For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

లైఫ్ ఎంజాయ్ చేయాలంటే ఈ ఆలోచనలకు గుడ్ బై తప్పనిసరి..

By Nutheti
|

నెగ‌టివ్ థాట్స్. వీటి వ‌ల్ల వ‌చ్చే ప్ర‌యోజ‌నం ఏమీ ఉండ‌దు.. కానీ జీవితంలో మ‌న‌ల్ని మ‌రింత వెనక్కి నెట్టేస్తాయి. ఎదుటి వాళ్లు మ‌న గురించి ఏమ‌నుకుంటున్నారు ? మ‌నం త‌ప్పు చేస్తే ఎదుటివాళ్లు ఎలా విమ‌ర్శిస్తారో అన్న ఆలోచనలతో నిరంత‌రం భ‌య‌ప‌డుతూ ఉంటారు. ఎల్ల‌ప్పుడు ఎదుటివాళ్లు మ‌న గురించి ఏం ఆలోచిస్తున్నారో అని చింతిస్తూనే ఉంటారు.

READ MORE: ఆఫీస్ లో ఉన్నప్పుడు మంచి మూడ్&ఎనర్జినిచ్చే ఫుడ్స్

జీవితాన్ని ఫ్రీగా ఆస్వాదించ‌డానికి చాలామంది సంకోచిస్తూ ఉంటారు. దానికి కార‌ణం మ‌న ఆలోచ‌న‌లు. లైఫ్ గిఫ్ట్ లాంటిది. దీనిపై ఎవ‌రి కంట్రోల్, ఎవరి అథారిటీ ఉండ‌దు.. ఉండకూడదు. సొంత ఆలోచ‌న‌లతో జీవితాన్ని ముందుకు నడిపించినప్పుడే లైఫ్ బ్యూటీఫుల్ గా ఉంటుంది. ఎదుటివాళ్ల ఆలోచ‌న‌ల గురించి ఎందుకు భ‌య‌ప‌డాలి ? ఎదుటి వాళ్ల అభిప్రాయాలను ఎందుకు వ్య‌తిరేకించ‌కూడదు ? ఇలాంటి ప్రశ్నలతో మైండ్ ని స్ర్టాంగ్ గా మార్చుకోండి.

నెగ‌టివ్ థాట్స్ జీవితాన్ని నాశ‌నం చేస్తాయి. ఉద్యోగానికి అప్లై చేయ‌డానికి కొంతమంది భ‌య‌ప‌డుతూ ఉంటారు. మ‌న గురించి మ‌నం పాజిటివ్ గా ఆలోచించ‌లేం. ఛాలెంజ్ లు తీసుకోవ‌డాన్ని వ్యతిరేకించడం, భ‌య‌ప‌డ‌టం మానేయాలి. ఫెయిల్యూర్ అనేది జీవితంలో ఒక భాగ‌మ‌ని.. గుర్తుంచుకోవాలి. ఫెయిల్యూర్ లేకుండా.. విజ‌యం సాధించ‌లేమ‌ని గ్ర‌హించాలి.

READ MORE: 30ఏళ్ళ తర్వాత మగవారు చేయకూడని 9 ఖచ్చితమైన పనులు

నెగ‌టివ్ గా ఆలోచించ‌డం, నెగ‌టివ్ థాట్స్ అనేవి కేవ‌లం భ‌యంతో కూడిన‌వి. వీట‌న్నింటికి దూరంగా ఉండి.. పాజిటివ్ గా ఉండాలి. పాజిటివ్ ఆలోచ‌న‌ల‌తో లైఫ్ లీడ్ చేయ‌డానికి ఎలాంటి ఖ‌ర్చు అవ‌దు. కేవ‌లం కొన్ని టిప్స్ ఫాలో అయితే చాలు. నెగ‌టివ్ ఆలోచ‌న‌ల‌కు ఈజీగా గుడ్ బై చెప్ప‌వ‌చ్చు. నెగ‌టివ్ థాట్స్ కార‌ణంగా కాన్ఫిడెన్స్ కోల్పోతారు. ఎదుటివాళ్లు చెప్పే విష‌యాలు మీ మీద న‌మ్మ‌కాన్ని కోల్పోయేలా చేస్తాయి. ఈ నెగ‌టివ్ ఆలోచ‌న‌ల‌న్నీ అబ‌ద్దాలే. ఈ ఆలోచ‌న‌ల నుంచి బ‌య‌ట‌ప‌డటానికి.. ఇక్కడ 7 మార్గాలున్నాయి.

మీ ఆలోచ‌న‌లు తెలుసుకోవాలి

మీ ఆలోచ‌న‌లు తెలుసుకోవాలి

నెగ‌టివ్ థాట్స్ వ‌చ్చిన‌ప్పుడు వాటిని నోట్ చేసుకుని అవి లైఫ్ లో తీసుకునే నిర్ణ‌యాల‌పై ఎలాంటి ప్ర‌భావం చూపుతున్నాయో తెలుసుకోవాలి. కొంత స‌మ‌యం కేటాయించి వివిధ సంద‌ర్భాల్లో రోజంతా ఎలా ఉంటున్నారో నోట్ చేసుకోవాలి. నెగ‌టివ్ థాట్స్ గురించి రాసుకుని అవి ఎందుకు వ‌చ్చాయో తెలుసుకోవాలి. దీనివ‌ల్ల నెగ‌టివ్ ఆలోచ‌న‌లు జీవితంపై ఎలాంటి ప్ర‌భావం చూపుతున్నాయో తెలుసుకోవ‌చ్చు. అంతేకాదు నెగ‌టివ్ థాట్స్ నుంచి బ‌య‌ట‌ప‌డాల‌న్న ఆలోచ‌న వ‌స్తుంది. జీవితాన్ని హాయిగా ఎంజాయ్ చేయ‌వ‌చ్చు.

నెగ‌టివ్‌గా ఆలోచిస్తున్నారంటే మ‌న‌సుకి అబ‌ద్దం చెబుతున్న‌ట్లే

నెగ‌టివ్‌గా ఆలోచిస్తున్నారంటే మ‌న‌సుకి అబ‌ద్దం చెబుతున్న‌ట్లే

మీరు ఎప్పుడైతే నెగ‌టివ్ గా ఆలోచిస్తున్నారో, చింతిస్తున్నారో అప్పుడు మీకు మీరే అప‌ద్దం చెప్పుకున్న‌ట్టే. భ‌విష్య‌త్ ని ఎవ‌రూ అంచ‌నా వేయ‌లేం.. జ‌ర‌గ‌బోయేదాన్ని ఎవ‌రూ ఆప‌లేం. కాబ‌ట్టి దాని గురించి ఆలోచించ‌డం వ‌ల్ల ప్ర‌యోజ‌నం ఉండ‌దు. దీనికి ప‌రిష్కారం పాజిటివ్ గా ఆలోచించ‌డం. మంచి గురించి ఆలోచిస్తేనే మంచి జ‌రుగుతుంది.

మిమ్మ‌ల్ని న‌మ్మండి

మిమ్మ‌ల్ని న‌మ్మండి

నెగ‌టివ్ గా ఆలోచిస్తున్నారంటే.. మిమ్మ‌ల్ని మీరు న‌మ్మ‌డం లేద‌ని, మీపై న‌మ్మ‌కం లేద‌ని అర్ధం. ఇత‌రులు మిమ్మ‌ల్ని ఇష్ట‌ప‌డ‌టం లేద‌నే ఎక్కువ‌గా భావిస్తారు.. అదే మీరు ఏ ప‌ని చేసినా ప‌ర్ఫెక్ట్ గా చేస్తే.. ఎదుటి వాళ్ల నుంచి నెగ‌టివ్ రెస్పాన్స్ ఉండ‌ద‌ని గ్ర‌హించాలి. కాబ‌ట్టి మీ మైండ్ కి మీరే శిక్ష‌ణ ఇవ్వండి. దేవుడి మీద న‌మ్మ‌కం, మీ మీద భ‌రోసా ఉండేలా మైండ్ ని మార్చుకోవాలి.

కొంత నెగ‌టివ్ ఆలోచ‌న‌లు అవ‌స‌రం

కొంత నెగ‌టివ్ ఆలోచ‌న‌లు అవ‌స‌రం

కొన్ని సంద‌ర్బాల్లో కొంచెం నెగ‌టివ్ గా ఆలోచించ‌డం వ‌ల్ల మ‌రింత ఎఫ‌ర్ట్ పెడ‌తారు, ఓవ‌ర్ కాన్ఫిడెన్స్ ను అరిక‌ట్ట‌వ‌చ్చు. అయితే మ‌రీ ఎక్కువ నెగ‌టివ్ ఆలోచ‌న‌లు రాకుండా కాపాడుకోవాలి. దీనివ‌ల్ల జీవితంలో ఫెయిల్యూర్స్ దూరంగా ఉంటాయి. అన్ని ఆలోచ‌న‌ల‌కు వెల్ క‌మ్ చెప్పాలి. కానీ.. ఏది అవ‌స‌ర‌మో దాన్ని మాత్ర‌మే తీసుకోవాలి.

గ‌తంలో బాధించిన ఆలోచ‌న‌లు

గ‌తంలో బాధించిన ఆలోచ‌న‌లు

గ‌తంలో వ‌చ్చిన ఫెయిల్యూర్స్, అనుభ‌వాలే నెగ‌టివ్ ఆలోచ‌న‌లు, భ‌యానికి కార‌ణం. గ‌తంలో జ‌రిగిన విష‌యాల‌ను మ‌రిచిపోవాలి, అలాంటి విష‌యాలే మిమ్మ‌ల్ని మ‌రింత స్ర్టాంగ్ గా చేస్తాయి. కాబ‌ట్టి మీలో ఉండే వీక్ పాయింట్స్ గురించి ఆలోచించి దానిపై వ‌ర్క‌వుట్ చేయ‌డం వ‌ల్ల ఫ‌లితం ఉంటుంది.

ఫోర్స్

ఫోర్స్

త‌ప్పు ఆలోచ‌న‌లు కాకుండా.. స‌రైన ఆలోచ‌న‌లు వ‌చ్చేలా మైండ్ ని ఫోర్స్ చేయండి. క‌రెక్ట్ గా ఆలోచించ‌డం వ‌ల్ల ఏది చేసినా స‌క్సెస్ అవుతుంది. కాబ‌ట్టి నెగ‌టివ్ ఆలోచ‌న‌లకు వెళ్ల‌కుండా బ్రెయిన్ ని క‌ట్ట‌డి చేయండి. నెగ‌టివ్ ఆలోచ‌న‌ల నుంచి బ్రెయిన్ ని డైవ‌ర్ట్ చేయండి. మంచిగా ఆలోచించ‌డం వ‌ల్ల ఎలాంటి హాని జ‌ర‌గ‌దు.. మీకే సంతోషం క‌లుగుతుంది.

నెగ‌టివ్ ఆలోచ‌న‌ల‌ను ఎప్ప‌టికీ న‌మ్మ‌వ‌ద్దు

నెగ‌టివ్ ఆలోచ‌న‌ల‌ను ఎప్ప‌టికీ న‌మ్మ‌వ‌ద్దు

ఒక‌వేళ మీరు నెగ‌టివ్ ఆలోచ‌న‌ల నుంచి బ‌య‌ట‌ప‌డ‌లేక‌పోతుంటే.. అలాంటి ఆలోచ‌న‌ల‌ను న‌మ్మ‌డం మానేయండి. ఇలా చేయ‌డం వ‌ల్ల పాజిటివ్ ఆలోచ‌న‌లు మైండ్ లోకి వ‌స్తాయి. పాజిటివ్ ఆలోచ‌న‌ల కారణంగా ప‌నిలో వృద్ధి పెరుగుతుంది, విజ‌యం సాధిస్తారు. జీవితం సంతోషంగా ఉంటుంది.

English summary

7 Ways To Stop Negative Thoughts in telugu

Negative thoughts! All of us get these annoying thoughts, which do nothing except let us down in every aspect of life. We usually fear what other people think about us or how people might criticise us in case we are wrong. We constantly keep worrying about what other people might be thinking about us all the time.
Story first published: Wednesday, November 18, 2015, 16:36 [IST]
Desktop Bottom Promotion