Just In
- 18 min ago
వెల్లుల్లి పూర్తి ప్రయోజనం పొందడానికి ఎలా తినాలో మీకు తెలుసా?ఇక్కడ చదవండి ...
- 3 hrs ago
ఈ ప్రాబ్లమ్స్ మీ మ్యారేజ్ లైఫ్ ని నాశనం చేస్తాయని తెలుసా...!
- 4 hrs ago
Taurus Horoscope 2021 : వృషభరాశి వారు సంపద పెంచుకుంటారు.. అది ఎప్పుడంటే...?
- 4 hrs ago
తరచూ మూత్ర విసర్జన చేయాలనిపిస్తోందా? అయితే ఈ ఆహారాలకు దూరంగా ఉండండి
Don't Miss
- Movies
వాడి కోసం ఏడేళ్ల జీవితాన్ని నాశనం చేసుకున్నావ్.. రష్మీపై బుల్లెట్ భాస్కర్ కామెంట్స్
- Sports
రోహిత్.. ఎందుకింత నిర్లక్ష్యం! అప్పనంగా వికెట్ సమర్పించుకున్నావ్! గవాస్కర్ ఫైర్!
- News
అయోధ్య రామ మందిరానికి రఘురామకృష్ణ రాజు విరాళం.. ఎంత మొత్తం అంటే..
- Finance
లవర్స్ డే గిఫ్ట్: ఐపీఓ మార్కెట్లోకి డేటింగ్ యాప్: పబ్లిక్ ఇష్యూ: కళ్లు చెదిరే ఆదాయం
- Automobiles
అప్పుడే అయిపోయాయ్.. సోల్డ్ అవుట్ బోర్డ్ పెట్టేశారు..
- Technology
వన్ప్లస్ నార్డ్ స్మార్ట్ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
Swamy Vivekananda Quotes : యువతకు ప్రేరణనిచ్చే అద్భుతమైన స్వామి వివేకానందుని సూక్తులు...!
స్వామి వివేకానందుని పేరు చెబితే ప్రపంచంలోని ప్రతి ఒక్కరూ ఇప్పటికీ ఎంతో గౌరవిస్తారు. ఎందుకంటే విదేశీ గడ్డపై అది కూడా అగ్రరాజ్యమైన అమెరికా వారి చేత తన ప్రసంగంతో ఆకట్టుకున్నారు.
భారతదేశంలోని ఆధ్యాత్మికత గురించి, సనాతన ధర్మం గురించి ప్రపంచానికి చాటి చెప్పారు. అదే సమయంలో నాటి.. నేటి.. రేపటి యువతా మేలుకో అంటూ యువజనులందరికీ దిశా నిర్దేశం చేసేందుకు కొన్ని స్ఫూర్తివంతమైన, మనకు ప్రేరణనిచ్చే సూక్తులను మరియు సందేశాలను అందజేశారు.
అలాంటి స్వామి వివేకానంద జయంతిని జనవరి 12వ తేదీన ప్రతి సంవత్సరం జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఈ సందర్భంగా ఆయన ప్రసంగాలలో నుండి మన యువతకు ప్రేరణనిచ్చే కొన్ని స్ఫూర్తివంతమైన సూక్తులు మరియు సందేశాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం...
స్వామి రామకృష్ణ పరమహంస, ఆధ్యాత్మికంగా ప్రేరణ కలిగించే స్టోరీ

నీలో ఏముందనేదే నీకు ముఖ్యం..
నీ ముందు ఏముంది..? నీ వెనుక ఏముంది.. అనేది అనవసరం.. నీలో ఏముందనేదే నీకు ముఖ్యం.

ఓపికతో ఉంటే చాలు..
ఒక్క క్షణం ఓపికతో ఉంటే చాలు.. కొండంత ప్రమాదాన్ని సైతం ఆపొచ్చు. కానీ అదే ఒక్క క్షణం ఓపిక లేకుంటే మీ లైఫ్ మొత్తం నాశనం అవుతుంది.

ప్రతిరోజూ ఒక్కసారైనా
ప్రతిరోజూ ఒక్కసారైనా మీతో మీరు మాట్లాడుకోండి. లేదంటే మీరు ఒక అద్భుతమైన వ్యక్తితో మాట్లాడే అవకాశాన్ని కోల్పోతారు.

అంతా కోల్పోయినట్టే..
జీవితంలో ధనాన్ని కోల్పోయినా పర్వాలేదు.. కానీ మీ క్యారెక్టర్ ను కోల్పోతే మాత్రం అంతా కోల్పోయినట్టే.

ఎలాంటి పరిస్థితులలో ఉన్నా..
మనం ఎలాంటి పరిస్థితులలో ఉన్నా.. మన కర్తవ్యం మనకు గుర్తుండాలి. అప్పుడే అన్ని పనులు సవ్యంగా జరుగుతాయి.

లిచినప్పుడు పొంగిపోవడం..
మీరు దేనిలో అయినా గెలిచినప్పుడు పొంగిపోవడం.. ఓడినప్పుడు కుంగిపోవడం వంటివి చేయరాదు. ఎందుకంటే విజయమనేది అంతం కాదు.. ఓటమి అనేది చివరి మెట్టు కాదు..

పాజిటివ్ మైండ్ తో ఉండటం..
పాజిటివ్ మైండ్ తో ఉండటం.. అలసటను ఆనందంగా స్వీకరించడం.. ఇవే గెలుపును కాంక్షించే ప్రాథమిక లక్షణాలు.

ఓ యువతా మేలుకో..
ఓ యువతా మేలుకో.. నిద్ర నుండి మేల్కొని, గమ్యం చేరే వరకు విశ్రమించకండి.

నెమ్మదిగా అయినా
నిజాన్ని త్రికరణశుద్ధిగా నమ్మితేనే విజయం వరిస్తుంది. నెమ్మదిగా అయినా సరే, మనం జయించి తీరుతాం.

అదే విజయ రహస్యమంటే..
లక్ష్యంపై ఉన్నంత శ్రద్ధ, ఆసక్తి, లక్ష్యసాధనలో సైతం చూపించాలి. అదే విజయ రహస్యమంటే..

మహత్తర కార్యాలు
ఏ విషయంలో అయినా ఆత్మవిశ్వాసం ఉంటే.. గొప్ప విశ్వాసాల నుండే మహత్తర కార్యాలు సాధించబడతాయి.

ప్రేమే జీవితం
వికాసమే జీవితం, సంకుచితత్వమే మరణం. అలాగే ప్రేమే జీవితం, ద్వేషమే మరణం.

మనం ఎప్పుడూ బలంగా..
ఈ ప్రపంచమే గొప్ప వ్యాయామశాల. మనల్ని మనం ఎప్పుడూ బలంగా మార్చుకోవడానికే మనం ఇక్కడికి వస్తుంటాం.

అనంతమైన సహనాన్ని..
నాయకుడిగా ఉన్నప్పుడు సేవకుడిలా మారండి. అనంతమైన సహనాన్ని పెంపొందించుకోండి.. విజయం మీ వెంటే ఉంటుంది.

ప్రజల్లో మేల్కొలుపు..
మహిళా సాధికారత, ప్రజల్లో మేల్కొలుపు ప్రథమంగా ఉండాలి. అప్పుడే మీ ప్రాంతానికి మరియు మన భారతదేశానికి అంతా మంచి జరుగుతుంది.

ఎవరికి వారు
క్రైస్తవుడు హిందువు, బుద్ధిస్ట్ కాలేడు. అలాగే హిందువు, బుద్ధిస్ట్ కూడా క్రైస్తవుడు కాలేడు. కానీ ఒకరి ఆత్మను మరొకరు అర్థం చేసుకోవాలి. ఎవరికి వారు తమ వ్యక్తిత్వాన్ని కాపాడుకోవాలి.