For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

CDS General Bipin Rawat:సాధారణ సైనికుడి నుండి త్రివిధ దళాధిపతిగా రావత్ ప్రస్థానమిలా...

భారత ఆర్మీ జనరల్ బిపిన్ రావత్ కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

|

మన దేశ చరిత్రలోనే అతి ఘోరమైన హెలికాఫ్టర్ ప్రమాదం జరిగింది. డిసెంబర్ 8వ తేదీన బుధవారం ఉదయం భారతావని అంతా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఎందుకంటే డబుల్ ఇంజిన్ తో నడిచే అత్యంత శక్తివంతమైన ఎంఐ-17వీ5 హెలికాఫ్టర్ అది.

General Bipin Rawat: Interesting Facts About Indias First Chief of Defence Staff in in Telugu

అందులో ప్రయాణించింది భారత తొలి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్, ఆయన భార్య మధులికా రావత్ ఇతర రక్షణ సిబ్బంది. వీరు ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్ తమిళనాడు లోని నీలగిరి జిల్లాలోని కూనూరులో మధ్యాహ్నం సుమారు 12 గంటల సమయంలో ఒక్కసారిగా కుప్పకూలింది. ఉదయం పూట భారీగా కురుస్తున్న మంచులో ఈ ఘోర ప్రమాదం జరిగింది. దీంతో Mi-17V5 హెలికాప్టర్‌లో ప్రయాణిస్తున్న 13 మంది వ్యక్తులు మరణించారు. సూలూరు ఐఏఎఫ్ స్థావరం నుంచి వెల్లింగ్టన్‌లోని డిఫెన్స్ సర్వీసెస్ కాలేజీకి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. అయితే ఈ ప్రమాదం కెప్టెన్ వరుణ్ సింగ్ ఒక్కడే ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ సందర్భంగా భారతదేశపు మొదటి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

ఆయనొక ఉత్తేజం..

ఆయనొక ఉత్తేజం..

బిపిన్ లక్ష్మణ్ సింగ్ రావత్.. అందరికీ పరిచయమున్న పేరే. ఫోర్ స్టార్ జనరల్ గా సైనిక దళాలకు ఆయన ఒక ఉత్తేజంగా కనిపిస్తారు. ఎందుకంటే సాధారణ సైనికుడిగా ఆర్మీలో అడుగుపెట్టిన ఆయన అంచెలంచెలుగా ఎదుగుతూ వివిధ హోదాల్లో విధులు నిర్వర్తించారు. ఆర్మీ వ్యూహాల నుండి ఆపరేషన్లు సక్సెస్ చేయడంలో ఆయనది అందేవేసిన చేయి. ఓటమి లేని సైన్యాధికారిగా పేరు సంపాదించారు.

ఉత్తరాఖండ్ లో జననం..

ఉత్తరాఖండ్ లో జననం..

బిపిన్ రావత్ ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని పౌరీలో క్షత్రియ(రాజ్ పుత్) కుటుంబంలో 1958 మార్చి 26వ తేదీ జన్మించారు. మూడు తరాలుగా వారిది సైనిక కుటుంబం. ఆయన తండ్రి లక్ష్మణ్ సింగ్ రావత్ కూడ అంచెలంచెలుగా ఎదిగి లెఫ్టినెంట్ జనరల్, ఆర్మీ డిప్యూటీ చీఫ్ గా సేవలందించారు. 1971లో పాకిస్థాన్ తో జరిగిన యుద్ధంలోనూ పాల్గొన్నారు. రావత్ తాత కూడా యుద్ధంలో పాల్గొన్నట్లు తెలుస్తోంది. రావత్ తల్లి ఉత్తర కాశీకి చెందిన వారు. రావత్ భార్య మధులిక రాజే సింగ్. వీరికి ఇద్దరు కుమార్తెలు(క్రుతిక, తరుణి) ఉన్నారు.

రావత్ విద్యాభ్యాసం..

రావత్ విద్యాభ్యాసం..

బిపిన్ రావత్ డెహ్రాడూన్ లోని కాంబ్రియన్ హాల్ స్కూలు, సిమ్లా సెయింట్ ఎడ్వర్ట్ స్కూలులో ప్రాథమిక విద్యను పూర్తి చేశారు. అనంతరం పూణేలోని నేషనల్ డిఫెన్స్ అకాడమీలో చేరారు. ఆ తర్వాత డెహ్రాడూన్ లోని ఇండియన్ మిలిటరీ అకాడమీ(ఐఎంఎ)లో చేరారు. మళ్లీ తమిళనాడులోని వెల్లింగ్టన్ లో డిఫెన్స్ స్టాఫ్ కాలేజీ నుండి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. బుధవారం రోజున ఇదే కాలేజీలో ప్రసంగించేందుకు వెళ్తుండగా హెలికాఫ్టర్ ప్రమాదం చోటు చేసుకుంది.

మంచుకొండల్లో యుద్ధం..

మంచుకొండల్లో యుద్ధం..

మద్రాసు యూనివర్సిటీలో డిఫెన్స్ స్టడీస్ పై ఎం.ఫిల్ డిగ్రీ కూడా చేశారు. మిలిటరీ-మీడియా స్ట్రాటజిక్ స్టడీస్ పరిశోధన కోసం 2011లో మీరట్ లోని చౌదురి చరణ్ సింగ్ యూనివర్సిటీ ఆయనకు పిహెచ్ డీ కూడా ప్రదానం చేసింది. 1978 డిసెంబర్ 16వ తేదీన రావత్ గుర్ఖా రైఫిల్స్(11) ఐదో బెటాలియన్లో సైనికుడిగా చేరారు. అక్కడే మంచుకొండల్లో అత్యంత ఎత్తయిన శిఖరాల నడుమ జరిగే యుద్ధాల్లో ఎంతో అనుభవం గడించారు. సరిహద్దుల్లో కూడా ఉగ్రవాదుల వ్యతిరేక ఆపరేషన్లలో సుమారు పది సంవత్సరాల పాటు పని చేశారు. ఆ తర్వాత మేజర్ జనరల్ గా ప్రమోషన్ పొందారు.

సర్జికల్ స్ట్రయిక్స్ వ్యూహాకర్త..

సర్జికల్ స్ట్రయిక్స్ వ్యూహాకర్త..

2016 సంవత్సరంలో దాయాది దేశమైన పాకిస్థాన్ బార్డర్ ను దాటి.. పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోకి భారత సైన్యం చొరవడి వారి ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేయాలన్న వ్యూహాన్ని రచించిన వారిలో రావత్ కూడా ఉన్నారు. ఆ ఆపరేషన్ సక్సెస్ అయ్యేంత వరకు తనే దగ్గరుండి అన్నింటినీ పర్యవేక్షించారు. 2019 సంవత్సరంలోనూ ఫిబ్రవరిలో భారత యుద్ధ విమానాలు పాకిస్థాన్ లోని బాలాకోట్ లో జైషే మహమ్మద్ శిక్షణ శిబిరాన్ని కూల్చివేయంలో ఆయన కీలక పాత్ర పోషించారు. ఢిల్లీలోని రక్షణ కార్యాలయంలో ఉండి ఈ దాడిని పర్యవేక్షించారు. ఆ దాడి తర్వాత రావత్ పేరు దేశమంతా మార్మోగిపోయింది.

ఎన్నో అవార్డులు..

ఎన్నో అవార్డులు..

39 సంవత్సరాల పాటు సాగిన రావత్ సైనిక జీవితంలో ఎన్నో సాహస, ప్రతిభా పురస్కారాలను అందుకున్నారు. పరమ విశిష్ట సేవా పతకం, ఉత్తమ విశిష్ట సేవా పతకం, అతి విశిష్ట సేవా పతకం, యుద్ధ సేవా పతకం, సేనా పతకం, చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాప్ ప్రశంసాపత్రాలను రెండుసార్లు అందుకున్నాడు. అంతేకాదు రావత్ ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షక దళాలలో సభ్యుడు. తను ఐక్యరాజ్యసమితిలో ఉన్నప్పుడు రెండుసార్లు ఫోర్స్ కమాండర్ యొక్క ప్రశంసలు అందుకున్నాడు. ఆయన డెహ్రాడూన్‌లోని ఇండియన్ మిలిటరీ అకాడమీ నుండి స్వోర్డ్ ఆఫ్ హానర్ అవార్డును కూడా అందుకున్నాడు.

FAQ's
  • బిపిన్ రావత్ కెరీర్లో అందుకున్న అవార్డులెన్ని?

    39 సంవత్సరాల పాటు సాగిన రావత్ సైనిక జీవితంలో ఎన్నో సాహస, ప్రతిభా పురస్కారాలను అందుకున్నారు. పరమ విశిష్ట సేవా పతకం, ఉత్తమ విశిష్ట సేవా పతకం, అతి విశిష్ట సేవా పతకం, యుద్ధ సేవా పతకం, సేనా పతకం, చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాప్ ప్రశంసాపత్రాలను రెండుసార్లు అందుకున్నాడు. అంతేకాదు రావత్ ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షక దళాలలో సభ్యుడు. తను ఐక్యరాజ్యసమితిలో ఉన్నప్పుడు రెండుసార్లు ఫోర్స్ కమాండర్ యొక్క ప్రశంసలు అందుకున్నాడు. ఆయన డెహ్రాడూన్‌లోని ఇండియన్ మిలిటరీ అకాడమీ నుండి స్వోర్డ్ ఆఫ్ హానర్ అవార్డును కూడా అందుకున్నాడు.

  • బిపిన్ రావత్ తో పాటు ప్రమాదంలో మరణించిన తెలుగు బిడ్డ సాయితేజ ఏ ప్రాంతానికి చెందిన వారు?

    Mi-17V5 హెలికాప్టర్‌లో ప్రయాణిస్తున్న 13 మంది వ్యక్తుల్లో మన తెలుగు బిడ్డ సాయితేజ కూడా ఉన్నారు. తను ఈ ప్రయాణానికి సరిగ్గా గంట ముందే తన భార్య, పిల్లతో వీడియో కాల్ మాట్లాడారట. అంతలోనే ఈ ఘోరం జరిగిపోయింది. సాయితే ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లా నివాసి.

  • త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్ హెలికాఫ్టర్ ప్రమాదం ఎక్కడ, ఎప్పుడు జరిగింది?

    భారత తొలి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్, ఆయన భార్య మధులికా రావత్ ఇతర రక్షణ సిబ్బంది. వీరు ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్ తమిళనాడు లోని నీలగిరి జిల్లాలోని కూనూరులో ఒక్కసారిగా కుప్పకూలింది. ఉదయం పూట భారీగా కురుస్తున్న మంచులో ఈ ఘోర ప్రమాదం జరిగింది. దీంతో Mi-17V5 హెలికాప్టర్‌లో ప్రయాణిస్తున్న 13 మంది వ్యక్తులు మరణించారు.

English summary

General Bipin Rawat: Interesting Facts About India's First Chief of Defence Staff in in Telugu

CDS General Bipin Rawat: Here are a few little-known facts about the late four-star general of the Indian Army Bipin Rawat in Telugu. Read on.
Story first published:Thursday, December 9, 2021, 11:58 [IST]
Desktop Bottom Promotion