For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

International Museum Day 2020 : కరోనా దెబ్బకు కళావిహీనంగా మారిన మ్యూజియమ్స్...

ఈరోజు (మే 18) అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా ఆ వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...

|

అంతర్జాతీయ వస్తు ప్రదర్శనశాల(మ్యూజియం) దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం మే 18వ తేదీన జరుపుకుంటారు. అయితే ప్రస్తుతం కరోనా వైరస్ లాక్ డౌన్ కారణంగా దీనికి బ్రేకులు పడిపోయాయి. లేదంటే ఈ పాటికే మన హైదరాబాద్ లోని సాలార్ జంగ్ మ్యూజియం విద్యుద్దీపాలతో కళకళలాడుతూ ఉండేది. అసలే ఇప్పుడు రంజాన్ మాసం కూడా. అయితే కరోనా మహమ్మారి వల్ల వీటన్నింటికీ అవకాశం లేకుండా పోయింది. ఈ సందర్భంగా వస్తు ప్రదర్శన శాల (మ్యూజియం) యొక్క చరిత్ర మరియు ప్రాముఖ్యతను తెలుసుకుందాం...

ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆఫ్ మ్యూజియం యొక్క నివేదిక ప్రకారం అంతర్జాతీయ మ్యూజియం డే 2020 యొక్క లక్ష్యం ధ్రుక్కోణాల వైవిధ్యాన్ని జరుపుకోవడం మరియు పక్షపాతాన్ని అధిగమించడం.

International Museum Day 2020

ఈ ఇంటర్నేషనల్ మ్యూజియం డేని మొట్టమొదట 1977లో జరుపుకున్నారు. అప్పటి నుండి దీనిపై చాలా మందికి ఆసక్తి పెరిగింది. ఎందుకంటే ఇది ఎంతోమందిని బాగా ఆకర్షించింది. అది ప్రతి ఏటా మెరుగవుతూ 2009 సంవత్సరంలో ఏకంగా దాదాపు 20 వేల మ్యూజియంలు పాల్గొనేంత స్థాయికి చేరింది. ఆ సంవత్సరంలో 90కి పైగా దేశాలలో, ఆ తర్వాతి సంవత్సరంలో 98 దేశాలలో అంతర్జాతీయ మ్యూజియం వేడుకలు జరుపుకోగా, 2011లో ఏకంగా వంద దేశాలు ఈ వేడుకలో చేరాయి. దీని చరిత్ర మరియు ప్రాముఖ్యత గురించి మొత్తం 37 భాషలలో అనువదించబడింది. ఇక 2012లో 129 దేశాలు ఈ వేడుకలో పాల్గొన్నాయి. ఆ సంవత్సరంలో దాదాపు 30 వేల మ్యూజియంలు పాల్గొన్నాయి.

International Museum Day 2020

ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని మ్యూజియమ్స్ ను ప్రోత్సహించడానికి, ఈ ఇంటర్నేషనల్ మ్యూజియం డేలో పాల్గొనేందుకు ఆహ్వానించబడతాయి. సంవత్సరపు థీమ్ చుట్టూ ఆహ్లాదకరమైన, ప్రత్యేకమైన ఉచిత కార్యకలాపాలను స్రుష్టించడం ద్వారా ఇది జరుగుతుంది. అంతర్జాతీయ స్థాయిలో సమాజ వ్రుద్ధిలో మ్యూజియంల పాత్ర గురించి అవగాహన కల్పించడానికి ఇది ముఖ్యమైనది.

ఈ సందర్భంగా అనేక కార్యకలాపాలు జరుగుతూ ఉంటాయి. వివిధ దేశాల నుండి భిన్నమైన కొన్ని ప్రత్యేక కార్యకలాపాలు ఉన్నాయి. ఈ ప్రత్యేక కార్యకలాపాలు ప్రతి సంవత్సరం మారతాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక సంస్థలు మ్యూజియానికి ఉచిత యాత్రను ప్లాన్ చేస్తాయి. ఈరోజు చాలా కుటుంబాలు మరియు స్నేహితులు మ్యూజియాన్ని సందర్శిస్తారు.

English summary

International Museum Day 2020: What Is Its History, Significance

Here we talking about international museum day 2020 : what is its history, significance. Read on
Story first published:Monday, May 18, 2020, 20:42 [IST]
Desktop Bottom Promotion