For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఎరుపు రంగు హ్యాండ్లూమ్ చీరలో నిర్మలా సీతారామన్, శక్తిని, ధైర్యానికి సంకేతంగా..

2023 బడ్జెట్ ప్రవేశ పెట్టడానికి నిర్మలా సీతారామన్ ఎరుపు రంగు చీర కట్టుకున్నారు. హ్యాండ్లూమ్ చీరలను ధరించే ఆర్థిక మంత్రి ఈ రోజు కూడా చేనేత చీరనే కట్టుకున్నారు. ఇలా నేత చీరలను ధరిస్తూ.. నేతన్నలను, చేతి వృత్తులను ప్రోత్సహిస

|

నిర్మలా సీతారామన్ 2023 బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. ఎలాంటి నిర్ణయాలు ఉండనున్నాయి, పన్ను రాయితీలు, ట్యాక్స్ శ్లాబ్‌లు, ఏ రాష్ట్రానికి ఏమివ్వనున్నారు అనే చర్చ చాలా జరుగుతోంది. అయితే కొంత మంది మాత్రం బడ్జెట్ ప్రవేశ పెట్టే రోజు నిర్మలా సీతారామన్ ఎలాంటి చీర ధరించనున్నారు, ఏ రంగు చీర కట్టుకోబోతున్నారని ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే నిర్మలా చీరల ఎంపిక చాలా ప్రత్యేకంగా ఉంటుంది. 2019 నుండి ఆమె బడ్జెట్ ప్రవేశ పెడుతున్నప్పుడు ధరించే చీరను ప్రత్యేకంగా ఉండేలా చూసుకుంటున్నారు.

Nirmala Sitharaman wear red colour black gold border handloom saree for budget session 2023 in Telugu

2023 బడ్జెట్ ప్రవేశ పెట్టడానికి నిర్మలా సీతారామన్ ఎరుపు రంగు చీర కట్టుకున్నారు. హ్యాండ్లూమ్ చీరలను ధరించే ఆర్థిక మంత్రి ఈ రోజు కూడా చేనేత చీరనే కట్టుకున్నారు. ఇలా నేత చీరలను ధరిస్తూ.. నేతన్నలను, చేతి వృత్తులను ప్రోత్సహిస్తున్నారు. 2023 బడ్జెట్ ప్రవేశపెట్టడం నిర్మలా సీతారామన్‌కు ఇది ఐదో సారి. అలాగే 2024 సార్వత్రిక ఎన్నికల ముందు ఇదే చివరి పూర్తి స్థాయి బడ్జెట్. ఈ ప్రత్యేక సందర్భం కోసం ఆమె ప్రత్యేక చీరను కట్టుకున్నారు. ఇందుకోసం ఆమె ఎరుపు రంగు చీరను ఎంచుకున్నారు. బ్లాక్, గోల్డ్ కలర్‌లో వచ్చిన లైన్ బార్డర్ ఉంది. సింపుల్ గా, హుందాగా కనిపించేలా మెడలో సన్నని చైన్, రెండు చేతులకు బంగారు గాజులను మాత్రమే వేసుకున్నారు.

శక్తికి, ధైర్యానికి ఎరుపు చిహ్నం:

శక్తికి, ధైర్యానికి ఎరుపు చిహ్నం:

హిందూ సాంప్రదాయం ప్రకారం ఎరుపు రంగును దుర్గాదేవితో పోలుస్తారు. రెడ్ కలర్ శక్తిని, ధైర్యాన్ని, బలాన్ని, సామర్థ్యాన్ని సూచిస్తుంది. వరుసగా ఇది ఐదో బడ్జెట్ కావడం, 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు ఇదే పూర్తి స్థాయి బడ్జెట్ కావడం వల్ల ప్రత్యేక సందర్భంలో ప్రత్యేకంగా ఉండటానికి ఆమె ఎరుపు రంగు ఎంచుకున్నారు.

ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక మాంద్యం భయాల నేపథ్యంలో ఈ బడ్జెట్ చాలా కీలకం కానుంది. అందుకే ఎలాంటి భయం, బెరుకు లేకుండా భారత్, దేశ ఆర్థిక వ్యవస్థ ధైర్యంగా నిలబడగలుగుతుందన్న సంకేతం ఆమె ధరించిన చీరలో కనిపిస్తోంది.

మొదటి నుండి ప్రత్యేకత:

మొదటి నుండి ప్రత్యేకత:

2019లో మొదటి బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు నిర్మలా సీతారామన్. ఆరోజు ప్రకాశవంతమైన గులాబీ రంగు, బంగారు అంచు గల మంగళగిరి చీరను ధరించారు. లెడ్జర్ పేపర్ లను బ్రీఫ్‌కేస్‌లో సంప్రదాయ బహీ ఖాతాతో తీసుకువచ్చే సాంప్రదాయాన్ని వదిలిపెట్టి బడ్జెట్ పత్రాలను సిల్క్ రెడ్ క్లాత్‌లో చుట్టి, పైన జాతీయ చిహ్నాన్ని ఉంచారు.

పసుపు-బంగారు రంగు చీర:

పసుపు-బంగారు రంగు చీర:

2020 బడ్జెట్ ప్రవేశపెట్టడానికి నిర్మలా సీతారామన్ పసుపు-బంగారం పట్టు చీరను ధరించారు. ఈ చీరకు నీలి రంగు బార్డర్ వచ్చింది. మ్యాచింగ్ బ్లౌజ్ అందంగా ఉంది. పసుపును శ్రేయస్సుకు చిహ్నంహా భావిస్తారు. మ భారతీయ సాంప్రదాయం ప్రకారం పసుపు రంగును శుభ సందర్భాల్లో ధరిస్తారు.

పోచంపల్లి చీర:

పోచంపల్లి చీర:

2021 సంవత్సరం నిర్మలా సీతారామన్ ఎరుపు, తెల్లటి సిల్క్ పోచంపల్లి చీరలో పల్లు చుట్టూ ఇక్కత్ నమూనాలతో, ఆకుపచ్చ అంచుతో ఉన్న చీర కట్టుకున్నారు. ఇది మ్యాచింగ్ రెడ్ బ్లౌజ్ తో జత చేయబడింది.

మెరూన్ కలర్ చీర:

మెరూన్ కలర్ చీర:

2022లో నిర్మలా సీతారామన్ మెరూన్ కలర్ శారీలో కనిపించారు. సిల్వర్ కలర్ బార్డర్ తో ఉన్న చీర హుందాను తీసుకువచ్చింది. రన్నింగ్ బ్లౌజ్ ధరించారు.

English summary

Nirmala Sitharaman wear red colour black gold border handloom saree for budget session 2023 in Telugu

read this to know Nirmala Sitharaman wear red colour black gold border handloom saree for budget session 2023 in Telugu
Story first published:Wednesday, February 1, 2023, 14:01 [IST]
Desktop Bottom Promotion