For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Brother's Day 2021: సోదరుల దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారో తెలుసా...

అంతర్జాతీయ అన్నదముల దినోత్సవం యొక్క ప్రాముఖ్యత ఏంటో తెలుసుకుందామా

|

ప్రతి సంవత్సరం ప్రపంచ వ్యాప్తంగా మే 24వ తేదీన అంతర్జాతీయ అన్నదమ్ముల దినోత్సవం (International Brother's Day) జరుపుకుంటారు.

Brothers Day 2021 Date, History, Significance And All You Need To Know in Telugu

యునైటెడ్ స్టేట్స్ అమెరికా(USA)తో పాటు ఇతర దేశాల్లో ఈ అన్నదమ్ముల వేడుకను జరుపుకుంటారు. మదర్స్ డే, ఫాదర్స్ డే, ఉమెన్స్ డే, సిబ్లింగ్స్ డే ఎలా జరుపుకుంటారో.. అదే విధంగా బ్రదర్స్ డేను కూడా జరుపుకుంటారు.

Brothers Day 2021 Date, History, Significance And All You Need To Know in Telugu

ఈ నేపథ్యంలో అంతర్జాతీయ సోదరుల దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారు.. ఇది ఎప్పుడు ప్రారంభమైంది.. దీని యొక్క ప్రాముఖ్యత మరియు చరిత్ర ఏంటి అనే పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...

2005 నుండి..

2005 నుండి..

చరిత్రను పరిశీలిస్తే, ప్రపంచవ్యాప్తంగా 2005 సంవత్సరం, మే 24వ తేదీ నుండి ఈ అంతర్జాతీయ అన్నదమ్ముల దినోత్సవాన్ని అధికారికరంగా జరుపుకోవడం ప్రారంభించారు. అలబామకు చెందిన సిరామిక్ కళాకారుడు, శిల్పి, రచయిత సి డేనియల్ రోడ్స్ మొదటగా ఈరోజును జరుపుకోవడం ప్రారంభించారు. ఏప్రిల్ మాసంలో ప్రతి ఏటా సిబ్సింగ్స్ డే ని ఎలా జరుపుకుంటారో.. అదే మాదిరిగా అన్నదమ్ముల దినోత్సవాన్ని జరుపుకుంటారు.

కొన్నిరోజుల్లో సెలవులు..

కొన్నిరోజుల్లో సెలవులు..

అయితే తొలిరోజుల్లో ఈ వేడుకలను కేవలం అమెరికాలోనే జరుపుకున్నారు. ఆ తర్వాత క్రమంగా ప్రపంచంలోని ఇతర దేశాలు కూడా జరుపుకోవడం ప్రారంభించాయి. మరికొన్ని దేశాలలో ఈ అన్నదమ్ముల రోజున అధికారికంగా సెలవు రోజుగా పాటిస్తారు.

సోదరుల ప్రాముఖ్యత..

సోదరుల ప్రాముఖ్యత..

ఈ ప్రపంచంలోని ప్రతి ఒక్కరికీ రక్త సంబంధం లేకపోయినా ఆత్మీయంగా సోదర భావంతో జరుపుకునే ప్రత్యేకమైన రోజు ఇది. మెరికన్ సిట్కామ్ బ్రదర్స్, డిస్నీ ది సూట్ లైఫ్ ఆఫ్ జాక్ & కోడి, HBO బ్యాండ్ ఆఫ్ బ్రదర్స్ వంటి చిత్రాలు, నవలలు, నాటకాలు టెలివిజన్ కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉంటారు. ఈరోజున తమకు ఇష్టమైన సోదరులకు ప్రేమను వ్యక్తపరుస్తారు. ప్రస్తుత కాలంలో సోషల్ మీడియా ద్వారా తమ ప్రియమైన సోదరులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈరోజున తమ సోదరులకు నచ్చిన వంటకాలను చేయడం.. వారికి నచ్చిన వస్తువులను కానుకలుగా ఇవ్వడం చేస్తుంటారు.

అన్నదమ్ములతో గడపడం..

అన్నదమ్ములతో గడపడం..

మరి కొన్ని దేశాల్లో అన్నదమ్ముల దినోత్సవం రోజున కేవలం శుభాకాంక్షలు చెప్పడమే కాదు.. వారితో ఈరోజంతా సరదాగా గడపడం, వారితో కలిసి ఎక్కడికైనా మంచి టూరిస్ట్ ప్లేసుకు వెళ్లి ప్రత్యేక అనుభూతిని పొందుతుంటారు. తమ జీవితంలో సోదరుడి సహకారం ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటారు.

English summary

Brother's Day 2021 Date, History, Significance And All You Need To Know in Telugu

Here we are talking about the brother's day 2021 date, history, significance and all you need to know in Telugu. Have a look
Story first published:Monday, May 24, 2021, 13:07 [IST]
Desktop Bottom Promotion