For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈవారం రాశి ఫలాలు : ఆగస్ట్ 19 నుండి ఆగస్ట్ 25 వరకు

|

వారం వారం మన అదృష్టాలు, దురదృష్టాలు గురించి తెలుసుకోవాలనే కుతూహలం చాలా మందిలో ఉంటుంది. అలాంటి వారిలో మీరు ఒకరైతే తప్పకుండా ఈ వారం (ఆగష్టు 19, 2018 to ఆగష్టు 25, 2018) వరకు మీ భవితవ్యం ఎలా ఉంటుందో తెలుసుకోండి...

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 20

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 20

ఈ వారం మేష రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. అనేక ప్రతికూల సమస్యల తరువాత నిర్ణయాలు తీసుకోవలసిన సమయముగా ఈవారం ఉండనుంది. ఈ నిర్ణయాలు జీవితంలో సంతోషకరమైన వాతావరణానికి నాంది పలికే అవకాశాలు కూడా ఉన్నాయి. ‌ కుటుంబములో మీ పనికి తగ్గ గుర్తింపు లభిస్తుంది. మరియు కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుటకు అనుకూలమైన సమయం లభిస్తుంది. క్రమముగా ఆందోళనలు, ఒత్తిడులు తొలగి మానసిక ప్రశాంతత లభిస్తుంది. మీ ప్రియమైన వారు మీ వెంటనే ఉండడం మీకు సంతోషాన్నిస్తుంది.

అదేవిధంగా తార్కిక మరియు సృజనాత్మక ఆలోచనలు చేయడానికి మీకంటూ ఒక ప్రత్యేకమైన సమయం లభిస్తుంది. ఆరోగ్యం దృష్ట్యా వ్యాయామం, యోగా లేదా ధ్యానం మొదలైన వాటి మీద దృష్టి కేంద్రీకరించగలుగుతారు. క్రమంగా మానసిక మరియు శారీరక ఆరోగ్యం మెరుగుపడుతుంది. లాటరీల వంటి వాటి ద్వారా ఆకస్మిక ధనలాభం ఉన్నప్పటికీ డబ్బు సంపాదించుటకు సులువైన మార్గాన్ని అలవాటు పడటం మంచిది కాదని తెలుసుకుంటారు. వైవాహిక జీవితంలో ఎటువంటి సమస్యలు ఉండబోవు.

వృషభ రాశి : ఏప్రిల్ 21 - మే 21

వృషభ రాశి : ఏప్రిల్ 21 - మే 21

వృత్తి మరియు ఆఫీసు కార్యకలాపాలలో ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న ఫలితాలు వచ్చే ‌అవకాశాలున్నాయి. కాకపోతే నిర్ణయం తీసుకునే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించి తీసుకోవడం ఉత్తమమని చెప్పబడినది. ఈ వారం మీ భాగస్వామితో లేదా ప్రియమైన వారితో సంతోషంగా గడిపే సమయం లభిస్తుంది. మరియు ఈ సమయం మీ మధ్య బంధాన్ని మరింత బలపరుస్తుంది. వివాహాది శుభకార్యముల సంబంధిత నిర్ణయాలు తీసుకోవడానికి మరియు గృహ ప్రవేశాలకు అనువుగా ఉన్నది.

మిధున రాశి : మే 22 - జూన్ 21

మిధున రాశి : మే 22 - జూన్ 21

కుటుంబం సంబంధించిన అనేక విషయాలు మీ సమయాన్ని ఆక్రమిస్తాయి. క్రమంగా మీకంటూ వ్యక్తిగత స్వేచ్ఛ ఈవారం లభించడం కష్టంగా ఉంటుంది. మరియు మీ కార్యాలయంలో మిమ్ములను శత్రువులుగా భావించే వ్యక్తుల నుండి బయటపడే క్రమంలో మీకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తిపరమైన విషయాల నందు మీ దృష్టి ఉంచడం మరియు సమయానుకూలముగా నిర్ణయాలు తీసుకోవడం మొదలైనవి సూచించదగిన అంశాలుగా ఉన్నాయి. క్లిష్టమైన దశలలో మీరు వ్యతిరేకంగా భావించే వ్యక్తులు మీకు అండగా ఉండడం ఆశ్చర్యానికి లోనుచేస్తుంది.

కర్కాటక రాశి : జూన్ 22 - జూలై 22

కర్కాటక రాశి : జూన్ 22 - జూలై 22

వ్యక్తిగత మరియు వృత్తిపరమైన లేదా వ్యాపార సంబంధిత విషయాల పరంగా నూతనముగా ప్రారంభించవలసిన అంశాల పట్ల, తీసుకోవలసిన నిర్ణయాలకు సరైన సమయంగా ఈవారం ఉండనుంది. ప్రణాళికాబద్ధమైన నిర్ణయాలు తీసుకుంటూ సానుకూల ఫలితాలను పొందుతూ కార్యాలయాలలో మంచి గుర్తింపును పొందుతారు. మీ నిర్ణయాల ప్రకారం, సరైన సమయంలో ఆశించిన ఫలితాలను పొందగలరు కూడా. ఈ వారమంతా ఆరోగ్య చింతలు లేకుండా, మానసికంగా చురుకుదనం కూడుకొని ఉంటారు. కాకపోతే మీ మార్గములో కొన్ని ఆటుపోట్లు సర్వసాధారణంగా ఉంటాయి. మీ అంతరాత్మ చెప్పిన విధముగా, లేదా మీ భాగస్వామితో చర్చల ద్వారా నడుచుకోవడం మూలముగా సానుకూల ఫలితాలను పొందగలరు.

సింహ రాశి : జూలై 23 - ఆగస్టు 21

సింహ రాశి : జూలై 23 - ఆగస్టు 21

ఈవారం మీ ప్రేమ జీవితానికి ఒక అద్భుతమైన వారంగా ఉంటుంది. మీ బాగస్వామితో సమయాన్ని కేటాయించడానికి మరియు వారితో మీ భావాలను పంచుకోవడానికి అనువైన సమయంగా ఉన్నది. పెళ్లికాని వారికి సరైన జీవిత భాగస్వామి తారసపడే అవకాశాలు ఉన్నవి. ఇవి దీర్ఘకాలిక సంబంధంతో ముగుస్తాయి. ‌

వృత్తి పరమైన అంశాల నందు మీరు ఊహించిన ఫలితాలను పొందడమే కాకుండా మీరు చేపట్టిన ప్రాజెక్టులో అభివృద్ధిని కూడా చూడగలుగుతారు. ఎంతోకాలంగా మీరు ఎదురుచూస్తున్న భారీ ప్రాజెక్టులు మీ వశమయ్యే అవకాశాలు ఉన్నాయి.

ఈవారం మానసిక ఒత్తిడులు కొద్దిగా మిమ్ములను వేధించవచ్చు. కావున మీ భావాలను ఎప్పటికప్పుడు మీ భాగస్వామితో పంచుకొనుటకు సిద్ధముగా ఉండండి. మీ సృజనాత్మకతకు పని చెప్పండి.

కన్యా రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 23

కన్యా రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 23

మీరు మీ ఉద్యోగంలో లేదా వ్యాపారంలో కొన్ని ప్రతికూల సమస్యలను ఎదుర్కొనవలసి రావచ్చు. మీ గ్రహాల స్థితిగతులు ఇందుకు కారణంగా ఉంటుంది. క్రమంగా మిశ్రమ ఫలితాలతో ఈవారం ఒడిదుడుకుల మధ్య ముందుకు సాగుతుంది. కానీ ఈ వారంలో తీసుకున్న నిర్ణయాలు భవిష్యత్తులో లాభాలను సాధించే దిశగా సహాయం చేయగలవు.

తులా రాశి : సెప్టెంబర్ 24 - అక్టోబర్ 23

తులా రాశి : సెప్టెంబర్ 24 - అక్టోబర్ 23

పురోగతి వెంట వైఫల్యాలు కూడా కనిపిస్తూ, మిశ్రమమైన పోకడలకు మానసిక స్థితిని గురిచేస్తూ ఈవారం ముందుకు సాగుతుంది. పనిభారం కార్యాలయాల యందు తీవ్రమైన ఒత్తిడి మానసిక సంక్షోభానికి దారి తీస్తుంది. స్వీయ విశ్వాసం అన్నిటా సహాయం చేస్తుంది.

కొంత అజాగ్రత్త కొన్ని విషయాలను మరింత దిగజారుస్తాయి. కొన్ని పరిస్థితుల నందు కుటుంబం మరియు వృత్తిపరమైన అంశాల నుండి పూర్తిగా దూరంగా వెళ్లిపోవాలన్న ఆలోచనలు కూడా వస్తుంటాయి. కానీ మీ శ్రేయోభిలాషులు మీ శ్రేయస్సు కోరే సలహాలు ఇస్తున్నారు అన్న విషయాన్ని మరచిపోకూడదు. కుటుంబంలో ఆర్థిక సంక్షోభం మరియు అనారోగ్య సంబంధిత సమస్యలు వస్తువుల కొనుగోలులో జాప్యం లేదా ఆటంకం మొదలైనవి మీ మానసిక ఒత్తిడులకు కారణభూతాలుగా ఉంటాయి.

మీ జీవిత భాగస్వామి సంబంధిత సమస్యలు మీ తలకు మించిన భారంగా మారే అవకాశాలు ఉన్నాయి, కానీ మీరు తీసుకునే ప్రస్తుత నిర్ణయాలే భవిష్యత్తులో మార్గదర్శకం కాగలవని మరచిపోరాదు.

వృశ్చిక రాశి : అక్టోబర్ 24 - నవంబర్ 22

వృశ్చిక రాశి : అక్టోబర్ 24 - నవంబర్ 22

మీ వృత్తి పరమైన అంశాల నందు లేదా కార్యాలయాలలో రెట్టింపు ఉత్సాహం, శక్తి మరియు ధైర్యంతో ముందుకు అడుగులు వేస్తూ నలుగురికి ప్రేరణ ఇచ్చేలా ఉంటారు. మరియు వృత్తి యందు మీ నిబద్ధత, పట్టుదల, క్రమశిక్షణ మీకు సానుకూల ఫలితాలను ఇస్తూ మంచి గుర్తింపును తీసుకొని రాగలవు. అలాగని అన్నివేళలా విజయం తలుపు తడుతుందని అనుకోడానికి లేదు.

ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అన్న సూక్తిని విస్మరించకూడదు. సంబంధాలలో ఏవైనా సమస్యలు ఉన్న యెడల నిష్పాక్షికమైన ధోరణితో మీ అభిప్రాయాలను భాగస్వామితో పంచుకోవడం ద్వారా పరిష్కరించుకోగలరు. ఉన్నపళంగా మీ వైఖరిని మార్చుకోవడం ద్వారా ఎటువంటి లాభాన్ని కలిగి ఉండదని గుర్తుంచుకోండి. ప్రపంచంలో ప్రతి ఒక్కరిని సంతోషపెట్టడం జరగని పని అని కూడా గుర్తుంచుకోండి. ఈ వారం విద్యార్థులకు ఎంతో అనుకూలంగా ఉంటుంది మరియు ఆరోగ్యం మీద దృష్టి సారించడానికి మార్గాలను అన్వేషిస్తారు. క్రమంగా వ్యాయామం మీద జీవనశైలి మీద దృష్టి సారిస్తారు.

ధనుస్సు రాశి : నవంబర్ 23 - డిసెంబర్ 22

ధనుస్సు రాశి : నవంబర్ 23 - డిసెంబర్ 22

తల్లిదండ్రుల ఆస్తి లేదా వివాహ సంబంధ ఒప్పందాల సంబంధిత సమస్యలు ఈ వారంలో మీ కుటుంబాన్ని సమస్యలతో నింపవచ్చు. మరియు మానసిక గందరగోళానికి ఒత్తిడిలకు కారణంగా మారవచ్చు. కావున విచక్షణ కోల్పోకుండా సహనాన్ని కలిగి ఉండాలని గుర్తుంచుకోండి.

మీ దగ్గరలో ఉన్న వ్యక్తులతో వ్యవహరించేటప్పుడు మీ ప్రతికూల చర్యలను నియంత్రించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఒక్కోసారి మీ చర్యలు మీ పట్ల ఉన్న సానుకూల వైఖరిని తొలగించే అవకాశాలు ఉన్నాయి.

మీ కార్యాలయాలలో మీ పనియందు ఎదురయ్యే ప్రతికూల సమస్యల పట్ల ఒక కన్ను ఉంచవలసిన అవసరం ఉన్నది. గతంలో మీరు పెట్టిన పెట్టుబడుల వలన మీకు ఆర్థిక సమస్యలు అంతగా ఉండకపోవచ్చు. పెట్టుబడులు లేని వారికి లాభార్జన లేకపోయినా, నష్టం లేకుండా ముందుకు సాగుతుంది.

మకర రాశి : డిసెంబర్ 23 - జనవరి 20

మకర రాశి : డిసెంబర్ 23 - జనవరి 20

గత జ్ఞాపకాలు కొన్ని మనసులో స్ఫురణకు వస్తూ, ఈవారం దూర ప్రాంతాలకు ప్రణాళికలు వేసేలా ఉసిగొల్పుతుంది. ఈ చర్యలు రోజు వారి సమస్యల నుండి దూరం చేయలేవు. కేవలం ఒత్తిళ్లను దూరం చేసేందుకు మాత్రమే దోహదపడుతుందని గుర్తుంచుకోండి. ఇది మీ జీవన అనుభవాన్ని మెరుగుపరచేలా చేయగలదు. ఆర్ధిక సంక్షోభం ఉండదు కానీ, మానసిక గందరగోళం నెలకొంటుంది.

కుంభ రాశి : జనవరి 21 - ఫిబ్రవరి 19

కుంభ రాశి : జనవరి 21 - ఫిబ్రవరి 19

జీవితంలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవలసిన కష్టమైన దశలో మిమ్ములను మీరు కనుగొన్నప్పుడు, విభిన్న కోణాల నుండి సమస్యల గురించిన ఆలోచనలు చేయడానికి ప్రయత్నించండి. మీ ప్రియమైన వారు శ్రేయోభిలాషుల సూచనలను అనుసరిస్తూ సాధ్యాసాధ్యాల‌ను పరిశీలిస్తూ నిర్ణయాలు తీసుకోండి.

మీ ఆలోచనా విధానాలు మరియు గుణగణాలు కార్యాలయాల నందు ప్రశంసించబడుతాయి. ఇక మీ భాగస్వామి పరంగా మీ వ్యక్తిగత జీవితం కొన్ని హెచ్చుతగ్గులకు గురికాగలిగే సూచనలు కనిపిస్తున్నాయి. సరికొత్త ఆదాయ మార్గాల మూలాలు దొరికినందువలన ఈవారం ఆర్థిక సంబంధ సమస్యలు ఏర్పడక పోవచ్చు. అదేవిధంగా ఆరోగ్యం కూడా నిలకడగా ఉంటుంది.

మీన రాశి : ఫిబ్రవరి 20 - మార్చి 20

మీన రాశి : ఫిబ్రవరి 20 - మార్చి 20

కార్యాలయంలో పనివేళల నందు సహచరులతో కొన్ని సవాళ్లను ఎదురుచూడాల్సి వస్తుంది. మీరు జీవితంలో ఎటువంటి ప్రతిఘటనలనైనా ఎదుర్కొనుటకు సిద్ధంగా ఉంటారు. జీవిత భాగస్వామి యందుగల మీ విశ్వసనీయత మరియు నిబద్ధత, మిమ్ములను వారి మనసులో ఒక స్థానంలో ఉంచుతుంది. అత్యంత క్లిష్టమైన మరియు కీలకమైన పరిస్థితులను ఎదుర్కోవడంలో మీ జీవిత భాగస్వామి సహాయం ఎప్పుడూ ఉంటుంది.

ఈ వారంలో వ్యాపార మరియు వృత్తి సంబంధిత వ్యవహారాలనందు కొన్ని ప్రతికూల సమస్యలు ఎదురైనా ఫలితాలు మాత్రం ఆశాజనకంగానే ఉంటాయి. క్లిష్ట సమయాలలో మీరు తీసుకునే నిర్ణయాలు ఉత్తమమైన ఫలితాలను ఇచ్చే అవకాశాలున్నాయి.

ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆసక్తికర, ఆహార, ఆరోగ్య, జీవన శైలి, ఆద్యాత్మిక, వ్యాయామ, లైంగిక తదితర సంబంధిత విషయాల కోసం బోల్డ్స్కీ పేజీని తరచూ సందర్శించండి. ఈ వ్యాసం పై మీ అభిప్రాయాలను, వ్యాఖ్యలను క్రింద వ్యాఖ్యల విభాగంలో తెలియజేయండి.

English summary

Your Weekly Horoscope: Aug 19, 2018 – Aug 25, 2018

The week 19th August to 25th August is said to be good for Aries, as they will spend more time with family. Also they get some me time in the coming week. If your sign is Gemini it is important to concentrate on your work as enemies in your workplace may try to snatch the limelight away from you.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more