వివిధ రాశులకు చెందిన మోస్ట్ ఎట్రాక్టివ్ ఫిజికల్ ఫీచర్స్

Written By: Lalitha Lasya Peddada
Subscribe to Boldsky

ఆకర్షణీయమైన కళ్ళు, విల్లులాంటి కనుబొమ్మలు, దొండపండులాంటి పెదవులు ఇటువంటి కొన్ని ఆకర్షణీయమైన ఫిజికల్ ఫీచర్స్ ను ఇట్టే అందరినీ ఆకర్షిస్తాయి. అయితే, ఈ ఫిజికల్ ఫీచర్స్ పై రాశుల ప్రభావము ఉంటుందని మీకు తెలుసా?

ప్రతి రాశి ఆ రాశికి చెందిన ఫిజికల్ ఫీచర్స్ పై ప్రభావం చూపుతుందట. ఈ ఫీచర్స్ అనేవి ఈ రాశికి చెందిన వ్యక్తుల అపియరెన్స్ ను మరింత పెంపొందించేందుకు తోడ్పడతాయట. అయితే ఏ ఏ రాశులకు సంబంధించిన ఫిజికల్ ఫీచర్స్ ఏంటో విడివిడిగా ఈ క్రింది విధంగా వివరించడం జరిగింది.

What Is The Most Attractive Physical Feature Of Each Zodiac Sign

మీ రాశి ప్రకారం మీలోని ది బెస్ట్ ఫిజికల్ ఫీచర్ ఏంటో ఇప్పుడు తెలుసుకోండి!

మేషరాశి:

మేషరాశి:

మీలో కసి ఎక్కువగా ఉంటుంది. మీ కనుబొమ్మలు ఆకర్షణీయంగా ఉంటాయి. ఇది, మీలోని ఎట్రాక్టివ్ ఫిజికల్ ఫీచర్. మీ తీక్షణతనైనా లేదా అమాయకత్వాన్నైనా వ్యక్తీకరించడానికి కనుబొమ్మలు తోడ్పడతాయి. మీ మూడ్ స్వింగ్స్ గురించి మీ కనుబొమ్మలు చక్కగా వివరిస్తాయి.

వృషభరాశి:

వృషభరాశి:

మీ పెదవులు మిమ్మల్ని ఆకర్షణీయంగా ఉంచడంలో తోడ్పడతాయి. మీ అందాన్ని రెట్టింపు చేయడంలో మీ పెదవులు ముఖ్యపాత్ర పోషిస్తాయి. మిమ్మల్ని మొదటిసారి చూసినవారెవరైనా మీ పెదవులని మొదటగా గుర్తిస్తారు.

మిథునరాశి:

మిథునరాశి:

మీ కాంప్లెక్షన్ మీ అపియరెన్స్ ను ప్లెజంట్ గా మారుస్తుంది. అందువలన, మీ కాంప్లెక్షన్ ను సంరక్షించుకునేందుకు మీరు సరైన కేర్ ను తీసుకోవాలి. ఈ రాశికి చెందిన వారి బుగ్గలు ఎర్రగా ఉంటాయి. ఆరోగ్యాన్ని సంరక్షించుకుంటే వీరు అందాన్ని సంరక్షించుకున్నట్టే అర్థం.

కర్కాటకరాశి:

కర్కాటకరాశి:

మీ పొట్టే మీలోని ఆకర్షణీయమైన బాడీ ఫీచర్. ఇతరులతో కారుణ్యంగా వ్యవహరించాలన్న కోరిక మీ పొట్టలో దాగుని ఉంటుంది. అందువలన, అది మంచి షేప్ లోనే ఉంటుంది. మీరు కొంచెం నెర్వస్ గా ఉన్నప్పుడు మీ పొట్టలోని బటర్ ఫ్లైస్ మిమ్మల్ని సెన్సిటివ్ గా ఉంచుతాయి. మీలోని ప్రేమతత్వం అలాగే ఉదారభావం ఎప్పటికీ సజీవంగా ఉంటాయి.

సింహరాశి:

సింహరాశి:

మీ శిరోజాలే మీలోని ఆకర్షణను మరింత పెంచుతాయి. మిమ్మల్ని చూడగానే మీ శిరోజాలే మొదటగా అటెన్షన్ ను పొందుతాయి. మీ రాయల్టీని ఈ ఫీచర్ రిప్రెజెంట్ చేస్తుంది. శిరోజాల వలన మీ అందం రెట్టింపు అవుతుంది.

కన్యారాశి:

కన్యారాశి:

మీ చర్మం మీ అందాన్ని రెట్టింపు చేస్తుంది. ఈ రాశివారి చర్మం మంచి నిగారింపుతో కళకళ లాడుతుంది. చర్మసంరక్షణకు ప్రాధాన్యమివ్వడం ద్వారా మీరు మీ ఆకర్షణను కాపాడుకోవచ్చు. ఈ రాశివారికి చర్మ సౌందర్యం అనేది ఒక వరం అని చెప్పుకోవచ్చు.

తులారాశి:

తులారాశి:

ఇతరులతో సత్సంబంధాలను మెయింటెయిన్ చేయడం మీకు ఎంతో ముఖ్యం. మీ బెస్ట్ ఫీచర్ అనేది మీ వెనుకభాగం. సరైన పోస్టిరియర్ అనేది మీరెంత జెంటిల్ నేచర్ కలిగిన వారో అలాగే కరుణ కలిగిన వారో తెలియచేస్తుంది.

వృశ్చికరాశి:

వృశ్చికరాశి:

మీ ఈరొజేనాస్ జోన్స్ అనేవే మీలోని బెస్ట్ బాడీ ఫీచర్స్. మీకు కలిగిన శక్తిని తెలుసుకోండి. బెస్ట్ బాడీ ఫీచర్స్ ని గుర్తించడం ద్వారా ఒక అంచనా ఏర్పడుతుంది. శరీరంపై ఒక అవగాహన ఏర్పడుతుంది.

ధనుస్సురాశి:

ధనుస్సురాశి:

మీ బ్యాక్ అనేది మీలోని ది బెస్ట్ బాడీ ఫీచర్. బ్యాక్ లెస్ డ్రెస్ లను ధరిస్తే మీ గురించి తాపత్రయపడే వారి సంఖ్య పెరుగుతూనే ఉంటుంది. బ్యాక్ లెస్ డ్రెస్ లు మీకు భలే సూట్ అవుతాయి.

మకరరాశి:

మకరరాశి:

ఈ రాశికి చెందిన వారి కాళ్ళు ఆకర్షణీయంగా ఉంటాయి. హాల్ లో నడుస్తున్నా లేదా డ్యాన్సింగ్ ఫ్లోర్ వైపు వెళుతున్నా అందరి దృష్టి మీ లెగ్స్ పైనే ఉంటుంది అనడంలో సందేహం లేదు.

కుంభరాశి:

కుంభరాశి:

మీ పాదాలు మీలోని ది బెస్ట్ ఫిజికల్ ఫీచర్ అనడంలో సందేహం లేదు. ఎక్కువగా పరుగెత్తడానికి మీరు ఇష్టపడతారు. అత్యంత సహజంగా మీ పాదాలు అందంగా ఉంటాయి. ఈ భూమిలోని ప్రశాంతతను నింపేందుకు ప్రశాంతమైన ఆలోచనలతో నడకను మీరు ఆస్వాదిస్తారు.

మీనరాశి:

మీనరాశి:

మీ కళ్ళు అత్యంత ఆకర్షణీయంగా ఉంటాయి. మీ కళ్ళు అనేక భావోద్వేగాలను పలికించగలుగుతాయి. మీ కళ్ళలోకి చూస్తూ ఇతరులు మైమరచిపోతారు. మీ కళ్ళతో ప్రేమానుబంధాలను పంచగలుగుతారు. కాబట్టి, మీ రాశి ప్రకారం మీ బెస్ట్ ఫిజికల్ ఫీచర్ గురించి తెలుసుకున్నారా? మీ అభిప్రాయాలను కామెంట్స్ సెక్షన్ లో మాకు తెలియచేస్తారు కదూ!

English summary

What Is The Most Attractive Physical Feature Of Each Zodiac Sign

Knowing what's the best thing about your body could lessen the burden of trying to feel confident about yourself. Body features tell you how great you look; and it also tells you a little bit about yourself. According to astrology, there are certain physical features that people of each zodiac sign are known to possess.