పెళ్ళంటే ఇష్టపడని జన్మరాశులు

Written By: DEEPTHI T A S
Subscribe to Boldsky

మీ భాగస్వామి మీతో బంధం నుంచి ఎప్పుడూ ఎందుకు పారిపోతున్నారో తెలుసా? మీరు వారి రాశులు, నక్షత్రాలను నిందించుకోవచ్చు ఎందుకంటే వాటివల్లనే వారు మీ బంధానికి పేరు ఇవ్వటానికి ఇష్టపడరు.

ఇక్కడ ఈ ఆర్టికల్ లో ఇలా బంధాలంటే ఇష్టపడని వారి రాశుల గురించి ఇవ్వబడింది.

zodiac signs

ఈ రాశులకి చెందినవారు చాలాకాలంగా బంధంలో ఉన్నా, దానికి ఒక పేరు ఇవ్వటానికి, పెళ్ళి చేసుకోటానికి ఇష్టపడరు.

వారెవరో ఇక్కడ తెలుసుకోండి...

మేషం – మార్చి 21 – ఏప్రిల్ 19

మేషం – మార్చి 21 – ఏప్రిల్ 19

ఈ రాశి వారు బ్రతకడానికి కొన్ని నియమాలు పెట్టుకుంటారు. అందరికన్నా ముందు ఉండటానికి, ఇంకొకరిపై ఆధిపత్యం చేయటానికి చాలా ప్రయత్నిస్తారు. వీరికి విలువలు, నియమాలు ఎక్కువ. వారి నమ్మకాల ముందు ఎవరికీ తలవంచరు. ఏ బంధంలోనైనా సామరస్యం కోసం తమ నియామాలతో రాజీ పడటానికి చాలా కష్టపడతారు. ఈ కారణాల వల్లనే వారి భాగస్వాములకి చిరాకు వస్తుంది. తమకి తాము చాలా విలువనిస్తారు అందుకే అందరూ వాళ్ళని స్వార్థపరులనుకుంటారు.

మిథునం- మే 21-జూన్ 20

మిథునం- మే 21-జూన్ 20

ఈ వ్యక్తులు గొప్ప మాటకారులు. వారు ఏం మాట్లాడినా అర్థవంతంగా, వినోదాత్మకంగా మార్చే ఆత్మవిశ్వాసం కలిగివుండి అందర్నీ ఆకట్టుకుంటారు.ఎప్పుడైనా దీర్ఘకాలం బంధాల గురించి మాట వచ్చినప్పుడు, వీళ్ళకి మాట్లాడటానికి మాటలు ఉండవు. క్యాజువల్ డేటింగ్ పదం వీరికి బాగా నప్పుతుంది. అందర్నీ కలుస్తూ వారు ఎంజాయ్ చేసినా, దీర్ఘకాల బంధాల వత్తిడులు వారు తట్టుకోలేరు.

ధనుస్సు – నవంబర్ 23-డిసెంబర్ 22

ధనుస్సు – నవంబర్ 23-డిసెంబర్ 22

ప్రవాహంతో పాటు వెళ్ళటాన్ని ఇష్టపడేవారికి ఉదాహరణగా వీరిని చెప్పుకోవచ్చు. జీవితాన్ని సీరియస్ గా తీసుకోటాన్ని అస్సలు ఇష్టపడని ఉల్లాసంగా తిరిగే వ్యక్తులు వీరు. వారికి ఒంటరిగా ఉండటం ఇష్టమే కానీ స్నేహితులతో కూడా సమయం గడుపుతారు. క్యాజువల్ డేటింగ్ అంటే ఆసక్తి చూపిస్తారు కానీ విషయం తీవ్రంగా మారినప్పుడు అయోమయంలో పడిపోతారు. ప్రతిఒక్కరూ గుర్తుంచుకోవాల్సింది అన్నిటికన్నా స్వేఛ్చ, స్వాతంత్ర్యాలకి వారు ఎక్కువ విలువనిస్తారని. అందుకని వారి నుంచి దీర్ఘకాల బంధాన్ని ఆశించకండి!

కుంభం – జనవరి 21- ఫిబ్రవరి 18

కుంభం – జనవరి 21- ఫిబ్రవరి 18

ఈ రాశివారు చాలా ఉత్సుకత కలిగివుంటారు. వీళ్ళు ప్రేమించినవాళ్లతో గాఢమైన బంధాలను ఏర్పర్చుకోటంలో సౌకర్యంగానే ఉంటారు. కాకపోతే ప్రేమను మెల్లగా కాలంతో పాటు పెంచుకోవాలన్న ఆలోచనలంటే అసహ్యించుకుంటారు. వీరి స్వభావం కూడా ఒకేలా ఉండదు.ఒక నిముషం వున్నట్టు తర్వాత నిముషం ఉంటారో లేదో చెప్పటం కష్టం. అందుకని బంధాల గురించి బాధ్యత, ఆశించటం, కలిగివుండటం వారి డిక్షనరీలోనే లేదు.

English summary

These People Are Never Known To Get Married, As Per Zodiac

If you have been in a relationship with any of the 4 zodiac signs, which we've mentioned here, then you need to be well prepared to understand the facts about these individual signs do not see themselves getting married anytime sooner. These zodiac signs are: Aries, Gemini, Sagittarius and Aquarius.
Story first published: Wednesday, April 4, 2018, 13:30 [IST]