ఈ రాశుల వారు చాలా టార్చర్ చేస్తారు.. వీరిని భరించాలంటే చాలా ఓపిక ఉండాలి

Posted By: Bharath
Subscribe to Boldsky

కొందరు నోటికి ఏది వస్తే అది మాట్లాడుతారు. అది వారి నైజం అని మనం అనుకుంటాం. ఎలా అంటే అలా ప్రవర్తిస్తారు. గందరగోళం చేస్తారు. చిన్న విషయాన్ని కూడా చాలా పెద్దదిగా చేస్తారు. గోటితో పోయే దాన్ని గొడ్డలిదాకా తెస్తారు. ఎందుకంటే వారి రాశి అలాంటిది. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం కొన్ని రాశుల వారు వారికి నచ్చినట్లుగా ఉంటారు. వారికి నచ్చినట్లుగానే ప్రవర్తిస్తారు. దీని వల్ల ఎవరేమి ఇబ్బంది పడ్డా పట్టించుకోరు. అలాంటి రాశుల వారు ఎవరో మీరూ తెలుసుకోండి. వీళ్లు మంచి వ్యక్తులే గానీ వీరితో మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండండి.

తులరాశి (సెప్టెంబరు 23-అక్టోబరు 22)

తులరాశి (సెప్టెంబరు 23-అక్టోబరు 22)

తులరాశి వారు పక్కన వారిని బాగా ఇబ్బంది పెడుతుంటారు. వీళ్లు ఎక్కువగా కంగారుపడుతుంటారు. ప్రశాంతంగా ఉన్న వాతావరణాన్ని కూడా వీరు గందరగోళం చేస్తుంటారు. వీరితో మీరు కాస్త జాగ్రత్తగా ఉండండి. వీరు మీ పక్కన ఉంటే మిమ్మల్ని ఇబ్బందులుపెట్టాలని నానా రకాలుగా ప్రయత్నిస్తుంటారు. అయితే మీరు మాత్రం కాస్త జాగ్రత్తగా వ్యవహరిస్తే వీరి బారి నుంచి తప్పించుకోవొచ్చు.

కుంభరాశి (జనవరి 20-ఫిబ్రవరి 18)

కుంభరాశి (జనవరి 20-ఫిబ్రవరి 18)

కుంభరాశి వారు ఎక్కువగా ఊహల్లో విహరిస్తుంటారు. వీరు వాస్తవానికి దూరంగా ఆలోచిస్తారు. దీంతో చిక్కుల్లో చిక్కుకుంటారు. అంతేకాకుండా వీరు ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తారో తెలియదు. వారి కోణంలో ఆలోచిస్తే వీరు చాలా మంచివారు. కానీ ఎదుటి వారికి మాత్రం వీళ్లు చాలా డేంజర్. ఎదుటి వ్యక్తుల ఎలా ఫీల్ అవుతారని కూడా వీళ్లు ఆలోచించరు. ఒక్కోసారి ఒక్కోరకంగా ప్రవర్తిస్తూ పక్కవారిని బాగా ఇబ్బందిపెడుతారు.

వృశ్చికం (అక్టోబర్ 23-నవంబరు 21)

వృశ్చికం (అక్టోబర్ 23-నవంబరు 21)

వృశ్చికరాశి వారు ఎక్కువగా సీక్రెట్స్ మెయింటెన్ చేయాలనుకుంటారు. వీరు అసలు విషయం చెప్పకుండా పక్కన ఉన్న వారిని ఇబ్బందిపెడుతుంటారు. ఒక విషయాన్ని మనస్సుల్లో పెట్టుకుని పక్క వారిని టార్చర్ చేస్తూ ఉంటారు. అందువల్ల వృశ్చికరాశి వారితో మీరు కాస్త జాగ్రత్తగా ఉండడం చాలా మేలు. వీరు ఎప్పుడూ వారి అనుకూలంగానే పనులు కావాలని కోరుకుంటారు. పక్కనున్న వారికి అనుకూలంగా ఏదైనా జరిగితే వీరు తట్టుకోలేరు.

మిథునం (మే 21 - జూన్ 20)

మిథునం (మే 21 - జూన్ 20)

మిథునరాశి వారు వారు ఏం చేయాలి అని నిర్ణయించుకోరు. ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తుంటారు. దీంతో పక్కనున్న వారిని కూడా ఇబ్బందిపెడుతుంటారు. వీరు కొన్ని సమయాల్లో పక్కనున్న వారిని చాలా టార్చర్ పెడతారు. వీళ్లను అర్థం చేసుకోవడం చాలా కష్టం. వీరు అప్పడప్పుడు ప్రవర్తించే తీరు విసుగు తెప్పిస్తుంది.

కర్కాటకరాశి (జూన్ 21- జూలై 22)

కర్కాటకరాశి (జూన్ 21- జూలై 22)

వీళ్లు ఎక్కువగా రొమాంటిక్ గా ఉంటారు. వీరికి శృంగారం పట్ల మంచి ఆసక్తి ఉంటుంది. అయితే వీరు అవతలి వ్యక్తితో మాట్లాడేటప్పుడు చాలా దురుసుగా ఉంటారు. ఉన్నది ఉన్నట్లు కుండబద్దలు కొట్టినట్లు చెబుతారు. దీంతో అవతలి వ్యక్తులు బాధపడతారు. కానీ కర్కాటక రాశి వారి మనస్సులో ఎలాంటి చెడు ఆలోచన ఉండదు. వీరి మాట తీరు కాస్త దురుసుగా ఉంటుంది. ఏ విషయాన్ని కూడా వీరు ప్రశాంతంగా చెప్పరు. కర్కాటక రాశి వారు తమకు ఏం కావాలనే విషయాన్ని సూటిగా చెప్పలేరు. అవతలి వ్యక్తిని తిట్టినట్లుగా మాట్లాడతారు. దీంతో వీరు చాలా మందికి దూరం అవుతూ ఉంటారు.

ధనుస్సు (నవంబర్ 22-డిసెంబర్ 21)

ధనుస్సు (నవంబర్ 22-డిసెంబర్ 21)

ధనుస్సు రాశి వారు మాట్లాడే ముందుగానీ, వాళ్లు ఏదైనా పని చేసే ముందుగానీ ఒక్కనిమిషం కూడా ఆలోచించరు. నోటికి ఏది వస్తే అది అనేస్తారు. వీరికి ఏం చేయాలనిపిస్తే అది చేసేస్తారు. దాని వల్ల ఎవరేమి ఇబ్బందిపడ్డా తమకు అనవసరం అన్నట్లుగా ప్రవరిస్తారు. వీరు చెప్పాలనుకునేది చెప్పేస్తారు. దాంతో ఎదుటి వాళ్లు చాలా ఇబ్బందులకు గురవుతారు.

English summary

these zodiac signs are known be the most confusing ones

these zodiac signs are known be the most confusing ones
Subscribe Newsletter