For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఇండియన్స్ మాత్రమే నమ్మే బూటకపు విషయాలు..!!

By Swathi
|

ఇండియాలో జరిగే కొన్నివిషయాలు వింతగా, విచిత్రంగా, మూఢనమ్మకంగా అనిపిస్తాయి. కొన్ని తరచుగా వినే తమాషాలు.. చాలా ఆశ్చర్యానికి గురిచేస్తాయి. ఇలాంటి వాటిని నమ్మడమే కాకుండా.. చాలా తేలికగా, వేగంగా.. ప్రపంచమంతా వ్యాపించేస్తాయి.

ఇప్పటివరకు ఇంటర్నెట్ ద్వారా.. మనుషులను ఫూల్స్ చేసిన కొన్ని బూటకపు విషయాలను ఇప్పుడు మీకు వివరించబోతున్నాం. ఇక్కడ చెప్పబోయే వాటిలో కొన్నింటినైనా మీరు నమ్మే ఉంటారు. అలాగే ఫూల్స్ అయ్యామని ఫీలవుతారు కూడా. అవి నిజమే, వాస్తవమే అన్న భ్రమ చాలామందికి ఉంటుంది. ఇండియన్స్ ని ఫూల్స్ ని చేసిన బూటకపు విషయాలేంటో ఇప్పుడు చూద్దాం..

మూడు తలల పాము

మూడు తలల పాము

ఇది ఖచ్చితంగా ఫోటో ఎడిట్ మాత్రమే. ఈ ఫోటోని దగ్గరగా గమనించినట్లైతే.. పాము తల అంతా ఒకే క్రమంలో ఉంది. కాబట్టి.. ఇదంతా ఎడిటింగ్ మహిమ మాత్రమే. కాబట్టి.. ఇది బూటకపు ప్రచారం మాత్రమే.

భారత జాతీయగీతంపై యునెస్కో ప్రకటన

భారత జాతీయగీతంపై యునెస్కో ప్రకటన

భారత జాతీయ గీతంలో ప్రపంచంలోనే అద్భుతమైనదని యూనెస్కో ప్రకటించినప్పుడు ప్రజలంతా ఉబ్బితబ్బిబ్బయ్యారు. ఇండియన్స్ గా చాలా గర్వపడ్డారు. కానీ.. అసలు నిజం.. ఇదంతా బూటకపు ప్రచారం మాత్రమే.

ఆంజనేయుడి గధ

ఆంజనేయుడి గధ

ఈ ఫోటోలో కనిపిస్తున్నది క్లియర్ గానే ఉంది. అక్కడ ఉన్నది ఆంజనేయుడి గధే. అయితే.. ఈ గధ శ్రీలంకలో బయటపడిందని ప్రచారం జరిగింది. కానీ.. తాజాగా ఇది గుజరాత్ లో బయటపడిందని ప్రచారం జరుగుతోంది. కానీ.. ఈ గధను హనుమంతుడి విగ్రహం నుంచి తీయడం జరిగింది.

తాగిన వ్యక్తిని మింగిన పాము

తాగిన వ్యక్తిని మింగిన పాము

లిక్కర్ షాపు పక్కన నిద్రపోతున్న వ్యక్తిని ఈ పాము మింగిందని.. ప్రచారం జరిగింది. ఇది జనాలను భయపట్టే బూటకపు ప్రచారం. కానీ పాము ఒక కుక్కను లేదా జింకను మింగి ఉండవచ్చు.

11 మంది పిల్లలకు జన్మనిచ్చిన మహిళ

11 మంది పిల్లలకు జన్మనిచ్చిన మహిళ

ఈ ఫోటో నిజమే కానీ.. దీనివెనక కథ మాత్రం తప్పు. ఒకే రోజు అది కూడా 11.11.11 న జన్మించిన పిల్లలను ఒకే దగ్గరకు చేర్చి ఫోటో తీశారు. ఇది సూరత్ లో జరిగింది.

రేప్ ఫెస్టివల్

రేప్ ఫెస్టివల్

అస్సాంలో జరిగే రేప్ ఫెస్టివల్ గురించి.. సోషల్ మీడియాలో ఒకటే మెసేజ్ లు, ఆర్టికల్స్ వచ్చాయి. కానీ.. ఇలాంటి ఫెస్టివల్స్ జరగలేదని.. స్థానికులు చెబుతున్నారు.

అదంతా రూమర్స్ మాత్రమే అంటున్నారు.

దీపావళి రోజు ఇండియా

దీపావళి రోజు ఇండియా

ప్రతి ఏడాది దీపావళి పండుగ రోజు.. సోషల్ సైట్స్ లో ఈ ఫోటో కనిపిస్తూ ఉంటుంది. దేశమంతా దీపావళి రోజు.. టపాకాయలు పేల్చడం వల్ల ఇండియా ఇలా కనిపిస్తుందని ప్రచారం జరుగుతుంది. కానీ.. ఈ చిత్రం వాస్తవమే. కానీ.. 1992 నుంచి 2003 మధ్యలో ఇండియాను రాత్రి సమయంలో ఎలా ఉంటుంది..ఇండియాలో పెరుగుతున్న జనాభా గురించి వివరిస్తూ ఈ ఫోటో తీశారు.

సాధువు అస్థిపంజరం

సాధువు అస్థిపంజరం

ఇండియాలో తవ్వకాల సమయంలో సాధువు అస్థిపంజరం బయటపడిందని ఇండియన్స్ నమ్ముతారు. కానీ.. ఇమేజ్ మ్యానిపులేషన్ కాంపిటేషన్ సమయంలో.. ఈ ఫోటోని పార్టిసిపెంట్ పంపాడు. ఈ ఫోటో అవాస్తవం.

English summary

Top 8 Hoaxes About India

Top 8 Hoaxes About India. Throughout the year, most of us do not feel patriotic unless it is the month of August as that's when every Indian becomes proud about his country and tries to learn about India in a better way.
Story first published:Tuesday, August 30, 2016, 11:18 [IST]
Desktop Bottom Promotion