For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

డిగో మారడోనా గోల్డెన్ గోల్..‘హ్యాండ్ ఆఫ్ గాడ్’స్టోరీ ఏంటో తెలుసా...

|

2020 సంవత్సరం అందరినీ ఏదో ఒక విధంగా ఇబ్బంది పెడుతూనే ఉంది. ఒకవైపు కరోనా మహమ్మారితో ప్రపంచం మొత్తం అల్లకల్లోలంగా ఉంటే.. మరోవైపు ప్రముఖుల మరణాలు చాలా మంది నిరాశపరుస్తున్నాయి. తాజాగా సాకర్ ఫుట్ బాల్ ప్రపంచం దుఃఖ సాగరంలో మునిగిపోయింది.

ప్రపంచంలోనే దిగ్గజ ఆటగాడైన అర్జెంటీనా ఫుట్ బాల్ క్రీడాకారుడు డిగో మారడోనా ఇక లేడన్న వార్తలు విన్న అభిమానులు కన్నీటి సంద్రంలో మునిగిపోయారు. మన దేశంలోనూ గంగూలీ 'నా ఫుట్ బాల్ హీరో ఇక లేరు.. జీనియస్ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నా.. నీ కోసమే నేను ఫుట్ బాల్ మ్యాచ్ లు చూశాను'

అంటూ భావోద్వేగ ట్వీట్ చేశాడు. అంతేకాదు. దాదాతో పాటు సచిన్, సెహ్వాగ్, వివిఎస్ లక్ష్మణ్, అనిల్ కుంబ్లే పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. పలు నివేదికల ప్రకారం, మారడోనా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. కొంతకాలం క్రితమే మారడోనా మెదడులో రక్తం గడ్డ కట్టడం వల్ల శస్త్ర చికిత్స చేయాల్సి వచ్చింది.

తన అద్భుతమైన ఆట తీరుతో సాకర్ ఫుట్ బాల్ ప్రపంచాన్ని ఉర్రూతలూగించిన ఈ ఆటగాడు కళ్లు చెదిరే విన్యాసాలతో 1986లో అర్జెంటీనాకు ఫుట్ బాల్ ప్రపంచకప్ అందించాడు. ఆటపట్ల తనకున్న అంకితభావం చాలా మంది యువకులను ప్రేరేపించగలిగింది. ఈ సందర్భంగా డిగో మారడోనాకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం...

పేద కుటుంబంలో పుట్టి..

పేద కుటుంబంలో పుట్టి..

డిగో మారడోనా పూర్తి పేరు డిగో అర్మాండో మారడోనా. ఇతను 1960 అక్టోబర్ 30వ తేదీన అర్జెంటీనాలోని లానోస్లో ఒక పేద కుటుంబంలో జన్మించాడు. ముగ్గురు కుమార్తెల తర్వాత మొదటి కుమారుడిగా మారడోనా పుట్టాడు. తనకు ఇద్దరు తమ్ముళ్లు కూడా ఉన్నారు.

చిన్నప్పటి నుండే..

చిన్నప్పటి నుండే..

మారడోనాకు చిన్నప్పటి నుండే ఫుట్ బాల్ ఆడటం అంటే చాలా ఇష్టం. మారడోనా పదేళ్ల వయసులోనే టాలెంట్ స్కౌట్ కు ఎంపికయ్యాడు. అప్పటి నుండి తను ఫుట్ బాల్ ఆటనే జీవిత లక్ష్యంగా చేసుకున్నాడు. చూడటానికి చాలా చిన్నగా ఉన్నప్పటికీ మారడోనా ఫుట్ బాల్ మైదానంలో చిరుతలా దూసుకెళ్లేవాడు. తనకు వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకున్నాడు. అత్యంత తక్కువ కాలంలోనే ఎక్కువ ప్రజాదరణను పొందాడు.

1986లో ప్రపంచకప్..

1986లో ప్రపంచకప్..

ఆ టోర్నమెంటు అంతటా ఫుట్ బాల్ కెప్టెన్ డిగో మారడోనా పేరు మారుమోగిపోయింది. అందుకు తగ్గట్టే తన అద్భుతమైన ఆటతీరుతో 1986లో అర్జెంటీనాకు ప్రపంచకప్ ఛాంపియన్ టైటిల్ సాధించాడు. ఈ టైటిల్ ఫైట్లో 24 జట్లు పాల్గొనగా.. ఫైనల్లో పశ్చిమ జర్మనీని 3-2 తేడాతో ఓడించి విశ్వవిజేతగా నిలిపాడు. తన యొక్క ఆటతీరు అందరినీ మంత్రముగ్ధుల్ని చేసింది. అంతేకాదు ఆ టోర్నీలో డిగో 5 గోల్స్ చేశాడు. మరో 5 గోల్స్ కు సహకరించాడు.

‘హ్యాండ్ ఆఫ్ గాడ్’

‘హ్యాండ్ ఆఫ్ గాడ్’

1986లో వరల్డ్ కప్ ఫైనల్స్ లో ఇంగ్లాండ్ పై మారడోనా సాధించిన లక్ష్యం అత్యంత చర్చనీయాంశమైంది మరియు వివాదస్పదమైంది. తన భుజం కింద చేయితో గోల్ పోస్టుకు బంతి వెళ్లింది. రిఫరీ అతన్ని చూడలేకపోయాడు. దానిని గోల్ అని అన్నారు. మారడోనా ఈ గోల్ ను ‘హ్యాండ్ ఆఫ్ గాడ్'గా అభివర్ణించాడు. అప్పటి నుండి దానిని హ్యాండ్ ఆఫ్ గాడ్ అంటారు.

ఎన్నో అవార్డులు..

ఎన్నో అవార్డులు..

డిగో మారడోనా కెరీర్లో ఎన్నో అవార్డులను అందుకున్నాడు. ఫిఫా అండర్ 20 వరల్డ్ కప్ లో ఉత్తమ ఆటగాడిగా.. గోల్డెన్ బాల్ అవార్డును.. 1979, 1980, 1981 సంవత్సరాల్లో వరుసగా అర్జెంటీనా లీగ్ టాప్ స్కోరర్ అవార్డును కూగా గెలుచుకున్నాడు.

చెడు వ్యసనాలు..

చెడు వ్యసనాలు..

అయితే మారడోనా 1980 నుండి 2004 వకు కొకైన్ వంటి చెడు అలవాట్లకు బానిసగా మారాడు. ఇది తన ఫుట్ బాల్ కెరీర్ ను చాలా ప్రభావితం చేసింది. ఆ తర్వాత డ్రగ్స్ తీసుకుని 15 నెలల పాటు నిషేధానికి కూడా గురయ్యాడు. 1991లో తను నిషేధిత డ్రగ్స్ తీసుకున్నాడు. 1994లో వరల్డ్ కప్ లో డోప్ ఆరోపణలు ఎదుర్కొని, ఎఫెడ్రిన్ తీసుకున్నందుకు తనను సస్పెండ్ చేశారు.

తన ఆత్మకథ..

తన ఆత్మకథ..

2000 సంవత్సరంలో మారడోనా ఆత్మకథ ‘ఐ యామ్ ది డిగో'ను విడుదల చేశారు. తను ప్రపంచంలో ప్రజాదరణ పొందిన విధానం, ఈ పుస్తకం ద్వారా ప్రసిద్ధి చెందింది. ఈ పుస్తకం మార్కెట్లో విడుదల అయిన వెంటనే హాట్ కేకులా అమ్ముడయ్యింది.

ప్లేయర్ ఆఫ్ ది సెంచరీ..

మారడోనా 20వ శతాబ్దంలో గొప్ప ఫుట్ బాల్ ఆటగాడిగా ఎంపికయ్యాడు. ఫిఫా పోల్ లో పీలేను ఓడించి, 2000 సంవత్సరంలో ఫిఫా ఇంటర్నెట్ లో 'ప్లేయర్ ఆఫ్ ది సెంచరీ' కోసం నిర్వహించిన ఆన్ లైన్ ఓటింగులో మారడోనా 53.6% ఓట్లతో అగ్రస్థానంలో నిలిచాడు.

English summary

Lesser Known Facts About Legendary Football Player Diego Maradona in Telugu

Here are some lesser-known facts about the late football legend Diego Maradonas life in Telugu.