ఈ రాశుల వారితో డేటింగ్ చాలా కష్టం.. కన్యరాశి అమ్మాయితో కమిట్ అయ్యేటప్పుడు కాస్త జాగ్రత్త బాబూ

Written By:
Subscribe to Boldsky

ఈ జనరేషనల్ ప్రతి ఒక్కరికీ లవర్ ఉండడం కామన్. లవ్ లో పడ్డాక ఇప్పుడున్న యూత్ వెంటనే డేటింగ్ స్టార్ట్ చేస్తోంది. కొందరు డేటింగ్ తర్వాత పెళ్లి చేసుకుంటున్నా.. మరికొందరు డేటింగ్ లోనే ఫెయిల్ అయిపోతున్నారు.

ఎందుకంటే కొన్ని రాశుల అమ్మాయిలతో డేటింగ్ చేయడమంటే అంత సులవు ఏం కాదు. ఆ రాశి అమ్మాయిలు ఎవరో తెలుసుకోండి. మీ గర్ల్ ఫ్రెండ్ ది కూడా అదే రాశి అయితే కాస్త జాగ్రత్తపడండి. ఆమెతో డేటింగ్ లో ఉన్నప్పుడు కాస్త జాగ్రత్తగా వ్యవహరించి మీ ప్రేమను పెళ్లి దాకా తీసుకెళ్లండి.

కన్య: ఆగస్టు 24 సెప్టెంబర్ 23

కన్య: ఆగస్టు 24 సెప్టెంబర్ 23

కన్య రాశి వారితో డేటింగ్ కాస్త కష్టంగానే ఉంటుంది. ఈ రాశి అమ్మాయిలతో మీరు డేటింగ్ చేయాలంటే వారిని చాలా రకాలుగా మీరు అర్థం చేసుకోవాలి. వారి మనస్సు అర్థం చేసుకోవడం కాస్త కష్టం.

కన్యరాశి

కన్యరాశి

వీరు మీతో డేటింగ్ చేస్తున్నంత సేపు మీపై ధ్యాస పెట్టకుండా మీలో తప్పులను వెదికే పనిలో పడతారు. దాంతో మీరు డేటింగ్ పై ఎక్కువగా ఇన్ ట్రెస్ట్ పెట్టలేరు.

చుక్కలు చూపెడతారు

చుక్కలు చూపెడతారు

కన్య రాశి అమ్మాయిలు మీతో ఫస్ట్ డేటింగ్ కు ఒకే అన్నా తర్వాత మీకు చుక్కలు చూపెడతారు. రోజుకో రూల్ తీసుకొస్తారు. ఫస్ట్ లో మీరు కూడా కన్యరాశి అమ్మాయితో కాస్త ఎంజాయ్ చేస్తారు.

కమిట్ అయ్యేటప్పుడు కాస్త జాగ్రత్త

కమిట్ అయ్యేటప్పుడు కాస్త జాగ్రత్త

కానీ రానురాను కన్యరాశి అమ్మాయి అధికారం చెలాయించడాన్ని మీరు తట్టుకోలేరు. అందువల్ల కన్యరాశి అమ్మాయితో కమిట్ అయ్యేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి.

వృశ్చిక రాశి : అక్టోబర్ 24- నవంబర్ 22

వృశ్చిక రాశి : అక్టోబర్ 24- నవంబర్ 22

వృశ్చిక రాశి అమ్మాయితో మీరు డేటింగ్ స్టార్ట్ చేస్తున్నట్లయితే మీరు కొన్ని విషయాలు గమనించి ఉంటారు. వృశ్చిక రాశి వారు ఒక్కోసారి చాలా ప్రశాంతంగా మాట్లాడతారు. మరుక్షణమే మళ్లీ మీపై కోపం పెంచుకుంటారు. అందుకే బాస్ వృశ్చిక రాశి అమ్మాయితో డేటింగ్ చేసే ముందు కాస్త ఆలోచించు.

వృశ్చికం

వృశ్చికం

వృశ్చిక రాశి అమ్మాయిలు ఎక్కువగా తమని తాము ఇష్టపడతారు. తన బాయ్ ఫ్రెండ్ ఎక్కువగా తనపై ప్రేమ చూపాలని కోరుకుంటారు. ప్రేమ కాస్త తక్కువైనా తట్టుకోలేరు. ఉగ్రరూపాన్ని చూపిస్తారు. ఫలానా టైమ్ కు కలుస్తానని చెప్పి కలవకుండా వేరే పనిలో మీరు బిజీలో ఉన్నారనుకో మీకు ఆ రోజు సినిమా కనపడుతుంది.

ధనుస్సు రాశి: నవంబర్ 23- డిసెంబర్ 22

ధనుస్సు రాశి: నవంబర్ 23- డిసెంబర్ 22

ధనుస్సు రాశి అమ్మాయిలు ఒక్కసారి కమిట్ అయితే ఎవ్వరి మాట వినరు. అయితే ధనుస్సు రాశి అమ్మాయిలతో ఫస్ట్ మీరు డేటింగ్ స్టార్ చేసిన టైమ్ లో కాస్త ఇబ్బందులుపడతారు. రానురాను ఇక ఆ అమ్మాయి మీపై చూపే ప్రేమను మీరు తట్టుకోలేరు. ఒక్కసారి ధనుస్సు రాశి అమ్మాయి ఒక అబ్బాయిని అతని కోసం ఏదైనా చెయ్యడానికి రెడీ అయి ఉంటుంది.

మకరరాశి : డిసెంబర్ 23- జనవరి 20

మకరరాశి : డిసెంబర్ 23- జనవరి 20

మకరరాశి అమ్మాయిలు ఈజీగా లవ్ లో పడిపోతుంటారు. అయితే వీరితో డేటింగ్ మాత్రం కాస్త కష్టమే. వీరు ప్రతీదాన్ని కాస్త మెథడాలికల్ గా, లాజిక్ గా ఆలోచిస్తారు. మీతో డేటింగ్ కు కమిట్ అయ్యే ముందు మకరరాశి అమ్మాయిపై నీపై ఒక పీహెచ్ డీ చేసేస్తుంది. తర్వాత తన కమిట్ అవుతుంది. అయినా కూడా డేటింగ్ సమయంలో ఆమె వల్ల మీకు చాలా రకాల ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది.

కుంభరాశి : జనవరి 21-ఫిబ్రవరి 18

కుంభరాశి : జనవరి 21-ఫిబ్రవరి 18

కుంభరాశి అమ్మాయిలు చాలా స్వేచ్ఛగా ఉండాలని అనుకుంటారు. కుంభరాశి అమ్మాయి తనపై ఎవరైనా పెత్తనం చెలాయిస్తే అస్సలు ఒప్పుకోదు. ఈ రాశి అమ్మాయితో డేటింగ్ కాస్త కంఫర్ట్ బుల్ గా ఉండదు. కుంభరాశి అమ్మాయి ఎక్కువగా తనను తాను ఎక్కువగా ప్రేమిస్తుంది.

English summary

zodiac signs that are most difficult to date

zodiac signs that are most difficult to date.. According to astrology, many individuals have negative astrological personality traits. These traits can make it almost impossible for anyone to deal with them, for example, date them!
Story first published: Wednesday, February 14, 2018, 11:30 [IST]