అలర్జీ కారణంగా తన భర్తకు దూరంగా ఉన్న మహిళ

By: SSN Sravanth Guthi
Subscribe to Boldsky

అలర్జీ బయటపడే వరకు - దాని గూర్చి మనలో చాలా మందికి తెలియదు. కొన్ని అరుదైన పరిస్థితుల కారణంగా దాదాపు అన్నింటికీ అలర్జీ సమస్యతో బాధపడే మహిళ గూర్చి తెలుసుకుందాం.

ఆ జాబితాలో ఆమె భర్త కూడా ఉన్నారు !

చాలా సాధారణమైన విషయాలకు కూడా ఆమె అలర్జీగా బాధపడటం చాలాకష్టం అనిపించే విషయం.

ఇంత అందమైన అమ్మాయికి, ఆ దేవుడు ఎంత శిక్ష విధించాడో చూడండి..

మాస్ట్ సెల్ యాక్టివేషన్ సిండ్రోమ్ (MCAS) తో బాధపడుతున్న "జోహాన్న వాట్కిన్స్" అనే మహిళ కథను తెలుసుకుందాం.

అరుదైన పరిస్థితుల వల్ల ఆమె ఈ బాధను ఎదుర్కొంటుంది :

అరుదైన పరిస్థితుల వల్ల ఆమె ఈ బాధను ఎదుర్కొంటుంది :

ఆమె 'మాస్ సెల్ యాక్టివేషన్ సిండ్రోమ్ (MCAS)' అని పిలవబడే అరుదైన రోగనిరోధక రుగ్మత (వ్యాధి) తో బాధపడుతోంది. ఈ పరిస్థితుల్లో ఆమె వ్యాధినిరోధక వ్యవస్థలో గల కణాలు తప్పుడు రసాయనాలను విడుదల చేస్తాయి. ఈ కారణంచేత ఆమె పక్కింటి వారు చేసుకునే వంటల వల్ల వచ్చిన వాసనని పీల్చడం కూడా ఆమెకి అలర్జీ గా మారింది.

ఆమె తల్లిదండ్రుల కారణంగా కూడా :

ఆమె తల్లిదండ్రుల కారణంగా కూడా :

కొన్ని రిపోర్టుల ఆధారంగా, ఆమె తన తల్లిదండ్రుల వల్ల కూడా అలర్జీకి గురి అవుతున్నట్లుగా తెలుస్తోంది. తన ముగ్గురు తోబుట్టువులలో, ఈ అలెర్జీ ఈమెలోనే కనబడుతుంది. పూర్తిగా తలుపులు, కిటికీలు మూసివేసిన తన స్నేహితుని గదిలో ఆమె నివసిస్తున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది.

ఆమె సాధారణంగా జీవించేందుకు ఆ గదిలో గాలిని శుద్ధిచేసే వ్యవస్థ ఉన్నది. ఆమె ఆస్పత్రికి వెళ్లడానికి (లేదా) డాక్టర్ని కలవడానికి మాత్రమే బయటకు వస్తుంది.

ఆమె అలెర్జీలు చాలా తీవ్రమైనవి :

ఆమె అలెర్జీలు చాలా తీవ్రమైనవి :

ఆమెకు అలర్జీ చాలా తీవ్రంగా ఉన్నది. ఆమె సంవత్సరంలో ప్రతిరోజూ ఒకే రకమైన ఆహారాన్ని తీసుకోవటం జరుగుతుంది. అవి ఏమటంటే, గొర్రె మాంసం, బాగా కాల్చిన దోసకాయలు, కేరట్లు వంటి ప్రాధమిక ఆహారాన్ని తీసుకుంటుంది. ఆమె త్రాగే పానీయం కేవలం "నీరు" మాత్రమే.

హోటళ్లలో సగం వాడిన సబ్బులను ఏమి చేస్తారు అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా ?

సాధారణమైన జీవితాన్ని గడిపేందుకు ఆ జంట ప్రయత్నిస్తున్నారు :

సాధారణమైన జీవితాన్ని గడిపేందుకు ఆ జంట ప్రయత్నిస్తున్నారు :

"జోహాన్న వాట్కిన్స్, స్కాట్" లు ఒకరికొకరు లోతైన ప్రేమను కలిగి ఉండటం వల్ల వారి ప్రేమ కథను 'శాశ్వతమైన ప్రేమ' కథగా చెప్పవచ్చు. కొన్ని సంవత్సరాల నుండి కలిసి జీవించడానికి ప్రయత్నిస్తున్నారు కానీ, ఇప్పుడు ఉన్న పరిస్థితుల కారణంగా అది ఇంకా విజయవంతం కాలేదు.

ఒకే ఇంటిలో ఆ జంట నివసిస్తున్నారు :

ఒకే ఇంటిలో ఆ జంట నివసిస్తున్నారు :

ఆ జంట ఒకే ఇంట్లో నివసిస్తున్నారు. జోహాన్న - పెద్ద పడకగదిలో పడుకుంటే, దానికి క్రింద వున్న గదిలో - స్కాట్ ఉంటాడు. ఆమెకు అలర్జీలు వ్యాపించకుండా ఉండడం కోసం, వెచ్చదనాన్ని పుట్టించే ఫర్నీచర్ ఉన్న ఇంటిని నిర్మించాడు కానీ ఆ ఇంటి పెయింట్ వాసన వల్ల ఆమెకు ఎలర్జీ వచ్చిన కారణంగా మళ్ళీ ఇల్లు మారవలసి వచ్చింది.

అతను ఆమెను ప్రేమించడం ఆపలేదు :

అతను ఆమెను ప్రేమించడం ఆపలేదు :

ఈ జంట స్కైప్ మీద మాట్లాడటం, వారి మాటలను సజీవంగా దాంచుకుంటాడు స్కాట్, ఎందుకంటే అతను ఆమె పక్కన ఉండకూడదు కాబట్టి.

"నేను ఆమెతో చాలా దగ్గరగా ఉండలేను,

నేను ఆమెను సురక్షితంగా కౌగిలించుకోలేను,

ఆమెను బాధపెట్టి నేను కౌగిలించుకోలేను" - అని అతను వివరించాడు.

Source

English summary

Woman Who is Allergic To Her Own Husband

Most of us are unaware of our allergies unless we are exposed to them. This is one such case of a woman who is suffering from a rare condition where she is allergic to almost everything!
Subscribe Newsletter