For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సోమనాథ్ ఆలయంలోకి హిందువులకు మాత్రమే ఎంట్రీ..!! ఎందుకు ?

By Nutheti
|

సోమనాథ్ ఆలయం. మొదటి ద్వాదశ జ్యోతిర్లింగాలలో మొదటిది ఇది. ఈ ఆలయానికి ఎన్నో ఏళ్ల చరిత్ర ఉంది. ముస్లింల దాడులతో నలిగిపోయినప్పటికీ ఈ ఆలయం.. మాత్రం పునర్ నిర్మాణంతో మళ్లీ ప్రాముఖ్యత సంతరించుకుంటూనే ఉంది. ఈ ఆలయంలో ఉన్న సోమేశ్వర లింగం ఒక అద్భుతంగా చెప్పుకోవాలి. ఈ లింగం వెనక అంతుచిక్కని రహస్యం దాగుంది.

గుజరాత్ లోని ప్రభాస పట్టణంలో సోమనాథ్ ఆలయం కొలువై ఉంది. త్రివేణి సంగమానికి దగ్గరలో ఉన్న ఈ సోమనాథ్ ఆలయ దర్శనం ఎన్నో జన్మల పుణ్యఫలమని హిందువులు నమ్ముతారు. శివుడికి ఎంతో ప్రత్యేకమైన లింగాకారాల్లో మొదటి జ్యోతిర్లింగం ఇక్కడ కొలువుదీరింది. అయితే ఈ ఆలయం కేవలం జ్యోతిర్లింగ క్షేత్రంగానే కాదు.. రకరకాల మిస్టరీలు, హిస్టరీలు కలిగి ఉంది. ఈ ఆలయం వెనక దాగున్న ఫ్యాక్ట్స్ మిమ్మల్ని ఆశ్చర్యానికి గురిచేస్తాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

12 జ్యోతిర్లింగ క్షేత్రాల్లో ఒకటి

12 జ్యోతిర్లింగ క్షేత్రాల్లో ఒకటి

ప్రముఖ ప్రసిద్ధి చెందిన 12 జ్యోతిర్లింగ క్షేత్రాలలో సోమనాథ్ ఆలయం ఒకటి. శివుడికి చాలా ప్రత్యేకమైనవి ఈ జ్యోతిర్లింగ క్షేత్రాలు. ముస్లిం ఆక్రమణదారులతో చాలా సందర్భాల్లో సుమారు ఆరేడుసార్లు సోమనాథ్ ఆలయం అపవిత్రంగా ధ్వసం చేయబడింది. కానీ ప్రతిసారి అదే ప్రాంతంలో పునర్ నిర్మించారు. చివరిసారిగా ఈ ఆలయాన్ని 1947 నుంచి 1957 వరకు ఐదేళ్లు నిర్మించారు. అప్పటి భారత రాష్ర్టపతి రాజేంద్రప్రసాద్ ఈ ఆలయాన్ని ప్రారంభించారు.

అంతుచిక్కని మిస్టరీ

అంతుచిక్కని మిస్టరీ

సోమనాథ్ ఆలయంలో ఎవ్వరికీ అంతచిక్కని విచిత్రం ఉంది. అది చంద్రుడు ప్రతిష్టించిన శివలింగం. ఆలయం మధ్యలో, భూమి లోపల ఎలాంటి ఆధారం లేకుండా శివలింగం నిలిచి ఉంటుంది. గాలిలో తేలినట్టు ఉండే ఈ శివలింగం ఎవ్వరికైనా వర్ణించలేని ఒక అద్భుత దృశ్యం.

లింగం ప్రత్యేకత

లింగం ప్రత్యేకత

ఈ జ్యోతిర్లింగానికి చాలా ప్రత్యేకత ఉంది. ఇదో మ్యాజికల్ స్టోన్. ఇది బంగారాన్ని ఉత్పత్తి చేయగలిగే శక్తి కలిగి ఉంది. ఈ రాయికి గురుత్వాకర్షణ శక్తి ఉంది. కాబట్టి.. ఇది ఎలాంటి సపోర్ట్ లేకుండా నిలబడి ఉందని చాలా మంది చెబుతూ ఉంటారు.

సోమనాథ్ ఆలయం, పురాణం

సోమనాథ్ ఆలయం, పురాణం

సుల్తాన్ మహమ్మద్ ఇండియాకి వ్యతిరేకంగా మతయుద్ధం చేయడానికి వెళ్లినప్పుడు సోమనాథ్ ఆలయాన్ని కూల్చేశారు. అలా కూల్చేయడం ద్వారా హిందువులను మహమ్మదీయులలోకి కలుపుకోవాలని భావించారు. క్రీస్తు శకం 1025లో అక్కడికి చేరుకున్నాడు సుల్తాన్ మహమ్మద్. అయితే హిందువులంతా.. ఆలయంలోకి వెళ్లి కాపాడండి అంటూ కేకలు పెట్టారు. అయినా 50 వేల మందిని చంపేసి, ఆలయాన్ని కూల్చేశారు.

గొప్ప నిధి

గొప్ప నిధి

ఆలయాన్ని కూల్చిన తర్వాత సుల్తాన్ మహమ్మద్ ఆలయంలోని నిధులన్నీ కాజేశారు. చాలా బంగారు, వెండి విగ్రహాలు, లెక్కలేనన్ని బంగారు, వెండి పాత్రలు అపహరించుకుపోయారు.

త్రివేణి సంగమం

త్రివేణి సంగమం

చరిత్ర ప్రకారం సోమనాథ్ పుణ్యక్షేత్రం త్రివేణి సంగమాన్ని కలుపుతూ నిర్మించారు. ఇక్కడ కపిల, హిరాణి, సరస్వతి నదుల కలయికతో త్రివేణి సంగమంగా పిలువబడుతుంది.

పౌరాణిక జానపదాలు, సోమనాథ్ ఆలయం

పౌరాణిక జానపదాలు, సోమనాథ్ ఆలయం

చంద్రుడు దక్ష ప్రజాపతి కుమార్తెలైన 27 మందిని పెళ్లి చేసుకుంటాడు. కానీ 27 నక్షత్రాలలో రోహిణితో మాత్రమే సన్నిహితంగా ఉంటూ మిగిలిన వాళ్లను నిర్లక్ష్యం చేస్తాడు. ఈ కారణంగా దక్షుడు ఆగ్రహించి చంద్రుడిని శపిస్తాడు. దీంతో చంద్రుడు కాంతిని కొద్దికొద్దిగా కోల్పోతూ.. చివరికి ఒక రోజూ పూర్తీగా ప్రకాశాన్ని కోల్పోయి మాయమవుతాడు.

చంద్రడుకి శివానుగ్రహం

చంద్రడుకి శివానుగ్రహం

అలా మాయమైన చంద్రుడు తర్వాత బ్రహ్మ సూచన మేరకు ప్రభాస తీర్థానికి చేరుకుని శివుడిని వేడుకుంటాడు. తనకు ప్రాప్తించిన క్షయ వ్యాధి నివారించుకోవడానికి చంద్రుడు శివలింగ ప్రతిష్ఠ చేసి తపస్సు చేసిన ప్రాంతమే ఈ ప్రభాసతీర్ధము. ఇక్కడ శివుడు చంద్రుడికి ప్రత్యక్షమై భార్యలందరిని సమానంగా చూసుకోమని చంద్రుడికి సలహా ఇచ్చి శాపాన్ని పాక్షికంగా ఉపసంహరించి చంద్ర ఉపస్థిత లింగంలో తాను శాశ్వతంగా ఉంటానని చంద్రుడికి మాట ఇచ్చాడు.

ఆలయ నిర్మాణం, పురాణాలు

ఆలయ నిర్మాణం, పురాణాలు

పురాణాల ప్రకారం ఆలయాన్ని రకరకాలుగా నిర్మించినట్లు తెలుస్తోంది. చంద్రుడు సోమనాథ్ ఆలయాన్ని బంగారంతో, తర్వాత రావణుడు వెండితో, తర్వాత శ్రీకృష్ణుడు గంధపు చెక్కతో నిర్మించినట్లు పురాణాలు చెబుతున్నాయి.

ఆలయ నిర్మాణం మొదట ఎప్పుడు

ఆలయ నిర్మాణం మొదట ఎప్పుడు

మొదటి జ్యోతిర్లింగ క్షేత్రమైన సోమనాథ్ ఆలయానికి ప్రాణ ప్రతిష్ట 10వ త్రేతాయుగం సమయంలో శ్రావణమాసంలో ప్రారంభమైందట. అంటే 7,99,25,105 సంవత్సరాల క్రితం మొదటగా ఆలయం నిర్మాణం జరిగిందని స్కంద పురాణంలోని ప్రభాస్ ఖండం వివరిస్తోంది.

వేదాలు, పురాణాలు

వేదాలు, పురాణాలు

గుజరాత్ లోని నెలకొని ఉన్న సోమనాథ్ ఆలయంలో పురాణ, ఇతిహాసాలు దర్శనిమిస్తాయి. పురాతన ఆలయమైన ఇందులో అనేక పురాణగాధలు కళ్లకు కడతాయి. భాగవతం, స్కంద పురాణం, శివ పురాణం వంటి ఆనవాళ్లు ఈ ఆలయంలో కనిపిస్తాయి.

శాశ్వత పుణ్యక్షేత్రం

శాశ్వత పుణ్యక్షేత్రం

ఈ పురాతన ఆలయాన్ని అనేక సార్లు కూలగొట్టారు.. మళ్లీ పునర్ నిర్మించారు. ఇస్లాం రాజులు ఈ ఆలయాన్ని కూలగొడితే.. హిందూ రాజులు మళ్లీ పునర్ నిర్మించారు. చివరిసారిగా 1947లో ఈ ఆలయాన్ని వల్లభాయ్ పటేల్ సందర్శించి... మళ్లీ నిర్మించాలని నిర్ణయించారు. పటేల్ మరణం తర్వాత ఈ ఆలయ నిర్మాణం భారత ప్రభుత్వం చొరవతో పూర్తయింది.

మహమ్మద్ గజిని

మహమ్మద్ గజిని

క్రీ. శ 1024 గజనీ మహమ్మద్ ధార్ ఎడారి గుండా ఈ ఆలయానికి చేరుకుని తన దండయాత్రలో భాగంగా మరోసారి సోమనాథ్ ధ్వంసం చేసాడు. ఆలయం తిరిగి గుర్జర్ పరమకు చెందిన మాల్వా రాజైన భోజి, అన్‌హిల్వారాకు చెందిన చోళంకి రాజైన భీమ్‌దేవ్‌ లు క్రీ. శ 1026 నుంచి 1042ల మధ్య ఆలయ పునర్ నిర్మాణం జరిగింది. క్రీ.శ 1296 సోమనాథ్ ఆలయాన్ని మరోసారి సుల్తాన్ అల్లాయుద్దీన్ ఖిల్జీ సైన్యాలు కూల్చేశాయి. మళ్లీ క్రీ శ 1308లో సౌరాష్ట్రా రాజైన మహీపాదావ సోమనాథ్ ఆలయాన్ని పునర్ నిర్మించారు.

ఔరంగజేబ్

ఔరంగజేబ్

క్రీ శ 1375లో సోమనాథ్ ఆలయాన్నిగుజరాత్ సుల్తాన్ మొదటి ముజాఫర్ షాహ్ కూల్చేశాడు. తర్వాత క్రీ శ 1451లో గుజరాత్ సుల్తాన్, క్రీ శ 1701లో మరోసారి ఈ ఆలయం కూల్చబడింది. క్రీ శ 1701లో ఔరంగజేబు ఈ ఆలయాన్ని ధ్వంసం చేసి ఆ రాళ్లతో మసీదు నిర్మించాడు. తర్వాత క్రీ.శ 1783లో పూనా పేష్వా, నాగపూరుకు చెందిన భోన్స్‌లే, ఖోలాపూరుకు చెందిన చత్రపతి భోన్‌స్లే, ఇండోరుకు చెందిన హోల్కార్ రాణి అహల్యాభాయి, గ్వాలియరుకు చెందిన శ్రీమంత్ పతిభువా అందరూ కలిసి ఆలయాన్ని మళ్లీ పునర్ నిర్మించారు.

ఆలయ ప్రవేశానికి స్పెసల్ పర్మిషన్

ఆలయ ప్రవేశానికి స్పెసల్ పర్మిషన్

హిందువులు సోమనాథ ఆలయంలో ప్రవేశించడానికి ఎలాంటి నిబంధన లేదు. కానీ.. హిందువులు కాకుండా వేరే మతస్థులు ఆలయంలో ప్రవేశించాలంటే.. స్పెషల్ పర్మిషన్ అవసరమని మీకు తెలుసా ? నిజమే.. ఇతర మతస్థులు ఆలయంలోకి వెళ్లాలంటే.. ప్రత్యేకంగా పర్మిషన్ తీసుకోవాలి, వెళ్లడానికి సరైన కారణాలు చెప్పాలి, అలాగే అధికారులను ఒప్పిస్తేనే ఆలయ ప్రవేశానికి అర్హులవుతారు.

ఆలయంలో నోటీస్

ఆలయంలో నోటీస్

సోమనాథ్ ఆలయంలోని జ్యోతిర్లింగం హిందువులకు ప్రత్యేకమైనది. ఇటీవలే ఆలయం బయట నోటీస్ పెట్టారు. హిందువులు కాకుండా ఇతర మతస్థులు ఆలయంలో ప్రవేశించాలంటే.. ఆలయ జనరల్ మేనేజర్ తో పర్మిషన్ తీసుకోవాలని వివరిస్తూ ఈ నోటీస్ ఏర్పాటు చేశారు. అనేకసార్లు ఈ ఆలయం మహమ్మదీయుల చేత కూల్చబడంతో భద్రత కట్టుదిట్టం చేశారు. సెక్యూరిటీ ఇష్యూస్ కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆలయ అధికారులు వివరించారు.

నిర్మాణ రీతి

నిర్మాణ రీతి

చాళుక్యుల స్టైల్లో ప్రస్తుతం ఆలయ నిర్మాణం జరిగింది. 150 అడుగల ఎత్తులో ఆలయ శిఖరం ఉంటుంది. సోమనాథ్ ఆలయానికి ఉన్న కలశం బరువు 10 టన్నులు. 27 అడుగుల ఎత్తులో ధ్వజస్తంభం ఉంది. ఈ ధ్వజస్తంభానికి ఉన్న జెండాను రోజుకి మూడు సార్లు మారుస్తారు.

బాణ స్తంభం, మరో అద్భుతం

బాణ స్తంభం, మరో అద్భుతం

సోమనాథ్ ఆలయం నిర్మించిన స్థలానికీ, దక్షిణాన ఉన్న అంటార్కిటిక్ ఖండానికీ మధ్య భూభాగమన్నదే లేదు. ఈ విశేషాన్ని సంస్కృత భాషలో తెలియజేస్తున్న ఒక శాసనం అక్కడి బాణ స్తంభం లేదా యారో పిల్లర్ మీద చెక్కబడింది. వెయ్యి ఏళ్ల క్రితం ఈ బాణ స్తంభం అక్కడి సముద్రతీరాన ఉన్న రక్షణకుడ్యముపై నిర్మించారు. ఈ బాణ స్థంభం ఉత్తర దక్షిణ ధృవాల కేంద్ర బిందువుగా భావిస్తారు.

చూశారుగా.. ఇది సోమనాథ్ ఆలయం వెనక ఉన్న ఆశ్చర్యకర, అంతుచిక్కని విషయాలు.

English summary

18 Lesser known facts about Somnath Temple:Mystery about Somnath Temple

Let’s take a look at some fascinating yet unknown facts about the Somnath temple. Facts reveal the temple and its importance for the devotees.
Story first published: Friday, December 18, 2015, 13:14 [IST]
Desktop Bottom Promotion