For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

International Youth Day Special: యవ్వనంలో ఉన్నప్పుడు చేయాల్సిన పనులు

ఇంటర్నేషనల్ యూత్ డే స్పెషల్: నేటి యువతే రేపటి భవిత

|

నేటి యువతే రేపటి భవిత అంటారు . యువతకు గల శక్తి అంతులేనిది . . అపారమైనది . దేశ ఉన్నతికి , ఔన్నత్యానికి ఈ శక్తిని ఫణం గా పెడితే అన్నీతిరుగులేని విజయాలే ఉంటాయి. వారి విజయాలు వ్యక్తిగతం మాత్రమే కాదు , సామాజికమైనవి ,. తద్వారా జాతీయం , అంతర్జాతీయం అయినవి . ఈ శక్తి ఎప్పుడూ అనుకూల పధం సాగాల్సి ఉంది . యువ శక్తి దేశానికి ఎంత మేలు చేస్తుందో .. గతి తప్పితే అంతకు రెట్టింపు కీడుచేస్తుంది .

నేటి తరానికి బాధ్యతలు గుర్తు చేసేందుకు , యువతకు గల శక్తిని చాటి చెప్పేందుకు గాను గత పదేళ్ళుగా అంతర్జాతీయ యువజనోత్సవాన్ని నిర్వహిస్తూ వస్తున్నారు .

READ MORE: ఈనాటి యువత డబ్బు పొదుపు చేయటానికి 11 చిట్కాలు

అంతర్జాతీయ యువ దినోత్సవమును ప్రతి సంవత్సరం ఆగస్టు 12 న జరుపుకుంటారు. ఐక్యరాజ్యసమితి యువత కోసం చేపట్టిన ప్రపంచ కార్యాచరణ కార్యక్రమం పట్ల యువతకు అవగాహన కలిగించేందుకు అంతర్జాతీయ యువ దినోత్సవంను ప్రకటించింది. మొదటి అంతర్జాతీయ యువ దినోత్సవం ఆగస్టు 12, 2000 లో జరిగింది.

ధరిత్రీ దినోత్సవం వంటి ఇతర రాజకీయ అవగాహన దినోత్సవాల మాదిరిగా ఈ దినోత్సవమును జరుపుకోవడం వలన యువత దృష్టిని ఆకర్షించడం ద్వారా ప్రయోజనం చేకూరుతుంది. సాంస్కృతిక మరియు చట్టపరమైన సమస్యలు ద్వారా అపాయంలో చిక్కుకున్న జనాభాకు ఇటువంటి దినోత్సవాల అవసరం ఉంది.

READ MORE: మద్యం మత్తులో యువత..నేటి సరదాలే రేపటి విషాదాలు..!

ఇంటర్నేషనల్ యూత్ డే సందర్భంగా యవ్వనంలో ఉన్నవారు కొన్ని ప్రత్యేకమైన పనులు చేయాలి . మంచి భవిష్యత్ కోసం గట్టి పునాది వేసుకోవాలి. డబ్బు సంపాందించాలి ? మంచి ప్రేమను పొందాలి...ఇంకా ప్రేమను పంచాలి . ముఖ్యంగా మంచి ఫ్రెండ్స్ ను కలిగి ఉండటం కూడా గొప్పవిషయమే . అదేవిదంగా కొత్త విషయాల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడం కొత్త విషయాలను నేర్చుకోవడం ముఖ్యం. మీరు ఎప్పుడైతే యంగ్ ఏజ్ లో ఉంటారో అప్పుడు ఎక్కువగా కష్టపడితే మిడిల్ ఏజ్ లో సంతోషంగా గడపగలరు . మరి యువత కోసం కొన్ని చిట్కాలు క్రింది విధంగా...

మీకు నచ్చిన దానికి కోసం వెతుక్కోవడం:

మీకు నచ్చిన దానికి కోసం వెతుక్కోవడం:

జీవితంలో మీరు సంతోషంగా దేని ద్వారా అయితే గడపగలరో దాన్ని వెతుక్కోవడం . అది మీరు యవ్వనం లో ఉన్నప్పుడు మాత్రమే చేయగలరు . తర్వాత జీవిన విధానంకు ఇది గొప్పగా సహాయపడుతుంది.

జీవిత ఆశయం:

జీవిత ఆశయం:

మీకు ఏదైనా జీవితాశయాలున్నట్లైతే వాటిని యవ్వనంలోనే నెరవేర్చుకోవడానికి ప్రయత్నించండి. ఉదాహరణకు : సంగీత విద్వాసులు, ఆర్ట్స్ లో ఎక్స్ పర్ట్స్, సైంటిస్టులు etc..

కెరీర్ ఎక్స పరిమెంట్:

కెరీర్ ఎక్స పరిమెంట్:

మీరు ఎక్కువ బాధ్యతలు మరియు కుటుంబ సమస్యలు లేనప్పుడు మీ కెరీర్ కు సంబంధించి కొన్ని విషయాల్లో డిఫరెంట్ గా ప్రయత్నించవచ్చు . ఏ ప్రయత్నం చేయాలన్నా 30ఏళ్ళలోపు పూర్తి చేసుకోవడం మంచిది.

 డబ్బు సేవ్ చేసుకోవడం:

డబ్బు సేవ్ చేసుకోవడం:

మీరు యవ్వనంలో ఉన్నప్పుడే డబ్బు సంపాధించుకోవడం, డబ్బును పొదుపు చేసుకోవడం వల్ల మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చు. అంతే కాదు వయస్సైన తర్వాత శారీరకంగా మరియు మానసికంగా ఎలాంటి ఇబ్బందులుండవు .

ప్రేమలో పడటం:

ప్రేమలో పడటం:

యవ్వనం ఒక్కసారే వస్తుంది. అలాంటి యవ్వనాన్ని వ్రుదా చేయకుండా మీకు నచ్చిన విధంగా ఉపయోగించుకోవాలి. మీకు నచ్చిన వారితో ప్రేమలో పడటం ఒక్క యవ్వనంలోనే సాద్యం అవుతుంది. వయస్సు మీరిన తర్వాత నిజమైన ప్రేమను పొందడానికి కష్టం అవుతుంది.

 అబ్రాడ్ వెళ్లండి:

అబ్రాడ్ వెళ్లండి:

యవ్వనంలో ఉన్నప్పుడు కుటుంబంతో మరియు డబ్బు పరంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉన్నట్లైతే మీకు నచ్చిన ఇతర ప్రదేశాలకు, దేశాలను చుట్టి రావాలి. యవ్వనంలో ఉన్నప్పులు ఇలా వెళ్ళి రావడం వల్ల సాంప్రదాయాలు అలవడుతాయి.

బుక్స్ చదవడం:

బుక్స్ చదవడం:

యవ్వనంలో ఉన్నప్పుడు ఎక్కువగా బుక్స్ ను చదవడం అలవాటు చేసుకోవడం. ఏది చదివినా జీవితంలో బాగా గుర్తుపెట్టుకోగల వయస్సు యవ్వనం.

చెడు అలవాట్లను దూరం చేసుకోవాలి:

చెడు అలవాట్లను దూరం చేసుకోవాలి:

యవ్వనంలో ఉన్నప్పుడే జీవితానికి ఒక మంచి పునాది వేసుకోవాలి. అలాంటి జీవిత లక్ష్యం పెట్టుకొన్నవారు , చెడు అలవాట్లకు, చెడు వ్యసనాలకు బానిసలుకాకూడదు . స్మోకింగ్, డ్రింకింగ్ వంటి చెడు అలవాట్లను దూరం చేసుకోవాలి.

English summary

International Youth Day Special: 8 Things To Do When You Are Young

International Youth Day Special: 8 Things To Do When You Are Young, Though age is just a number, it is a fact that life is going to be short. One day, you may grow old and might not be in a position to do things energetically.
Desktop Bottom Promotion