For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సహజంగా భారతీయ యువతకు ఏ విషయాల్లో హద్దులు పెడుతున్నారు

|

యునైటెడ్ నేషన్స్ ప్రకారం 10 నుంచి 24 ఏళ్ళ వయసులోనున్న వారిని యూత్ గా పరిగణిస్తారు. ఈ డెఫినిషన్ ప్రకారం, ఇండియాలో 356 మిలియన్ల యూత్ ఉన్నారు. ఏ నేషన్ కి చెందిన యూత్ అయినా ఆయా నేషన్ కి చెందిన ముందు తరం వారు నిర్దేశించిన అంచనాల ప్రకారం జీవించాలి.

ముందు తరం వాళ్ళు నిర్దేశించిన విషయాలు కొన్ని న్యాయంగా ఉంటే మరికొన్ని మాత్రం యూత్ పై శాపంగా మారతాయి. తరాలు మారుతున్న కొద్దీ వారి ఆలోచనా విధానంలో తేడాలుండడం సహజం. అయితే ముందు తరం ఆలోచనల ప్రకారం కొన్ని విషయాలలో యూత్ తమ ఇష్టాలను నియంత్రించుకోవలసి ఉంటుంది. భారతీయ యువత కొన్ని సార్లు ఇటువంటి విషయాలలో కొద్దిపాటి ఇబ్బందులకు గురవుతున్నారు. పైకి చిన్నగా కనిపించినా ఇవి ప్రముఖంగా చర్చించుకోవలసినవి.

భారతీయ యువత గురించి చెప్పుకోవాలంటే వారు ముఖ్యంగా ఎంతో ఆసక్తికలిగిన, ఉత్సాహపూరితమైన, పాషన్ కలిగిన వారు. అయితే, వారిలో అసహనం, రెస్ట్ లెస్, మ్యానియాక్ వంటి లక్షణాలు కూడా కలవు. ముఖ్యంగా మూర్ఖత్వం కూడా వారిలో చెప్పుకోదగిన ప్రధాన అంశం.

న్యూ జెనెరేషన్ వచ్చినప్పుడల్లా విప్లవ ధోరణి ఎదురవడమన్నది వాస్తవం. పెద్దలు నిర్దేశించిన కొన్ని సిద్ధాంతాలు యువతకు భూతద్దంలో పెద్ద సమస్యగా కనిపించడం సహజం. కొన్ని రకాల పనులు చేయకూడదని ఇండియాలోని యువతను నిరోధిస్తున్నారు. భారత్ లో ఫ్రీడం కొన్ని రకాల రూల్స్ తో సహా వస్తుంది. ఆ రూల్స్ ని పాటించకపోతే శిక్షార్హులుగా పరిగణిస్తారు కూడా.

ఇవి చదివి మీకు కూడా వర్తిస్తాయేమో గమనించండి

నోట్ : ఇందులో వ్యక్తపరిచిన అభిప్రాయలు విమర్శనాత్మకమైనవి. కేవలం విమర్శనాత్మకమైనవే ఇందులో పొందుపరచడం జరిగిందని గమనించండి.

కలలను సాకారం చేసుకోవడం

కలలను సాకారం చేసుకోవడం

ఇండియాలో కలలు కనడం కేవలం తల్లిదండ్రుల హక్కు. పిల్లలు భవిష్యత్తులో ఎమవ్వాలో తల్లిదండ్రులే నిర్దేశిస్తారు. వారి తాహతుని బట్టే పిల్లల చదువు సంధ్యలు, పిల్లల భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది.

సెక్స్ గురించి మాట్లాడడం

సెక్స్ గురించి మాట్లాడడం

సెక్స్ అంటే పురాణం వంటిది. ఇండియాలో ఈ విషయంపై మాట్లాడడానికి జంకుతారు. యూత్ ఫేస్ చేస్తున్న ప్రధాన సమస్య ఇది. ఈ విషయంపై మాట్లాడితే నేరస్తులను చూసినట్టు చూస్తారు.

బహిరంగంగా అభిమానాన్ని వ్యక్తపరచడం

బహిరంగంగా అభిమానాన్ని వ్యక్తపరచడం

ఒక జంట బహిరంగంగా అభిమానాన్ని వ్యక్తపరచుకుంటే అది వారికి ఇబ్బందులను కలుగజేయవచ్చు. ఇండియన్ యూత్ ఈ విషయంలో ఇబ్బందులు పడుతున్నారు. దీని గురించి రీసెంట్ గా ఒక కంపైన్ కూడా జరిగింది. కిస్ ఆఫ్ లవ్ అని జరిగిన ఈ కంపైన్ లో ప్రజల హక్కులను కాపాడేందుకు, పబ్లిక్ లో తమ అభిమానాన్ని చాటుకునే రైట్ కోసం పోరాడారు. వాళ్ళకి గుడ్ లక్ చెప్దాము.

డ్రింకింగ్/స్మోకింగ్

డ్రింకింగ్/స్మోకింగ్

ఇండియన్ యూత్ ఫేస్ చేస్తున్న మరొక ప్రధాన సమస్య ఇది. డ్రింక్ చేసినా స్మోక్ చేసినా దుర్గుణాలకు బానిసై పోయినట్లు చూస్తారు. నిజమే, ఇవి చెడు లక్షణాలే. అయితే, ఒక వ్యక్తికి కనీస స్వేచ్చ అంటూ ఉంటుంది కాబట్టి ఆ వ్యక్తి తన ఇష్టప్రకారం ప్రవర్తించే హక్కుని హరించకూడదు.

ఒక కాజ్ కోసం కృషి చేయడం (కిస్ ఆఫ్ లవ్)

ఒక కాజ్ కోసం కృషి చేయడం (కిస్ ఆఫ్ లవ్)

ఆహింసాత్మకంగా ఒక కాజ్ కోసం యూత్ నిలబడడాన్ని కూడా తప్పుపడతారు. కొన్నిసార్లు ఆయా కంపైన్ లలో పాలుపంచుకున్న యువతను అవమానించి కొట్టిన దాఖలాలు కూడా కలవు.

స్వేచ్ఛగా ఆలోచించే దృక్పథంలో

స్వేచ్ఛగా ఆలోచించే దృక్పథంలో

"ఆలోచించడాన్ని నిరుత్సాహపరచనంత వరకు కచ్చితంగా సక్సెస్ అవుతారు" అని బెర్ట్రాండ్ రస్సెల్ చెప్పాడు. స్వేచ్ఛగా ఆలోచించే తత్వాన్ని అలాగే విభిన్న దృక్పథంతో ఆలోచించడాన్ని ఇండియాలో ప్లేగు వ్యాధితో సమానంగా హీనంగా చూస్తారు. ఫ్రీ థాట్ లేనప్పుడు ప్రజలు పాత పద్దతులకే బానిసలాగ కట్టుబడి ఉంటారు. ఇండియన్ యూత్ ఫేస్ చేస్తున్న ప్రధాన సమస్య ఇది. ఈ విధానం ఎంత త్వరగా మారుతుందో యువత భవిష్యత్తుతో పాటు దేశ భవిష్యత్తు అంత త్వరగా అభివృద్ధి చెందుతుంది.

ఆపోజిట్ జెండర్ స్నేహితులు ఉండటం

ఆపోజిట్ జెండర్ స్నేహితులు ఉండటం

ఒక అబ్బాయి, ఒక అమ్మాయి ఎల్లప్పుడూ స్నేహితులుగా ఉండలేరు. ఇది భారతీయుల నమ్మకం. ఆపోజిట్ జెండర్ లో స్నేహితులు ఉంటే ప్రతి ఒక్కరు ఆశ్చర్యంగా చూస్తారు. ఇవన్నీ గమనిస్తే చిన్నవిగా కనిపించిన ఇండియన్ యూత్ అతి పెద్ద ప్రాబ్లం ను ఫేస్ చేస్తోందని అర్థం చేసుకోవచ్చు.

నచ్చినట్లు డ్రెస్ చేసుకోవడం

నచ్చినట్లు డ్రెస్ చేసుకోవడం

రెచ్చగొట్టే విధంగా డ్రెస్ చేసుకునే విధానం వల్లే మానభంగాలు జరుగుతున్నాయనే అపోహ ఇండియాలో ఉంది. కనీసం నచ్చినట్టుగా దుస్తులు ధరించే స్వేచ్ఛ కూడా ఇండియన్ యూత్ కి లేదు.

పోర్న్ చూడడం

పోర్న్ చూడడం

ఇండియన్ యూత్ పోర్న్ ని చూస్తే వారిని క్రిమినల్స్ ని చూసిన వారిలాగ పరిగణిస్తారు. ఒక వయసుకు వచ్చిన ప్రతి ఒక్కరు హ్యూమన్ నేచర్ ప్రకారం చేసే దాన్ని యూత్ నుంచి నిషేదించడం ఇండియన్ యూత్ ప్రధానంగా ఫేస్ చేస్తున్న సమస్య.

మతానికి వ్యతిరేకంగా వెళ్ళడం

మతానికి వ్యతిరేకంగా వెళ్ళడం

మతానికి వ్యతిరేకంగా మాట్లాడకూడదు. ఓక్ రిలీజన్ కే పరిమితమై ఉండాలి. పెద్దలు చెప్పినట్టు ఒక రిలీజన్ కే కట్టుబడి ఉండాలి. సర్వమత సమ్మేళనం అనే కాన్సెప్ట్ ఇండియన్ యూత్ కి వర్తించదు.

పెద్దలకు ఎదురుచెప్పడం

పెద్దలకు ఎదురుచెప్పడం

ఇండియన్ యూత్ ఫేస్ చేస్తున్న ప్రాబ్లెమ్స్ ని వివిధ కోణాలలో విశ్లేషించుకోవచ్చు. పెద్దలకు పిల్లలకు అభిప్రాయ బేధాలు తలెత్తితే పెద్దల మాటకు ఎదురుచెప్తున్నారని అంటారు. పెద్దలేప్పుడూ తాము మంచే చెప్తున్నామనే అభిప్రాయంలోనే ఉంటారు. కాబట్టి ఆలోచించండి.

నచ్చిన వారిని పెళ్ళాడడం

నచ్చిన వారిని పెళ్ళాడడం

నచ్చిన వారిని పెళ్ళాడడం ఇండియాలో తప్పు. ఇండియాలో పెళ్ళంటే ఇద్దరు వ్యక్తుల కలయిక మాత్రమే కాదు, రెండు కుటుంబాల కలయిక. 2015లో కూడా యూత్ ఈ సమస్యతో సతమతమవుతున్నారంటే ఆశ్చర్యపోనవసరం లేదు. వీరి ప్రాబ్లెమ్స్ ఇప్పట్లో పరిష్కారమవుతాయన్న అలోచన విరమించుకోవడం మంచిది. కాని కచ్చితంగా ఎప్పుడో ఒకప్పుడు పరిష్కారమవుతాయి. అంతవరకూ వేచి చూడాలి మరి.

English summary

12 Things Indian Youth Are Restricted From Doing

According to the United Nations, a youth is defined as someone who belongs to the age group of 10 to 24. Going by that definition, India has 356 million youths. The youth of any nation always has to live up to certain expectations and a set of rules set forth by the previous generation.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more