For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఇండియన్స్ పాటించే మూఢనమ్మకాల వెనక ఉన్న అసలు సీక్రెట్స్..!!

By Swathi
|

మనం చిన్న వయసులో ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకూ చూస్తూ ఉంటాం.. మన ఇంట్లో పెద్దవాళ్లు ఎన్నో ఆచారాలు పాటిస్తూ వస్తున్నారు. కొన్ని ఆశ్చర్యం కలిగిస్తే.. మరికొన్ని మిస్టరీగా ఉంటాయి. ఎందుకో కారణం తెలియకుండానే ఇప్పటికీ కొన్ని నమ్మకాలను పాటిస్తూ ఉంటారు. అంతేకాదు.. ఈ ఆచారాలు ఇప్పుడు పుట్టినవి కాదు. మన తల్లిదండ్రులు, వాళ్ల తల్లిదండ్రులు అలా మన పూర్వీకుల నుంచి పుట్టుకొచ్చినవి.

మన పూర్వీకులు రాగి పాత్రలనే ఎందుకు వాడేవాళ్లు ?

ఈ ఆచారాల గురించి ఎందుకు, ఏమిటి అన్న క్వశ్చన్ ఎవరూ అడగకపోవడం వల్ల వాటి వెనక ఉన్న అసలు వాస్తవాలు అలా మరుగున పడుతూనే ఉన్నాయి. కారణం తెలియకపోయినా... పాటించకపోతే ఏమవుతుందో అన్న భయంతో ఇప్పటికీ కొన్ని అలవాట్లు అలా కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. ఇంకా కొన్నిసార్లు మన పూర్వీకులు చెప్పినవి కాబట్టి.. అవి ఏదో ఒక కారణం ఉండే ఉంటుందని గుడ్డిగా నమ్మేస్తుంటాం.

హోటల్ రూముల్లో భారతీయులు చేసే పిచ్చి పనులు

ఎన్నో సంత్సరాలుగా పాలో అవుతున్న కొన్ని ఆచారాలు చాలా ఫన్నీగా అనిపిస్తాయి. కానీ మనం పెరిగి పెద్దవాళ్లైయ్యాక అవన్నీ కేవలం మూఢనమ్మకాలే అన్న విషయం అర్థమవుతోంది. ఏ రోజు ఏం చేయకూడదు, ఏ రోజు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని కొన్ని రకాల నమ్మకాలు పాటిస్తూ ఉంటారు. కొన్ని ఆచారాలు కేవలం నమ్మకం, భయంతో పాటిస్తున్నవే చాలా ఉన్నాయి. అవి పాటించకపోతే ఏమవుతుందో అన్న భయంతో ఇలాంటి నమ్మకాలన్నీ ఆచార సంప్రదాయలుగా మారిపోయాయి.

మన భారతీయులు మాత్రమే ఆలోచించకుండా చేసే 8రకాల పనులు

అయితే కొన్నింటి వెనక సైంటిఫిక్ రీజన్స్ ఉంటే.. మరికొన్నింటి వెనక భయం ఉంది.. మరికొన్నింటి వెనక ఉన్న అసలు వాస్తవం తెలిస్తే ఆశ్చర్యపోతాం. అయితే అవి ఎప్పుడో ఒకసారి కాదు.. ప్రతి రోజూ పాటించే ఆచారాలు, నమ్మకాలు కూడా కొన్ని ఉన్నాయి. అయితే ఈ మూఢనమ్మకాలన్నింటి వెనక లాజిక్ ఉందని, సైన్స్ కూడా ఉందని.. తాజాగా తెలుస్తోంది. అలాంటి మూఢనమ్మకాల వెనక ఉన్న ఆసక్తికర వాస్తవాలు, రహస్యాలేంటో ఇప్పుడు చూద్దాం..

మూఢనమ్మకం

మూఢనమ్మకం

కాకిని పూర్వీకులకు ప్రతిరూపంగా భావిస్తాం. అంటే.. మనం వండిన ఆహారాన్ని మొదట కొద్దిగా తీసి.. బయట పెడితే.. మన పూర్వీకులు కాకి రూపంలో వచ్చి తింటారని నమ్మకం ఉంది.

లాజిక్

లాజిక్

కాకులు ఎప్పుడూ మనషులకు దగ్గరగా జీవిస్తూ ఉంటాయి. దీనివల్ల అవి ఆహారాన్ని త్వరగా గుర్తించి, సేవిస్తాయి అంతే. పూర్వీకులు, పెద్దవాళ్లు వస్తారని కాదు.

నిమ్మ, మిర్చి వేలాడదీయం

నిమ్మ, మిర్చి వేలాడదీయం

మూఢనమ్మకం

చాలామంది ఇంటి గుమ్మానికి, వాహనాలకు నిమ్మకాయ, మిరపకాయలు కట్టి వేలాడదీస్తారు. ఇలా కట్టడం వల్ల దుష్టశక్తులు దరిచేరకుండా ఉంటాయని నమ్ముతారు.

లాజిక్

లాజిక్

నిమ్మకాయ, మిరపకాయల్లో మెడిసినల్ గుణాలు ఉంటాయి. ఇవి క్రిమీకీటకాలు, సూక్ష్మక్రిములు దూరంగా ఉండేలా చేస్తాయి. అందుకే ఈ పద్ధతి పాటిస్తారు.

మూఢనమ్మకం

మూఢనమ్మకం

అంత్యక్రియలకు వెళ్లి వచ్చాక స్నానం చేయడం వల్ల స్మశానంలో దుష్టశక్తులు, వ్యతిరేక ప్రభావం, దెయ్యాలు వంటివి చేరకుండా ఉంటాయని స్నానం చేయాలని చెబుతారు.

లాజిక్

లాజిక్

స్మశానంలో వాతావరణం చాలా కలుషితమై ఉంటుంది. అలాగే ఇన్ఫెక్షన్లకు అవకాశాలుంటాయి. అంతేకాదు.. చనిపోయిన వ్యక్తికి ఏదైనా అనారోగ్య సమస్యలు ఉంటే.. అవి సోకే ప్రమాదం ఉంటుందని.. రాగానే స్నానం చేయాలని సూచిస్తారు.

మూఢనమ్మకం

మూఢనమ్మకం

పామును చంపిన తర్వాత తల బతికే ఉంటుందని.. దాన్ని చంపిన వ్యక్తిని గుర్తుపెట్టుకుని తర్వాత తన భార్య పగ తీర్చుకునే అవకాశం ఉందని తలను కూడా చంపేయాలని చెబుతారు.

లాజిక్

లాజిక్

పాము చనిపోయిన తర్వాత కూడా.. తన విషయం ద్వారా మనుషులకు హాని కలుగుతుందని.. దాన్ని పూర్తీగా చంపేయడం మంచిదని చెబుతారు.

మూఢనమ్మకం

మూఢనమ్మకం

ఆత్మలు ఎటాక్ చేసి.. తల్లికి, కడుపులోని బిడ్డకు హాని చేస్తాయని.. బయటకు వెళ్లకూడదని.. సూచిస్తుంటారు మన పెద్దవాళ్లు.

లాజిక్

లాజిక్

పూర్వకాలంలో ట్రాన్స్ పోర్టేషన్ సమస్యగా ఉండేది. అనవసరంగా గర్భిణీలు నడవడం ఇబ్బందికరంగా ఉంటుందని.. బయటకు రాకూడదు, ఇంట్లోనే ఉండాలని ఒక నమ్మకాన్ని క్రియేట్ చేశారు.

మూఢనమ్మకం

మూఢనమ్మకం

భోజనం చేసేటప్పుడు కింద కూర్చుని తినకపోతే.. మన పూర్వీకులు మనస్తాపం చెందుతారని చెబుతుంటారు.

లాజిక్

లాజిక్

కింద కూర్చుని భోజనం చేయడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగ్గా సాగుతుంది. కాళ్లు ముడుచుకుని కూర్చున్నప్పుడు డైజెషన్ కి సమస్యగా ఉండదని ఈ పద్ధతిని అలవాటు చేశారు.

మూఢనమ్మకం

మూఢనమ్మకం

ఉత్తం వైపు తిరిగి పడుకుంటే.. జీవితకాలం తగ్గుతుందని.. మన పూర్వీకుల నమ్మకం.

లాజిక్

లాజిక్

మన శరీరం మన శరీరం ఉత్తర ధ్రువం, భూమి ఉత్తర ధ్రువం ఒకే డైరెక్షన్ లో ఉంటే.. ఒత్తిడి, తలనొప్పి ఎక్కువగా వస్తాయి. దీనివల్ల ఈ దిశగా తలపెట్టుకుని పడుకోకూడదని ఒక నమ్మకం ఏర్పరచారు.

మూఢనమ్మకం

మూఢనమ్మకం

ఏదైనా పనిమీద బయటకు వెళ్లేటప్పుడు పంచదార, పెరుగు తినడం వల్ల గుడ్ లక్ వరిస్తుందని, వెళ్లిన పనిలో సక్సెస్ అవుతారని నమ్మకం ఉంది.

లాజిక్

లాజిక్

పెరుగు పొట్టను చల్లగా ఉంచుతుంది. పంచదార శరీరంలో గ్లూకోజ్ ఏర్పడటానికి సహాయపడుతుంది. ఈ రెండూ ఆరోగ్యానికి చాలా మంచిది. అందుకే ఇవి తినమని చెబుతారు.

మూఢనమ్మకం

మూఢనమ్మకం

మంగళవారం, గురువారం తలస్నానం చేయడం వల్ల కుటుంబానికి మంచిది కాదని, అపవిత్రమని నమ్ముతారు.

లాజిక్

లాజిక్

పూర్వకాలం నీటి సమస్య ఎక్కువగా ఉండేది. కాబట్టి ప్రతి రోజూ తలస్నానం అంటే.. మరింత ఇబ్బందిగా ఉంటుందని.. ఇలా నమ్మకంగా చెబితే వింటారని.. ఈ కండిషన్ పెట్టారు.

మూఢనమ్మకం

మూఢనమ్మకం

దేవుడిని పూజించడానికి, వరం కోరుకోవడానికి గంట కంపల్సరీ కొట్టాలని నమ్ముతారు.

లాజిక్

లాజిక్

గంట కొట్టడం వల్ల.. మనుషుల శరీరంలోని సెవెన్ సెన్సెస్ తెరుచుకుంటాయి.. అందుకే గుడికి వెళ్తే గంట కొట్టే సంప్రదాయం, ప్రతి గుళ్లో గంట ఉండటానికి అసలు కారణం.

మూఢనమ్మకం

మూఢనమ్మకం

తులసిని లక్ష్మీదేవి అవతారంగా భావిస్తాం. కాబట్టి ఎప్పటికీ ఈ ఆకులను నమలకూడదని నమ్మకం ఉంది.

లాజిక్

లాజిక్

తులసి ఆకులు కొద్దిగా పాషాణంగా ఉంటుంది. ఎప్పుడైతే దీన్ని నములుతారో.. అది పంటి ఎనామిల్ ని నాశనం చేసే అవకాశం ఉంది. కాబట్టి.. తులసి ఆకులను నమలకూడదని చెబుతారు.

మూఢనమ్మకం

మూఢనమ్మకం

రాత్రిపూట గోళ్లు కట్ చేసుకోవడం వల్ల.. బ్యాడ్ లక్ తో పాటు, భవిష్యత్ లో సమస్యలు ఎదురవుతాయని ఒక మూఢనమ్మకం ఉంది.

లాజిక్

లాజిక్

పూర్వకాలం నెయిల్ కట్టర్స్ ఉండేవి కాదు. కాబట్టి అప్పట్టో చాలా పదునుగా ఉండే వాటిని గోళ్లు కట్ చేయడానికి ఉపయోగించేవాళ్లు. అలాగే రాత్రిళ్లు కరెంట్ ఉండేది కాదు. దీనివల్ల హాని కలుగకుండా.. ఉండటానికి జాగ్రత్త కోసం.. రాత్రిళ్లు గోళ్లు కట్ చేసుకోకూడదని చెబుతారు.

మూఢనమ్మకం

మూఢనమ్మకం

సూర్యగ్రహణం సమయంలో.. బయటకు వెళ్తే.. నెగటివ్ గా ఎఫెక్ట్ అవుతుంది అలాగే.. ఆత్మలు చుట్టూ తిరుగుతాయని ఒక నమ్మకం ఉంది.

లాజిక్

లాజిక్

సూర్య గ్రహణం సమయంలో.. సూర్యుడి రేడియేషన్ చర్మంపై చాలా దుష్ర్పభావం చూపుతుంది. అలాగే.. అంధత్వానికి కూడా కారణమవుతుంది. కాబట్టి.. సూర్యగ్రహణం చూడకూడదని చెబుతారు.

మూఢనమ్మకం

మూఢనమ్మకం

ఇంట్లో అద్దం పగిలితే.. బ్యాడ్ లక్ అని చాలామంది ఇప్పటికీ హెచ్చరిస్తూ ఉంటారు.

లాజిక్

లాజిక్

పూర్వం అద్దం కొనాలంటే.. చాలా ఖర్చుతో కూడిన పని. అందులోనూ.. తక్కువ క్యాలిటీవి దొరికేవి. దీంతో.. నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా అద్దంతో జాగ్రత్త.. పగలకూడదనే సింపుల్ ట్రిక్ ప్లే చేశారు. దీన్ని ఏదో చెడు జరుగుతుందనే భయం క్రియేట్ అయింది.

మంగళవారం హెయిర్ కట్ చేయకూడదు

మంగళవారం హెయిర్ కట్ చేయకూడదు

ఇప్పటికీ చాలామంది ఇంట్లో పెద్దవాళ్లు ఉంటే.. మంగళవారం కటింగ్, షేవింగ్ చేసుకోవడానికి అనుమతించరు. ఎందుకు అంటే మాత్రం చేసుకోకూడదు అని చెబుతారు.

లాజిక్

లాజిక్

పూర్వకాలం సోమవారాలు సెలవు ఉండేది. దీంతో అందరూ సోమవారం కటింగ్ చేయించుకునేవాళ్లు. దీంతో మంగళవారాలు సెలూన్ షాపులు మూసేసేవాళ్లు. దీంతో ఇప్పటికీ మంగళవారం కటింగ్ చేయించుకోకూడదని మూఢనమ్మకం పెట్టుకున్నారు.

మూఢనమ్మకం

మూఢనమ్మకం

ఇంట్లో గొడుగు ఓపెన్ చేయకూడదు, మంచిది కాదు అని చెబుతూ ఉంటారు. కానీ మంచిది కాదనేది మూఢనమ్మకం. కారణం చెప్పకుండా.. ఈ పనిచేయకూడని చెబుతుంటారు.

లాజిక్

లాజిక్

గొడుగు ఇంట్లో ఓపెన్ చేస్తే.. చుట్టూ ఉన్న వస్తువులు డ్యామేజ్ అవుతాయని అలా చెప్పేవాళ్లు. ఇది అసలు కారణం. కానీ గొడుగు ఇంట్లో ఓపెన్ చేస్తే ఏ అనర్థం జరుగుతుందో అని చాలా మంది భయపడుతుంటారు.

మూఢనమ్మకం

మూఢనమ్మకం

సాయంత్రం ఇల్లు ఊడిస్తే.. చెడు జరుగుతుందేమో అని ఆ నిబంధనను అలా ఫాలో అవుతూ వస్తున్నారు. కానీ ఇదేమీ పెద్ద నేరం కాదు.

లాజిక్

లాజిక్

సాయంత్రం పూట ఇల్లు ఊడవడం చాలా పెద్ద తప్పుగా భావిస్తారు. ఇప్పటికీ చీకటి పడిందంటే.. చీపురు పట్టుకోవడాన్ని వ్యతిరేకిస్తారు. కానీ.. దీనికి అసలు కారణం ఏంటో తెలుసా ? అప్పట్లో చీకటి పడిందంటే.. పవర్ లేక వెలుతురు చాలా తక్కువగా ఉండేది. దీంతో తెలియకుండా కిందపడిన ఏదైన నగలు, వస్తువులు చెత్తతో పాటు డస్ట్ బిన్ లోకి వేసేస్తారేమో అన్న భయంతో.. ఈ నిబంధన పెట్టారు.

చూశారుగా ఇవి మన ఇండియన్స్ తెలిసీ, తెలియక పాటిస్తున్న ఆచారాలు, మూఢనమ్మకాలు. కాబట్టి కారణం తెలుసుకోకుండా.. అనవసర ఆందోళనకు గురికాకుండా.. తెలియని వాళ్లకు వివరించండి.

English summary

The Science Behind The Common Beliefs We've Been Following All Our Lives!

The Science Behind The Common Beliefs We've Been Following All Our Lives! There are certain rituals we follow in our daily life which are completely stupid when it comes to logic.
Story first published:Monday, June 27, 2016, 12:49 [IST]
Desktop Bottom Promotion