For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఓ మైగాడ్.! ఆమె శరీరాన్ని 27000 ముక్కలు చేశారా?ఎందుకు?ఎప్పుడు?!

|

గత దశాబ్ద కాలంలో సైన్సులో అపారమైన పురోగతి కనిపించింది అన్నది జగమెరిగిన సత్యం. అనేక వ్యాధులకు చికిత్స కనుగొనడం దగ్గర నుండి, రోగ నిరోధక శక్తిని పెంచే సమ్మేళనాల గురించిన అవగాహన వరకు అనేక పరిశోధనలు జరిగి అద్భుతమైన ఫలితాలను రాబట్టడం జరిగింది.

విజ్ఞాన శాస్త్ర రంగంలో సరికొత్తగా జరుగుతున్న వాటి గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని ప్రతిఒక్కరికీ ఒక కోరిక ఉంటుంది. క్రమంగా ఆ ప్రయోగాలు, మానవ శరీర౦ మీద చేసినప్పుడు ఆ పరిశోధనలు మరి౦త ఆసక్తికర౦గా తయారవుతాయి. అవునా?

వైద్య విద్యార్థులు అభ్యాస సాధన కోసం, మరియు మానవ శరీరం గురించిన మరిన్ని విషయాలను అన్వేషించే క్రమంలో భాగంగా కొందరు స్వచ్చందంగా తమ తమ శరీరాలను మెడికల్ కాలేజీ, లేదా కొన్ని ప్రత్యేకించిన సంస్థలకు దానమివ్వడం జరుగుతుంటుంది. ఆ క్రమంలో భాగంగా, ఒక మహిళ శాస్త్ర పరిశోధనల నిమిత్తం, తన శరీరాన్ని మెడికల్ కాలేజీ విద్యార్ధులకు దానం చేసింది. దానం చేయడమే కాకుండా చరిత్రగా చెప్పుకునేలా చేసింది.

దీనికి సంబంధించిన మరిన్ని వివరాల కోసం వ్యాసంలో ముందుకు సాగండి.

ఆమె చరిత్ర తిరగరాద్దామని భావించింది!

ఆమె చరిత్ర తిరగరాద్దామని భావించింది!

ఆమె చనిపోయే నాటికి 87 ఏళ్ల వయసున్న సుసాన్ పాటర్, తాను లేదా కనీసం తన శరీరమైనా ఒక చరిత్ర సృష్టించాలని భావించింది. టైటానియం హిప్ (హిప్ రీప్లేస్మెంట్ శస్త్ర చికిత్స జరిగింది) కూడా ఉన్న మొట్ట మొదటి దానం చేయబడిన శరీరంగా మిగిలిపోతుంది. ఆ శరీరం శీతలీకరించబడుతుంది, మరియు అధ్యయనం కోసం ఉపయోగించబడుతుంది.

ఆమె అమరజీవిగా నిలవాలనుకుంది :

ఆమె అమరజీవిగా నిలవాలనుకుంది :

వైద్య విద్యార్థులకు తన దేహాన్ని మెడికల్ స్టూడెంట్స్ పరిశోధనలకు ఉపయోగపడాలని స్పష్టంగా కోరుకుంది. ఈ కారణంగా ఆమె జీవితంలో మిగిలిన 15 సంవత్సరాలను అధ్యయనం చేసేలా కోరుకుంది. ఈ లోకంలో తాను లేకపోయినా, తన జీవితం నలుగురికి ఉపయోగపడాలని భావించింది. అదే నిజమైన జీవితం అని ఆమె ఉద్దేశం కూడా. క్రమంగా ఆమె చనిపోయిన, నాలుగేళ్ళ కాలంలోనే ఆమె జీవితంలోని ప్రతి అంశమూ పాఠ్యాoశాలుగా కూడా మారిపోయాయి. అనేకమంది పరిశోధకులకు ఎన్నో రకాలుగా ఆ శరీరం ఉపయోగపడింది.

ఆమె శరీరం 27,000 ముక్కలుగా చేయబడింది :

ఆమె శరీరం 27,000 ముక్కలుగా చేయబడింది :

27,000 ముక్కలుగా ఆమె శరీరాన్ని విభజించడం ఒక అనూహ్యమైన ప్రాజెక్టుగా మెడిక్స్ అభివర్ణిస్తున్నారు. March 9, 2017 న ఈ శరీరాన్ని విభజించడం జరిగింది. ఈ ముక్కల అంచులు, మానవుని కన్ను సైతం గుర్తించడానికి అధిక సమయం తీసుకునేలా 3 రెట్లు చిన్నవిగా ఉంటాయని చెప్పబడింది. అవి ఒక కంప్యూటర్లోకి స్కాన్ చేయబడ్డాయి, అవి ఆమె శరీరాన్ని, ఒకరకమైన స్క్రోలబుల్ డిజిటల్ రికార్డుగా ఏర్పరుస్తాయి.

నేషనల్ జియోగ్రాఫిక్ చానెల్ వారు, ఆమె జీవన ప్రయాణాన్ని డాక్యుమెంటరీ చేశారు :

నేషనల్ జియోగ్రాఫిక్ చానెల్ వారు, ఆమె జీవన ప్రయాణాన్ని డాక్యుమెంటరీ చేశారు :

తన జీవితం గురించి పరిశోధకులకు పూర్తిస్థాయిలో తెలియజేసేలా, ఆమె కోరుకున్న విధంగా, నేషనల్ జియోగ్రాఫికల్ చానెల్ వారు 16 సంవత్సరాలపాటు సుసాన్ చివరి జీవన ప్రయాణాన్ని పర్యవేక్షిస్తూ ఒక అద్భుతమైన డాక్యుమెంటరీగా చేసింది. ఫిబ్రవరి 16 2015 న మరణించిన తర్వాత, ఆమె శరీరాన్ని మైనస్ 15 డిగ్రీల ఫారెన్ హీట్ ఉష్ణోగ్రత ఉండే ఫ్రీజర్లో నిల్వ చేయడం జరిగింది. క్రమంగా ఆమె శరీరం ఆ ఫ్రీజర్లోనే రెండేళ్ల పాటు ఉండిపోయింది. 2017లో మరలా ఆమె శరీరాన్ని వెలికి తీసి ప్రాజెక్ట్ చేపట్టడం జరిగింది.

ఆమె చనిపోయిన తర్వాత …

ఆమె చనిపోయిన తర్వాత …

సుసాన్ చనిపోయిన తర్వాత, వైద్య పరిశోధనల కోస౦ మృతదేహాన్ని భద్రపరచినప్పటి ను౦డి కొన్ని భద్రతాపరమైన చర్యలను, మరియు పరిశోధనలను వేగ౦గా చేయవలసి వచ్చి౦ది.

తాను బ్రతికున్నంత కాలం "డోనార్ కార్డ్" తనతోనే ఉంచుకుని తిరిగేది. క్రమంగా సుసాన్, తన నిర్జీవ శరీరం ఎక్కడ ఎవరికి దొరికినా, 4 గంటల లోపునే నిల్వచేసేందుకు చర్యలను ప్రారంభించవలసి ఉంటుంది.

ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆసక్తికర విషయాలతో పాటు, మేకప్, ఫాషన్, ఆరోగ్య, జీవనశైలి, ఆహార, మాతృ శిశు సంబంధ, వ్యాయామ, లైంగిక, ఆద్యాత్మిక, జ్యోతిష్య, హస్త సాముద్రిక, తదితర అంశాల కోసం బోల్డ్స్కై పేజీని తరచూ సందర్శించండి. ఈ వ్యాసంపై మీ అభిప్రాయాలను, వ్యాఖ్యలను క్రింద వ్యాఖ్యల విభాగంలో తెలియజేయండి

English summary

87-Year-Old Woman Donated Her Body So Doctors Could Slice It into 27,000 Pieces

Here are the details of the woman who donated her body for research purpose after death. Check out the details of the same.
Desktop Bottom Promotion