For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

World Egg Day 2021: కోడిగుడ్డుతో.. కోరుకున్నంత అందం.. ఆరోగ్యం పెరుగుతుందట...

వరల్డ్ ఎగ్ డే 2021, చరిత్ర, ప్రాముఖ్యత, థీమ్ మరియు ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

|

కోడి గుడ్డు(Egg) మనకు కోరినంత ఆరోగ్యమే కాదు... అందాన్ని కూడా ఇస్తుందట. ఎందుకంటే పోషకాలను సహజంగా అందించే ఆహార పదార్థం ఇది. అందుకే మన ప్రభుత్వాలు 'ఆదివారమైనా.. సోమవారమైనా.. ప్రతిరోజూ గుడ్డు తినండి' అంటూ ప్రకటనలు జారీ చేసింది.

World Egg Day 2021 Date, History, Significance, Theme & More health benefits of eating eggs

ఈ కోడిగుడ్డు బడ్జెట్ పద్మనాభాలకు చాలా ఇష్టం. చిన్నారులకు, పెద్దలకు కూడా మెత్తగా, రుచికరంగా ఉండటమే.. మంచి శక్తినిచ్చే పోషకాహారం. అందుకే ప్రతి సంవత్సరం అక్టోబర్ మాసంలోని రెండో శుక్రవారం(అక్టోబర్ 8వ తేదీ) రోజున వరల్డ్ ఎగ్ డే జరుపుకుంటారు.

World Egg Day 2021 Date, History, Significance, Theme & More health benefits of eating eggs

ఈ నేపథ్యంలో కోడిగుడ్డుపై అందరికీ అవగాహన కల్పించాలనే ఉద్దేశ్యంతో ఈరోజును నిర్వహిస్తారు. ఈ సందర్భంగా కోడిగుడ్డు తినడం వల్ల ఏయే ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఎగ్ డే ఎందుకు జరుపుకుంటారనే ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం...

World Egg Day 2021: ఫుడ్ లవర్స్ కోసం రుచికరమైన గుడ్డు ఉడకబెట్టిన పులుసు వంటకం..

ఎగ్ డే ఎలా మొదలైందంటే..

ఎగ్ డే ఎలా మొదలైందంటే..

1996 సంవత్సరంలో తొలిసారిగా వియన్నాలో జరిగిన ఓ సమావేశంలో ఇంటర్నేషనల్ ఎగ్ కమిషన్ ప్రతి సంవత్సరం అక్టోబర్ రెండో శుక్రవారం నాడు వరల్డ్ ఎగ్ డే కార్యక్రమాన్ని నిర్వహించాలనే నిర్ణయాన్ని తీసుకుంది. అప్పటి నుండి ప్రతి ఏటా ఈ ఎగ్ డే జరుపుకోవడం ప్రారంభించారు. ఈ సందర్భంగా గుడ్లు తినడం వల్ల ఎలాంటి పోషకాహారాలు లభిస్తాయి.. వాటి గురించి ప్రజలకు అవగాహన కల్పించాలనే లక్ష్యంతో ఈ ఎగ్ డే జరుపుకున్నారు.

ఉచితంగా గుడ్ల పంపిణీ..

ఉచితంగా గుడ్ల పంపిణీ..

ప్రపంచ గుడ్డు దినోత్సవం సందర్భంగా కొన్ని ప్రాంతాల్లో ఉచితంగా కోడిగుడ్లను కూడా పంపిణీ చేస్తారు. ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం వల్ల పేదలకు ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుంది. వీటిని రెగ్యులర్ గా తినడం వల్ల శరీరానికి కావాల్సిన అనేక రకాల క్యాలరీలతో పాటు నాణ్యత కలిగి ప్రోటీన్స్ మనకు లభిస్తాయి. అందుకే ఈ గుడ్డుతో అనేక రకాల రెసిపీలను చేస్తున్నారు. ప్రస్తుత కాలంలో చాలా మంది ఇళ్లలో గుడ్లు బ్రేక్ ఫాస్ట్ గా కూడా మారిపోయాయి.

గుడ్లపై అవగాహన..

గుడ్లపై అవగాహన..

ప్రపంచంలో మన దేశం గుడ్ల ఉత్పత్తిలో మూడో స్థానంలో ఉంది. అయితే వినియోగంలో మాత్రం 115వ స్థానంలో ఉంది. మన తెలుగు రాష్ట్రాలైన తెలంగాణలో సుమారు మూడున్నర కోట్ల కోడిగుడ్లు ఉత్పత్తి అవుతుండగా.. ఆంధ్రప్రదేశ్ లో నాలుగు నుండి నాలుగున్నర కోట్ల గుడ్లు ఉత్పత్తి అవుతున్నాయి. అందుకే గుడ్డుపై ప్రజల్లో మరింత అవగాహన పెరగాల్సి ఉంది. అందుకే ప్రతి సంవత్సరం అక్టోబర్ 8వ తేదీన వరల్డ్ ఎగ్ డే నిర్వహిస్తారు.

రోజూ ఒక్క గుడ్డూ తినడం లేదా? పచ్చి గుడ్డు తింటే ఏమవుతుంది? ప్రతి మగాడు రోజుకొక పచ్చిగుడ్డు తినాలి!రోజూ ఒక్క గుడ్డూ తినడం లేదా? పచ్చి గుడ్డు తింటే ఏమవుతుంది? ప్రతి మగాడు రోజుకొక పచ్చిగుడ్డు తినాలి!

కోడిగుడ్లపై పరిశోధనలు..

కోడిగుడ్లపై పరిశోధనలు..

కోడిగుడ్డు గురించి ఇప్పటికే అనేక పరిశోధనలు జరిగాయి. జరుగుతూనే ఉన్నాయి. గుడ్డులో లభించే పోషక విలువలపై ప్రపంచవ్యాప్తంగా నిత్యం పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. మన బాడీలో ఇమ్యూనిటీ పవర్ పెంచడంలో కోడిగుడ్డును మించిన ఆహారం మరొకటి లేదని ఇప్పటికే నిపుణులు తేల్చారు. ఎందుకంటే గుడ్డులో డి విటమిన్ అధిక మోతాదులో దొరుకుతుంది.

కొలెస్ట్రాల్ తగ్గుదల..

కొలెస్ట్రాల్ తగ్గుదల..

మనం తీసుకునే కోడి గుడ్లలో ఉండే పచ్చ సోనలో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటుంది. అయితే మీరు రోజుకు రెండు గుడ్లను తింటే చాలు.. మీకు ఒక్కరోజులో ఎంత కొలెస్ట్రాల్ కావాలో అంత ఇస్తుంది. అంతేకాదు ఇది మన బాడీలోని చెడు కొలెస్ట్రాల్ ను సులభంగా తగ్గించి.. మన కాలేయాన్ని మెరుగుపరుస్తుంది.

గుండెపోటుకు గుడ్డుతో చెక్..

గుండెపోటుకు గుడ్డుతో చెక్..

మనం రెగ్యులర్ కోడిగుడ్లను తినడం వల్ల మన బాడీలోని చెడు కొలెస్ట్రాల్ తగ్గుతాయని ఎన్నో పరిశోధనల్లో ఇప్పటికే తేలింది. దీని వల్ల మనకు గుండె పోటు సమస్యలు కూడా తగ్గుతాయట. అంతేకాదండోయ్.. గుడ్డును రోజూ తినడం వల్ల హార్ట్ ఎటాక్ వచ్చే ముప్పు కూడా దాదాపు తగ్గిపోతందని నిపుణులు చెబుతున్నారు.

English summary

World Egg Day 2021 Date, History, Significance, Theme & More health benefits of eating eggs

Here we are talking about the world egg day 2021 date, history, significance, theme & more health benefits of eating eggs. Read on
Story first published:Friday, October 8, 2021, 11:33 [IST]
Desktop Bottom Promotion