For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆర్జీవీ బర్త్ డే స్పెషల్ : ఎవరో ఒకరిని ‘రోజూ గిల్లే వాడే‘(RGV)వర్మ

సినిమాలు తీయడం ఈయనకు వెన్నతో పెట్టిన విద్య. అందరూ పబ్లిసిటీ కోసం ఏవేవో స్టంట్లు చేస్తే.. వర్మ నోటి నుండి, లేదా తన సోషల్ మీడియా అకౌంట్ నుండి వచ్చే ఏ అంశానికైనా ఆటోమేటిక్ గా పబ్లిసిటీ వచ్చేస్తుంది.

|

ఉదయం నిద్ర లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునేంతవరకు ప్రతిరోజూ ఎవరో ఒకరిని గిల్లకపోతే ఆయనకు ప్రశాంతంగా నిద్ర పట్టదు అని కొందరు.. ఆయనకు పిచ్చి పట్టిందని మరికొందరు.. ఇంకొందరు ఆయన లాజిక్ లేనిదే ఏదీ మాట్లాడాడు అని ఆర్జీవీకి మద్దతుగా మాట్లాడతారు. ఈ ప్రపంచంలో అందరూ ఎడ్డెం అంటే.. ఆర్జీవీ ఒక్కడు కాదు తెడ్డెం అంటాడు.

అనడమే కాదు అందుకు ఆధారాలు కూడా చూపిస్తాడు. అందరినీ నమ్మిస్తాడు. ఇటీవల టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిని ఆకాశానికెత్తేశాడు. సాగర్ ఉపఎన్నికల్లో తనకు ఓటు హక్కు ఉంటే భగత్ కే తన ఓటు వేసేవాడినంటూ సెటైరికల్ గా కామెంట్ చేశాడు. దీనిపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. మరోవైపు తన సినిమాలను ఎప్పుడు ఎలా తీస్తాడో తనకే తెలీదు. అయితే ప్రతిదీ వివాదస్పదంగా ఉండే అంశాన్నే ఎంపిక చేసుకుంటాడు. అన్నింట్లోనూ తనకు అనుకూలంగా మలచుకుంటాడు.రాజకీయాలు, దెయ్యాలు, బాంబు బ్లాస్టులు, బయోగ్రఫీలు, రౌడీయిజం ఇలా ఏ అంశంపై అయినా అవలీలగా సినిమా తీసేస్తుంటాడు.

Ram Gopal Varma

ఆ సినిమాలు హిట్లా.. ఫ్లాపులా అనే విసయాలను అస్సలు పట్టించుకోడు. ఆర్జీవీ కేవలం డైరెక్టర్ గా ఆగిపోలేదు. స్క్రీన్ ప్లే, నిర్మాతతో పాటు ఇంకా ఎన్నో రకాల పాత్రలను తెరవెనుక నుండి పోషించారు. ఏప్రిల్ 7వ తేదీన రామ్ గోపాల్ వర్మ పుట్టినరోజు సందర్భంగా ఆర్జీవీ తెలుగు సినిమా రంగంలో అడుగు పెట్టడానికి గల కారణాలేంటి? ఎందుకని ఆయన ఈ రంగం వైపు వచ్చారో అనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

ఆర్జీవీ జననం..

ఆర్జీవీ జననం..

1962లో తూర్పుగోదావరి జిల్లాలో క్రిష్ణంరాజు, సూర్యమ్మ అనే దంపతులకు ఏప్రిల్ 7వ తేదీన రామ్ గోపాల్ వర్మ జన్మించాడు. ప్రాథమిక విద్య తన జిల్లాలోనే పూర్తి చేసుకున్న వర్మ ఉన్నత విద్య కోసం విజయవాడ వెళ్లాడు.

విద్యార్థిగా ఉన్నప్పుడే...

విద్యార్థిగా ఉన్నప్పుడే...

తను విద్యార్థిగా ఉన్న సమయంలో నగరంలో ఏ రోజు ఏ భాషలో విడుదలైన సినిమా అయినా తప్పకుండా చూసేవాడట. అంతేకాదు ఆ సినిమాలో తప్పు, ఒప్పుల గురించి తన స్నేహితులతో వాదనలకు కూడా దిగేవాడట..

సిడిల దుకాణం..

సిడిల దుకాణం..

తన డిగ్రీ పూర్తయ్యాక చిత్ర రంగంలో అవకాశం కోసం హైదరాబాద్ నగరానికి వచ్చాడట. అంతేకాదు డైరెక్టర్ గా అవకాశం రాకముందు తను ఒక వీడియోలో సిడిలను అమ్మేవాడినని.. ఒకసారి పోలీసులకు కూడా దొరికిపోయానని తానే పలు ఇంటర్వ్యూలో చెప్పాడు.

శివతో బోణీ..

శివతో బోణీ..

తెలుగు సినిమా రంగంలో అప్పటివరకు ఒకే రకమైన సినిమాలతో బోరు కొట్టిన జనానికి, రామ్ గోపాల్ వర్మ నాగార్జునతో తీసిన ‘శివ‘ అప్పట్లో సెన్సెషనల్ హిట్ అయ్యింది. అక్కడి నుండి వర్మ అసలు వెనుకడుగు అనేదే వేయలేదు. అలా శివ సినిమాతో బోణీ కొట్టిన వర్మ ఏకంగా బాలీవుడ్ కు సైతం అడుగు పెట్టాడు.

ఎందరో శిష్యులను...

ఎందరో శిష్యులను...

రామ్ గోపాల్ వర్మ టెక్నికల్ గా మంచి ప్రావీణ్యం కలవాడు. అంతేకాదు తన దగ్గర పని చేసిన ఎందరో శిష్యులు ప్రస్తుతం టాప్ డైరెక్టర్లుగా కొనసాగుతున్నారు. అలా వచ్చిన వారిలో పూరి జగన్నాథ్, తేజ ఇంకా ఎంతో మంది ఉన్నారు.

ఆయన కోణమే వేరు..

ఆయన కోణమే వేరు..

ఈ ప్రపంచంలో మనం నిజాన్ని అబద్ధం అనే వాళ్లను ఎంతోమందిని చూసుంటాం. కొన్ని అబద్ధాలను నిజం అనే వాళ్లనూ చూసుంటాం. అయితే ఆర్జీవీ మాత్రం ఏది నిజమో... ఏది అబద్ధమో తన కోణంలో మాత్రమే చూపిస్తాడు. చూస్తే చూడండి.. లేదంటే మానేయ్యండి. నాకు నిజం అనిపించింది నేను తీశా అని నిర్మోహమాటంగా చెప్పేస్తారు.

వివాస్పదమే కాదు..

వివాస్పదమే కాదు..

ఆర్జీవీ వివాదస్పద సినిమాలు మాత్రమే తీస్తాడనుకుంటే మీరు పొరబడినట్లే. ఆయన రొమాన్స్, ప్రేమ, ఎమోషన్, యాక్షన్, మాఫీయా, నిజ జీవిత సంఘటనలు ఏవి తీసుకున్నా ఆయన ప్రతి సినిమాలో ఏదో ఒక విషయం కచ్చితంగా ఉంటుంది. నాటి శివ, గోవింద గోవింద, రంగీలా, సత్య నుండి నేటి ఐస్ క్రీమ్, లక్ష్మీస్ ఎన్టీఆర్ వరకు ప్రతి దానిలో ఏదో ఒక మెసెజ్ ఉంటుంది. అంతేకాదు గాడ్ సెక్స్ ట్రూత్ (జిఎస్టీ)తో ఆయనకు ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు వచ్చింది.

ప్రపంచవ్యాప్త ఫాలోయింగ్..

ప్రపంచవ్యాప్త ఫాలోయింగ్..

ఆర్జీవీకి ఒక్క టాలీవుడ్ లోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆస్కార్ అవార్డ్ విన్నర్ స్లమ్ డాగ్ మిలినీయర్స్ డైరెక్టర్ డేనీ బోయల్ లాంటి డైరెక్టరే తనపై వర్మ ప్రభావం ఉందని చెప్పాడంటే ఆయన క్రేజ్ ఏంటో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. మామూలుగా ఏ డైరెక్టర్ అయినా ఏదైనా సినిమా తీయాలంటే సొంతంగా కథను రాసుకుంటారు. లేదా రచయితల నుండి తెప్పించుకుంటారు. కానీ వర్మ మాత్రం కథపై పరిశోధన చేస్తారు. అందుకు సంబంధించిన అంశాలతోనే కథను రెడీ చేస్తారు. అందులో ప్రతిదీ జనం మధ్యలో నుండి వచ్చిన అంశాలే కావడంతో వర్మ సినిమాల వద్దన్నా ఎవరైనా చూస్తూనే ఉంటారు.

అవార్డులు..

అవార్డులు..

రామ్ గోపాల్ వర్మకు తను తీసిన సినిమాలకు గానూ ఎన్నో అవార్డులు వచ్చాయి. ఆయన దర్శకత్వం వహించిన తొలి సినిమా శివకు, క్షణ క్షణం, ప్రేమ కథా చిత్రానికి ఇలా మూడుసార్లు నంది అవార్డులను గెలుచుకున్నారు. రంగీలా, సత్య చిత్రాలకు ఉత్తమ దర్శకుడిగా వర్మను అవార్డు వరించింది.

PC : Twitter

English summary

Unknown facts about Director Ram Gopal Varma

Here are the unknown facts about director ram gopal varma. Take a look
Desktop Bottom Promotion