For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  ఈ 2018 లో మీ రాశి చక్రం నేర్చుకోబోయే గుణపాఠం ఏమిటో తెలుసా ?

  |

  ఈ సంవత్సరంలో మీరు నేర్చుకున్న అతి పెద్ద పాఠం ఏమిటి? దీని గురించి మీకు అవగాహన ఉంటుంది. అదేవిధంగా జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ సంవత్సరంలో మీ రాశిచక్రం నేర్చుకోబోయే కష్టతరమైన పాఠాల గురించిన వివరణ కూడా ఉంది. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

  ఈ కష్టతరమైన పాఠాల గురించి తెలుసుకోవడం వలన, రానున్న కాలంలో అవి ఎదురైనప్పుడు ఎదుర్కొనడానికి సిద్దంగా ఉండేలా మిమ్ములను మీరు మార్చుకోవచ్చును.

  మేషం: మార్చి 21-ఏప్రిల్ 19

  మేషం: మార్చి 21-ఏప్రిల్ 19

  మేష రాశి ప్రకారం, మీరు ఈ సంవత్సరంలో నేర్చుకోవలసిన అంశం వర్తమానంలో బ్రతకడం. భవిష్యత్ ప్రణాళికల పై చింత ఎక్కువగా ఉన్నందువలన మానసిక ఒత్తిడికి లోనవుతారు. తద్వారా అనేక మానసిక శారీరిక సమస్యలను ఎదుర్కొనవలసి వస్తుంది, కావున భవిష్యత్ ప్రణాళికల గురించిన చింత వద్దు అని ఈ రాశి చక్రం సూచిస్తుంది. వర్తమానంలో ఉన్న పరిస్థితులకు తగ్గట్లుగా జీవించడం వలన మానసిక ఒత్తిడులకు లోనుకాకుండా ఉండవచ్చు.

  వృషభం: ఏప్రిల్ 20-మే 20

  వృషభం: ఏప్రిల్ 20-మే 20

  మీరు మీ మనసులోని భావాలను దాచలేరు. ఈ సంవత్సరం మీ రాశి చక్రం ప్రకారం మీరు నేర్చుకోబోయే పాఠం ఇదే . మీరు ఇతరుల పట్ల హేయభావాన్ని ప్రదర్శించలేరు. కానీ అన్నివేళలా భావాలను వ్యక్తపరచే గుణం ఉన్న కారణంగా అనేక సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. కానీ దీని గురించి తెలుసుకోవడం వలన కొంతలో కొంతైనా జాగ్రత్త తీసుకొనగలరు.

  మిధునం: మే 21- జూన్ 20

  మిధునం: మే 21- జూన్ 20

  ఈ రాశిచక్రం ప్రకారం మీ అంతరాత్మతో స్నేహం చేయవలసి ఉంటుంది . నిజానికి మీ స్నేహపూర్వక తత్వం కారణంగా మీ చుట్టూతా మీ ప్రియమైన వారు నిండి ఉంటారు. మీరు కలిగి ఉండే ప్రతి ఒక్క సంబంధమూ ప్రత్యేకంగా ఉంటుంది. కానీ ఈ సంవత్సరం మీ అంతర్గతమైన అంతరాత్మతో స్నేహం చేయడం వలన, మీరు దేనిని ఇష్టపడుతున్నారు, తద్వారా మీ జీవితానికి ఏం కోరుకుంటున్నారు అని తెలుసుకునే అవకాశం ఉంది.

  కర్కాటకం : జూన్ 21- జూలై 22

  కర్కాటకం : జూన్ 21- జూలై 22

  మీ రాశి చక్రం ప్రకారం ఈ సంవత్సరం మీరు నేర్చుకోవలసిన పాఠం, మీ లక్ష్యం పై దృష్టి కేంద్రీకరించడం. ఇప్పటిదాకా మీకు ప్రత్యేకమైన లక్ష్యాలు ఉండకపోవచ్చు కానీ , ఈ రాశి చక్రం ప్రకారం మీరు తదుపరి లక్ష్యాలను ఏర్పరచుకోవలసి ఉంటుంది. తద్వారా ఒక నిర్మాణాత్మకమైన జీవితాన్ని ఏర్పరచుకోగలరు. లేకుంటే జీవితం అస్తవ్యస్తం అవుతుంది.

  సింహ రాశి : జులై 23-ఆగస్టు 23

  సింహ రాశి : జులై 23-ఆగస్టు 23

  మీరు ప్రతి సంబంధం దీర్ఘకాలంగా ఉండదు అని అర్థం చేసుకోవాలి.మిమ్ములను మీరే ఎక్కువగా ప్రేమిస్తారు, కానీ మరో వైపు మిమ్ములను కూడా ప్రేమించే వ్యక్తులు ఉన్నారని అర్ధం చేసుకొనవలసిన అవసరం ఉంది. కానీ మీరు ఎక్కువగా మీకు సంబంధించిన ఆలోచనలే చేస్తుంటారు. ఈ పద్దతి మార్చుకుని ఎదుటివారి మనసును అర్ధం చేసుకుని ప్రవర్తించాల్సిన అవసరం ఉంది.

  కన్య: ఆగస్టు 24-సెప్టెంబర్ 23

  కన్య: ఆగస్టు 24-సెప్టెంబర్ 23

  మీరు పట్టుదల కృషి కలిగిన ఒక నిరంతర శ్రామిక జీవి, మీరొక ఆచరణతో నిర్మాణాత్మక ధోరణితో ముందుకు సాగుతూ ఉంటారు. కానీ ఈ రాశిచక్రం ప్రకారం మీరు తెల్సుకోవలసిన విషయం ఏమిటంటే, మీకు ఉద్దేశించబడిన మీరు పట్టించుకోని అనేక విషయాలను కూడా మీరు గమనించాలి . అలా లేని పక్షంలో అనేక ఇతరములైన సమస్యలను ఎదుర్కొనవలసి వస్తుంది. కొన్ని తేలికగా వదిలేసిన విషయాలే, తర్వాతి కాలంలో పెద్దవిగా పరిణమిస్తాయి అని తెలుసుకోవలసిన అవసరం ఉంది. ముఖ్యంగా కొందరు మీ ఎదుగుదలకు అడ్డు పడుతూ ఉంటారు. వారి గురించిన ఆలోచన చేయడం మంచిది. చివరగా ఈ రాశి వారికి చెప్పదగిన సూచన ఏమిటి అంటే, ఏ విషయాన్ని కూడా తేలికగా తీసుకోవద్దు.

  తుల: సెప్టెంబర్ 24-అక్టోబర్ 23

  తుల: సెప్టెంబర్ 24-అక్టోబర్ 23

  మీలో ఒక ఉన్నతమైన వ్యక్తిని చూపగల సంవత్సరం ఇది. తులా రాశి వారికి ఈ సంవత్సరం అనేక ఉత్తమ ఫలితాలను ఇస్తుంది. అలాంటి అద్భుతమైన ఫలితాలకోసం ఎదురుచూడండి. కొన్ని అద్భుతమైన మార్పులు మీ మార్గంలో గోచరిస్తున్నాయి. కానీ అలాంటి అధ్బుతాలు జరగవన్న భ్రమలో, అందివచ్చే అవకాశాలను వదిలివేసే అవకాశం ఉంది. కావున ఎదురుచూడడం అలవాటు చేసుకోండి . మీరు కోరుకున్నది సాధించే అవకాశాలు ఈ సంవత్సరంలో అధికంగా ఉన్నాయి.

  వృశ్చికం: అక్టోబర్ 24-నవంబరు 22

  వృశ్చికం: అక్టోబర్ 24-నవంబరు 22

  ఇతరుల గురించి , వారిపై మీరు ఉంచే విశ్వాసాల గురించిన అవగాహన తెచ్చుకోవలసిన అవసరం ఉంది. ఈ రాశి వారు ఎక్కువగా ఇతరులపై నమ్మకాన్ని ఉంచి విశ్వాసంతో మెలుగుతూ ఉంటారు. కానీ ఈ రాశి వారికి వీరు నమ్మిన వ్యక్తుల వలనే కొన్ని సమస్యలు వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. కావున దేనినీ గుడ్డిగా నమ్మకండి.

  ధనుస్సు: నవంబర్ 23-డిసెంబరు 22

  ధనుస్సు: నవంబర్ 23-డిసెంబరు 22

  మీరు ఇతరులతో ఎలా ఉన్నారు అనే దానికన్నా , ఎంత నిజాయితీ తో ఉన్నారు అన్న దానిపైనే ఈ సంవత్సరం మీకు ఫలితాలను ఇవ్వగలదు. నిజాయితీ తప్పి ప్రవర్తించి అభాసుపాలయ్యే ప్రమాదం ఉంది. కావున నిజాయితీతో మెలగడం నేర్చుకోండి. మీరు మీ జీవితo లో ఏం కోరుకుంటున్నారో అన్న దానికై మీ అంతరాత్మని మీకు మీరే ప్రశ్నించి సమాధానం తెలుసుకోండి. తద్వారా మీ జీవితానికి ఏది అవసరమో ఏది అనవసరమో అన్న అవగాహనకి రాగలరు.

  మకరం: డిసెంబర్ 23- జనవరి 20

  మకరం: డిసెంబర్ 23- జనవరి 20

  మీరు ఈ సంవత్సరం నేర్చుకోవాల్సిన ముఖ్యమైన పాఠం ఏమిటంటే మీ జీవితంలో కొన్ని విషయాలు మార్చాలి, ప్రత్యేకంగా కొన్ని విషయాలు మీరు కోరుకున్న విధంగా జరగడం లేదు. మీరు జీవితంలో ఒక పద్ధతిని కలిగి ఉంటారు. కానీ మరొక వైపు , మీ కోసం పని చేయని విషయాలని వదిలేసేలా ఉండాలి. లేకపోతే సమస్యలే.

  మీరు వ్యక్తిగతంగా స్పురద్రూపి, అనుకున్నవి అనుకున్నట్లు జరగాలి అన్న ఆలోచనతో ఉండు వారు. కావున మీరు కొన్ని ప్రణాళికలను ఏర్పాటు చేసుకుని, తద్వారా మీరు మీ కుటుంబం మొత్తం ఆ పద్దతినే అనుసరించాలి అని కోరుకుంటారు. అందరికీ నచ్చకపోయినా తప్పక మీకోసం పాటిస్తుంటారు. ఈ పద్దతి ఏదో ఒకరోజు పెద్ద సమస్యగా మారవచ్చు. కావున మీరు అలాంటి పోకడలను మార్చవలసిన అవసరం ఎంతైనా ఉంది.

   కుంభం: జనవరి 21-ఫిబ్రవరి 18

  కుంభం: జనవరి 21-ఫిబ్రవరి 18

  మీరు ఈ సంవత్సరం యోగ్యతను అలవరచుకోవాలి. మీరు కొన్ని జీర్ణించుకోలేని, ఊహించని సమస్యలను ఎదుర్కొనవలసి వస్తుంది. కొన్ని పరిస్థితులకు అలవాటు పడలేక ఇబ్బందికి గురవుతూ ఉంటారు. కావున కొన్నిటికి సిద్దపడాల్సివస్తుంది. మీరు యదార్ధ సంఘటనలను కొన్నింటిని ఎదుర్కొనడానికి సిద్దంగా ఉండలేరు., తద్వారా చిన్న సమస్యలు కూడా భూతద్దంలో లాగా కనిపిస్తూ ఉంటాయి . కావున ఆ అలవాటు మానుకోవలసిన అవసరం ఉంది. లేనిచో చిన్న సమస్యేలే చినికి చినికి గాలివానగా మారి సంబంధాలను దెబ్బతీసే అవకాశం ఉంది,. కావున ఈ రాశిచక్రానికి చెందిన వారు యోగ్యతను అలవరచుకోవలసినదిగా సూచించడమైనది.

  మీనం: ఫిబ్రవరి 19-మార్చి 20

  మీనం: ఫిబ్రవరి 19-మార్చి 20

  మీరు ఎక్కువగా కలలలో విహరిస్తూ ఉంటారు. తద్వారా అనేకరకాల ఆలోచనలతో సతమతమవుతూ ఉంటారు. మీరు ఒక అద్భుతమైన , కలల సౌధాన్ని నిర్మించుకుని రాజ్యమేలుతూ ఉంటారు. కానీ నిద్ర లేచి వాస్తవిక ప్రపంచాన్ని చూడవలసిన అవసరం ఎంతో ఉంది. లేనిచో మీరు అభాసుపాలవడం తప్పదు. ఈ కలల ప్రపంచానికి అలవాటుపడినందువలన, సామాజిక ప్రపంచంలోని పోకడలు మీకు ఇంపుగా ఉండవు. తద్వారా అసౌకర్యానికి గురి అవుతూ ఉంటారు. దీని కారణంగా సంబంధాలు దెబ్బతినే అవకాశం ఉంది. కావున ఈ రాశిచక్రానికి చెందిన వారు నేలమీద ఒక అడుగు ఉంచి ప్రవర్తించడం అలవాటు చేసుకోవాలి.

  Read more about: life predictions astrology
  English summary

  Zodiac Signs That Will Learn A Tough Lesson This Year

  There are certain lessons that you will be learning according to your zodiac sign. For e.g., for Capricorn individuals: The most important lesson that you need to learn this year is that you need to change certain things in your life, especially if these things are not going the way you wish them to.
  Story first published: Friday, March 30, 2018, 11:00 [IST]
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more