For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జీవితంపై విరక్తి కలుగుతోందా ? కారణాలివే..

By Nutheti
|

జీవితం చాలా చిన్నది.. కాబట్టి పూర్తీగా అనుభవించాలి. జీవితంలో కొన్ని విషయాలకు దూరంగా ఉన్నప్పుడే జీవితాన్ని ఆనందంగా.. పూర్తీగా అనుభవించడం సాధ్యమవుతుంది. గతంలో జరిగిన విషయాలు గుర్తుచేసుకోవడం, నెగటివ్ టాకింగ్, భవిష్యత్ గురించి ఎక్కువగా ఆలోచించడం.. వంటి విషయాలు జీవితంపై విరక్తి కలిగిస్తాయి.

కొన్ని సందర్భాల్లో మనం చేసే తప్పులు మన వ్యక్తిత్వాన్ని కించపరుస్తాయి. ఇలాంటి నెగటివ్ ఫీలింగ్స్ వల్ల ఎమోషన్స్ కి హర్ట్ చేస్తాయి.. కాన్ఫిడెన్స్ తగ్గిస్తాయి. దీనివల్ల మిమ్మల్ని మీరే అసహ్యించుకుంటారు. ఇవన్నీ చాలా సింపుల్ గా అనిపించినా.. చాలా ముఖ్యమైన విషయాలు. కాబట్టి ఇలాంటి విషయాలకు, ఆలోచనలకు దూరంగా ఉండటం వల్ల జీవితం హ్యాపీగా, అర్థవంతంగా ఉంటుంది. జీవితంలో ఎదురయ్యే ఎలాంటి విషయాలు.. జీవితంలో హ్యాపీగా ఎంజాయ్ చేయకుండా చేస్తాయో ఇప్పుడు చూద్దాం..

గతంలోని తప్పులు

గతంలోని తప్పులు

గతంలో చేసిన తప్పులు గుర్తు చేసుకుని బాధపడటం కంటే.. వాటి నుంచి మరోసారి పొరపాట్లు జరగకుండా జాగ్రత్తపడటం నేర్చుకోవాలి. గతంలో జరిగిన విషయాల గురించి చింతించడం, పగ పెంచుకోవడం వల్ల జీవితంలో ఆనందాన్ని కోల్పోతారు.

ఆర్థికంగా

ఆర్థికంగా

మీ ఆర్థిక పరిస్థితులను బట్టి.. జీవితంలో ముందడుగు వేయడం అవసరం. సంపాదన కంటే ఎక్కువ ఖర్చు చేయడం వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆర్థిక పరిస్థితులు దెబ్బతింటే.. ఒత్తిడికి లోనవుతారు. కాబట్టి.. అవసరమైనంత వరకు మాత్రమే ఖర్చు చేయాలి.

ఇతరులతో పోల్చుకోవడం

ఇతరులతో పోల్చుకోవడం

ఎవరికి వారు ప్రత్యేకం. ఇతరులతో పోల్చుకోవడం మానేయాలి. ఇతరులలాగా ఉండాలని అనుకోవడం వల్ల మీ గుర్తింపు కోల్పోతారు. అయితే ఇతరుల గుణాలు పొగడటం తప్పుకాదు.. కానీ మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేసుకోవడం సరికాదు. కాబట్టి ఇతరులతో పోల్చుకునే అలవాటు మానేయాలి.

రిలేషన్స్

రిలేషన్స్

మీ జీవితాన్ని అసహనంగా మార్చేసే వ్యక్తులతో సంబంధం పెంచుకోకూడదు. అలాంటి రిలేషన్స్ కి దూరంగా ఉండాలి. కాబట్టి నెగటివ్ పీపుల్స్ కి దూరంగా ఉండటం మంచిది. అప్పుడే మీ జీవితం హ్యాపీగా ఉంటుంది.

నెగటివ్ సెల్ఫ్ టాక్

నెగటివ్ సెల్ఫ్ టాక్

నెగటివ్ ఆలోచనలు మీమీద చాలా దుష్ర్పభావం చూపిస్తాయి. మీ మనసుని మీరు కంట్రోల్ చేసుకోవాలి. మిమ్మల్ని మీరు కించపరుచుకోకుండా.. మీ తప్పులు పదే పదే గుర్తు చేసుకోకుండా ఉండాలి. మీ మనస్తత్వాన్ని.. మీ మనసుని మీరే గుర్తించాలి.

ఇబ్బంది కలిగించే వస్తువులు

ఇబ్బంది కలిగించే వస్తువులు

మిమ్మల్ని ఇబ్బందికి గురిచేసే బట్టలు, షూస్, ఫర్నిచర్ ని మార్చేయండి. జీవితం ఒక్కసారే వస్తుంది.. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న విషయాలతో అసంతృప్తికి గురిచేసుకోకూడదు. ఎప్పుడైతే మీరు కంఫర్టబుల్ గా ఉంటారో.. అప్పుడు మీ జీవితం సంతృప్తికరంగా ఉంటుంది.

ఇష్టంలేని జాబ్

ఇష్టంలేని జాబ్

వర్క్ ముఖ్యమూ కానీ.. మీకు ఇష్టంలేని పని మాత్రం చేయకూడదు. ఇష్టంలేని.. సంతృప్తిలేని ఉద్యోగం మిమ్మల్ని అసహనానికి, ఒత్తిడికి గురిచేస్తుంది. కాబట్టి జీవితాన్ని ఫుల్ గా ఎంజాయ్ చేయడానికి మీకు నచ్చిన.. ఇష్టమైన ఉద్యోగాన్ని ఎంచుకోవడం మంచిది.

English summary

List Of Things That Makes You Unhappy With Life

Life is short and must be lived to the fullest. This is only possible when you avoid certain things in your life. Sometimes, we deliberately make our life hell by introducing past regrets, negative talking, overly worried about future, etc, in our life.
Story first published: Saturday, January 2, 2016, 12:50 [IST]
Desktop Bottom Promotion