For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Natioanl Girl Child Day 2023: భారత్‌లో బాలికల కోసం ఉన్న ప్రభుత్వ పథకాలు ఎన్నంటే..

|

ప్రతి సంవత్సరం జనవరి 24న భారతదేశం జాతీయ బాలికా దినోత్సవాన్ని జరుపుకుంటుంది. భారతదేశంలోని ఆడపిల్లలకు మద్దతు ఇవ్వడం మరియు వారికి అనేక అవకాశాలను అందించడం అనే లక్ష్యంతో ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు. మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జాతీయ బాలికా దినోత్సవాన్ని నిర్వహిస్తోంది.

ఈ సందర్భంగా భారత్‌లో బాలికల కోసం ఎన్ని పథకాలు ఉన్నాయి. ఆడపిల్లల సమానత్వం కోసం భారత ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోంది. ఆడపిల్లల సంక్షేమం, వారి విద్య, ఆరోగ్యం కోసం అనేక సంక్షేమ పథకాలు, ఆర్థిక సహాయ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Republic Day 2023: పిల్లల కోసం రిపబ్లిక్ డే స్పీచ్ ఐడియాలు.. ఈ టిప్స్ పాటిస్తే ప్రైజ్ మీదే

దేశంలో ఆడపిల్లల సంక్షేమం కోసం అమలవుతున్న పథకాలు:

1. బేటీ బచావో బేటీ పఢావో

ఈ పథకం యొక్క ప్రాథమిక ఉద్దేశం లింగ ఆధారిత గర్భశ్రావాలు, దేశవ్యాప్తంగా పిల్లల విద్యను అభివృద్ధి చేయడం. సామాజిక వైఖరిని మార్చడంలో సహాయపడే విద్యా కార్యక్రమం ఇది.


2. సుకన్య సమృద్ధి యోజన

ఈ పథకం తల్లిదండ్రులకు వారి ఆడబిడ్డ భవిష్యత్తును సురక్షితం చేసుకోవడంలో సహాయపడే ప్రభుత్వ ఆధారిత చిన్న పొదుపు పథకం. ఈ పథకాన్ని ఆడపిల్ల పేరుతో సేవింగ్స్ అకౌంట్ రుపంలో పోస్టు ఆఫీసులు, ప్రైవేట్, పబ్లిక్ బ్యాంకుల్లో తెరవొచ్చు. సుకన్య సమృద్ధి యోజన వడ్డీ రేట్లు త్రైమాసికంగా ప్రకటిస్తారు.

Republic Day 2023: రిపబ్లిక్ డే రోజు బీటింగ్ రీట్రీట్.. చరిత్ర, ప్రాముఖ్యత ఏంటో తెలుసా?

3. బాలికా సమృద్ధి యోజన

కూతురు పుట్టినప్పటి నుండి ఆమె చదువుకి అయ్యే ఖర్చులను కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది. కుమార్తెల ఉజ్వల భవిష్యత్తు కోసం 1997 అక్టోబర్ 2న బాలికా సమృద్ధి యోజన పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం కింద దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న కుటుంబాల బాలికలు అర్హులు. ఈ పథకం 15 ఆగ్టు 1997 తర్వాత పుట్టిన ఆడపిల్లలకి వర్తిస్తుంది. ఈ పథకం కింద కుటుంబంలోని ఇద్దరు కుమార్తెలు మాత్రమే ప్రయోజనం పొందగలరు.

4. ముఖ్యమంత్రి రాజశ్రీ యోజన

ఈ పథకం యొక్క లక్ష్యం బాలికల అక్షరాస్యత, సంక్షేమాన్ని మెరుగుపరచడం. ఆడపిల్ల పుట్టినప్పటి నుండి 12వ తరగతి వరకు విద్యా, ఆరోగ్యం, సంరక్షణ కసం తల్లిదండ్రులకు 50 వేల వరకు ఆర్థిక సాయం అందించబడుతుంది.

5. CBSE ఉడాన్ స్కీం

దేశం అంతటా ప్రతిష్టాత్మకమైన ఇంజినీరింగ్, సాంకేతిక కాలేజీల్లో బాలికల నమోదును పెంచడం ఈ పథకం లక్ష్యం. సీబీఎస్ఈలో చదివే బాలికలకు ఉచిత కోర్సులు అందిస్తారు. పీర్ లెర్నింగ్, మెంటార్‌షిప్‌ అందిస్తారు.

6. మాధ్యమిక విద్య కోసం బాలికలకు జాతీయ ప్రోత్సాహక పథకం

సెకండరీ ఎడ్యుకేషన్ కోసం బాలికలకు జాతీయ ప్రోత్సాహక పథకం అనేది భారత ప్రభుత్వంలోని మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ, విద్యా శాఖ ద్వారా నిర్వహించబడే పాన్ ఇండియా పథకం. ఇది ప్రధానంగా దేశంలోని వెనకబడిన తరగతుల బాలికల ప్రయోజనం కోసం. అర్హత సాధించిన విద్యార్థిని ఎంపిక చేసిన తర్వాత రూ.3 వేల తరపున ఫిక్స్‌డ్ డిపాజిట్‌గా జమ చేస్తారు. విద్యార్థిని 10వ తరగతి పరీక్షలో ఉత్తీర్ణత సాధించి 18 ఏళ్లు నిండిన తర్వాత ఈ బ్యాలెన్స్‌ను వడ్డీతో సహా విత్‌డ్రా చేసుకోవచ్చు.

7. ధనలక్ష్మి పథకం

ఈ పథకం మార్చి 2008లో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన పైలట్ ప్రాజెక్టు. ఈ పథకం ఆడపిల్లలతో తక్కువ ఆదాయ కుటుంబాలకు షరతులతో కూడిన నగదు ప్రోత్సాహకాలను అందిస్తుంది.

8. ముఖ్యమంత్రి లాడ్లీ యోజన

ఈ పథకం కింద ఐదేళ్ల స్థిర కాల వ్యవధి కోసం రూ.6 వేల డిపాజిట్ మొత్తాన్ని పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ ఖాతాలో జమ చేస్తారు.

English summary

List of government schemes for girl child in India in Telugu

read this to know List of government schemes for girl child in India in Telugu
Story first published:Tuesday, January 24, 2023, 10:56 [IST]
Desktop Bottom Promotion