవైపు, మీ ఆలోచనలను ఇంప్లిమెంట్ చేసే సమయంలో మీకు కొన్ని అవాంతరాలు ఎదురయ్యే సూచనలు కలవు.

సవివరమైన మంత్లీ ప్రెడిక్షన్స్ ను మీరు ఇక్కడ తెలుసుకోండి.

ఆరోగ్యం:

హెల్త్ ప్రెడిక్షన్స్ ప్రకారం మీ లాంగ్ టర్మ్ డిప్రెషన్ నుంచి మీకు పూర్తి విముక్తి కలుగుతుంది. ఇది మీకు ఉపశమనం కలిగించే విషయం. వ్యాయామానికి మీరు కాస్తంత సమయాన్ని కేటాయించాలి. అయితే, అతిగా వ్యాయామం చేయకూడదు. అతిగా చేయడం వలన కండరాలు అలాగే లిగమెంట్ల నొప్పులు వేధిస్తాయి. మీ శరీరం అందించే వార్నింగ్ సైన్స్ ను మీరు గమనించాలి. తద్వారా, ఆరోగ్య సమస్యలను ప్రారంభ దశలలోనే తగ్గించుకోవచ్చు.

Monthly Predictions For Gemini Zodiac For May 2018

వృత్తి:

ఈ నెల ప్రారంభం నుంచే వృత్తిపరంగా మీకు కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే సూచనలు కలవు. మీరు సహనం పాటిస్తే సమస్యలను సులభంగా పరిష్కరించుకోగలుగుతారు. పదవ తారీఖు వరకు సమస్యలు అలాగే ఉంటాయి. నెల మధ్యలో పరిస్థితులు చక్కబడటం ప్రారంభిస్తాయి. మరోవైపు, వర్క్ ప్లేస్ లో మీరు కమ్యూనికేట్ చేయడం ద్వారా కొన్ని పనులను నిర్వర్తించగలుగుతారు.

ఆర్థిక లావాదేవీలు:

ఈ నెల మీకు సానుకూలంగా ఉంది. అందువలన, మీరు బిజినెస్ పై ఎక్కువ ఫోకస్ పెట్టగలుగుతారు. మీ బిజినెస్ ని పూర్తిగా కొత్త ఫార్మేట్ లో ఎస్టాబ్లిష్ చేసేందుకు మీరు మొగ్గుచూపుతారు. కొత్త అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. మరోవైపు, ఇతరుల నుంచి మీకు సవాళ్లు ఎదురవుతాయి. వ్యక్తిగతంగా అలాగే వృత్తిపరంగా మీకు ఎదురయ్యే సవాళ్ళను మీరు సహనంతో ఎదుర్కోవాలి.

Monthly Predictions For Gemini Zodiac For May 2018

లవ్ లైఫ్:

కొత్తగా మ్యారేజ్ అయిన వారు హానీ మూన్ కి ఏర్పాట్లు చేసుకోవడం మంచిది. పని ఒత్తిడి నుంచి కాస్తంత విరామాన్ని పొంది సోషల్ గ్యాదరింగ్స్ కు సమయాన్ని కేటాయించాలి. మరోవైపు, పిల్లలు ఉంటే వారిని మీ తల్లిదండ్రుల వద్ద కొన్నాళ్ళు ఉంచి మీ భాగస్వామితో సమయాన్ని గడపడానికి ప్రయత్నించండి. అప్పుడు, మీ రిలేషన్షిప్ మరింత బలపడుతుంది. పిల్లల్ని కనాలని అనుకునే వారికి ఈ నెల అనుకూలంగా ఉంటుంది.

అదృష్ట తేదీలు అలాగే రంగులు:

ఈ నెలలో ఈ రాశికి చెందిన అదృష్ట సంఖ్యలు - 5 & 6; అలాగే 9 వ సంఖ్యకు యాడ్ అయ్యే సంఖ్యలు అంటే 14, 23, 32 వంటివి

అదృష్ట తేదీలు : 5, 14, 23.

అదృష్ట రంగులు : గ్రీన్, ఎల్లో మరియు ఆరెంజ్.

మే నెలకి సంబంధించిన మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ ప్రెడిక్షన్స్ ను చెక్ చేసుకోండి. ఇందులో ప్రతి రాశికి సంబంధించిన ప్రెడిక్షన్స్ ను వివరంగా అందించాము.

English summary

Monthly Predictions For Gemini Zodiac For May 2018

Gemini individuals are known to be hyperactive and this is something that lets their personality stand out in a crowd. If you belong to this sign, then you need to know about your predictions.As we bring in the detailed predictions of each zodiac sign for the entire month of May, it will help you know on what is coming your way for the entire month of May.
Story first published: Tuesday, May 1, 2018, 2:00 [IST]