For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్రతి రాశిచక్రం యొక్క వ్యక్తిత్వాన్ని సూచించే వ్యాక్యల(కొటేషన్స్) గురించి తెలుసుకోండి

|

ఈ ప్రపంచంలోని కొటేషన్స్ విస్తృతమైన అర్థాన్ని కలిగి ఉంటాయి. వాటిని మీ జీవితానికి అన్వయించుకున్నప్పుడు ఒక పరిపూర్ణ అర్ధాన్ని చూపగలుగుతాయి. రోజూ సామాజిక మాధ్యమాలలో మనం అనేకములైన కొటేషన్స్ చూస్తూనే ఉంటాం. కొన్ని మన జీవితానికి దగ్గరగా అనిపిస్తుంటాయి కూడా.

వీటిలో కొన్ని సూటిగా ఉంటాయి, నేరుగా మీ జీవితాన్ని అర్ధం పట్టేలా కనిపించడం లేదా ప్రత్యేకమైన వాటి గురించిన జ్ఞాపకాలను గుర్తుచేయడం వంటివి చేస్తుంది.

Quotes That Define Zodiac Signs Personalities

ఇక్కడ, ఈ వ్యాసంలో, ప్రతి ఒక్క వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని వారి రాశి చక్రాల ఆధారంగా వివరించే 12 వేర్వేరు కొటేషన్ల గురించి మనం తెలుసుకుందాం.

ఈ కొటేషన్స్, మీ జీవితంలో స్తబ్ధతను దూరం చేయగలవు కూడా.

ఇక్కడ తెలుపబడిన కొటేషన్స్ ప్రతి రాశి చక్రం యొక్క లక్షణాలపై ఆధారపడినవి మరియు వాటిని ఖచ్చితత్వంతో విశదీకరించేవిగా ఉంటాయి.

ప్రతి రాశిచక్ర వ్యక్తిత్వాన్ని సూచించే వ్యాక్యల(కొటేషన్) గురించి తెలుసుకోండి

మేష రాశి : మార్చి 21-ఏప్రిల్ 19

మేష రాశి : మార్చి 21-ఏప్రిల్ 19

మేష రాశికి చెందిన వ్యక్తులు అన్ని అత్యంత బలమైన, మరియు ఆత్మ స్థైర్యం కలిగిన వ్యక్తులుగా నిర్వచించబడుతారు. చురుకైన తెలివితేటలు, సత్వర నిర్ణయాలు, విశ్వసనీయత అనే మూడు అంశాలు ప్రధానంగా వీరి వ్యక్తిత్వాన్ని నిర్వచిస్తాయి. వీరిని వివరించగలిగే అత్యుత్తమ వాఖ్య: "నేను నా విధికి యజమానిని, నేను నా ఆత్మకు నాయకుడిని." - విలియమ్ ఎర్నెస్ట్ హెన్లీ.

వృషభ రాశి : ఏప్రిల్ 20-మే 20

వృషభ రాశి : ఏప్రిల్ 20-మే 20

వృషభ రాశికి చెందిన వ్యక్తులలో అంతర్గత శక్తి ఇమిడి ఉంటుంది. మరియు వారి భావోద్వేగాలను ఎలా నిర్వహించాలో వారికి అవగాహన ఉంటుంది. వీరిని వివరించగలిగే అత్యుత్తమ వ్యాఖ్య: "నీ ప్రాణం తీయని అంశం ఏదైనా, అది నీ బలంగా మారగలదు." - ఫ్రెడరిక్ నీట్జ్సె

మిధున రాశి: మే 21- జూన్ 20

మిధున రాశి: మే 21- జూన్ 20

మిధున రాశికి చెందిన వారు సమాజం పట్ల, స్నేహితుల పట్ల అత్యధిక విధేయతను కలిగి ఉంటారు. అదే సమయంలో, వారు సున్నితమైన భావోద్వేగాలకు కేంద్రబిందువులా ఉంటారు. వీరిని నిర్వచించగలిగే ఉత్తమమైన కొటేషన్: "నవ్వులేని ఏ రోజైనా వ్యర్థమే." - చార్లీ చాప్లిన్

కర్కాటక రాశి : జూన్ 21- జూలై 22

కర్కాటక రాశి : జూన్ 21- జూలై 22

కర్కాటక రాశికి చెందిన వ్యక్తులు పెద్ద మనసు కలిగి, ఉదార స్వభావాన్ని ప్రదర్శించే వారిగా ఉంటారు. క్షమాగుణం కలిగిన వారిగా మరియు దయార్ద హృదయులుగా ఉంటారు. వీరిని వివరించగలిగే అత్యుత్తమమైన వాక్యం: "చివరికి, కేవలం మూడు విషయాలు మాత్రమే మనుగడలో ఉంటాయి: మీరు ఎంతగా ప్రేమించారు, ఎంత గొప్పగా జీవించారు, అనవసర విషయాలకు దూరంగా ఎంత సంతోషంగా ఉన్నారు." - బుద్ధుడు

సింహ రాశి : జులై 23-ఆగస్టు 23

సింహ రాశి : జులై 23-ఆగస్టు 23

సింహ రాశిలో పుట్టిన వ్యక్తులు పుట్టుకతోనే నాయకత్వపు లక్షణాలను పుణికి తెచ్చుకుని, అందరి దృష్టిని తమ వైపుకు ఆకర్షించేలా ఉంటారు. ఆత్మవిశ్వాసం వీరి ప్రధాన ఆభరణంగా ఉంటుంది. వీరిని వివరించగలిగే అత్యుత్తమ వాక్య: "నీ ప్రేమ నన్ను బలపరుస్తుంది, అయితే నీ ద్వేషం మాత్రం నన్ను నిలువరించలేదు." - క్రిస్టియానో రోనాల్డో

కన్యా రాశి : ఆగస్టు 24-సెప్టెంబర్ 23

కన్యా రాశి : ఆగస్టు 24-సెప్టెంబర్ 23

కన్యా రాశికి చెందిన వ్యక్తులు అత్యంత ఆచరణాత్మక లక్షణాలను ప్రదర్శిస్తుంటారు. ఎటువంటి సమస్యలనైనా పరిష్కరించగలిగే తెలివితేటలు వీరి సొంతంగా ఉంటాయి. వీరిని వివరించగలిగే అత్యుత్తమ వాక్య: "మీ ఋణగ్రస్తుల కోసం మీరు నివసించడం లేదు." - జాన్ బన్యన్

తులా రాశి : సెప్టెంబర్ 24-అక్టోబర్ 23

తులా రాశి : సెప్టెంబర్ 24-అక్టోబర్ 23

తులా రాశికి చెందిన వ్యక్తులు సమతుల్య లక్షణాలతో మరియు సహకార బుద్దితో మెలుగుతూ ఉంటారు. వీరు ఎల్లప్పుడూ తమ ప్రియమైన వారి కోసమే తమ జీవితం అన్నట్లు ఉంటారు. వీరిని వివరించగలిగే అత్యుత్తమ వాక్య: "మీరు ఇతరులలో పరిపూర్ణతను కోరుకోవడం మానినప్పుడు, వారిని వారిగానే ఇష్టపడగలరు." - డోనాల్డ్ మిల్లెర్

వృశ్చిక రాశి : అక్టోబర్ 24-నవంబరు 22

వృశ్చిక రాశి : అక్టోబర్ 24-నవంబరు 22

వృశ్చిక రాశికి చెందిన వ్యక్తులు పని చెయ్యి, ఫలితం పొందు అన్న నినాదంతో ముందుకు సాగుతుంటారు. వారు లక్ష్యం ఎల్లప్పుడూ విజయం వైపే ఉంటుంది. వీరిని వివరించగలిగే అత్యుత్తమ వాక్య: "స్మశానవాటికలో ధనవంతుడైన వ్యక్తి గురించి నాకు పట్టింపు లేదు, ఏదైనా సాధించాను అన్న నమ్మకంతో నిద్రకు ఉపక్రమించడమే నేను పట్టించుకుంటాను..." - స్టీవ్ జాబ్స్

ధనుస్సు రాశి: నవంబర్ 23-డిసెంబరు 22

ధనుస్సు రాశి: నవంబర్ 23-డిసెంబరు 22

ధనుస్సు రాశికి చెందిన వ్యక్తులు, మిగిలిన రాశి చక్రాల వారితో పోలిస్తే, అత్యంత చురుకైన వ్యక్తులుగా ఉన్నారు. వీరిని వివరించగలిగే అత్యుత్తమ వాక్య: "ప్రయాణం: ఎంత వీలయితే అంత చేయి, ఎంత దూరం వెళ్ళగలిగితే అంత దూరం వరకు వెళ్ళాలి. జీవిత కాలం అంతా ఒకే చోట నివసించటానికి కాదు." – అనామిక

మకర రాశి: డిసెంబర్ 23- జనవరి 20

మకర రాశి: డిసెంబర్ 23- జనవరి 20

మకర రాశికి చెందిన వ్యక్తులకు, ధన సముపార్జన మీదే కోరిక ఉంటుంది, ఉన్నత స్థానం పొందే క్రమంలో భాగంగా ఎన్ని ఒత్తిడులకు లోనైనా, కష్టేఫలి నినాదంతో ముందుకు సాగుతుంటారు. వీరిని వివరించగలిగే అత్యుత్తమ వాఖ్య: "మీరు మంచి జీవితాన్ని పొందారు, జీవితాన్ని అందంగా మార్చుకోవడం కూడా మీ విధిగా మారాలి(మరియు మీ మానవ హక్కులను కోల్పోకుండా)" - ఎలిజబెత్ గిల్బర్ట్

కుంభ రాశి : జనవరి 21-ఫిబ్రవరి 18

కుంభ రాశి : జనవరి 21-ఫిబ్రవరి 18

కుంభ రాశికి చెందిన వ్యక్తులు ఎల్లప్పుడూ డైనమిక్ స్వభావాన్ని కలిగి ఉంటారు. వారు ఎల్లప్పుడూ ఇతరుల సంక్షేమం గురించి ఆలోచిస్తూ, చేయి చాచిన వారిని కాదనకుండా సహాయం చేసే వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. వీరిని వివరించగలిగే అత్యుత్తమమైన వాఖ్య: "జీవితం యొక్క ప్రధాన లక్ష్యం ఇతరులకు సహాయపడడం, మరియు మీరు వారికి సహాయం చేయలేకపోతే, కనీసం వారిని బాధపెట్టకుండా ఉండడానికి ప్రయత్నించు."- దలైలామా

మీన రాశి: ఫిబ్రవరి 19-మార్చి 20

మీన రాశి: ఫిబ్రవరి 19-మార్చి 20

మీన రాశికి చెందిన వ్యక్తులు ఇతరుల భావోద్వేగాలను సులువుగా గుర్తించి, వారి భాదను తగ్గించే ప్రయత్నం చేస్తుంటారు. ఏదీ ఆశించకుండా ఇతరులకు సహాయం చేసే వ్యక్తిత్వం వీరి సొంతం. వీరిని నిర్వచించగలిగే అత్యుత్తమ వాఖ్య : "మీరు ఎప్పుడైనా నేర్చుకోవాల్సిన గొప్ప విషయం ఏదైనా ఉంటే, అది ప్రేమించటం మరియు తిరిగి ప్రేమించబడడం."- మౌలిన్ రోగ్

ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి, ఇటువంటి ఆద్యాత్మిక, హస్త సాముద్రిక, రాశి ఫలాల సంబంధిత అనేక ఆసక్తికర అంశాల గురించిన వివరాల కోసం బోల్డ్స్కీ పేజీని తరచూ సందర్శించండి. మీ విలువైన అభిప్రాయాలను క్రింది వ్యాఖ్యల విభాగంలో మాతో పంచుకోండి.

English summary

Quotes That Define Zodiac Signs Personalities

Having a quote that defines your personality is great as you can relate to your characteristics. We have listed 12 quotes that represent the character of each zodiac sign. For example, Aries is known as the most strong-minded people of all. The best quote that defines their personality is: "I am the master of my fate. I am the captain of my soul." - William Ernest Henley.
Story first published: Wednesday, July 4, 2018, 7:00 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more