For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

స్వాతంత్ర్య దినోత్సవాన్ని హ్యాపీగా సెలబ్రెట్ చేసుకోవడానికి 10 మార్గాలు

|

1947 ఆగస్టు 15 న మన మొదటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ ప్రకటనతో భారతీయులకి సూర్యోదయమయ్యింది.ఈ సంవత్సరం మనం అరవై తొమ్మిదో స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకుంటున్నాము.

తాము ఎన్ని సంక్షోభాలు, సవాళ్ళనెదుర్కుని బ్రిటీష్ వారి దాస్య శ్రుంఖాలనుండి బయటపడ్డామో భారతీయులు ఎప్పటికీ మర్చిపోరు.స్వాతంత్ర్య దినోత్సవం రోజున వారు ఆనాటి కాలాన్ని మరింతగా గుర్తు చేసుకుంటారు.ఒక్కమాటలో చెప్పాలంటే భారతీయులందరూ నేడు ఆనాటి అమరవీరులని గుర్తుతెచ్చుకుని వారికి అంజలి ఘటిస్తారు,ఎందుకంటే వారివల్లనే దేశం స్వేచ్చా వాయువులని పీల్చుకుంది కాబట్టి.

ఈరోజు ఎంత ముఖ్యమైన రోజు, కాబట్టి భారతీయుల సంబరాలని ఊహించుకోవచ్చు.ఇలాంటి సుదినాన 10 రకాలుగా స్వాతంత్ర్య దినోత్సవం ఎలా జరుపుకోవచ్చో చెప్పడం తక్కువే.స్వాతంత్ర్య దినోత్సవం ఒక్కో రాష్ట్రం లో ఒక్కో శైలిలో జరుపుకుంటారు.ఢిల్లీ లో ప్రధానమంత్రి ఉపన్యాసంతో జరుపుకుంటే దక్షిణాది రాష్ట్రాలు తమ శైలిలో జరుపుకుంటాయి. విద్యార్ధులు కానివ్వండి, ఇతర రంగాలలో ఖ్యాతి గాంచిన వారు కానివ్వండి ఎవ్వరైనా సరే వారి వారి శైలిలో ఈ స్వాంతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటారు.

మరి, ఈ స్వాంతంత్ర్య దినోత్సవాన్ని 10 రకాలుగా ఎలా జరపుకోవచ్చో చూద్దామా??

1)కవాతు వీక్షణ:

1)కవాతు వీక్షణ:

మీరు దేశ రాజధానిలో ఉంటారా??అయితే కనుక మీరు స్వాంతంత్ర్య దినోత్సవాన్ని 10 రకాలుగా ఎలా జరపుకోవాలో అని ఆలోచించక్కర్లేదు.రాజధాని లో జరిగే కవాతు ఎప్పుడైనా చూసారా?? అదొక అధ్భుత వేడుక.మీరెప్పుడూ కనుక ఈ వేడుక చూడకపోతే ఈ సంవత్సరం ప్రయత్నించండి.

2)స్కూలు ఫంకషన్లు:

2)స్కూలు ఫంకషన్లు:

మీరు విద్యార్ధయితే కనుక బహూశా మీరు మీ స్వాతంత్ర్య దినోత్సవ కార్యక్రమాలా రిహార్సల్స్ లో బిజీగా ఉండి ఉంటారు.జండా వందనం, ఆతరువాత జరిగే న్రుత్య, డ్రామా ప్రదర్శనలు, దేశభక్తి గీతాలాపన..ఇవన్నీ వీక్షించడానికి ప్రతీ విద్యార్ధీ ఎదురుచూస్తుంటాదు.

3)మీరే ఓ వేడుక నిర్వహించండి:

3)మీరే ఓ వేడుక నిర్వహించండి:

చిన్నప్పుడు మీరు స్వాతంత్ర్య దినోత్సవం రోజున సరద సరదాగా గడిపిఉంటారు.ఈ సారి మీరు మీ ఇంటి దగ్గరలో గల గ్రవుండ్ లో ఈ వేడుక జరిపి దగ్గరలలో ఉన్న పిల్లలని ఆహ్వానించండి. స్వాంతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకోవడం లో ఇదొక విధం.

4)జండా వందన కార్యక్రమం:

4)జండా వందన కార్యక్రమం:

మీ అపార్ట్ మెంటులో స్వాంతంత్ర్య దినోత్సవాన్ని పెద్ద ఎత్తున జరుపుతారా ప్రతీ యేటా?? అలా కాకపోతే మీరే చొరవ తీసుకుని జరిపించండీ. ఒక పెద్దాయనని ఉపన్యాసం ఇవ్వమని పిల్లలకి చాక్లెట్లూ, స్వీట్సూ పంచి సరదాగా గడపండి.

5)అనాధాశ్రమాలని లేదా వ్రుద్ధాశ్రమాలని సందర్శించడం:

5)అనాధాశ్రమాలని లేదా వ్రుద్ధాశ్రమాలని సందర్శించడం:

అనాధలు, వ్రుద్ధుల కళ్ళల్లో ఆనందం నింపితే ఎలా ఉంటుందో ఆలోచించండి.

అనాధాశ్రమం లేదా వ్రుద్ధాశ్రమాన్ని సందర్శించి వారితో కలిసి భోంచెయ్యండీ, స్వీట్లు పంచండి.

6)మొక్కలు నాటడం:

6)మొక్కలు నాటడం:

మీ స్వాతంత్ర్యాన్ని ప్రక్రుతితో పంచుకోండి.మీ స్నేహితులతోనో , పక్కవారితోనో కలిసి కాసిని మొక్కలు నాటి పచ్చని ప్రక్రుతి కి వీలైయినంత తోడ్పడండి.

7)ముగుల్ల పోటీలు లేదా పిల్లలకి కలరింగ్/డ్రాయింగ్ కాపిటీషన్స్:

7)ముగుల్ల పోటీలు లేదా పిల్లలకి కలరింగ్/డ్రాయింగ్ కాపిటీషన్స్:

మీరే ఓ ముగ్గులపోటీయో లేదా పిల్లల్కి కలరింగ్/డ్రాయింగ్ కాంపిటీషన్సో పెట్టంది.పిల్లలకి రంగులతో ఆడుకుని ఏదో ఒకటీ కొత్తగా గీయడం అంటే ఇష్టం.మీరు కూడా ఫేస్ పెయింటింగ్, ముగ్గుల పోటీల్లో పాల్గొనచ్చు.

8)సాంస్క్రుతిక కార్యక్రమాలు:

8)సాంస్క్రుతిక కార్యక్రమాలు:

స్కూళ్ళల్లో, కాలేజీల్లో సాంస్క్రుతిక కార్యక్రమాలు సాధారణం. కానీ ఈసారి మీరే మీ చుట్టుపక్కల వీటిని నిర్వహించి చూడండి.స్వాతంత్ర్య దినోత్సవం రోజున జరిగే అసలు ఫంక్షనే కాకుండా ఆరోజుకోసం అంతా సిద్ధం చేసుకోవడమూ సరదాగా ఉంటుంది.స్వాతంత్ర్య దినోత్సవాన్ని 10 రకాలుగా జరుపుకోవడంలో ఇదొక విధం.

9)మీరే ఒక కవాతు నిర్వహించండి:

9)మీరే ఒక కవాతు నిర్వహించండి:

ఢిల్లీలో కవాతు ని ప్రత్యక్షంగా వీక్షించలేక్పోతే ఏమిటి?? మీరే మీ చుట్టుపక్క పిల్లలతో కలిసి కవాతు నిర్వహించండీ. పిల్లల తల్లి తండ్రులూ ఖచ్చితంగా వస్తారు. ఉదయాన్నే అందరూ కలిసి కూర్చుని దేశభక్తి గీతాలు ఆలపించండి.ఐడియా బాగుంది కదూ??

10)కలిసి భోంచేయడం:

10)కలిసి భోంచేయడం:

మీరు అస్సలు వారితో సమయం గడపట్లేదని మీ దగ్గరైవారు ఫిర్యాదు చేస్తున్నారా?? ఈ

సంవత్సరం మీకు మీ దగ్గరి వారితో కలిసి గడపడానికి ఒక వారాంతం కలిసి వచ్చింది.వారిని

డిన్నరుకో లంచ్ కో బయటకి తీసుకెళ్ళి ఆశ్చర్యపరచండి.

English summary

10 Ways To Celebrate Independence Day

With the proclamation of the first Prime Minister Jawaharlal Nehru, the great country India awoke at the dawn of the first Independent day on 15th August, 1947. This year people are going to celebrate the 69th anniversary of the Independence Day.
Story first published: Friday, August 14, 2015, 17:49 [IST]
Desktop Bottom Promotion