కొత్తగా పెళ్లైన కపుల్స్ ఏడాదిలోపు చేయకూడని పొరపాట్లు..!!

Posted By:
Subscribe to Boldsky

పెళ్లి అంటే జీవితాంతం ఒకరినొకరు కలిసి ఉంటామనే నమ్మకంతో ముడిపడే బంధం. చాలా ఓర్పు, నమ్మకం, అర్థం చేసుకునే తత్వం, ఒకరి అభిరుచులు ఒకరు గౌవరించడం చాలా అవసరం. అప్పుడే.. ఇద్దరి మధ్య మూడుముళ్ల బంధం కలకాలం హ్యాపీగా, జాలీగా సాగిపోతుంది.

A newly married couple should never do these things!

అయితే ఇవి మాత్రమే కాకుండా.. భార్యాభర్తలు కొన్ని విషయాలకు దూరంగా ఉండాలి. ముఖ్యంగా.. కొత్తగా పెళ్లైన జంట కొన్ని పనులను ఎట్టిపరిస్థితుల్లో చేయకూడదు. అప్పుడే.. వాళ్ల వైవాహిక బంధం సక్సెస్ అవుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి.

భార్యాభర్తలు ఎట్టిపరిస్థితుల్లో శృంగారం చేయకూడని ప్రదేశాలు..!

కొత్తగా పెళ్లి అయిందంటే.. రకరకాల ప్లాన్స్, రకరకాల ఆలోచనలు, ఒకరికి తెలియకుండా మరొకరు చాలా సర్ ప్రైజింగ్ ప్లాన్స్ చేసి ఉంటారు. కానీ.. కొత్తగా పెళ్లైన కపుల్స్ ఏడాది గడిచేవరకు కొన్ని పనులకు దూరంగా ఉండాలి, వాటిని ఎట్టిపరిస్థితుల్లో చేయకూడని శాస్త్రాలు వివరిస్తున్నాయి. మరి అవేంటో చూద్దామా..

పుణ్యక్షేత్రం

పుణ్యక్షేత్రం

పెళ్లైన తర్వాత చాలామంది కపుల్స్ హనీమూన్ వెళ్తారు. అయితే మీరు వెళ్లే ప్లేస్ పుణ్యక్షేత్రం కాకూడదు. కాబట్టి చాలా జాగ్రత్తగా మీ హనీమూన్ ని ప్లాన్ చేసుకోండి. పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధి చెందిన ప్రాంతానికి హనీమూన్ కి వెళ్లకూడదు.

శివుడు

శివుడు

ఒకవేళ మీరు హనీమూన్ కి వెళ్లినప్పుడు పుణ్యక్షేత్రం సందర్శించాలి అనుకుంటే.. శివాలయానికి మాత్రం వెళ్లకండి. అలా హనీమూన్ కి వెళ్లినప్పుడు శివాలయానికి వెళ్లడాన్ని అపవిత్రంగా శాస్త్రాలు చెబుతున్నాయి.

శివలింగం

శివలింగం

పెళ్లైన ఏడాదిలోపు మహిళలు శివలింగంను ముట్టుకోకూడదు. ఏడాది దాటిన తర్వాత ఆమెకు ఎలాంటి నిబంధనలు ఉండవు.

పార్వతి

పార్వతి

శివలింగంను పూజించకుండా.. పెళ్లైన మొదటి ఏడాది ఆ మహిళ పార్వతి దేవిని పూజించవచ్చు. ఆరోగ్యం, సంక్షేమం, కుటుంబ సంతోషం కోసం పార్వతిని మహిళలు పూజిస్తే మంచి జరుగుతుంది.

శివలింగాన్ని దర్శిస్తే

శివలింగాన్ని దర్శిస్తే

ఒకవేళ కొత్తగా పెళ్లైన జంట శివలింగాన్ని దర్శించుకుంటే.. కొన్నిరోజుల పాటు శారీరకంగా దూరంగా ఉండాలి. కన్సీవ్ అవకుండా జాగ్రత్తపడాలి.

బెడ్ రూం

బెడ్ రూం

పెళ్లైన కపుల్స్ బెడ్ రూం.. ఇంటికి నైరుతి భాగంలోనే ఉండాలి. ఎట్టిపరిస్థితుల్లో ఆగ్నేయంలో ఉండకూడదు. ఒకవేళ ఆగ్నేయంలో బెడ్ రూం ఉంటే.. ఇద్దరి మధ్య సమస్యలు, మనస్పర్థలు వస్తాయి.

బెడ్

బెడ్

అలాగే బెడ్ రూంలో బెడ్ ఖచ్చితంగా నైరుతి భాగంలోనే ఉండాలి. ఉత్తరం, తూర్పు వైపు లేకుండా జాగ్రత్తపడాలి.

నిద్ర

నిద్ర

చెక్క తయారు చేసిన మంచంపైనే నిద్రపోవాలి. అలాగే నైరుతి వైపే తలచేసి పడుకోవాలి.

కలర్

కలర్

బెడ్ రూంలో గోడల కలర్ ఎట్టిపరిస్థితుల్లో ఎరుపు కాకూడదు. అలాగే గ్రీన్, లైట్ బ్లూ, రోజ్ పింక్ వంటి రంగుల్లోనే ఉండాలి.

అద్దం

అద్దం

కొత్తగా పెళ్లైన కపుల్స్ రూంలో అద్దం, కంప్యూటర్, టీవీ వంటి వస్తువులు ఉండకూడదు. ఇవి వాళ్లిద్దరిపై నెగటివ్ ప్రభావం చూపుతాయి. ఇద్దరి మధ్య మనస్పర్థలకు కారణమవుతాయి.

పెయింటింగ్స్

పెయింటింగ్స్

కొత్తగా పెళ్లైన వాళ్ల ఇంట్లో మరణం, హింస, డిప్రెషన్ వంటి సంకేతాలు అందించే పెయింటింగ్స్ ని పెట్టుకోకూడదు.

English summary

A newly married couple should never do these things!

A newly married couple should never do these things. Read on to know what these things are...
Story first published: Thursday, December 15, 2016, 15:00 [IST]
Please Wait while comments are loading...
Subscribe Newsletter