For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జన్మరాశి చిహ్నాలను దేవతా రూపాల్లో వీక్షించే అవకాశాన్ని కల్పించిన ఎమిలీ అద్భుత కళాసృష్టి

|

ఎమిలీ పీటర్స్ మార్క్ అనే కళాకారిణి, మిచిగన్ కు చెందిన బ్యాండ్, 'ది యాక్సిడెంటల్స్' పర్యటన పోస్టర్ల కోసం దేవతల చిత్రాలను రాశిచక్ర గుర్తులుగా సృష్టించి ప్రసిద్ధికెక్కింది.

ఈ సిరీస్ చేపట్టడానికి ముందు, ఎమిలీకి జ్యోతిషశాస్త్రం పట్ల మిడిమిడి జ్ఞానం మాత్రమే ఉండేది. ఒక సంవత్సర కాలం పాటు, ఆమె ఈ ప్రాజెక్ట్ కొరకు పరిశోధన చేసారు. ప్రతి రాశిచక్ర చిహ్నానికి వెనుక దాగివున్న పురాణ విశ్లేషణను తన అధ్యయనం ద్వారా కనుగొంది.

దేవతల చిత్రాలను రాశిచక్ర గుర్తులుగా అందమైన దృష్టాంతాలను ఎమిలీ సృష్టించింది.దీని ద్వారా ఆమె ప్రపంచ జ్యోతిష్య ప్రియుల యొక్క ప్రశంసలను చూరగొంది.

ఆ అద్భుతమైన సిరీస్ లో ఆమె రాశిచక్ర చిహ్నాలను దేవతలుగా ఊహించుకున్న తీరు మీ కోసం! ఓ చూపు వెయ్యండి....

మేషం: మార్చి 21-ఏప్రిల్ 19

మేషం: మార్చి 21-ఏప్రిల్ 19

ఎమిలీ విశ్లేషణ ప్రకారం, మేషరాశివారి యొక్క దృక్పధంలో పరిపక్వత ఉంటూ చూడటానికి మొరటుదనంతో ఉన్న అనుభూతిని కలిగిస్తారని వెల్లడించారు.

 వృషభం: ఏప్రిల్ 20-మే 20

వృషభం: ఏప్రిల్ 20-మే 20

ఫ్లోరిడాలోని పార్కుల్యాండ్ లో ఉన్న మార్జోరీ స్టోన్ మ్యాన్ డగ్లస్ ఉన్నత పాఠశాలలో జరిగిన సామూహిక కాల్పుల ఘటన నుండి తప్పించుకుని బయటపడ్డ ఎమ్మా గొంజాలెజ్ అనే ఒక కార్యకర్త ఇచ్చిన స్పూర్తితో ఆమె సంబంధించిన దృష్టాంతం యొక్క రూపకల్పన చేసింది.

వృషభ రాశికి చెందినవారు, తమ శక్తిని సరిగా అంచనా వేసుకోగలరనే భావనను ఆమె ప్రగాఢంగా విశ్వసిస్తుంది.

మిథునం: మే 21- జూన్ 20

మిథునం: మే 21- జూన్ 20

ఎమిలీ మిథున రాశివారి గురించి వివరంగా తెలిపారు. వారిని ఉద్దేశించి ఆమె, "మిథున రాశిని సూచించే కవలలు ఇద్దరిని శక్తివంతులుగా, భారీ కిరీటాలను ధరించిన తిరుగుబాటుదారులుగా కనపడేట్టు చేయాలని నేను కోరుకుంటున్నాను" అన్నది. అంతేకాక, ఆమె "ఈ సిరీస్ లోని స్త్రీ రూపాల లైంగికతను బాహాటంగా చిత్రీకరించకుండా, వారిలోని ప్రకృతీసిద్ధమైన దుర్బలత్వం మరియు సహజత్వంలను ఈ చిహ్నాలలో చూపాలని నేను కోరుకున్నాను" అన్నారు.

కర్కాటకం: జూన్ 21- జూలై 22

కర్కాటకం: జూన్ 21- జూలై 22

పోస్టర్ ఎలెక్ట్రిక్ ఫారెస్ట్ ఫెస్టివల్ లో ఎమిలీ యొక్క స్వీయ అనుభవంతో కర్కాటక రాశికి సంబంధించిన చిత్రీకరణకు ప్రేరణ పొందింది. "దట్టమైన అడవులలోని చీకటిని చీలుస్తూ ప్రసరించే నియాన్ కాంతులను నేను ఇష్టపడటం, నా స్ఫురణకు వచ్చింది." ఆమె, "అర్ధరాత్రి సమయంలో, ఆ విస్తారమైన అరణ్యంలో మరోప్రపంచాన్ని కనుగొనాలనే భావనకు రూపాన్ని ఇవ్వాలని నేను కోరుకున్నాను."

సింహరాశి: జులై 23-ఆగస్టు 23

సింహరాశి: జులై 23-ఆగస్టు 23

సింహరాశి కొరకు ఆమె సృష్టించిన దృష్టాంతం ది యాక్సిడెంటల్స్ యొక్క ఆల్బం, "ఒడిస్సీ" కొరకు కూడా ఉపయోగించుకున్నారు. ఎమిలీ దీని కొరకు, తన జీవితంలో ముఖ్యమైనదైన దేని కొరకో వెతుకుతూ, ప్రయాణాన్ని ఆరంభించిన ఒక కథానాయిక వంటి మహిళ రూపాన్ని గీసింది.

కన్య రాశి: ఆగస్టు 24-సెప్టెంబర్ 23

కన్య రాశి: ఆగస్టు 24-సెప్టెంబర్ 23

కన్య రాశివారు కన్నెపిల్లలుగా చిత్రించబడతారు కనుక, ఆమె ఈ చిహ్నంలో యవ్వనం ఉట్టిపడేట్టు చేసేందుకు ప్రయత్నించారు. దీని చిత్రీకరణ సమయంలో, ఆమె యొక్క అనుభవాన్ని గురించి ఇలా వివరించారు. ఆమె ఇలా అన్నాడు, "ఈ పోస్టర్ చిత్రీకరణక కొరకు నేను మొట్టమొదటిసారి చేసిన ప్రయత్నంలోని యువతి చాలా దుర్బలంగా కనిపించింది, కనుక ఆమెకు మరికొంత దృక్పథంను జోడించేందుకు దానిని చేరిపివేసాను".

తులరాశి: సెప్టెంబర్ 24-అక్టోబర్ 23

తులరాశి: సెప్టెంబర్ 24-అక్టోబర్ 23

2017 లో అధ్యక్షుడుగా ట్రంప్ తన ప్రయాణాన్ని ఆరంభించిన రోజున, ఆమె గీసిన లేడీ జస్టిస్ స్కెచ్ ఆధారంగా తులరాశి చిత్రీకరణ రూపొందింపబడింది. ఆమె ఈ చిత్రీకరణను వివరిస్తూ "దీనిని నేను రాజకీయ దృష్టితో చూడను కానీ లేడీ జస్టిస్ ను నల్లజాతీయురాలిగా చిత్రీకరించడానిని చైతన్యంతో కూడిన విలక్షణమైన ఎంపికగా భావిస్తాను" అంది.

వృశ్చిక రాశి: అక్టోబర్ 24-నవంబరు 22

వృశ్చిక రాశి: అక్టోబర్ 24-నవంబరు 22

దేవత యొక్క వెనుక భాగాన "సొగసైన, ఆధునిక అంశాలతో కూడిన సంప్రదాయ పాలినేషియన్-ప్రేరేపిత పచ్చబొట్టు"నుండి పొందిన ప్రేరణతో వృశ్చిక రాశికి చెందిన వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని నిర్వచించింది.

ధనురాశి: నవంబర్ 23-డిసెంబరు 22

ధనురాశి: నవంబర్ 23-డిసెంబరు 22

ఎమిలీ ధనురాశి చిత్రీకరణకు వాస్తవంలో కూడా శరీరధర్మాలు సక్రమంగా నిర్వర్తించగలిగే దేహం యొక్క రూపాన్ని ఇవ్వడానికి ప్రయత్నించింది

ఇది నిజం. "తన ఆహారాన్ని తానే సంపాదించుకుని, ఇతిహాసం పోరాటాలు చేసేవారి"కి ఇది ప్రతిరూపమని ఆమె నమ్మకం.

 మకరరాశి: డిసెంబర్ 23-జనవరి 20

మకరరాశి: డిసెంబర్ 23-జనవరి 20

ఎమిలీ సముద్రపు మేకగా పిలువబడే ఒక వింత ఊహా జీవి మకరానికి ప్రాతినిధ్యం వహిస్తుందని తెలుసుకుంది.

" జీవజాలంలోని సున్నితత్వంతో జరిగే సంఘర్షణకు చిహ్నంగా ఈటెను, ఈ పోస్టర్ కు ఒక గాఢత కలిగిన స్వప్నానుభూతిని అందించడానికి ఉపయోగించాలని నేను కోరుకున్నాను", అని ఆమె చెప్పారు.

 కుంభ రాశి: జనవరి 21-ఫిబ్రవరి 18

కుంభ రాశి: జనవరి 21-ఫిబ్రవరి 18

ఈ రాశిచిహ్నాన్ని చూస్తే ఒక పురాణానికి ప్రతిసృష్టిలా ఉండాలని ​​ఆమె భావించారు. ఈ చిహ్నం ద్వారా, ఆమె ఇజిప్షియన్ దేవతల ఆలోచనను మరియు ఈజిప్టియన్ స్మారక చిహ్నాల స్మృతిని రేకెత్తించాలని ఆమె తలపోసింది.

మీన రాశి: ఫిబ్రవరి 19-మార్చి 20

మీన రాశి: ఫిబ్రవరి 19-మార్చి 20

మీన రాశికి చిహ్నంగా మలచబోయే దేవతను శక్తివంతంగా చిత్రీకరించాలనే దృష్టికోణంలో ఆమె ఆలోచించింది. ఈ చిత్రంలోని మీనరూపం, స్త్రీరూపంతో పోలిస్తే మరిగుజ్జుగా ఉండే విధంగా కోరుకుంది. ఈ చిహ్నం యొక్క అధిదేవత "కొన్ని ఇతర చిహ్నాలలో కంటే ఎక్కువ మానవరూపం కలిగిఉండాలని" ఆమె ఆశించింది.

Image Courtesy: Instagram

English summary

Zodiac Signs Illustrations That Visualise Zodiac Signs As Goddess

An artist named 'Emilee Petersmark' has discovered a new appreciation for the mythology behind each zodiac sign. She has created beautiful illustrations of the zodiac signs as Goddesses, and this has delighted the astrology enthusiasts everywhere in the world. The paintings visualise the stunning series that reimagines every zodiac sign as a goddess.
Story first published: Friday, July 13, 2018, 7:00 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more