ప్రేమ‌ను పుట్టించే ర‌త్నాలు!

By: sujeeth kumar
Subscribe to Boldsky

కొన్ని ర‌త్నాలను ధ‌రిస్తే అదృష్టం క‌లిసి వ‌స్తుంద‌నే విష‌యం మీకు తెలుసా? ఈ రాళ్లు, ర‌త్నాలు అదృష్టాన్ని పెంచుతాయ‌ని అంటారు. మ‌రి కొన్ని రాళ్ల‌ను పూర్తిగా దూరంగా ఉంచాలంటారు.

Crystals

ఈ క‌థ‌నంలో కొన్ని ర‌కాల ర‌త్నాల గురించి చ‌ర్చించ‌బోతున్నాం. ఇది ప్రేమ జీవితాన్ని మెరుగుప‌ర్చ‌గ‌ల‌దు. మీకు అనువైన ర‌త్నాన్ని క‌నుగొని జీవితం ఆనంద‌మ‌యం చేసుకోగ‌లరు. కొన్ని ర‌త్నాలు త‌మదైన అదృష్టాన్ని తెచ్చిపెట్ట‌గ‌ల‌వు. మీకు స‌రిపోయే ఉత్త‌మ ర‌త్న‌మేదో తెలుసుకోండి.!

రోజ్ క్వార్ట్జ్‌

రోజ్ క్వార్ట్జ్‌

ఈ రత్నం మ‌న‌ల్ని మ‌నం ప్రేమించుకోగ‌లిగే, అంగీక‌రించే దానికి చ‌క్క‌ని ఉదాహ‌ర‌ణ‌. మీ బంధాన్ని ప‌ర్‌ఫెక్ట్‌గా మ‌ల‌చుకోవాలంటే నాలుగు రోజ్ క్వార్ట్జ్ రాళ్ల‌ను బెడ్‌రూమ్ లోని నాలుగు మూల‌ల్లో ఉంచండి. దీంతో మీ ప్రేమ బంధం మ‌రింత బ‌ల‌ప‌డుతుంది.

రూబీ

రూబీ

రొమాంటిక్ ప్రేమ రూబీ సాక్షాత్కారంగా నిలుస్తుంది. ఈ ర‌త్నం మీ ద‌గ్గ‌రుంటే సంతోషంగా మీ చుట్టుప‌క్క‌లే ఉంటుంది. ఏకాగ్ర‌త‌, ఆరాధ‌నతో ఉంటారు. గుండె నిబ్బ‌రంగా, బ‌లంగా త‌యార‌వుతుంది. ఇది తొడిగినవారికి ధైర్యం వ‌స్తుంది.

మూన్‌స్టోన్‌

మూన్‌స్టోన్‌

ర‌క్ష‌ణాత్మ‌క శ‌క్తి, భావోద్వేగాల‌ను అదుపు చేయ‌గ‌ల‌దు ఈ ర‌త్నం. ఇది మ‌రీ ఖ‌రీదైన‌దేమీ కాదు. రాత్రి నిద్ర‌పోయేట‌ప్పుడు త‌ల దిండు కింద పెట్టుకొని దీన్ని ప‌డుకుంటే ప్రేమ‌, ఆప్యాయ‌త భావ‌న‌లు పెరుగుతాయంట‌.

లెమ‌న్ క్వార్ట్జ్‌

లెమ‌న్ క్వార్ట్జ్‌

ప్ర‌తికూల భావ‌న‌లు ఈ ర‌త్నం త‌గ్గిస్తుందంటారు. అంతేకాదండోయ్ జంట‌ల మ‌ధ్య సాన్నిహిత్యాన్ని పెంచి ఇద్ద‌రిలో సానుకూల వాతావ‌ర‌ణం క‌లిగిస్తుంద‌ట‌.

మాల‌కైట్‌

మాల‌కైట్‌

ఈ ర‌త్నంలో క‌నిపించే ఆకుప‌చ్చ‌ని రంగు మ‌న‌సులో ఉండే ర‌క‌ర‌కాల బాధ‌ల‌ను తొల‌గించేయ‌గ‌ల‌దు. మ‌న‌సు నొచ్చుకొని ఉంటే ఈ రాళ్లు తొడిగితే తొంద‌ర‌గా ఉప‌శ‌మ‌నం క‌లిగిన భావ‌న ఉంటుంద‌ట‌. కొత్త ప్రేమ పుట్టుకొస్తుంది. రాత్రి ప‌డుకునే ముందు దీన్ని మెళ్లో వేసుకోవ‌డం మేలు అంటారు.

రోడోక్రోసైట్‌

రోడోక్రోసైట్‌

ఈ ర‌త్నం క‌లిగి ఉన్న‌వారి వ్య‌క్తిత్వం మెరుగ‌వుతుంది. అది వేసుకున్న వారు త‌మ‌పై తాము ప్రేమ‌ను క‌లిగి ఉంటారు. నిజ‌మైన ప్రేమ ద‌క్కుతుంది. అంతేకాదు ఆత్మ‌విశ్వాసమూ మెరుగ‌వుతుంది.

Read more about: life, లైఫ్, రాశులు
English summary

The Best Gemstones To Attract Love

Gemstones and crystals are known for their powers. They can make or break an individual's luck and there are certain gemstones that can help in increasing the luck factor for love! Take a look..
Story first published: Thursday, January 25, 2018, 15:00 [IST]
Subscribe Newsletter