For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Women's Equality Day 2021:మహిళలకు సమాన హక్కుల కోసం పోరాడిన మహిళలెవరో తెలుసా...

|

ప్రతి సంవత్సరం ఆగస్టు 26వ తేదీన మహిళా సమానత్వ దినోత్సవం జరుపుకుంటారు. ఈ ఏడాది యునైటెడ్ స్టేట్స్ అమెరికా(USA)లో 101వ మహిళా సమానత్వ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. రాజ్యాంగ బద్ధంగా ఓటు హక్కు పొదిన అమెరికన్ మహిళలను గౌరవించడానికి ఆగస్టు 26వ తేదీన అమెరికాలో ఈ దినోత్సవాన్ని ఎక్కువగా జరుపుకుంటారు.

యునైటెడ్ స్టేట్స్ అమెరికాలో 1920 సంవత్సరంలో రాజ్యాంగంలో 19వ సవరణ ద్వారా మహిళా సమానత్వ హక్కుకు ఆమోదం లభించింది. ఈ చట్టం వల్ల ఆ దేశంలో స్త్రీ, పురుషుల మధ్య ఓటు హక్కులో తేడాలను నిరాకరించింది. అది చట్ట విరుద్ధమని ప్రకటించింది. అందరూ సమానమే అని నిర్ధారించింది.

మహిళా సమానత్వ దినోత్సవ చరిత్ర..

మహిళా సమానత్వ దినోత్సవ చరిత్ర..

PC : Maps of India

యునైటెడ్ స్టేట్స్ కాంగ్రెస్ ప్రతినిధి బెల్లా అబ్జుగ్ అభ్యర్థన మేరకు 1971 సంవత్సరంలో ఆగస్టు 26వ తేదీన ‘మహిళా సమానత్వ దినోత్సవం'గా ఏర్పాటు చేశారు. దీన్ని 1973 సంవత్సరంలో ఆమోదించారు. అప్పటి నుండి ప్రతి సంవత్సరం అమెరికాలో ఈ దినోత్సవాన్ని జరుపుకోవాలని అప్పటి అధ్యక్షులు రిచర్డ్ నిక్సన్ మొదటి అధికారిక ప్రకటన విడుదల చేశారు. అప్పటి నుండి ప్రతి ఏటా మహిళలకు ఓటు హక్కు కల్పించిన దినోత్సవంగా ఈ తేదీని ఎంచుకున్నారు.

తొలి మహిళా సదస్సు..

తొలి మహిళా సదస్సు..

అయితే దీని కంటే ముందు 1848 సంవత్సరంలోనే న్యూయార్క్ లోని సెకెకా ఫాల్స్ లో ప్రపంచంలోనే మొట్టమొదటి మహిళా హక్కులు సదస్సు ప్రారంభమైంది. అయితే అప్పుడు మహిళల నాయకత్వ లోపంతో, అహింసాత్మక పౌర హక్కుల ప్రచారానికి ముగింపు పలికారు.

మహిళా సమానత్వ దినోత్సవ ప్రాముఖ్యత..

మహిళా సమానత్వ దినోత్సవ ప్రాముఖ్యత..

మహిళా సమానత్వ దినోత్సవం సందర్భంగా 19వ రాజ్యాంగ సవరణే కాకుండా, పూర్తి సమానత్వం సాధించడానికి, మహిళలు కొనసాగిస్తున్న పోరాటాలపై ఫోకస్ పెట్టేలా చేసింది. గత శతాబ్దంలో రోజా పార్క్స్ మరియు ఎలియనోర్ రూజ్ వెల్ట్ నుండి పౌర హక్కులు మరియు సమానత్వం కోసం పోరాడుతున్న మేరీ క్యూరీ, రోసలిండ్ ఫ్రాంక్లిన్ మరియు జేన్ గూడాల్ వంటి అద్భుతమైన శాస్త్రవేత్తల వరకు మహిళలు ఏమి చేయగలరో చేసి చూపించారు. అంతేకాదు మహిళలు సాంప్రదాయ మూస పద్ధతులు తప్పని నిరూపించారు. అవకాశం వస్తే పురుషులతో సమానంగా మహిళలు అన్నీ చేయగలరని గతంలో కంటే ఇప్పుడే మరింత ఎక్కువయ్యింది.

మహిళలపై హింసకు వ్యతిరేకంగా..

మహిళలపై హింసకు వ్యతిరేకంగా..

అప్పట్లో మహిళలు ఓటు హక్కు, విద్యా, వైద్యం వంటి ఎన్నో ప్రాథమిక హక్కులను సంపాదించినప్పటికీ.. వారిపై హింసను మాత్రం నేరంగా పరిగణించని సందర్భాలు చాలా ఉన్నాయి. ఫలితంగా మహిళలు అనేక సంవత్సరాల పాటు అనేక హింసలు మరియు దుర్వినియోగానికి గురయ్యారు. అయితే కొందరు మహిళలు మహిళలపై జరుగుతున్న అన్యాయాన్ని అరికట్టాలని నిర్ణయించుకున్నారు. అలాంటి మహిళల గురించి అతి తక్కువ మందికే తెలిసి ఉంటుంది. ఈ సందర్భంగా వారెవరో గుర్తు చేసుకుందాం.

దుర్గాబాయ్ దేశ్ ముఖ్..

దుర్గాబాయ్ దేశ్ ముఖ్..

1909 జులై 15వ తేదీ జన్మించిన దుర్గాబాయ్ దేశ్ ముఖ్ ఒక స్త్రీవాద, సామాజిక కార్యకర్త, న్యాయవాది మరియు ప్రముఖ భారతీయ స్వాతంత్య్ర సమరయోధురాలు. ఆమె భారత ప్రణాళికా సంఘంతో పాటు భారత రాజ్యాంగ పరిషత్ సభ్యులలో ఒకరు. తన చిన్నతనంలో మహిళల సంక్షేమం కోసం పోరాడాలని నిర్ణయించుకున్నారు. 12 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు, ఉద్దేశపూర్వకంగా ఆంగ్ల విద్యను విధించినందుకు నిరసనగా ఆమె పాఠశాలను విడిచిపెట్టారు. ఆమె హిందీ మీడియం కోసం వాదించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ రాజమండ్రిలో బాలికా హిందీ పాఠశాలను స్థాపించారు. 1923 సంవత్సరంలో ఆమె స్వగ్రామం కాకినాడలో జరిగిన ఇండియన్ నేషనల్ సమావేశంలో టికెట్ లేకుండా ఎవరూ కాన్ఫరెన్సులోకి ప్రవేశించకుండా చూసే బాధ్యతను ఆమె చూసుకున్నారు. అదే సమయంలో పండిట్ జవహార్ లాల్ నెహ్రు సదస్సులో ప్రవేశించడానికి వచ్చారు. అయితే ఆయనతో టికెట్ లేకపోవడంతో.. తనను లోపలికి వెళ్లడానికి నిరాకరించారు. టికెట్ లేని వారిని ఆపడం తన కర్తవ్యమని, తాను ఎలాంటి మినహాయింపులను తట్టుకోలేనని చెప్పారు.

సావిత్రి బాయి పూలే..

సావిత్రి బాయి పూలే..

సావిత్రి బాయి పూలే భారతదేశంలోనే మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు. ఆమె ఒక సంఘ సంస్కర్త, కవి మరియు విద్యావేత్త కూడా. మహారాష్ట్రకు చెందిన ఈమె విద్య కోసం భర్త జ్యోతిరావు పూలే సహాయాన్ని తీసుకున్నారు. మహిళల హక్కులు మరియు విద్య కోసం వాదించారు. 1948 సంవత్సరంలో తనే తొలి బాలికల పాఠశాలను ప్రారంభించారు. ఇది మాత్రమే కాదు, ప్రజలకు మంచి, చెడుల గురించి వివరించారు. లింగం, కులం ఆధారంగా వివక్షకు వ్యతిరేకంగా కూడా ఆమె పని చేశారు. వీరితో పాటు ప్రపంచవ్యాప్తంగా ఇంకా ఎందరో మహిళలు సమానత్వపు హక్కు కోసం పోరాటం చేశారు. విజయం కూడా సాధించారు.

English summary

Women's Equality Day 2021: Know date, significance, history and more about the special day in Telugu

Every year 25 August is observed as the Women’s Equality Day which commemorates the 1920 amendment of the US constitution. This year, here’s a list of women who fought for the injustice and malpractices against women. Scroll down to read more.
Story first published: Thursday, August 26, 2021, 11:39 [IST]