Latest Updates
-
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.!
అత్యంత శక్తివంతంగా ఊహించగలిగే రాసుల వారు ఎవరో మీకు తెలుసా ?
కొంతమంది వ్యక్తులు ఏమి జరగబోతుంది అనే విషయాన్ని ఎంతో ఖచ్చితత్వంతో ఊహించగలరు. ఇలాంటి అతీంద్రియ సామర్ధ్యాలు వ్యక్తులకు ఉంటాయి అనే విషయం మీకు తెలుసా ?
కొంతమంది వ్యక్తులు ఏమి జరగబోతుంది అనే విషయాన్ని ఎంతో ఖచ్చితత్వంతో ఊహించగలరు. ఇలాంటి అతీంద్రియ సామర్ధ్యాలు వ్యక్తులకు ఉంటాయి అనే విషయం మీకు తెలుసా ? ఈ వ్యక్తులకు ఎంతో శక్తివంతమైన ఊహించగలిగే శక్తి ఉంటుంది. వీరిని అలాంటి శక్తులతో ఆశీర్వదించడం జరిగింది. ఎదుటివారు ఎప్పుడు అబద్దాలు చెబుతున్నారు లేదా భవిష్యత్తులో ఏమి జరగబోతుంది అనే విషయాన్ని కలగని చెప్పగలరు. కొన్ని సందర్భాల్లో అవి నిజం అవుతుంటాయి.
మీరు ఊహించి చెప్పే విధానానికి లేదా మీలో ఉన్న ఊహించే శక్తికి, మీ యొక్క రాశికి సంబంధం ఉంది అనే విషయం మీకు తెలుసా ? మొత్తంగా ఐదు రాశుల వారు చాలా అదృష్టవంతులు. వీరికి ఇలాంటి ఊహించే శక్తి అధికంగా ఉంటుంది. వీరు వీరి దగ్గర ఉన్న అతి శక్తివంతమైన ఈ యొక్క ఊహాశక్తి ఆధారంగా ఎదుటి వ్యక్తి మనస్సులో ఏమి ఉంది లేదా ఏమి జరగబోతుంది అనే విషయాన్ని చెప్పేయగలరు.
మీ రాశి కూడా ఇలాంటి ఊహాజనిత శక్తిగల రాశి అవునా? కాదా అనే విషయం తెలుసుకోవాలంటే మీరు ఈ వ్యాసాన్ని ఖచ్చితంగా చదవాల్సిన అవసరం ఉంది.

మిథున రాశి : మే 21 నుండి జూన్ 20 వరకు :
ఎప్పుడైతే పరిస్థితితులు చాలా తీవ్రంగా ఉంటాయో, అప్పుడు వీరి యొక్క ఊహాజనితమైన శక్తులు కూడా పనిచేస్తాయి. ఎప్పుడైతే వీరు ఒక సమస్యలో చిక్కుకుంటారో, అప్పుడు తర్వాత ఏమి జరగబోతోంది అనే విషయమై ఊహించగలరు. మరో వైపు వారి యొక్క ఊహిజనిత శక్తిని, ఇతరులపై ప్రదర్శించడమే కాకుండా ఎదుటి వారికి వారు భవిష్యత్తులో ఎదుర్కోబోయే సమస్యల గురించి సవివరంగా చెప్పి, భవిష్యత్తులో వాళ్ళు ఎదుర్కోబోయే సమస్యలను ఎదుర్కోవడంలో సహాయపడతారు.

వృశ్చికం : అక్టోబర్ 22 నుండి నవంబర్ 22 వరకు :
ఈ రాశి యొక్క వ్యక్తులు ఇలాంటి ఊహాజనిత విషయాలపై ఎంతో మక్కువ ప్రదర్శిస్తారు. తమకు రెండో మెదడు కూడా ఉందని అది అత్యుత్తమంగా పనిచేస్తుందని వీరి నమ్మకం. ఎదుటి వ్యక్తుల యొక్క మనస్సుని చదవడమే కాకుండా, వారి యొక్క నిజమైన ఉద్దేశ్యాలను కనుక్కోవడంలో ఎంతో సామర్ధ్యాన్ని ప్రదర్శిస్తారు. ఎదుటి వ్యక్తుల యొక్క వ్యక్తిత్వాన్ని అంచనా వేయడంలో సిద్ద హస్తులు. అంతేకాకుండా ఎదుటి వ్యక్తుల్లో ఉండే ఉత్తమ లక్షణాలను అంచనా వేయడం వీరి యొక్క ప్రత్యేకత. దీనికి తోడు ఎవరు అబద్దాలు ఆడుతున్నారు అనే విషయాన్ని కూడా ఎంతో చాకచాక్యంగా పసిగట్టగలరు.

ధనస్సు : నవంబర్ 22 నుండి డిసెంబర్ 22 వరకు :
ఈ రాశి యొక్క వ్యక్తులు ఎప్పుడైతే ధ్యానం లో ఉంటారో అప్పుడు వీరికి ఊహించే శక్తి అధికంగా ఉంటుంది. ఇలాంటి సమయాల్లో వీరు ఒక విషయాన్ని మనస్సులో పెట్టుకొని ఊహించుకొని ధ్యానం చేసి ఒక నిర్ణయానికి వస్తారు. ఆ తర్వాత మేల్కొని ఒక నిర్దిష్టమైన లక్ష్యంతో ప్రయాణాన్ని ముందుకు సాగించి విజయాన్ని అందుకుంటారు. కొన్ని సందర్భాల్లో వీరి యొక్క ఊహాజనిత శక్తి వీరికి ఏమని చెబుతుందంటే, మీరు చెవులతో దేనినైతే వింటారో దాన్ని బట్టి పనిచేయండి గాని, మీ మనస్సు ఏదైతే చెబుతుందో ఆది చేయకండి అని చెబుతుంది.

కుంభం : జనవరి 20 నుండి ఫిబ్రవరి 18 వరకు :
ఈ రాశి యొక్క వ్యక్తులు ఊహించడంలో అన్ని రాశుల వారి కంటే కూడా చాలా శక్తి వంతులట. ఇది విన్నవారికి చాలా ఆశ్చర్యం కలిగించవచ్చు. కానీ ఇదే నిజం. వీళ్ళు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నప్పటికీ కూడా, వీరి యొక్క ఊహించే శక్తి వీరికి దారిని చూపించి వీరిని గమ్యానికి చేరుస్తుంది.

మీనం : ఫిబ్రవరి 18 నుండి మార్చి 20 వరకు :
ఈ రాశి యొక్క వ్యక్తులు సహజంగానే ఎంతో ఊహించే శక్తిని కలిగి ఉంటారు మరియు మేధో శక్తితో వ్యవహరిస్తారు. వీరు ఎప్పుడుగాని ఎంతో ప్రతిబింబించే విధంగా, ఆలోచనాత్మక ధోరణితో మరియు శ్రద్ద కలిగిన వ్యక్తులుగా వ్యవహరిస్తారు. వారు ప్రతినిత్యం తమ దైనందిక జీవితంలో కలిసే వ్యక్తుల వెనుక ఎదో దేవతా సంబంధమైన బంధం ఉంది అనే భావనను కలిగి ఉంటారు. వీరు ఏదైనా అంగీకరించగల మనస్తత్వాన్ని కలిగి ఉంటారు మరియు మనస్సు ఎలా చెబితే ఆలా నడుచుకుంటారు. వీరి యొక్క ఊహాజనిత శక్తి వీరి యొక్క మనస్సు ద్వారానే ఉద్భవించి అలా ప్రయాణిస్తుంది.



Click it and Unblock the Notifications
