2018లో ఈ రాశుల వారికి ఎదురుండదు

Written By: Bharath
Subscribe to Boldsky

త్వరలో మనమంతా కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టనున్నాం. 2018కి ఆహ్వానం పలకనున్నాం. అయితే ఈ ఏడాది ఎలాగో మాకు అంతగా కలిసిరాలేదు. వచ్చే సంవత్సరమైనా బాగుంటుందా లేదా అని చాలా మంది ఆందోళన చెందుతుంటారు. అయితే కొన్ని రాశుల వారి లైఫ్ వచ్చే ఏడాది టర్న్ కానుంది. గ్రహాలు అనుకూలిస్తాయి కాబట్టి ఈ రాశుల వారికి ఎదురుండదు. 2018 లో సింహం, వృశ్చిక రాశుల వారికి తిరుగుండదు. అలాగే మరికొన్ని రాశుల వారికి కూడా 2018 కలిసొస్తుంది. మరి ఆ రాశులేమిటో మీరూ తెలుసుకోండి.

గ్రహాల స్థానం -2018

గ్రహాల స్థానం -2018

వచ్చే సంవత్సరం గ్రహాల స్థానం మారుతుంది. కుజుడు (అంగారకుడు) తులరాశి నుంచి నిష్ర్కమిస్తాడు. అలాగే వృశ్చికం నుంచి శని వైదొలుగుతాడు. కుజుడు, బృహస్పతి వృశ్చికంలోకి ప్రవేశిస్తారు.

వృశ్చికంలోకి కుజుడు

వృశ్చికంలోకి కుజుడు

అంగారకుడు జనవరి 17 న వృశ్చికంలోకి ప్రవేశిస్తాడు. మార్చి 7 వరకు ఆ రాశిలోనే ఉంటాడు. ఈ నెలలు ఈ రాశివారికి అంతా మంచే జరుగుతుంది.

అన్ని విషయాల్లో మంచే జరుగుతుంది

అన్ని విషయాల్లో మంచే జరుగుతుంది

2018లో కొన్ని రాశుల వారికి జాతకం బాగుండనుంది. వీరికి అన్ని విషయాల్లో మంచే జరుగుతుంది. ఆరోగ్యపరంగా, భవిష్యత్తుపరంగా, ప్రేమ విషయంలో, వివాహ విషయంలో, డబ్బు విషయంలో ఇలా ప్రతి విషయంలో 2018లో కొన్ని రాశుల వారికి దశ తిరుగుతుంది. వాళ్లకు అనుకూలంగానే అన్ని పనులు ముందుకెళ్తాయి.

మేషరాశి

మేషరాశి

అంగారకుడు మేషరాశిలోకి ప్రవేశిస్తాడు. దీంతో ఈ రాశివారి దశ తిరగనుంది. డబ్బుకు సంబంధించిన విషయాల్లో విషయాల్లో ఈ రాశి వారు చక్రం తిప్పనున్నారు. వీరు ప్రారంభించే ప్రతి పని విజయవంతం అవుతుంది. మేషరాశి వారు 2018లో ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోరు.

అంతా ప్రశాంతతే

అంతా ప్రశాంతతే

మేషరాశి వారు ఈ ఏడాదిలో ప్రశాంతంగా ఉంటారు. వీరు పని చేసే ప్రాంతంలో ఉండే సమస్యలన్నింటినీ ఛేదించగలరు. కొత్త అవకాశాలు తలుపుతడతాయి.

మకరరాశి

మకరరాశి

మకరరాశిలోకి కూడా అంగారకుడు ప్రవేశిస్తాడు. దీంతో ఈ రాశి వారకి కూడా అన్నీ అనుకూల పరిస్థితులే ఉంటాయి. జనవరి 2018 నుంచి మార్చి 2018 వరకు ఈ రాశి వారికి అన్నీ కలిసిసొస్తాయి. డబ్బుపరంగా ఈ రాశి వారికి ఈ సమయంలో చాలా అనుకూలమైనది. ఈ టైమ్ లో వీరికి డబ్బు బాగా కలిసొస్తుంది.

వ్యాపారులకు బాగా కలిసొస్తుంది

వ్యాపారులకు బాగా కలిసొస్తుంది

మకరరాశికి చెందిన వ్యాపారులకు ఈ సమయంలో బాగా కలిసొస్తుంది. వీరు లాభాల బాటలో దూసుకెళ్తారు. వీరు అడుగు పెట్టే ప్రతి రంగంలో ఆదాయాలను, విజయాలను చూస్తారు. ఇక జాబ్ చేసేవారు. ప్రమోషన్లు పొందే అవకాశం ఉంది.

వృశ్చికం నుంచి వెళ్లనున్న శని

వృశ్చికం నుంచి వెళ్లనున్న శని

వృశ్చికం నుంచి శని వెళ్లనున్నాడు. దీంతో వృశ్చికరాశి వారికి కూడా 2018లో అన్నీ శుభాలే కలుగనున్నాయి.

సింహరాశి

సింహరాశి

సింహరాశి వారికి 2018లో అన్నీ శుభాలే జరగనున్నాయి. ఇంతకాలం వీరు కాస్త కష్టాలు ఎదుర్కొని ఉంటారు. ఈ ఏడాది చివరి వరకే వీరికి ఇబ్బందులుంటాయి. ఆ తర్వాత వీరికన్నీ శుభాలే కలుగుతాయి. రాబేయే రోజుల్లో వీరికన్నీ విజయాలే కలుగుతాయి. అందువల్ల సింహరాశి వాళ్లంతా ఊపిరిపీల్చుకోండి.

ప్రశంసలు పొందుతారు

ప్రశంసలు పొందుతారు

సింహరాశి వారు వారి బాస్ ల దగ్గర, సీనియర్ల దగ్గర ప్రశంసలు పొందుతారు. వీళ్లు కోపాన్ని కాస్త అదుపులో పెట్టుకుంటే వీరికి అన్ని విజయాలే కలుగుతాయి.

తుల

తుల

తులరాశి వారు వచ్చే సంవత్సరం ప్రతి క్షణం ఆనందంగా గడుపుతారు. వీరి కృషి ఫలిస్తుంది. ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు పొందుతారు. ఇక వ్యక్తిగత జీవితం చాలా బాగా ఉంటుంది. 2018 లో అదృష్టం వీరిని వెంటాడుతూ వస్తుంది. వీరు ఎక్కడికి వెళ్లినా హ్యాపీగా ఉంటారు.

అన్నీ లాభాలే

అన్నీ లాభాలే

తులరాశి వారు వచ్చే ఏడాది అన్నీ లాభాలే పొందుతారు. వీరి జీవితం చాలా బాగుంటుంది. వీరు వచ్చే ఏడాది భాగస్వామితో మంచి జీవితాన్ని కొనసాగిస్తారు. వ్యక్తిగత జీవితంలో ఎలాంటి ఇబ్బందులుండవు. మీ చుట్టూ ఉండే వాళ్లంతా కూడా మీకు ప్రతి విషయంలో అండగా నిలుస్తారు. అయితే మీరు వచ్చే సంవత్సరం ఒక శుభకార్యం కోసం భారీగా నగదును ఖర్చు చేసే అవకాశం ఉంది.

English summary

2018 is going be lucky these two zodiac signs

2018 is going to be lucky for these two zodiac signs!
Story first published: Monday, December 11, 2017, 15:19 [IST]
Subscribe Newsletter