Latest Updates
-
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా? -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.! -
ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఏదో తెలుసా? -
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి! -
‘పరగడుపున వెల్లుల్లి’ ట్రెండ్.. అన్ని రోగాలకు ఇదే పరిష్కారమా.? -
అక్టోబర్ 11 నుంచి శరన్నవరాత్రులు..ఏనుగుపై భూలోకానికి దుర్గమ్మ.. ఆ 3 రాశుల వాళ్లకి ఇక అంతా డబ్బే డబ్బు!
కన్యారాశికి సంబంధించిన మే 2018 ప్రెడిక్షన్స్
కన్యారాశికి సంబంధించిన మే 2018 ప్రెడిక్షన్స్
కన్యారాశి ప్రధానంగా పరిశుభ్రత, పరిపూర్ణత ఆలాగే స్వచ్ఛతకు అసోసియేట్ అయి ఉంటుంది. ఈ రాశివారు ఎదో ఒక యాక్టివిటీలో తమను తాము బిజీగా ఉంచుకుంటూ ఆనందంగా ఉంటారు.
వీరికి సహనం ఎక్కువ. ఇతరులకు సహాయపడాలనే తత్త్వం వీరిది. ప్రియమైన వారికి సహాయపడటంలో ఆనందాన్ని వెతుక్కుంటారు. ఉదారభావం వీరిలో మెండు. నైతిక విలువలను పాటిస్తారు. వీరి ప్రవర్తన అందరినీ ఆకట్టుకుంటుంది.
వీటితో పాటు, ఈ నెలలో కన్యారాశి ప్రెడిక్షన్స్ గురించి తెలుసుకోండి.

ఈ ఆర్టికల్ లో ఆస్ట్రో నిపుణులు అందించిన ప్రెడిక్షన్స్ ను మీకు తెలియచేస్తున్నాము. మే నెలలో కన్యారాశికి సంబంధించిన విషయాలను ఈ ప్రెడిక్షన్స్ ద్వారా తెలుసుకోవచ్చు.
మే 2018లో కన్యారాశి ప్రెడిక్షన్స్ ను ఇప్పుడు తెలుసుకుందాం.
ఆరోగ్యం:
హెల్త్ హోరోస్కోప్ ప్రకారం మీ ఆరోగ్యం ఈ నెలలో 21 తరువాత కాస్తంత సున్నితంగా మారుతుందని తెలుస్తోంది. ఫిట్ గా ఉండాలంటే పని ఒత్తిడి నుంచి కాస్తంత విరామం తీసుకుంటూ ఉండాలి. క్రానిక్ హెల్త్ ప్రాబ్లెమ్స్ మాత్రం మిమ్మల్ని ఈ నెలలో ఇబ్బందులకు గురిచేసే అవకాశం లేదు.

వృత్తి:
ఈ నెలలో వృత్తిపరంగా ఎటువంటి పురోగతి ఉండదు. కొంతమంది త్వరగా ప్రాఫిట్ ని పొందేందుకు అక్రమ పద్దతులను పాటించే అవకాశం కలదు. మీరు అటువంటి పద్ధతులకు దూరంగా ఉండటం మంచిది. చాలా సార్లు మీ కష్టం అంతా వృధాగా మారుతుంది. అటువంటి పరిస్థితులలో మీరు సహనాన్ని పాటించాలి. తద్వారా, రాబోయే రోజులు మీకు అనుకూలంగా ఉండే ఆస్కారం కలదు.
ఆర్థిక లావాదేవీలు:
ఈ నెలలో వృత్తిపరంగా మీకు ఆర్థిక పురోగతి కనిపించదు. మీ లక్ష్యాలను సాధించేందుకు మీరు అమితంగా కష్టపడాల్సి వస్తుంది. పరిస్థితులలో మార్పులు కనిపించవు. ఈ సమయంలో మీరు లో ప్రొఫైల్ ని మెయింటెయిన్ చేయాలి. ప్రతికూల సమయం తొలగిపోయే వరకు సహనం పాటించాలి.

లవ్ లైఫ్:
ఈ నెలలో మీరు అనేక సవాళ్ళను ఎదుర్కోవలసి ఉంటుంది. ఒకవేళ పరిస్థితులు మరింత ఇబ్బందికరంగా మారినట్లైతే మీరు మీ భాగస్వామితో కూర్చుని చర్చలు జరపడం మంచిది. ఏవైనా సమస్యలు ఉంటే వాటిని ఇద్దరూ కలిసి పరిష్కరించుకోవడం మంచిది. మరోవైపు, మీ పార్ట్నర్ తో వెకేషన్ ని ప్లాన్ చేసుకోండి. ఇలా చేస్తే మీ ఇద్దరి బంధం మరింత పటిష్టమవుతుంది. ఆధ్యాత్మికత వలన కూడా మీ జీవితంలో ప్రశాంతత ఏర్పడుతుంది.

అదృష్ట తేదీలు అలాగే రంగులు:
ఈ నెలలో ఈ రాశి వారి అదృష్ట సంఖ్యలు: 16, 29, 79, 80 మరియు 90.
అదృష్ట తేదీలు: 4, 5, 14, 15, 16, 23, 24.
అదృష్ట రంగులు: టుర్కైస్ గ్రీన్ మరియు సియాన్ బ్లూ.



Click it and Unblock the Notifications
