Latest Updates
-
నవరాత్రి స్పెషల్..ఉపవాసాల కోసం కరకరలాడే సగ్గుబియ్యం పాపడ్.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా -
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా? -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.! -
ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఏదో తెలుసా? -
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి! -
‘పరగడుపున వెల్లుల్లి’ ట్రెండ్.. అన్ని రోగాలకు ఇదే పరిష్కారమా.?
చెస్ ఛాంపియన్ ఆనంద్ గురించి ఆసక్తికరమైన విషయాలు..
ప్రతి గేమ్ లో ప్రతి ఆటగాడికి రెండే ఆప్షన్లు ఉంటాయి. ఒకటి ఓడిపోవటం.. రెండోది ఓడిపోవటం.. ఎవ్వరైనా అవకాశం వచ్చినప్పుడు వాటిని వినియోగించుకుంటే వారినే విజయం వరిస్తుంది.
చదరంగం అంటేనే ఎత్తుకు పై ఎత్తులు వేయడం.. ప్రత్యర్థిని చిత్తు చేయడం.. అలాంటి ఆటలో ప్రావీణ్యత సంపాదించడమే చాలా కష్టం. అందుకు చాలా సహనం కావాలి. మన ప్రత్యర్థి ఏమి ఆలోచిస్తున్నారో.. ఎలా ఆలోచిస్తున్నారో వారి హావాభావాలను బట్టి.. వారు చెస్ గేమ్ లో ఏ కాయిన్ ను జరుపుతున్నారో చూసుకోవాలి. వారి రూటులోనే వెళ్లి వారిని బురిడీ కొట్టించాలి. అంటే మన మెదడుకు చాలా పదును పెట్టాలి. అలా విశ్వనాధన్ ఆనంద్ తన చిన్నప్పుడే తన మెదడుకు చాలా పదును పెట్టాడు. చిన్ననాటి నుండే చెస్ ఆటలో చాలా ప్రావీణ్యత సంపాదించాడు.
చిన్నప్పుడే తన తల్లిదండ్రులతో కలిసి చెస్ ఆడేవాడు. తన చిన్న పిల్లవాడుగా ఉన్నప్పుడే వారి కుటుంబ సభ్యులందరినీ ఓడించేవాడట. ఈరోజు డిసెంబర్ 11వ తేదీన ఆనంద్ పుట్టినరోజు సందర్భంగా ఆయన గురించి మరికొన్ని ఆసక్తికరమైన వాస్తవాలను తెలుసుకుందాం...

రెండే ఆప్షన్లు..
ప్రతి గేమ్ లో ప్రతి ఆటగాడికి రెండే ఆప్షన్లు ఉంటాయి. ఒకటి ఓడిపోవటం.. రెండోది ఓడిపోవటం.. ఎవ్వరైనా అవకాశం వచ్చినప్పుడు వాటిని వినియోగించుకుంటే వారినే విజయం వరిస్తుంది. అవకాశాలను చేజార్చుకుంటే వారికి ఓటమే మిగులుతుంది. మళ్లీ అలాంటి అవకాశం కోసం ఎంతో ఓపికగా ఎదురుచూడాలి. చెస్ గేమ్ లోనూ అంతే కౌంట్ డౌన్ మొదలయ్యాక చాలా తెలివిగా ఎత్తులు వేయాలి. అలా 2007 నుండి 2013 వరకు వరుసగా వరల్డ్ ఛాంపియన్ గా నిలిచాడు ఆనంద్. భారతదేశంలో చెస్ ఆట అంటే ఆనంద్ కు ముందు ఒకలా.. విశ్వనాథన్ ఆనంద్ తర్వాత విజయపరంపర అనేలా మార్చేశాడు...

ఆనంద్ జననం..
విశ్వనాథన్ ఆనంద్ 1969 డిసెంబర్ 11వ తదేీన తమిళనాడులోని మయిలడుతురై ప్రాంతంలో విశ్వనాథన్ అయ్యర్, సుశీల దంపతులకు జన్మించారు. ఆనంద్ తండ్రి దక్షిణ మధ్య రైల్వేలో జనరల్ మేనేజర్ గా పని చేసి రిటైర్ అయ్యారు. ఆయన ఉద్యోగ రీత్యా బీహార్ లో ఉండేవారు. అందుకే ఆనంద్ తన విద్యాభ్యాసాన్ని అంతా అక్కడే కొనసాగించారు.

తల్లే తొలి గురువు...
విశ్వనాథన్ ఆనంద్ కు చెస్ కు చిన్నప్పటి నుండే ఆసక్తి కలగడానికి ఆయన తల్లి సుశీలనే కారణం. ఆమెకు చెస్ గేమ్ లో చాలా ప్రావీణ్యం ఉంది. అందుకే మొదట విశ్వనాథన్ ఆనంద్ చదరంగంపై ఆసక్తి చూపించగానే ఆయన్ని ప్రోత్సహించిన వారిలో ఆమె తొలి వరసలో ఉంటారు. అంతేకాదు ఆమె కూడా ఆనంద్ తో చిన్నప్పటి నుండే చెస్ ఆడేవారు.

ఆనందే చిన్నవాడు..
విశ్వనాథన్ ఆనంద్ కుటుంబంలో అతనే చిన్నవాడు. తన అక్క కంటే అతనే 11 సంవత్సరాలు చిన్నవాడు. తన అన్నయ్య కంటే 13 సంవత్సరాలు చిన్నవాడు.

జూనియర్ చెస్ ఛాంపియన్..
1987లో ప్రపంచ జూనియర్ చెస్ ఛాంపియన్ అందుకుని రికార్డు స్రుష్టించారు. అప్పుడే మన దేశానికి చదరంగానికి సంబంధించి ఒక నూతన శకం మొదలైంది. చెస్ క్రీడలో మనకంటూ ఒక టైటిల్ ను కన్ఫార్మ్ అని అప్పుడే సంకేతాలు పంపాడు. కేవలం 18 ఏళ్ల వయసులోనే ఈ ఘనత సాధించిన ఆటగాడిగా చరిత్ర తిరగరాశాడు.

వరుసగా మూడుసార్లు..
ఆ తర్వాత వరుసగా మూడు అడ్వాన్స్ చెస్ టోర్నమెంట్లలో లియోన్, స్పెయిన్ వంటి దేశాలలో విశ్వనాథన్ ఆనంద్ విజేతగా నిలిచారు. గార్రి కాస్పరోవ్ కొత్త ఆట పద్ధతిని 1998లో పరిచయం చేయగా దీన్ని అతి తక్కువ కాలంలోనే అందుకోగలిగారు.

ఉత్తమ పౌర పురస్కారం..
మన దేశంలో 1988లో భారతీయ తొలి గ్రాండ్ మాస్టర్ గా ఆనంద్ అవతరించారు. 1991-92 సంవత్సరంలో ఆయన సేవలకు గాను ఆయనకు భారత ప్రభుత్వం ఉత్తమ పౌర పురస్కారాన్ని అందించింది. క్రీడాకారులు ఆ అవార్డును మొట్టమొదటిసారి.

2007లో ప్రపంచ ఛాంపియన్..
ఫైడ్ (ఎఫ్ ఐ డి ఇ) వరల్డ్ ఛాంపియన్ షిప్ ని 2000 సంవత్సరం నుండి 2002 సంవత్సరం నిర్వహించినపుడు ఆ టైటిల్ ని ప్రత్యర్థితో కలిసి సమానంగా పంచుకున్నారు. ఆ తర్వాత 2007లో ప్రపంచ ఛాంపియన్ గా అవతరించారు. అలా వరుసగా వరుసగా ఐదు సార్లు వరల్డ్ టైటిల్స్ కైవశం చేసుకున్నారు. ఇది ఆనంద్ యొక్క అత్యుత్తమ రికార్డు.



Click it and Unblock the Notifications

