For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కలియుగం ఎవరి చేతుల్లో అంతం అవుతుందో తెలుసా ??

By Swathi
|

హిందూ గ్రంథాల ప్రకారం భూమి అంతరించేది కలియుగంలో అని తెలుస్తోంది. అలాగే కలియుగాంతం సమయంలో.. మనుషుల ప్రవర్తన, మనుషుల ఆలోచనలు, మనుషుల పనితీరు చాలా అసహ్యంగా ఉంటుందని, చెడు కార్యాలకే ఎక్కువ మొగ్గుచూపుతారని మన పురాణాలు చెబుతున్నాయి. అయితే దీనికి పక్కాగా ఎలాంటి శాస్త్రీయ కారణాలు కనిపించడం లేదు.

కలియుగాంతంలో మనుషుల ప్రవర్తన, అలవాట్లు ఎలా ఉంటాయి ?

కానీ హిందూ పురాణాల ప్రకారం.. నాలుగు యుగాలున్నాయి. సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం, కలియుగం. భగవత్ గీత ప్రకారం సత్యయుగంలో మనుషులు ఎలాంటి తప్పులు చేయకుండా.. నిజాయితీగా ఉంటారు. త్రేతాయుగంలో కొంతకాలంలో డబ్బు సంపాదించాలనే కాంక్ష మనుషుల్లో ఎక్కువ అవుతుంది. వంచన, వ్యతిరేక భావం, చెడు పనులు చేస్తారు.

మరణం తర్వాత యమలోకానికి వెళ్లడానికి 47 రోజుల భయంకర జర్నీ..!!

ద్వాపర యుగం వచ్చే సరికి.. మనుషుల్లో చాలా మంది చెడు పనులకు అలవాటు పడిపోతారు. కలియుగంలో మనుషులు ఉన్నతస్థానానికి చేరుకోవడానికి రకరకాలుగా ప్రయత్నిస్తారు. అడ్డదారులు తొక్కుతారు. వయసు, ఎత్తు, బలం, జ్ఞానం, ఆకర్షణ వంటివన్నీ రానురాను కలియుగంలో తగ్గిపోతాయి.

అసలు కలియుగం ఎలా అంతమవుతుంది ? ఎవరి చేతుల్లో కలియుగం అంతం అవుతుంది ? మనుషులు కలియుగాంతంలో చనిపోయే ముందు ఏం గుర్తిస్తారు ? కలియుగాంతం తర్వాత మరో ప్రపంచం ఉద్భవిస్తుందా ? అసలు ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే... ఈ కింది స్లైడ్స్ క్లిక్ చేయండి..

భగవత్ గీత

భగవత్ గీత

భగవత్ గీత ప్రకారం కలియుగం ఒక వ్యక్తి, ఒక అవతారం చేతిలో అంతమవుతుంది. ఎలా ? ఎవరు ?

కల్కి చేతుల్లో కలియుగాంతం

కల్కి చేతుల్లో కలియుగాంతం

కలియుగం కల్కి అవతారంలో విష్ణువు చేతుల్లో అవుతుందని పురాణాలు చెబుతున్నాయి.

చేపలు తినడం

చేపలు తినడం

కలియుగాంతానికి ముందు మనుషులు కేవలం చేపలు మాత్రమే తింటారు. గొర్రె, మేక పాలు మాత్రమే తాగుతారు.

ఆవులు ఉండవు

ఆవులు ఉండవు

భగవత్ గీత ప్రకారం కలియుగం అంతమవడానికి ముందు భూమ్మీద ఆవులు ఉండవట. ఒకరిపై ఒకరికి జాలి ఉండదు.

వ్యతిరేక స్వభావంతో మహిళలు

వ్యతిరేక స్వభావంతో మహిళలు

మహిళలు చాలా చెండాలంగా మాట్లాడతారు. ఎంతో ఓర్పు, సహనానికి మారుపేరైన మహిళలు వ్యతిరేక స్వభావం కలిగి ఉంటారు.

వ్యభిచారాలు ఎక్కువ

వ్యభిచారాలు ఎక్కువ

కలియుంగాతానికి ముందు సూర్య గ్రహణాలు ఉండవు. వ్యభిచారం వంటి అకృత్యాలు విపరీతంగా పెరిగిపోతాయి.

జీవితకాలం 16 ఏళ్లు మాత్రమే

జీవితకాలం 16 ఏళ్లు మాత్రమే

కలియుగం అంతానికి ముందు మనుషుల జీవితకాలం కేవలం 16 సంవత్సరాలు మాత్రమే. అంతకంటే ఎక్కువ బతకలేరు.

7,8 ఏళ్లకే

7,8 ఏళ్లకే

మీకు తెలుసా కలియుగాంతం సమయంలో.. మనుషులు ఏడు, ఎనిమిదేళ్ల వయసులోనే.. మరోజన్మ ఇవ్వగలుగుతారు.

నక్షత్రాల వెలుగు

నక్షత్రాల వెలుగు

కలియుగాంతంకు ముందు ఎక్కడా ఆలయాలు ఉండవు. నక్షత్రాల వెలుగు తగ్గిపోతుంది.

విపరీతమైన వేడి

విపరీతమైన వేడి

భూమ్మీద వేడి విపరీతంగా పెరిగిపోతుంది. ఈ సమయంలోనే విష్ణు అవతారమైన కల్కి జన్మిస్తాడు.

ఉత్తప్రదేశ్ లో కల్కి అవతారం

ఉత్తప్రదేశ్ లో కల్కి అవతారం

ఉత్తరప్రదేశ్ లోని మురాదామాద్ కి చెందిన సాంభల్ గ్రామంలో కల్కి జన్మిస్తాడు.

ధైర్య సాహసాలు

ధైర్య సాహసాలు

కలియుగంలో అవతరించే కల్కి చాలా శక్తివంతమైన, తెలివైన, ధైర్య సాహసాలు కలిగిన వ్యక్తి.

ఆయుధాలు

ఆయుధాలు

కేవలం ఆలోచన ద్వారానే ఆయుధాలు, వాహనాలను తన కళ్ల ముందు తెచ్చుకునే శక్తి సామర్థ్యాలు కలిగి ఉంటాడు కల్కి.

దుర్మార్గుల అంతం

దుర్మార్గుల అంతం

దుర్మార్గులను ఒకరి తర్వాత ఒకరిని చంపుతూ వస్తాడు. అలా అందరినీ చంపేసిన తర్వాత.. మళ్లీ సత్య యుగం ప్రారంభమవుతుంది.

ఐదో బిడ్డగా కల్కి

ఐదో బిడ్డగా కల్కి

తన తల్లిదండ్రులకు కల్కి ఐదో బిడ్డగా జన్మిస్తాడు. తన తండ్రి పేరు విష్ణుయాషా, తల్లి పేరు సుమతి అయ్యే అవకాశాలున్నాయి.

తెల్ల గుర్రంపై కల్కి

తెల్ల గుర్రంపై కల్కి

తెల్ల గుర్రంపై స్వారీ చేస్తూ.. తెల్లగా నిగనిగలాడుతూ ఉంటాడు కల్కి. తనకు కోపం వచ్చినప్పుడు చర్మ రంగు.. డార్క్ గా మారుతుంది.

స్వచ్ఛమైన అవతారం

స్వచ్ఛమైన అవతారం

కల్కి అవతారం ఎలాంటి లోపాలు లేని, స్వచ్ఛమైనది. కల్కి దైవసంబంధమైన గుణాలను కలిగి ఉంటాడు.

పసుపు రంగు దుస్తులు

పసుపు రంగు దుస్తులు

కల్కి పసుపు రంగు బట్టలను మాత్రమే ధరిస్తాడు. అతని చెస్ట్ పై శ్రీవాస్త గుర్తు ఉంటుంది.

అత్యంత శక్తివంతమైన

అత్యంత శక్తివంతమైన

భూమిపై విష్ణువు చివరి అవతారమైన కల్కి అత్యంత శక్తివంతమైనది.

పాపాలు

పాపాలు

భూమి మీద పాపాలు చేసే వ్యక్తుల సంఖ్య విపరీతంగా పెరిగినప్పుడు.. కల్కి జన్మిస్తాడు.

English summary

The World is Predicted to be Destroyed by This Man

The World is Predicted to be Destroyed by This Man. It is said in Hindu religious scriptures, that Kalyuga will be the time of destruction of earth. This is also the time, when people will remain dissatisfied and mentally upset.