For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Asha Kandra :ఒకప్పుడు ఆమె స్వీపర్.. ఇప్పుడు డిప్యూటీ కలెక్టర్... సినిమా ట్విస్టులను మించి ఆశా జీవితం...

|

ఈ లోకంలో కృషి, పట్టుదల, సాధించాలనే తపన ఉంటే చాలు మనిషి ఏదైనా సాధించగలడు. ఈ విషయం ఎన్నోసార్లు నిరూపించబడింది. కానీ ఇప్పట్లో కొందరికి ఏదైనా చిన్న కష్టం వస్తే చాలు.. ఎవ్వరికీ లేనన్నీ ఇబ్బందులు తమకే వచ్చినట్టు.. తాము వాటిని అధిగమించలేమో అని తెగ బాధపడుతూ ఉంటారు.

PC : Twitter

అలాంటి వాటి నుండి బయటపడేందుకు బంధువులు, స్నేహితుల సహాయం కోసం ఆశగా ఎదురుచూస్తు ఉంటారు. కానీ వాటిని ఎలా అధిగమించాలా అనే ప్రయత్నం కూడా చేయరు కొందరు. కానీ ఓ మహిళ మాత్రం కష్టాలనే కడలిని పట్టుదలతో దాటేసింది.

Pc : Twitter

వయసు, పెళ్లి, పిల్లలు ఇలాంటివేవీ అడ్డు కాదని నిరూపించింది ఆమె. ఒకప్పుడు స్వీపర్ గా రోడ్లు ఊడ్చిన ఆమె.. ఇప్పుడు డిప్యూటీ కలెక్టర్ కొత్త రికార్డు సృష్టించింది.. పెళ్లై పిల్లలు పుట్టాక.. భర్త నుండి దూరమై.. స్వీపర్ గా పనిచేస్తూ.. ఉన్నత ఉద్యోగం స్థాయికి ఎదిగిన క్రమం సినిమా ట్విస్టులను మించి ఉంది. తనకంటూ చరిత్రలో ఒక పుటని లిఖించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె జీవితంలో పడిన కష్టాలు.. వాటిని అధిగమించిన తీరు.. ఆమె ఎదిగిన క్రమం గురించి తెలుసుకుందాం...

కష్టాలకు కుంగిపోలేదు..
రాజస్థాన్ లోని జోధ్ పూర్ కు చెందిన ఓ మహిళ పెళ్లై ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత ఎనిమిదేళ్లకు భర్త నుండి విడిపోయింది. అయితే భర్తకు దూరమయ్యానని.. సమాజం నుండి ఎదురయ్యే సూటి పోటి మాటలకు, ఆ తర్వాత వచ్చిన కష్టాలను చూసి ఆమె కుంగిపోలేదు. తనను చిన్న చూపు చూసిన సమాజానికి సమాధానం చెప్పాలని నిర్ణయించుకున్నారు. భర్త విడిచిపెట్టినప్పటికీ పిల్లలను పెంచే బాధ్యతను తీసుకుంది. భర్తను

మున్సిపాలిటీ ఉద్యోగంలో..
రాజస్థాన్ జోధ్ పూర్ లో మున్సిపల్ కార్పొరేషన్లో మహిళా స్వీపర్ చేరింది. ఆ సమయంలోనే ప్రభుత్వ ఉద్యోగులను దగ్గర నుండి చూసింది. వారికి అందరూ ఇచ్చే మర్యాద, గౌరవం, హోదా చూసి తాను కూడా అలా ఎందుకు కాకూడదు అని ప్రశ్నించుకుంది. అంతే అనుకున్నదే తడవుగా ఎలాగైనా చదువుకోవాలని నిర్ణయించుకుంది.

ఉద్యోగిగా డ్యూటీ చేస్తూనే..
ఓ వైపు ఉద్యోగిగా డ్యూటీ చేస్తూనే.. మరోవైపు చదువుకోవడం ప్రారంభించింది. మూడేళ్ల కాలంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. ఆ తర్వాత ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన పోటీ పరీక్షలను రాయడం ప్రారంభించారు. ఈ నేపథ్యంలో 2018 సంవత్సరంలో RAS పరీక్షలు రాశారు. అయితే కరోనా కారణంగా ఈ పరీక్షల ఫలితాలు ఆలస్యంగా విడుదలయ్యాయి.

ఉద్యోగం పర్మినెంట్..
తాజాగా విడుదలైన ఫలితాల్లో ఆశా 728వ ర్యాంకు సాధించారు. మరో ట్విస్ట్ ఏంటంటే.. ఆమె ఫలితాలు విడుదల అవ్వడానికి సరిగ్గా 12 రోజులకు ముందే తన స్వీపర్ ఉద్యోగం పర్మినెంట్ అయ్యింది. మరోవైపు ఆశా ఆర్ఎఎస్ పరీక్ష ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ మూడు విభాగాల్లోనూ సత్తా చాటారు. దీంతో తనకు డిప్యూటీ కలెక్టర్ పోస్టింగ్ కన్ఫార్మ్ అయ్యింది.

ప్రశంసల వర్షం..
అంతే ఒకప్పుడు స్వీపర్ గా పని చేసిన ఆమె జీవితం ఒక్కసారిగా పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు ప్రభుత్వ వాహనం, మంచి జీతం, సమాజంలో గౌరవం అన్నీ ఆమె చెంతకు చేరాయి. దీంతో ఆశా సాధించిన విజయం గురించి తెలుసుకున్న వారంతా ఆమెను అభినందిస్తున్నారు. పట్టుదల ఉంటే అసాధ్యాన్ని సుసాధ్యం చేయవచ్చని ఆశా మరోసారి నిరూపించారని అందరూ ప్రశంసిస్తున్నారు.

English summary

Asha Kandra, A Sweeper from Jodhpur Is Now a Deputy Collector; Here Is Her Inspiring Story in Telugu

Here we are talking about the asha kandra, a sweeper from jodhpur is now a deputy collector; Here is her inspiring story in telugu. Have a look
Story first published: Saturday, July 17, 2021, 11:17 [IST]