ఒక ట్రాన్స్ జెండర్ బిడ్డకు జన్మనిచ్చింది.

Written By: ChaitanyaKumar ARK
Subscribe to Boldsky

మనం సాధారణంగా ఒక ఆలోచనలో ఉంటాము,ఒక పురుషుని కన్నా, ఒక స్త్రీ జీవితంలో ఎక్కువ కష్టాలను అనుభవిస్తుందని. అందుకే అంత ఓర్పు, సహనం ప్రదర్శించే స్త్రీని దేవతగా భావిస్తాము. ఇదే ఆలోచనకు వ్యతిరేకంగా కూడా కొందరు ఆలోచిస్తుంటారు, ఒక మహిళ కన్నా పురుషుడే ఎక్కువ కష్టాలు అనుభవిస్తుంటాడు అని.

ఇలా ఎవరికివారు వ్యక్తిగతంగా చేసే ఆలోచనలే అన్నీ వేళలా సరికాదు. కానీ జీవితం లో ఈ రెండు జెండర్స్ కేనా కష్టాలు. ట్రాన్స్జెండర్ కు ఉండవా, వారు మాత్రం మనుషులు కారా? ఒక ట్రాన్స్జెండర్ అనుభవించే కష్టాలు అన్నీ ఇన్ని కావు. అలాంటి కష్టాలలో కూడా ఒక బిడ్డకు జన్మనిచ్చిన ట్రాన్స్ జెండర్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Transgender Who Lives A Life As Both Sexes

Image Source

వినడానికి నమ్మశక్యoగా లేదు కదా? కేసీ సుల్లివన్ ఒక ట్రాన్స్ జెండర్ , అయినప్పటికీ ఒక బిడ్డ కు జన్మనిచ్చి సమానత్వాన్ని ప్రదర్శించి ఆదర్శంగా నిలబడింది.

గర్భం దాల్చడం :

గర్భం దాల్చడం :

కేసీ ఒక మహిళ , తన 25 సంవత్సరాల వయసులో మేల్ హార్మోన్ టెస్టోస్టీరాన్ హార్మోన్ తీసుకోవడం ద్వారా మరియు స్థనములకు సంబంధించిన శస్త్రచికిత్సలు చేయించుకోవడం ద్వారా ట్రాన్స్ జెండర్ గా మారినది. కానీ కొన్ని ఆరోగ్యపరమైన సమస్యల వలన మేల్ హార్మోన్ టెస్టో స్టీరాన్ తీసుకోవడం ఆపివేయవలసి వచ్చింది. తద్వారా 2014 లో ఆన్లైన్ డేటింగ్ సైట్ ద్వారా పరిచయమైన 27 యేళ్ళ స్టీవెన్ అను భాగస్వామి ద్వారా బిడ్డకు జన్మనివ్వడం జరిగినది.

జెండర్ న్యూట్రాలిటీ :

జెండర్ న్యూట్రాలిటీ :

కానీ కేసీ, మరియు తన భాగస్వామి ఇద్దరూ కూడా తమ బిడ్డ జెండర్ గురించిన విషయాన్ని బయటకు చెప్పుటకు మాత్రం సంసిద్దతను వ్యక్తం చేయలేదు. కాలంతో పాటు ప్రజలకు కొన్ని తెలుస్తాయి అని చెప్తున్నారు. వీరు జెండర్ న్యూట్రాలిటీ కి మద్దతుగా ఈ పని చేశారు.

కేసీ కు ఇంతకు మునుపే ఒక బిడ్డకు తల్లి:

కేసీ కు ఇంతకు మునుపే ఒక బిడ్డకు తల్లి:

కేసీ ట్రాన్స్ జెండర్ గా మారక మునుపే మహిళగా ఉన్న రోజుల్లోనే తన మొదటి భర్తతో బిడ్డకు జన్మనిచ్చారు. ఆ బిడ్డకు ఇప్పుడు 5 సంవత్సరాలు.

మొదటి గర్భధారణ కన్నా ఇప్పుడే సంతోషంగా ఉంది:

మొదటి గర్భధారణ కన్నా ఇప్పుడే సంతోషంగా ఉంది:

కానీ కేసీ తన మొదటి బిడ్డకు జన్మనిచ్చిన సమయం కన్నా, ట్రాన్స్జెండర్ గా మారిన తర్వాత బిడ్డకు జన్మనివ్వడం ఎంతో ఆనందం కలిగించిందని పేర్కొన్నారు. అప్పటి నా శరీరం నేను కోరుకున్న విధంగా లేదు, బిడ్డకు జన్మనివ్వడం కూడా అసౌకర్యానికి లోనయ్యాను,ఎంతో డిప్రెషన్ స్థాయిల మద్య బిడ్డని కన్నాను. కానీ ఇప్పుడు నేను కోరుకున్న శరీరం నా సొంతం అని BBC కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కేసీ తన అనుభవాలను పంచుకుంది.

మా బిడ్డను ఇలాగే పెంచుతాము :

మా బిడ్డను ఇలాగే పెంచుతాము :

కానీ కేసీ మరియు తన భర్త స్టీవెన్, తమ బిడ్డను జండర్ తో సంబంధం లేకుండా , జెండర్ సంబంధిత దుస్తులకు వ్యతిరేకంగా పెంచుతామని చెప్తున్నారు.

English summary

Transgender Who Lives A Life As Both Sexes

Kaci Sullivan is a transgender who is enjoying life living as both sexes. Kaci revealed about her pregnancy as she was living as a woman but by the end of the pregnancy, she preferred giving birth as a MAN! Kaci also explained about the excitement he and his boyfriend had with the thought of having the baby.