For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

International Beauty Day 2021:అందానికి ఓ రోజు ఉందని తెలుసా....

అంతర్జాతీయ అందాల దినోత్సవం యొక్క చరిత్ర మరియు ప్రాముఖ్యత గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

|

'అందం.. అందం..తన కళ్లు అందం..
అందం అందం.. తన మాటందం..
అలలా ఎగసే తన మనసందం..
తుళ్లిపడినా ఆ నడకందం..
కట్టు జారే ఆ పైటందం..
తన పెదవందం.. తన బుగ్గలందం..
బక్కచిక్కు నడుముదే ఎంతెంతో అందం..
రత్నాలళ్లే తళుకనే తన నవ్వందం..
తనలా లేదే ఇక ఏ అందం'

International Beauty Day 2021:Date, History and Significance in Telugu

అందం గురించి ఓ కవి తన భావాన్ని ఎంత అందంగా అభివర్ణించాడో చూశారు కదా.. అలాంటి అందం అందరికీ ముఖ్యం.. అందం అంటే మనకు అందమైన అమ్మాయిలే గుర్తుకొస్తారు. ఎందుకంటే ఎలాంటి సందర్భం అయినా అమ్మాయిలు తళుక్కున మెరిసిపోవాలని ఆశిస్తుంటారు. ఏదైనా వేడుకకు వెళ్లినప్పుడు.. అందరూ తననే చూడాలని.. నలుగురిలో తామే ప్రత్యేకంగా కనిపించాలని కోరుకుంటూ ఉంటారు. అయితే మనమంతా సినీ సెలబ్రిటీలేం కాదు కదా.. అయితే మనం కొంచెం ప్రయత్నిస్తే.. అందంగా కనిపించొచ్చు. వీటన్నింటి సంగతి పక్కనబెడితే... అందానికి కూడా ఓ రోజు ఉందని తెలుసా.. ఈ ప్రత్యేకమైన రోజున అందం గురించి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తారని మీకు తెలుసా... ప్రపంచవ్యాప్తంగా ఈరోజున అంతర్జాతీయ అందాల దినోత్సవం జరుపుకుంటారట.

International Beauty Day 2021:Date, History and Significance in Telugu

ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 9వ తేదీన అంతర్జాతీయ అందాల దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. 1995 సంవత్సరం నుండి అంతర్జాతీయ సౌందర్య మరియు కాస్మోటాలజీ కమిటీ(సిడెస్కో) యొక్క రష్యన్ విభాగం ఈ దినోత్సవాన్ని ప్రారంభించిది. ఈరోజు అందం మరియు స్పా థెరపీకి ప్రపంచ ప్రమాణంగా వర్ణించబడింది. ప్రతి ఒక్కరూ అందాన్ని విభిన్న రీతిలో అర్థం చేసుకోగలుగుతారు. మనలో చాలా మంది బయటకు అందంగా కనిపించాలని కోరుకుంటారు. పురాతన కాలం నుండి నేటి ఆధునిక యుగం వరకు అందం కచ్చితంగా సానుభూతిని మరియు ప్రేమను కూడా ప్రేరేపించింది. ఎందుకంటే మనలో చాలా మంది ఎదుటి వ్యక్తుల రూపాన్ని చూసి వారి గురించి ఓ అంచనాకు వస్తారు. ఆ వెంటనే వారితో ఏదో విధంగా మాట్లాడేందుకు ప్రయత్నిస్తారు.

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరి లైఫ్ స్టైల్ మారిపోయింది. ముఖ్యంగా అమ్మాయిలు అందంగా కనిపించేందుకు వివిధ రకాల ఫ్యాషన్ దుస్తులు ధరించి, అద్భుతమైన మేకప్, స్టైలీష్ జ్యువెలరీతో అందంగా కనిపించేందుకు అనునిత్యం ప్రయత్నించడం సంతోషకరమే. అయితే దురద్రుష్టవశాత్తు, సౌందర్య సాధనాల సాగరంలో మునిగిపోతున్న మహిళలు గణనీయమైన ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారని నిపుణులు చెబుతున్నారు.

చాలా మంది మహిళలు సహజంగా అందాన్ని కోరుకోవడం లేదు. ఎక్కువగా మేకప్ కే ప్రాధాన్యత ఇస్తున్నారు. చాలా మంది మేకప్ లేకుండా బయటకు రావడం లేదు. కనీసం అద్దంలో కూడా తమ ముఖాన్ని మేకప్ లేకుండా చూసుకోవడానికి ఇష్టపడటం లేదు. అయితే అసలైన అందం చాలా శక్తివంతమైనది. ఇది మంచి ఆరోగ్యం మరియు శక్తివంతమైన నడక మరియు శ్రావ్యమైన భంగిమతో గుర్తించబడుతుంది. అంతేకానీ అనారోగ్యంతో కూడిన జీవనశైలికి సంకేతాలు కనిపిస్తే, అందంగా దుస్తులు ధరించిన వ్యక్తి కూడా స్పష్టంగా అనారోగ్యంతో ఉంటే స్టైలిష్ గా కనిపించరన్న సంగతి గుర్తుంచుకోవాలి.

ఏదైమైనా అందమైన పనికి సంబంధించిన వ్యక్తులను అభినందించడం ఎప్పటికీ మరచిపోవదదు. ప్రతి ఒక్కరూ అందంగా.. ఆరోగ్యంగా ఉండండి.

FAQ's
  • అంతర్జాతీయ అందాల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు?

    ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 9వ తేదీన అంతర్జాతీయ అందాల దినోత్సవాన్ని జరుపుకుంటారు.

English summary

International Beauty Day 2021:Date, History and Significance in Telugu

Here we are talking about the International Beauty Day 2021:Date, history and significance in Telugu. Have a look
Story first published:Thursday, September 9, 2021, 0:24 [IST]
Desktop Bottom Promotion