For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Telangana Formation Day 2022 :ఎనిమిదేళ్ల తెలంగాణలో ఎన్నో ఆటుపోట్లు..అద్భుత విజయాలు.. ఇంకా మరెన్నో...

తెలంగాణ అవతరణ దినోత్సవం 2022 తేదీ, చరిత్ర, ప్రాముఖ్యత మరియు వాస్తవాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

|

Telangana Formation Day 2022: ఎనిమిదేళ్ల తెలంగాణాలో ఎన్నో మైలురాళ్లు.. స్వరాష్ట్రం కోసం అనేక పోరాటాలు.. వందలాది మంది వీర మరణాలు.. ఎట్టకేలకు 20వ దశాబ్దంలో విజయాలు.. ఎన్నో మార్పులు.. ఎన్నో వెలుగులు.. ఎందరో నాయకులు.. అందరికీ వందనాలు..

Telangana Formation Day 2022 Date, History, significance and facts about Telangana in Telugu

జూన్ రెండో తేదీ తెలంగాణ చరిత్రలో ఎప్పటికీ మరచిపోలేని రోజు. ఆరు దశాబ్దాల పాటు ఎంతో మంది అమరవీరుల త్యాగాల కారణంగా.. ఎన్నో ఉద్యమాల ఫలితంగా తెలంగాణ రాష్ట్రం అవతరించిన రోజు జూన్ రెండో తేదీ. తెలంగాణ ప్రజల దశాబ్దాల స్వరాష్టాన్ని సాకారం చేసేందుకు పురుడు పోసుకుంది తెలంగాణ రాష్ట్రం.

Telangana Formation Day 2022 Date, History, significance and facts about Telangana in Telugu

ఉమ్మడి రాష్ట్రంలో తమకు జరుగుతున్న అన్యాయానికి వ్యతిరేకంగా శక్తి వంచన లేకుండా పోరాడిన తెలంగాణ ప్రజలు.. సొంత రాష్ట్ర కలను ఎట్టకేలకు నెరవేర్చుకున్నారు. 1969 నుండే తెలంగాణ కోసం ఉద్యమాలు ప్రారంభం కాగా.. తెలంగాణ రాష్ట్ర సమితి(TRS)ఆవిర్భావంతో తెలంగాణ ఉద్యమానికి రాజకీయ వేదిక దొరికినట్లయ్యింది.

Telangana Formation Day 2022 Date, History, significance and facts about Telangana in Telugu

తెలంగాణ రాష్ట్ర సాధన కోసమే 2001లో కేసీఆర్ కొత్తగా పార్టీ పెట్టారు. అయితే 2011లో చేపట్టిన సకల జనుల సమ్మెతో హస్తిన పాలకుల్లో ఆలోచన మొదలైంది. చివరకు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా 2013 సంవత్సరంలో జులై నెలలో కాంగ్రెస్ పార్టీ ప్రకటన చేసింది. నీళ్లు, నిధులు, నియామకాల కోసమంటూ జనం పోరాడి మరీ సాధించుకున్న తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా అవతరించి ఎనిమిదేళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా తెలంగాణ ఏర్పడిన తర్వాత ఎన్ని మార్పులొచ్చాయో ఇప్పుడు తెలుసుకుందాం...

కరెంటు కోతల్లేకుండా..

కరెంటు కోతల్లేకుండా..

2014 సంవత్సరం జూన్ రెండో తేదీన తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయ్యింది. కొత్త రాష్ట్రానికి తొలిసారి ముఖ్యమంత్రిగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు(కేసీఆర్) బాధ్యతలు చేపట్టిన ఈ ఎనిమిదేళ్లలో తెలంగాణ ఎన్నో మైలురాళ్లను అధిగమించింది. ఎన్నో మార్పులొచ్చాయి. ముఖ్యంగా రాష్ట్రానికి ఎంతో వెలుగొచ్చింది. తెలంగాణ వస్తే కరెంట్ లేక చీకట్లు తప్పవన్న నాటి పాలకుల హెచ్చరికలు తప్పని నిరూపిస్తూ.. కరెంటు కోతల్లేని రాష్ట్రంగా తెలంగాణ అవతరించింది. దేశంలో ఎక్కడా లేని విధంగా వ్యవసాయ రంగానికి 24 గంటల ఉచిత విద్యుత్ ను అందిస్తున్నారు. విద్యుత్ వినియోగం గణనీయంగా పెరిగినా.. డిమాండ్ కు సరిపడా సరఫరా చేస్తున్నారు.

చెరువుల్లో నీటి కళకళ..

చెరువుల్లో నీటి కళకళ..

ఒకప్పుడు తెలంగాణ ప్రాంతంలో నీటి కొరత తీవ్రంగా ఉండేది. కరువుతో ప్రజలు అల్లాడిపోయేవారు. రాష్ట్రంలోని అనేక చెరువులు నిర్లక్ష్యానికి గురయ్యాయి. అందుకే కేసీఆర్ సర్కారు మిషన్ కాకతీయ పేరిటన చెరువుల పునరుద్ధరణకు శ్రీకారం చుట్టింది. వేలాది చెరువులకు పునరుజ్జీవం పోసింది. దీంతో చెరువులన్నీ కళకళలాడాయి.

ఇంటింటికి నల్లా..

ఇంటింటికి నల్లా..

మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ కొళాయి(నల్లా) కనెక్షన్ ఏర్పాటు చేసి మంచి నీరు సైతం అందిస్తున్నారు. గోదావరి పక్కనే పారుతున్నా.. ఇన్నాళ్లూ బోరు నీళ్లు మాత్రమే తాగిన పల్లెవాసులు ఇప్పుడు గోదారి నీళ్లను తాగుతున్నారు.

సంక్షేమ పథకాలు..

సంక్షేమ పథకాలు..

తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్ సర్కారు తీసుకొచ్చిన రైతు బంధు, కళ్యాణ లక్ష్మీ, కంటి వెలుగు పథకాలు ఇప్పటికీ ఓ సంచలనం. మిగిలిన రాష్ట్రాలు సైతం వీటిని అమలు చేయడానికి ఆసక్తి చూపాయి. పేదింటి ఆడబిడ్డలకు పెళ్లికి డబ్బులు ఇవ్వడం కోసం రూపొందించిన కళ్యాణ లక్ష్మీ/షాదీ ముబారక్ పథకం ఇప్పుడు అందరి ప్రశంసలు అందుకుంది. రైతు బంధు పథకం ద్వారా ఎకరానికి రూ.5 వేలు చొప్పున ప్రతి ఏటా రెండు విడతల్లో పది వేల చొప్పున నేరుగా రైతులకు సర్కారే పెట్టుబడి సాయం చేస్తోంది.

కేసీఆర్ కిట్..

కేసీఆర్ కిట్..

ఒకప్పుడు సర్కారీ దవాఖానా అంటే భయపడే ప్రజలు.. ఇప్పుడు గవర్నమెంట్ ఆస్పత్రుల వైపు ఆసక్తి చూపుతున్నారు. సర్కారీ దవఖానాల్లో మౌలిక వసతులు మెరుగుపడటం, నాణ్యమైన వైద్యం అందేలా చూస్తున్నారు. ఇక గర్భిణులు ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రసవం చేయించుకుంటే.. కేసీఆర్ కిట్ పేరిట రూ.2,150తో పాటు ఓ కిట్ అందజేయనున్నారు. ఆడపిల్ల పుడితే రూ.13 వేలు, మగ పిల్లాడు పుడితే రూ.12 వేల రూపాయలను అందజేస్తున్నారు. దీంతో శిశుమరణాలు కూడా తగ్గుముఖం పట్టాయి. అయితే హైదరాబాదులో పెద్దాసుపత్రుల నిర్మాణం ఇంకా జరగాల్సి ఉంది.

ఐటీలోనూ మేటి తెలంగాణ..

ఐటీలోనూ మేటి తెలంగాణ..

తెలంగాణ అవతరించిన తర్వాత పేదలకు ఆసరా పింఛన్లు నిజంగానే ఆసరానిస్తున్నాయి. ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రంలో రూ.200 వచ్చే పెన్షన్ రూ.2016కు పెంచారు. కేవలం పెన్షన్ల కోసం తెలంగాణ సర్కారు 12 వేల కోట్ల రూపాయలకు పైగా ఖర్చు పెడుతోంది. తెలంగాణ ఉద్యమాల సమయంలో ఐటీ కంపెనీలు కొత్త కార్యాలయాల ఏర్పాటుకు వెనుకడుగు వేశాయి. కానీ ఇదంతా తాత్కాలికమే అని నిరూపిస్తూ.. ప్రత్యేక రాష్ట్రం అవతరించాక హైదరాబాద్ ఐటీ శరవేగంగా పురోగమించింది. బెంగళూరుకు పోటీగా భాగ్యనగరం ఐటీ సంస్థలను ఆకట్టుకుంటోంది. తెలంగాణ ఆవిర్భావం తర్వాత ఐటీ సంస్థలు హైదరాబాదులో కార్యకలాపాలు వేగం పెంచాయి. ఐటీ రంగం ద్వారా తెలంగాణలో దాదాపు 5.80 లక్షల మంది ఉపాధి పొందుతున్నారు.

FAQ's
  • తెలంగాణ అవతరణ దినోత్సవం ఎప్పుడు?

    2014 సంవత్సరం జూన్ రెండో తేదీన తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయ్యింది. జూన్ రెండో తేదీ తెలంగాణ చరిత్రలో ఎప్పటికీ మరచిపోలేని రోజు. ఆరు దశాబ్దాల పాటు ఎంతో మంది అమరవీరుల త్యాగాల కారణంగా.. ఎన్నో ఉద్యమాల ఫలితంగా తెలంగాణ రాష్ట్రం అవతరించిన రోజు ఈరోజు. తెలంగాణ ప్రజల దశాబ్దాల స్వరాష్టాన్ని సాకారం చేసేందుకు పురుడు పోసుకుంది తెలంగాణ రాష్ట్రం. నీళ్లు, నిధులు, నియామకాల కోసమంటూ జనం పోరాడి మరీ సాధించుకున్న తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా అవతరించి ఎనిమిదేళ్లు పూర్తయ్యాయి.

English summary

Telangana Formation Day 2022 Date, History, significance and facts about Telangana in Telugu

Every year on June 2 is observed as Telangana Formation Day as this is the day when the Telangana state was officially formed. Know about history, significance of indias youngest day in telugu
Desktop Bottom Promotion