For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీ ఆత్మీయుల కోసం క్రిస్మస్ కు ఎలాంటి గిప్ట్స్ ఎంపిక చేసుకోవాలి...?

మరికొద్ది రోజుల్లో క్రిస్టియన్స్ అంతా కోలాహలంగా జరుపుకొనే 'క్రిస్మస్'ఫెస్టివల్ రానే వచ్చేస్తోంది. ఇప్పటికే 'శాంతా క్లాజ్'లు వివిధ రకాల బహుమతులను కొనడం, ఇంటి డెకరేషన్లో మునగడం ఇప్పటికే సందడి చేసేస్తుంట

|

మరికొద్ది రోజుల్లో క్రిస్టియన్స్ అంతా కోలాహలంగా జరుపుకొనే 'క్రిస్మస్'ఫెస్టివల్ రానే వచ్చేస్తోంది. ఇప్పటికే 'శాంతా క్లాజ్'లు వివిధ రకాల బహుమతులను కొనడం, ఇంటి డెకరేషన్లో మునగడం ఇప్పటికే సందడి చేసేస్తుంటారు. పిల్ల హడావిడి గురించి అయితే చెప్పక్కర్లేదు..ఈ పండుగ హాడావిడి అంతా ..ఇంతా కాదు... ఎక్కడెక్కడో ఉన్న బంధువులు, స్నేహితులతో ఇంటి వాతావరం కాస్తా చాలా ఆహ్లాదంగా మారిపోతుంది.

గర్ల్ ఫ్రెండ్ కోసం క్రిస్మస్ గిఫ్ట్ లు: టాప్ 9 బెస్ట్ గిప్ట్స్

మరి ఇలాంటి సంతోకరమైన...ఆహ్లాదకరమైన సందర్భాల్లో సన్నిహితులకు, స్నేహితులకు, బంధువులకు ప్రత్యేకంగా మనతరపు బహుమతులు ఇవ్వకపోతే ఎలా? నిజమే...కానీ ఎలాంటి బహుమతులు ఇవ్వాలో చాలా మందికి తెలియదు. అందుకోసం కొన్ని ఐడియాలు మీకోసం...

1. స్మూత్ కేక్స్ :

1. స్మూత్ కేక్స్ :

క్రిస్మస్ అనాగానే మనందరీకి గుర్తుంచేది నోరూరించే కేక్స్. అందుకే అతిధులకు ఆతిధ్యం ఇవ్వడానికి , స్నేహితులు, సన్నిహితులకు శుభాకాంక్షలు తెలుపుతూ పంచుకోండానికి రుచికరమైన కేక్ ను ఎలాగూ సిద్దం చేస్తారు. వాటితో ాపటు బహుమతిగా ఇవ్వడానికి కూడా కేకులను ఎంపిక చేసుకోవచ్చు. ఆసక్తి, ఉండాలనే కానీ..చిన్న చిన్న కప్ కేక్స్ ను ఇంట్లోనే తయారుచేసి అందంగా గిప్ట్ ప్యాక్ చేసి అథితులకు, శ్రేయోభిలాషులకు అందిస్తే ఎంత బాగుంటుంది . స్వయంగా మీకోసమే చేసమని చెబితే మరింత సంతోషిస్తారు కూడా...

2. కలర్ ఫుల్స్ చాక్లెట్స్:

2. కలర్ ఫుల్స్ చాక్లెట్స్:

క్రిస్మస్ కు కేక్ తర్వాత అధిక ప్రాధాన్య ఇచ్చేది చాక్లెట్స్ కే.. చిన్నా, పెద్దా తేడా లేకుండా అందరూ వీటిని ఇష్టపడుతారు. మన అభిరుచులకు అనుగుణంగా వివిధ రకాల ఫ్లేవర్ చాక్లెట్స్ ఇప్పుడు మార్కెట్లో అందుబాటులో ఉంటున్నాయి. ప్రత్యేకించి గిప్ట్ గా ఇవ్వడానికి ప్యాక్ చేసినవి కూడా ఉంటాయి. వాటిలోంచి మీకు నచ్చింది ఎంపిక చేసుకొని గిప్ట్ ఇచ్చేయండి. లేదా మీరే స్వయంగా తయారుచేసి మీరే ప్యాక్ చేసి కూడా ఇవ్వొచ్చు

3. డెలిషియస్ స్వీట్స్:

3. డెలిషియస్ స్వీట్స్:

కేవలం కేక్స్, చాక్లెట్స్ మాత్రమే కాదు...రుచికరమైన..నోరూరించే సాఫ్ట్ స్వీట్ కూడా గిఫ్ట్ గా ఇవ్వొచ్చు. క్రిస్మస్ పండుగ రోజు స్వీట్స్ తో నోరు తీసి చేసుకోవాలని ఎవరు కోరుకోరు చెప్పండి? అయితే మీరు గిప్ట్ గా ఇచ్చే ముందు వారు ఎలాంటి స్వీట్స్ ఇష్టపడుతారో తెలుసుకొని ఇవ్వడం వల్ల వారు మరింత సంతోషపడుతారు.

4. ప్రత్యేకించి, వ్యక్తిగతంగా:

4. ప్రత్యేకించి, వ్యక్తిగతంగా:

ఇవే కాదు...మనం గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్న వ్యక్తి అవసరాలు, అభిరుచులకు అనుగుణంగా కూడా వారికి బహుమతులు ఇవ్వొచ్చు. బుక్స్ ఎక్కువ చదివే అలవాటున్న వారికి మంచి బుక్స్, సినిమాలు ఎక్కువగా చూసేవారికి డీవీడి ప్లేయర్స్, ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ ను ఇష్టపడేవారికి మొబైల్స్..ఇంకా వివిధ రాకల యాక్సెసరీస్, చీరలు, డ్రెస్సులు, వాచీలు...ఇలా ఏవైనా గిఫ్ట్ లుగా అందవ్వొచ్చు.

5. ప్లవర్ వాజులు:

5. ప్లవర్ వాజులు:

ఇంటిని అందంగా అలంకరించుకోవడానికి వీలుగా ఉండే చక్కని ప్లవర్ వాజులు కూడా గిప్ట్ గా ఇవ్వడానికి ఎంపిక చేసుకోవచ్చు. అయితే క్రిస్మస్ థీమ్ కు ఫర్ఫెక్ట్ గా నప్పే విధంగా ఎంచుకుంటే కొంచెం ప్రత్యేకంగా ఉంటుంది. ఇంకా సింపుల్ గా అయిపోవాలనుకుంటే మంచి ఫ్లవర్ బొకే ఒకటి తీసుకెళ్లి ఇవ్వండి. లేదా గుమ్మానికి తగిలించే రెత్ (క్రిస్మస్ కోసం ప్రత్యేకంగా రూపొందించే పుష్పగుచ్చం)ని కూడా బహుమతిగా ఇవ్వొచ్చు.

6. అలంకరణకు:

6. అలంకరణకు:

ఇంటిఅలంకరణలో బాగమైనవి క్రిస్మస్ థీమ్ తో ఉన్న లామినేటెడ్ పెయింటింగ్స్, క్రిస్మస్ ట్రీ పెయింటింగ్స్ వంటివి కూడా గిప్ట్ గా అందివ్వొచ్చు. ఇంకా క్రిస్మస్ లైట్స్, ఎల్ ఇడి బల్బ్స్ ఇస్తే కూడా వారి ఇంట్లో కాంతులు నింపిన వారు అవుతారు.

7. డ్రై ఫ్రూట్స్ :

7. డ్రై ఫ్రూట్స్ :

పైన చెప్పిన బహుమతులే కాదు, ఇటు ఆరోగ్యానికి, అటు సంతోషానికి కారణం అయ్యే డ్రైఫ్రూట్స్ అండ్ నట్స్ ను కూడా గిప్ట్ ప్యాక్ తో అందిస్తే మీ శ్రేయోభిలాషుల్లో ఆరోగ్యాన్ని నింపిన క్రిస్మస్ తాత మీరే అవుతాయి.

8. సెలవు మీ స్నేహితురాలు కోసం ఒక సెలవు బహుమతిగా చెయ్యవచ్చు .

8. సెలవు మీ స్నేహితురాలు కోసం ఒక సెలవు బహుమతిగా చెయ్యవచ్చు .

మీరు ఇద్దరూ ఎప్పటి నుండో చూడాలని అనుకొంటున్న ప్రదేశంను క్రిస్మస్ గిప్ట్ గా క్రిస్మెస్ సెలవులకు ఆమెను ఆప్రదేశానికి తీసుకెల్ళండి .

9. వైన్:

9. వైన్:

అలాగే క్రిస్మస్ పార్టీ సెలబ్రేట్ చేసుకోవడానికి వైన్ ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. క్రిస్మస్ కు స్పెషల్ గా వైన్ ఎందుకు తీసుకుంటారంటే ఇది క్రైస్ట్ రక్తంకు సంకేతం అని భావిస్తారు. అందుకే వైన్ ను ఓ స్పెషల్ గిప్ట్ గా ఇవ్వొచ్చు.

10. ఇంకా మరెన్నో గిఫ్ట్ లో అప్పుడే మార్కెట్లో కళకళలాడుతూ మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి.

10. ఇంకా మరెన్నో గిఫ్ట్ లో అప్పుడే మార్కెట్లో కళకళలాడుతూ మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి.

అందుకు మనం చేయాల్సిందల్లా వాటిలోంచి మంచి గిఫ్ట్ ను ఎంపిక చేసుకొని, నచ్చినవారికి అందివ్వడమే...

English summary

TOP 10 Gift Ideas for Christmas..!

Christmas is the time for giving. But you don't want to give your friends and family the same gift every year. So, you strive for fresh Christmas gift ideas every year. Wines make very thoughtful gifts. And when it comes to Christmas, wines also have a special significance.
Desktop Bottom Promotion