For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఇలాంటి అరుదైన అవయవాలు తక్కువ మందికి ఉంటాయి, అక్కడ రంధ్రం ఉంటుంది, వెంట్రుకలు డబుల్ ఉంటాయి

అలాంటి అరుదైన శరీర లక్షణాలతో ఉండే వారు ప్రపంచ జనాభాలో కేవలం 5% మంది మాత్రమే ఉంటారు. మనిషి బాడీలో కొందరికీ మాత్రమే కొన్ని ప్రత్యేకంగా ఉంటాయి. మరి అవి ఏమిటో చూడండి. చెవి దగ్గర చిన్నపాటి రంధ్రం.

|

ఒక్కొక్కరి శరీర నిర్మాణం ఒక్కో రకంగా ఉంటుంది. అందరికీ చేతికి ఐదు వేళ్లు ఉంటే కొందరికి ఆరు ఉంటాయి. వాళ్లు అందరిలో కాస్త ప్రత్యేకంగా ఉంటారు. అలాంటి ఫ్రెండ్స్ మీకుంటే వారిని కాస్త ప్రత్యేకంగానే ట్రీట్ చేస్తారు. చేతివేళ్లే కాదు.. ఇంకా చాలా అవయాలు కొందరికి ప్రత్యేకంగా ఉంటాయి. అయితే అలాంటి వారు చాలా అరుదుగా ఉంటారు.

అలాంటి అరుదైన శరీర లక్షణాలతో ఉండే వారు ప్రపంచ జనాభాలో కేవలం 5% మంది మాత్రమే ఉంటారు. మనిషి బాడీలో కొందరికీ మాత్రమే కొన్ని ప్రత్యేకంగా ఉంటాయి. మరి అవి ఏమిటో చూడండి.

చెవి దగ్గర చిన్నపాటి రంధ్రం

చెవి దగ్గర చిన్నపాటి రంధ్రం

చాలా తక్కువ మందికి చెవి దగ్గర చిన్నపాటి రంధ్రం ఉంటుంది. చెవిపోగు కుట్టిస్తే ఎలా రంధ్రం పడుతుందో అలాగే కొందరికి పుట్టకతోనే చెవి దగ్గర రంధ్రం ఉంటుంది. దీన్ని ఆయూరిక్లర్ ఫిస్టిలా అంటారు. ఇలా చెవి దగ్గర ప్రత్యేక రంధ్రం ఉండే ప్రపంచ జనాభాలో కేవలం 5% మంది మాత్రమే ఉంటారు. చెవి దగ్గర ఉండే ఈ చిన్నపాటి హోల్ శరీరానికి ఎలాంటి హాని కలిగించదు.

రంగులను ఈజీగా కనుక్కోనే సామర్థ్యం కలిగి ఉండడం

రంగులను ఈజీగా కనుక్కోనే సామర్థ్యం కలిగి ఉండడం

కొందరికీ కలర్స్ చెప్పడానికి అస్సలు రాదు. బ్లూ కలర్ ఉండే ప్రతి దాన్ని బ్లూ అంటుంటారు. అందులో నేవీ బ్లూ, స్కై బ్లూ ఇలా చాలా రకాలుంటాయి. వాటి గురించి అస్సలు తెలియదు. అయితే కొందరు మాత్రం ఏయే రంగు నుంచి ఏయే రంగు ఏర్పడుతుంది వాటి పేర్లు ఏమిటో అని చెప్పేయగలరు. ఇలాంటి కోవలో ఎక్కువగా ఆడవాళ్లే ఉంటారు.

సాధారణ మనుషులు కేవలం ఒక మిలియన్ రంగుల వరకు చూడగలుగుతారు. అంతకన్నా ఎక్కువ రంగుల్ని గుర్తుపట్టే సామర్థ్యం అందరికీ ఉండదు. కానీ కొందరు ప్రత్యేక చూపు కలిగి, రంగుల్ని పసిగట్టగలిగే అమ్మాయిలు మాత్రం 99 మిలియన్ షేడ్స్ రంగులను గుర్తించగలుగుతారు.

పక్కటెముకలు ఎక్కువగా ఉండడం

పక్కటెముకలు ఎక్కువగా ఉండడం

సాధారణంగా అందరికీ పక్కటెముకలుంటాయి. కానీ కొందరికీ మాత్రం అదనంగా ఉంటాయి. అలా ఉండడం ప్రమాదకరం కాదు. అమ్మాయిల్లో ఎక్కువగా ఇలా అదనపు పక్కటెముకలుంటాయి. వీటిని సర్వికల్ రిబ్స్ అంటారు. ఇలా అదనపు ఎముకలుండేవారు కూడా చాలా అరుదుగా ఉంటారు.

గట్టి ఎముకలు

గట్టి ఎముకలు

కొందరికి చాలా గట్టి ఎముకలుంటాయి. LRP5 జన్యువు ఉండేవాళ్లకు ఇలాంటి ఎముకలుంటాయి. మెడ దగ్గర కొందరికి ఎముకలు బయటకు వచ్చినట్లు కనిపిస్తాయి. అలాగే మరికొన్ని చోట్ల కూడా ఇలాంటి గట్టి ఎముకలుంటాయి.

మోచేతి దగ్గర ఉండే పొడవాటి కండరం

మోచేతి దగ్గర ఉండే పొడవాటి కండరం

కొందరికీ మోచేతి దగ్గర ఒక పొడవాటి కండరం ఉంటుంది. పిడికిలి గట్టిగా బిగించినా లేదంటే బొటన వేలితే చిటికెన వేలిని గట్టిగా టచ్ చేసిన సరే ఆ కండరం బయటకు కనపడుతుంది. ఇలాంటి వాళ్లు కూడా చాలా అరుదుగా ఉంటారు.

కంటి రెప్పలు డబుల్ ఉండడం

కంటి రెప్పలు డబుల్ ఉండడం

కొందరికి కనురెప్పలు చాలా తక్కువగా ఉంటాయి. మరికొందరు. కంటి రెప్పలు డబుల్ ఉంటాయి. ఒక దానిపై ఒకటి ఉంటాయి. దీంతో వారికి చాలా దట్టంగా కనురెప్పలు కనపడతాయి. ఇలాంటి వారు కూడా చాలా అరుదుగా ఉంటారు. వీటిలో ఏదైనా సరే మీకు ఉంటే మీకు కూడా ప్రత్యేకత గల మనుషులే మరి.

English summary

Only 5 Of The World's Population Have These Body Parts

Only 5 Of The World's Population Have These Body Parts
Story first published:Wednesday, September 5, 2018, 12:46 [IST]
Desktop Bottom Promotion