For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Bathukamma 2022: బతుకమ్మ సంబురం.. ఏ రోజు ఏ నైవేద్యం పెట్టాలో తెలుసా?

బతుకమ్మ పండుగను తొమ్మిది రోజుల పాటు జరుపుకుంటారు. 9 రోజులు 8 రకాల నైవేద్యాలు సమర్పిస్తారు. అవేంటో తెలుసుకుందాం.

|

Bathukamma 2022: బతుకమ్మ.. అచ్చమైన, స్వచ్ఛమైన తెలంగాణ పండుగ. ఈ పండుగ పూర్తిగా ప్రకృతితో మమేకమై ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడా లేని విధంగా పూలు పూజించే పండుగ బతుకమ్మ. పూలనే గౌరమ్మగా భావించి వాటిని మనసారా కొలిచే సంబురం బతుకమ్మ. తొమ్మిది రోజుల పాటు అంగరంగ వైభవంగా చేసుకునే బతుకమ్మ అంటే అతివలకు ఎంతో ఇష్టం.

bathukamma

బతుకమ్మ పండుగను తొమ్మిది రోజుల పాటు జరుపుకుంటారు. బొడ్డెమ్మ పండుగ తరువాత, ఇది భాద్రపద అమావాస్యకు రెండు రోజుల ముందు జరుపుకుంటారు. ఇది వర్షాకాలం ముగింపును సూచిస్తుంది. పండుగ చివరి రోజు ఆశ్వయుజ అష్టమి తిథిని జరుపుకుంటారు. ఆ రోజునే దుర్గాష్టమి అంటారు. మహిళలు తొమ్మిది రోజులూ సంప్రదాయ దుస్తులతో బతుకమ్మ చుట్టూ ఆడుతూ పాడుతూ పండుగను జరుపుకుంటారు.

ఈ పూల పండుగ భాద్రపద అమావాస్య రోజున ప్రారంభం అవుతుంది. తెలంగాణలో ఈ రోజును పెతర అమాస లేదా పితృ అమావాస్య అని కూడా అంటారు.

ఏ రోజు ఏ బతుకమ్మ:

ఏ రోజు ఏ బతుకమ్మ:

  1. ఎంగిలి పువ్వు బతుకమ్మ - ఆదివారం, సెప్టెంబర్ 25
  2. అటుకుల బతుకమ్మ - సోమవారం, సెప్టెంబర్ 26
  3. ముద్దపప్పు - మంగళవారం, సెప్టెంబర్ 27
  4. నానా బియ్యం - బుధవారం, సెప్టెంబర్ 28
  5. అట్ల బతుకమ్మ - గురువారం, సెప్టెంబర్ 29
  6. అలిగిన బతుకమ్మ - శుక్రవారం, సెప్టెంబర్ 30
  7. వేపకాయల బతుకమ్మ - శనివారం, అక్టోబర్ 1
  8. వెన్నె ముద్దల బతుకమ్మ - ఆదివారం, అక్టోబర్ 2
  9. సద్దుల బతుకమ్మ - సోమవారం, అక్టోబర్ 3
ఏ రోజు ఏ నైవేద్యం పెట్టాలో తెలుసా?

ఏ రోజు ఏ నైవేద్యం పెట్టాలో తెలుసా?

ప్రతి రోజు బతుకమ్మ పండుగను వేర్వేరు పేర్లతో పిలుస్తారు. అలాగే ప్రతి రోజు వేర్వేరు నైవేద్యాలను అందిస్తారు.

1. ఎంగిలి పూల బతుకమ్మ

1. ఎంగిలి పూల బతుకమ్మ

భాద్రపద అమావాస్య - బతుకమ్మ యొక్క మొదటి రోజును ఎంగిలి పువ్వు బతుకమ్మ అని పిలుస్తారు. పెత్రమాస రోజున బతుకమ్మ మొదలు అవుతుంది. ఆరోజున దాదాపు ప్రతి ఇంట్లో తమ పూర్వీకులకు అన్నదానం చేస్తుంటారు. సాయంత్రం సమయంలో బతుకమ్మను పేర్చి, బతుకమ్మ ఆడతారు. అందుకే ఎంగిలి పూల బతుకమ్మ అని అంటారు.

మొదటి రోజు బతుకమ్మ నైవేద్యంగా బియ్యం, నువ్వులు, నూకలు సమర్పిస్తారు.

2. అటుకుల బతుకమ్మ

2. అటుకుల బతుకమ్మ

ఆశ్వయుజ పాడ్యమి (ఆశ్వయుజ మాసం మొదటి రోజు) - బతుకమ్మ రెండో రోజును అటుకుల బతుకమ్మ అంటారు. ఈ రోజున భక్తులు అటుకులను నైవేద్యంగా సమర్పిస్తారు.

సప్పిడి పప్పు, బెల్లం, అటుకులతో నైవేద్యం తయారు చేసి సమర్పిస్తారు.

3. ముద్దపప్పు బతుకమ్మ

3. ముద్దపప్పు బతుకమ్మ

ఆశ్వయుజ ద్వితీయ నాడు (ఆశ్వయుజ మాసం రెండవ రోజు) బతుకమ్మను ముద్దపప్పు బతుకమ్మ అని పిలుస్తారు. ఎందుకంటే బతుకమ్మను ముద్ద చామంతి లేదా ముద్దబంతి పువ్వులతో పాటు తంగేడు పువ్వు & గొనుగు పువ్వుతో తయారు చేస్తారు.

ఈ రోజు బతుకమ్మకు - అన్నం & పప్పు (ముద్దపప్పు, అన్నం) నైవేద్యంగా సమర్పిస్తారు.

4. నానబియ్యం బతుకమ్మ

4. నానబియ్యం బతుకమ్మ

ఆశ్వయుజ తృతీయ నాడు - బతుకమ్మ యొక్క నాల్గవ రోజు భక్తులు నానబెట్టిన బియ్యం, బెల్లం సమర్పిస్తారు కాబట్టి నానబియ్యం బతుకమ్మ అని పిలుస్తారు.

నానబెట్టిన బియ్యం, పాలు, బెల్లం కలిపి నైవేద్యం చేసి సమర్పిస్తారు.

5. అట్ల బతుకమ్మ

5. అట్ల బతుకమ్మ

ఆశ్వయుజ చతుర్థి నాడు - ఈ రోజు బతుకమ్మను అట్ల బతుకమ్మ అంటారు. మహిళలు బతుకమ్మకు నైవేద్యంగా అట్లు, దోసెలను సమర్పిస్తారు. అందుకే అట్ల బతుకమ్మ అని పిలుస్తారు.

అట్లు లేదా దోసెలను నైవేద్యంగా సమర్పిస్తారు.

6. అలిగిన బతుకమ్మ

6. అలిగిన బతుకమ్మ

ఆశ్వయుజ పంచమి నాడు - ఆరో రోజు అలిగిన బతుకమ్మగా జరుపుకుంటారు. ఈ రోజు గౌరమ్మ అలుగుతుందని నమ్ముతారు. ఈ రోజునే లలిత పంచమిగా కూడా జరుపుకుంటారు.

ఈ రోజు ఎలాంటి నైవేద్యాన్ని సమర్పించరు.

7. వేపకాయల బతుకమ్మ

7. వేపకాయల బతుకమ్మ

ఆశ్వయుజ షష్ఠి నాడు - ఈ రోజును దుర్గా షష్టిగా జరుపుకుంటారు. నైవేద్యం వేపకాయ ఆకారంలో నైవేద్యాన్ని సమర్పిస్తారు. కాబట్టి ఈ రోజును వేపకాయల బతుకమ్మ అని పిలుస్తారు.

బియ్యం పిండిని వేయించి వేప పండ్లుగా తయారు చేసి వాటిని అమ్మ వారికి సమర్పిస్తారు.

8. వెన్న ముద్దల బతుకమ్మ

8. వెన్న ముద్దల బతుకమ్మ

ఆశ్వయుజ సప్తమి నాడు - బతుకమ్మను ఎనిమిదో రోజు వెన్న ముద్దల బతుకమ్మ అంటారు. ఈ రోజున భక్తులు వెన్నతో నైవేద్యం సమర్పిస్తారు.

నువ్వులు, బెల్లం, నెయ్యి, వెన్నతో చిన్న చిన్న ఉండలుగా తయారు చేస్తారు. వాటిని అమ్మవారికి సమర్పిస్తారు.

9. సద్దుల బతుకమ్మ

9. సద్దుల బతుకమ్మ

ఆశ్వయుజ అష్టమి నాడు - బతుకమ్మ పండుగను సద్దుల బతుకమ్మ లేదా పెద్ద బతుకమ్మ అని పిలుస్తారు. ఈ రోజున బతుకమ్మను ఎనిమిది రోజుల కంటే పెద్ద పరిమాణంలో వివిధ పూలతో తయారు చేస్తారు.

సద్దుల బతుకమ్మ రోజున 5 రకాల నైవేద్యాలు తయారు చేసి సమర్పిస్తారు.

  • పెరుగన్నం
  • నిమ్మకాయ పులిహోర
  • చింతపండు పులిహోర
  • కొబ్బరి అన్నం
  • నువ్వుల అన్నం
  • మలీద ముద్దలు( చపాతీ, చక్కెరతో చేసే బాల్స్)
  • తొమ్మిది రోజుల పాటు బతుకమ్మను పూజించిన మహిళలు.. చివరి రోజైన సద్దుల బతుకమ్మ నాడు పెద్ద పరిమాణంలో చేసిన బతుకమ్మలను చెరువులో నిమజ్జనం చేస్తారు. బతుకమ్మలపై ఉంచే పసుపుతో తయారు చేసిన గౌరమ్మను మహిళలు చెంపలకు, పుస్తెలకు పూసుకుంటారు.

2022లో బతుకమ్మ పండుగ సెప్టెంబర్ 25 (భాద్రపద అమావాస్య)న ప్రారంభమై అక్టోబర్ 3 (ఆశ్వయుజ అష్టమి) సద్దుల బతుకమ్మతో ముగుస్తుంది.

English summary

Bathukamma Festival 2022: Nine days of festival and day wise recipes to offer in Telugu

read on to know Bathukamma Festival 2022: Nine days of festival and day wise recipes to offer in Telugu
Story first published:Thursday, September 22, 2022, 12:20 [IST]
Desktop Bottom Promotion